నడి సముద్రంలో క్రికెట్‌..! | Scuba Diving Training Cricket In Ocean | Sakshi
Sakshi News home page

నడి సముద్రంలో క్రికెట్‌..!

Published Sun, Oct 17 2021 4:49 AM | Last Updated on Sun, Oct 17 2021 5:36 AM

Scuba Diving Training Cricket In Ocean - Sakshi

సాక్షి, చెన్నై(తమిళనాడు): ఐపీఎల్‌లో చెన్నైసూపర్‌ కింగ్స్‌ గెలుపును కాంక్షిస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ నడి∙సముద్రంలో స్కూబా డైవింగ్‌ ట్రైనర్లు ప్రదర్శించిన సాహసం శనివారం వెలుగులోకి వచ్చింది. నడి సముద్రంలో బ్యాట్‌ బాల్‌ పట్టి క్రికెట్‌ ఆడుతూ వీరు చేసిన వీడియో వైరల్‌గామారింది. ఇటీవల పుదుచ్చేరిలో స్కూబా డైవింగ్‌ శిక్షణ పొందుతున్న వారు నడి సముద్రంలో ఓ జంటకు వివాహం చేసిన  విషయం తెలిసిందే. ఈ వీడియో సంచలనానికి దారి తీసింది.

ఈ సాహసాన్ని మరోమారు తలపించే విధంగా డైవింగ్‌ శిక్షణ పొందిన స్విమ్మర్లు వినాయక చవితిపర్వదినం వేళ  గణపయ్య ›ప్రతిమను నడి సముద్రంలో నిమజ్జనం చేసి వార్తల్లోకి ఎక్కా రు. ఈ పరిస్థితుల్లో  శుక్రవారం దుబాయ్‌ వేదికగా ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో చెన్నై సూపర్‌ సింగ్స్‌ విజయాన్ని కాంక్షిస్తూ, «ధోని సేనకు శుభాకాంక్షలు తెలిపే విధంగా స్విమ్మర్లు నడి సముద్రంలో క్రికెట్‌తో అలరించారు.

పుదుచ్చేరి – తమిళనాడుకు చెందిన టెంపుల్‌ అట్‌ వెంచర్స్‌ పేరిట స్కూబా డైవింగ్‌ శిక్షణలో ఉన్న అరవింద్‌ నేతృత్వంలోని బృందం ఈ సాహసం చేసింది. చెన్నై శివారులోని నీలంకరై నుంచి పుదుచ్చేరి మధ్యలో 12 నాటికన్‌ మైళ్ల దూరంలో నడి సముద్రంలో క్రికెట్‌  ఆడారు. స్టంపులు, బ్యాట్, బాల్‌ అంటూ అన్ని రకాల సామగ్రితో భద్రతా పరమైన ఏర్పా ట్లతో ఈ బృందం చెన్నై కింగ్స్‌ ఆటగాళ్లను తలపించే విధంగా జెర్సీ ధరించి సముద్రంలో క్రికెట్‌ ఆడారు. ఈ వీడియో శనివారం వైరల్‌గా మారింది. ఫైనల్స్‌ లో చెన్నైకింగ్స్‌ విజయ కేతనంతో ఈ స్కూబా డైవింగ్‌ ట్రైనర్లే కాదు, తమిళ క్రీడాభిమానులూ ఆనంద సాగరంలో మునిగిపోయారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement