swimmers
-
దిగ్గజాల సరసన లెడెకీ, డ్రెసెల్
పారిస్: విశ్వ క్రీడల్లో అతికొద్ది మందికే సాధ్యమైన ఘనతను అమెరికా స్విమ్మర్లు కేటీ లెడెకీ, సెలబ్ డ్రెసెల్ సాధించారు. ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో అత్యధిక స్వర్ణాలు సాధించిన క్రీడాకారుల జాబితాలో వీరిద్దరు మరో నలుగురితో కలిసి ఉమ్మడిగా రెండో స్థానానికి చేరుకున్నారు. తాజాగా పారిస్ ఒలింపిక్స్‌లో లెడెకీ, డ్రెసెల్ రెండు స్వర్ణాల చొప్పున సాధించారు. దాంతో ఓవరాల్‌గా ఒలింపిక్స్ క్రీడల్లో వీరిద్దరు నెగ్గిన పసిడి పతకాల సంఖ్య 9కి చేరుకుంది.ఇప్పటికే ‘పారిస్’లో 1500 మీటర్లలో బంగారు పతకం గెలిచిన లెడెకీ ఆదివారం జరిగిన 800 మీటర్ల విభాగంలోనూ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు డ్రెసెల్ 4్ఠ100 మీటర్ల ఫ్రీస్టయిల్ టీమ్ స్వర్ణానికి 4్ఠ100 మీటర్ల మిక్స్డ్ మెడ్లే పసిడి పతకాన్ని జత చేశాడు. ఒలింపిక్స్‌లో అత్యధిక స్వర్ణ పతకాలు గెలిచిన రికార్డు అమెరికా స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ (23 స్వర్ణాలు) పేరిట ఉంది. ఆ తర్వాత 9 స్వర్ణాలతో లారిసా లాతినినా (జిమ్నాస్టిక్స్; సోవియట్ యూనియన్), పావో నుర్మీ (అథ్లెటిక్స్; ఫిన్లాండ్), మార్క్ స్పిట్జ్ (స్విమ్మింగ్; అమెరికా), కార్ల్ లూయిస్ (అథ్లెటిక్స్; అమెరికా), కేటీ లెడెకీ, డ్రెసెల్ ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నారు. -
తొలిసారి ఇద్దరికి ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ పురస్కారం
ప్రతి ఆసియా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారుల్లో నుంచి ఒకరికి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (ఎంవీపీ) పురస్కారం అందజేస్తారు. 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో తొలిసారి ఈ ‘ఎంవీపీ’ అవార్డును ప్రవేశపెట్టారు. గత ఆరు ఆసియా క్రీడల్లో ఒక్కరిని మాత్రమే ఈ పురస్కారం కోసం ఎంపిక చేస్తుండగా... ఈ క్రీడల్లో తొలిసారి ఇద్దరికి ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ అవార్డు దక్కడం విశేషం. ఆదివారం హాంగ్జౌలో ముగిసిన 19వ ఆసియా క్రీడలకు సంబంధించి ‘ఎంవీపీ’ అవార్డు చైనా స్విమ్మర్లు జాంగ్ యుఫె, కిన్ హైయాంగ్లకు సంయుక్తంగా లభించింది. 25 ఏళ్ల మహిళా స్విమ్మర్ జాంగ్ యుఫె హాంగ్జౌ ఆసియా క్రీడల్లో ఏకంగా ఆరు స్వర్ణ పతకాలు సాధించింది. పురుషుల స్విమ్మింగ్‌లో 24 ఏళ్ల కిన్ హైయాంగ్ ఐదు పసిడి పతకాలు గెలిచాడు. బ్యాడ్మింటన్ దిగ్గజం లిన్ డాన్ (2010 గ్వాంగ్జౌ) తర్వాత ఆసియా క్రీడల్లో ‘ఎంవీపీ’ అవార్డు గెల్చుకున్న చైనా ప్లేయర్లుగా జాంగ్ యుఫె, కిన్ హైయాంగ్ గుర్తింపు పొందారు. -
పాక్ జలసంధిని ఈదిన విజయవాడ స్విమ్మర్లు
విజయవాడ స్పోర్ట్స్: భారత్, శ్రీలంక మధ్యనున్న పాక్ జలసంధిని ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన స్మిమ్మర్లు కె.బేబీ స్పందన, బి.అలంకృతి, పి.రాహుల్, కె.జార్జ్, కె.జాన్సన్, టి.సాత్విక్‌లు విజయవంతంగా ఈదారు. వీరిలో అలంకృతి తొమ్మిదో తరగతి చదువుతుండగా, జార్జ్, జాన్సన్, సాత్విక్‌లు పదో తరగతి, బేబీ స్పందన డిగ్రీ, రాహుల్ బీటెక్ చదువుతున్నారు. 34 కిలోమీటర్ల జలసంధిని వీరు 9 గంటల 28 నిమిషాల్లో ఈత పూర్తి చేశారు. చదవండి👉: IPL 2022: ఎదురులేని ఎస్ఆర్హెచ్.. ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డు ఉమ్మడి కృష్ణా జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్‌కు చెందిన ఈ జట్టు తొలుత ఈ నెల 22వ తేదీ సాయంత్రం ధనుష్కోటి నుంచి బోటు ద్వారా శ్రీలంక తీరానికి చేరుకున్నారు. శ్రీలంక తీరం నుంచి శనివారం ఒంటి గంటకు ఈత ప్రారంభించి 10 గంటల 28 నిమిషాల 27 సెకన్లకు రామేశ్వరంలోని ధనుష్కోటికి చేరుకున్నారు. హెడ్ కానిస్టేబుల్, అంతర్జాతీయ స్విమ్మర్ తులసి చైతన్య శిక్షణలో ఈ జట్టు పాక్ జలసంధిని ఈదినట్లు కృష్ణా జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఐ.రమేష్ తెలిపారు. ఈ సాహసకృత్యాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన డీజీపీ కె.రాజేంద్రనాథ్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
నడి సముద్రంలో క్రికెట్..!
సాక్షి, చెన్నై(తమిళనాడు): ఐపీఎల్లో చెన్నైసూపర్ కింగ్స్ గెలుపును కాంక్షిస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ నడి∙సముద్రంలో స్కూబా డైవింగ్ ట్రైనర్లు ప్రదర్శించిన సాహసం శనివారం వెలుగులోకి వచ్చింది. నడి సముద్రంలో బ్యాట్ బాల్ పట్టి క్రికెట్ ఆడుతూ వీరు చేసిన వీడియో వైరల్‌గామారింది. ఇటీవల పుదుచ్చేరిలో స్కూబా డైవింగ్ శిక్షణ పొందుతున్న వారు నడి సముద్రంలో ఓ జంటకు వివాహం చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో సంచలనానికి దారి తీసింది. ఈ సాహసాన్ని మరోమారు తలపించే విధంగా డైవింగ్ శిక్షణ పొందిన స్విమ్మర్లు వినాయక చవితిపర్వదినం వేళ గణపయ్య ›ప్రతిమను నడి సముద్రంలో నిమజ్జనం చేసి వార్తల్లోకి ఎక్కా రు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం దుబాయ్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో చెన్నై సూపర్ సింగ్స్ విజయాన్ని కాంక్షిస్తూ, «ధోని సేనకు శుభాకాంక్షలు తెలిపే విధంగా స్విమ్మర్లు నడి సముద్రంలో క్రికెట్‌తో అలరించారు. పుదుచ్చేరి – తమిళనాడుకు చెందిన టెంపుల్ అట్ వెంచర్స్ పేరిట స్కూబా డైవింగ్ శిక్షణలో ఉన్న అరవింద్ నేతృత్వంలోని బృందం ఈ సాహసం చేసింది. చెన్నై శివారులోని నీలంకరై నుంచి పుదుచ్చేరి మధ్యలో 12 నాటికన్ మైళ్ల దూరంలో నడి సముద్రంలో క్రికెట్ ఆడారు. స్టంపులు, బ్యాట్, బాల్ అంటూ అన్ని రకాల సామగ్రితో భద్రతా పరమైన ఏర్పా ట్లతో ఈ బృందం చెన్నై కింగ్స్ ఆటగాళ్లను తలపించే విధంగా జెర్సీ ధరించి సముద్రంలో క్రికెట్ ఆడారు. ఈ వీడియో శనివారం వైరల్‌గా మారింది. ఫైనల్స్ లో చెన్నైకింగ్స్ విజయ కేతనంతో ఈ స్కూబా డైవింగ్ ట్రైనర్లే కాదు, తమిళ క్రీడాభిమానులూ ఆనంద సాగరంలో మునిగిపోయారు. -
వైరల్ వీడియో: టోక్యో ఒలింపిక్స్‌లో మాధురి దీక్షిత్ సాంగ్
-
టోక్యో ఒలింపిక్స్‌లో మాధురి దీక్షిత్ సాంగ్ వైరల్
జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో ఇదివరకు లేని రికార్డులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ ఫీవర్ పట్టుకుంది. ఎక్కడ చూసిన ఈ అంతర్జాతీయ ఆటలకు చెందిన విషయాలే హల్చల్ చేస్తున్నాయి. టోక్యో ఒలింపిక్స్‌కు సంబంధించిన బోలేడు వీడియోలు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లో బాలీవుడ్‌కు చెందిన ఓ పాట ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. ఒలింపిక్స్‌లో ఇజ్రాయిల్ జట్టు స్మిమర్స్ ఈడెన్ బ్లెచర్, షెల్లీ బోబ్రిట్క్సీ.. ఆర్టిస్టిక్ స్విమ్మింగ్ డ్యూయెట్ ఫ్రీ రొటీన్ ప్రిలిమినరీలో మంగళవారం పోటీ పడ్డారు. ఆ సమయంలో బీటౌన్ బ్యూటీ మాధురి దీక్షిత్ నటించిన పాపులర్ సాంగ్ ‘ఆజా నాచ్లే’ పాటకు డ్యాన్స్ చేస్తూ స్వీమ్ చేశారు. అన్నే దానం అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ‘చాలా ధన్యవాదాలు ఇజ్రాయెల్ టీమ్. ఆజా నాచ్లే పాటను వినడానికి, చూడటానికి ఎంత ఉత్సాహంగా ఉందో మీకు తెలియదు’. అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఇజ్రాయెల్ స్విమర్స్ బాలీవుడ్ పాటను ఎంచుకున్నందుకు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్విమ్మింగ్‌లో వారి స్టైల్‌కు ఫిదా అయిపోతున్నారు. ఒలింపిక్స్‌లో బాలీవుడ్ సాంగ్ వినిపించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా మాధురి దీక్షిత్, కొంకణ సేన్, కునాల్ కపూర్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆజా నాచ్లే . 2007లో విడుదలైన ఈ చిత్రానికి అనిల్ మెహతా దర్శకత్వం వహించారు. -
సర్జిపూల్ లీకేజీలకు మరమ్మతు
ధర్మారం(ధర్మపురి): కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ప్యాకేజీ 6లో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం వద్ద నిర్మించిన సర్జిపూల్లో షట్టర్స్ వద్ద ఏర్పడిన ఎయిర్‌గ్యాప్ లీకేజీలను విశాఖకు చెందిన గజ ఈతగాళ్లు సరిచేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీటిని వేంనూర్ జీరో పాయింట్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా టన్నెల్ నుంచి తరలించి మేడారం సర్జిపూల్‌ను నింపారు. సర్జిపూల్ పూర్తి కెపాసిటీ 37 మీటర్లు కాగా 19 మీటర్ల వరకు నీటితో నింపారు. జీరోపాయింట్ నుం చి సర్జిపూల్ వరకు సమస్యలు లేకుండా నీరు చేరింది. సర్జిపూల్ వద్ద ఏర్పాటు చేసిన 7 మోటార్ల వద్ద ఎయిర్గ్యాప్లు ఏర్పడి లీకేజీ అవుతోంది. దీనిని గమనించిన ఇంజనీరింగ్ అధికారులు విశాఖకు చెందిన గజ ఈతగాళ్లు అయిన నిపుణులతో లీకేజీలు సరిచేస్తున్నారు. 24న వెట్ రన్ : ఈఈ శ్రీధర్ ఈ నెల 24న సర్జిపూల్ మోటార్లతో వెట్‌రన్ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈ నూనె శ్రీధర్ తెలిపారు. జీరో పాయింట్ నుంచి సర్జిపూల్ వరకు సక్రమంగానే ఉందన్నారు. 24న ఉదయం మొదటి పంప్ ద్వారా వెట్‌రన్ చేసిన తరువాత, సాయంత్రం రెండోపంప్ ద్వారా వెట్‌రన్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం నీటి కిందిభాగంలో పనులు చేస్తున్న క్రమంలో ఈతగాళ్లకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా చర్యలు తీసుకుంటాం. నీటిలోకి దిగే మాస్కులు ధరిస్తాం. ఆక్సిజన్ సిలిండర్ వినియోగిస్తాం. – అక్షిత్, గజ ఈతగాళ్ల ఇన్చార్జి -
బ్యాట్ పట్టిన బంగారు చేప
న్యూఢిల్లీ: అమెరికా దిగ్గజ స్విమ్మర్, ఆల్‌టైమ్ గ్రేట్ ఒలింపియన్ మైకేల్ ఫెల్ప్స్ సరదాగా క్రికెట్ బ్యాట్ పట్టాడు. వాణిజ్య ప్రచార కార్యక్రమంలో భాగంగా భారత్‌లో ఉన్న అతను... ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆటగాళ్లతో బుధవారం కొంత సమయం గడిపాడు. మంగళవారం ఢిల్లీ, చెన్నై మధ్య జరిగిన మ్యాచ్‌ను కూడా అతను స్టేడియంలో కూర్చొని చూశాడు. క్రికెట్ ఆట ఆసక్తికరంగా అనిపించినా... ఆడటం మాత్రం తన వల్ల కాదని అతను నవ్వుతూ చెప్పాడు. ‘ఐపీఎల్ మ్యాచ్‌లో సిక్సర్లను ఆస్వాదిం చాను. ఆటలో కొన్ని నిబంధనలు ఆసక్తికరంగా అనిపించాయి. ప్రేక్షకుల ఉత్సాహం మాత్రం చాలా బాగుంది. బ్యాట్‌ను పట్టుకోవడం మొదలు మరికొన్ని చిట్కాలు ఇవాళ నేర్చుకున్నాను. వచ్చేసారి భారత్‌కు వచ్చినప్పుడు మాత్రం క్రికెట్ గురించి బాగా తెలుసుకొని వస్తా’ అని ఫెల్ప్స్ వ్యాఖ్యానిం చాడు. కావాల్సినన్ని రోజులు తన ఇంట్లో ఉండి ఫెల్ప్స్ క్రికెట్ నేర్చుకోవచ్చని రిషభ్ పంత్ సరదాగా చెప్పగా... తాను నేర్చుకోగలనని నమ్మినందుకు అతను కృతజ్ఞతలు చెప్పాడు. ఫెల్ప్స్ లాంటి దిగ్గజంతో సమయం గడిపే అవకాశం రావడం పట్ల క్రిస్ మోరిస్, ఇషాంత్ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. 2004–2016 మధ్య నాలుగు ఒలింపిక్స్‌లలో కలిపి ఫెల్ప్స్ 23 స్వర్ణాలు సహా మొత్తం 28 పతకాలు గెలుచుకున్నాడు. -
రాష్ట్ర స్విమ్మర్లకు సన్మానం
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన తెలంగాణ రాష్ట్ర స్విమ్మర్లను ఆదివారం సత్కరించారు. తెలంగాణ స్విమ్మింగ్ సంఘం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. విజయవాడలో డిసెంబర్ 27 నుంచి 29 వరకు జరిగిన సౌత్‌జోన్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి చెందిన 24 మంది స్విమ్మర్లు పతకాలను గెలుచుకున్నారు. వీరందరిని తెలంగాణ స్విమ్మింగ్ సంఘం కార్యదర్శి ఎం. రామకృష్ణ, కోశాధికారి ఉమేశ్, ఉపాధ్యక్షులు ఎం. కృష్ణ, హైదరాబాద్ జిల్లా స్విమ్మింగ్ సంఘం కార్యదర్శి జి. గిరిధర్ ప్రత్యేకంగా అభినందించారు. పతకాలు సాధించిన స్విమ్మర్ల వివరాలు గ్రూప్–1 బాలురు: యశ్ వర్మ (స్వర్ణం, రజతం, కాంస్యం), వై. హేమంత్ రెడ్డి (స్వర్ణం, రజతం), రుత్విక్ నాగిరెడ్డి (2 కాంస్యాలు), సీహెచ్ అభిలాష్ (2 కాంస్యాలు). గ్రూప్–1 బాలికలు:1. శ్రీజ ముప్పనేని (2 స్వర్ణా లు, 1 రజతం), సి. కృష్ణ ప్రియ (2 కాంస్యాలు). గ్రూప్–2 బాలురు: వై. జశ్వంత్ రెడ్డి (3 స్వర్ణాలు, రజతం, 2 కాంస్యాలు), సూర్యాన్షు (2 రజతాలు, 4 కాంస్యాలు), సాయి నిహార్ (2 రజతాలు, 2 కాంస్యాలు), ఆదిత్య (రజతం, కాంస్యం), చార్లెస్ (2 కాంస్యాలు), సాయి ప్రణీత్ (కాంస్యం). గ్రూప్–2 బాలికలు: 1. సంజన (4 కాంస్యాలు), జి. హంసిని (4 కాంస్యాలు), అష్ఫఖ్ (2 కాంస్యాలు), ఇష్వి మథాయ్ (2 కాంస్యాలు) గ్రూప్–3 బాలికలు: కాత్యాయని (రజతం, 3 కాంస్యాలు), సంస్కృతి (2 కాంస్యాలు), నందిని (2 కాంస్యాలు), చిన్మయి (2 కాంస్యాలు). గ్రూప్–4 బాలురు: సుహాస్ ప్రీతమ్ (2 కాంస్యాలు), అభయ్ లక్కోజు (కాంస్యం), గౌతమ్ (కాంస్యం), డి. వర్షిత్ (కాంస్యం). -
ఏపీ, తెలంగాణ స్విమ్మర్లకు పతకాల పంట
సాక్షి, విజయవాడ: సౌత్‌జోన్ అక్వాటిక్స్ చాంపియన్ షిప్లో రెండో రోజూ ఆంధ్రప్రదేశ్ (ఏపీ), తెలంగాణ స్విమ్మర్లు తమ పతకాల వేట కొనసాగించారు. శుక్రవారం జరిగిన పోటీల్లో వారు తొమ్మిదేసి పతకాలను గెల్చుకున్నారు. తెలంగాణ తరఫున గ్రూప్–2 బాలుర 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో వై.జశ్వంత్ రెడ్డి (తెలంగాణ; 2ని:21.14 సెకన్లు) పసిడి పతకం సాధించాడు. గ్రూప్–2 బాలుర 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో సూర్యాన్షు (తెలంగాణ; 28.37 సెకన్లు), గ్రూప్–1 బాలికల 200 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్‌లో ముప్పనేని శ్రీజ (తెలంగాణ; 3ని:12.72 సెకన్లు), గ్రూప్–1 బాలుర 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో యష్ వర్మ (తెలంగాణ; 2ని:13.67 సెకన్లు) రజత పతకాలను దక్కించుకున్నారు. గ్రూప్–1 బాలుర 800 మీటర్ల ఫ్రీస్టయిల్లో చల్లగాని అభిలాష్ (తెలంగాణ; 9ని:30.39 సెకన్లు), గ్రూప్–1 బాలికల 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో చెన్నవోజుల కృష్ణప్రియ (తెలంగాణ; 35.15 సెకన్లు), గ్రూప్–2 బాలికల 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో కాల్వ సంజన (తెలంగాణ; 32.97 సెకన్లు) కాంస్యాలు కైవసం చేసుకున్నారు. గ్రూప్–3 బాలికల 4్ఠ50 మీటర్ల మెడ్లేలో, గ్రూప్–2 బాలుర 4్ఠ100 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో తెలంగాణ బృందాలకు కాంస్యాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్ తరఫున గ్రూప్–1 బాలుర 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో ఎం.వాసురామ్ (ఆంధ్రప్రదేశ్; 27.11 సెకన్లు), గ్రూప్–1 బాలుర 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో ఎం.లోహిత్ (ఆంధ్రప్రదేశ్; 2ని:25.76 సెకన్లు), గ్రూప్–4 బాలుర 50 మీటర్ల ఫ్రీస్టయిల్లో ఎం. తీర్ధు సామదేవ్ (ఆంధ్రప్రదేశ్; 31.81 సెకన్లు) స్వర్ణ పతకాలను హస్తగతం చేసుకున్నారు. గ్రూప్–1 బాలుర 200 మీటర్ల ఫ్రీస్టయిల్లో ఎం. వాసురామ్ (ఆంధ్రప్రదేశ్; 2ని: 03.94 సెకన్లు) రజతం గెలిచాడు. గ్రూప్–2 బాలుర 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో మొహమ్మద్ పర్వేజ్ మహరూఫ్ (ఆంధ్రప్రదేశ్; 2ని:48.57 సెకన్లు) కాంస్యం నెగ్గాడు. గ్రూప్–1 బాలుర 4్ఠ100 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో, గ్రూప్–3 బాలుర 4్ఠ50 మీటర్ల మెడ్లేలో, గ్రూప్–4 బాలికల 4్ఠ50 మీటర్ల మెడ్లేలో, గ్రూప్–4 బాలికల 4్ఠ50 మీటర్ల మెడ్లేలో ఆంధ్రప్రదేశ్ బృందాలకు కాంస్యాలు లభించాయి. -
మెరిసిన ఏపీ, తెలంగాణ స్విమ్మర్లు
సాక్షి, విజయవాడ: సౌత్‌జోన్ అక్వాటిక్స్ చాంపియన్ షిప్లో తొలి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్విమ్మర్లు అద్భుత ప్రదర్శన చేశారు. నాలుగు స్వర్ణాలు, మూడు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి మొత్తం 11 పతకాలు సొంతం చేసుకున్నారు. గ్రూప్–4 బాలుర 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో ఎం. తీర్ధు సామదేవ్ (ఆంధ్రప్రదేశ్; 2ని:49.11 సెకన్లు)... గ్రూప్–1 బాలుర 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో ఎం.లోహిత్ (ఆంధ్రప్రదేశ్; 1ని:06.91 సెకన్లు–కొత్త మీట్ రికార్డు)... గ్రూప్–1 బాలికల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో ముప్పనేని శ్రీజ (తెలంగాణ; 1ని:28.65 సెకన్లు)... గ్రూప్–2 బాలుర 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో వై. జశ్వంత్ రెడ్డి (తెలంగాణ; 1ని:04.72 సెకన్లు) స్వర్ణ పతకాలు గెలిచారు. గ్రూప్–1 బాలుర 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో యన్నం హేమంత్ రెడ్డి (తెలంగాణ; 1ని:04.67 సెకన్లు) రజతం నెగ్గగా... గ్రూప్–1 బాలుర 4్ఠ100 మీటర్ల మెడ్లే రిలేలో యువరాజు, వాసురామ్, లోహిత్, సుజన్ చౌదరీ (ఆంధ్రప్రదేశ్; 4ని:19.13 సెకన్లు) బృందం... గ్రూప్–2 బాలుర 4్ఠ100 మీటర్ల మెడ్లే రిలేలో జశ్వంత్ రెడ్డి, సూర్యాన్షు, సాయి నిహార్, ఆదిత్య రాయ్ (తెలంగాణ; 4ని:38.16 సెకన్లు) బృందాలకు రజతాలు లభిం చాయి. గ్రూప్–1 బాలుర 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో చల్లగాని అభిలాష్ (తెలంగాణ; 4ని:28.13 సెకన్లు)... గ్రూప్–1 బాలికల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో చెన్నవోజుల కృష్ణప్రియ (తెలంగాణ; 1ని:31.26 సెకన్లు)... గ్రూప్–2 బాలుర 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో సూర్యాన్షు (తెలంగాణ; 1ని:14.04 సెకన్లు) కాంస్యా లు గెల్చుకున్నారు. గ్రూప్–2 బాలికల 4్ఠ100 మీటర్ల మెడ్లే రిలేలో ఇష్వి మథాయ్, హంసిని, కాల్వ సంజన, మెహరూష్ (తెలంగాణ; 5ని:23.22 సెకన్లు) బృందం కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. -
ఆడా, మగా తేడాలేకుండా న్యూడ్‌గా..
సిడ్నీ : సిడ్నీ స్కిన్నీ ఓషియన్ స్విమ్ ఐదో వార్షికోత్సవ సందర్భంగా ఆదివారం నూలు పోగులేకుండా స్విమ్మర్లు సముద్రతీరంలో సందడి చేశారు. ఆస్ట్రేలియాలో సిడ్నీలోని కోబ్లర్స్ బీచ్‌లో మొత్తం 1335 మంది స్విమ్మర్లు ఆడ, మగా తేడా లేకుండా ఒంటిపై నూలు పోగుకూడా లేకుండా సముద్రంలో ఈత కొట్టారు. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ న్యూరోసర్జన్ చార్లీ టీయో, సర్ఫింగ్‌లో ప్రపంచ చాంపియన్ లేన్ బీచ్లేలు కూడా న్యూడ్‌గా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. న్యూడ్‌గా బీచ్‌లోకి రావడంమే కాకుండా 300 నుంచి 900 మీటర్ల స్మిమ్మింగ్ పోటీల్లో వీరందరూ పాల్గొన్నారు. అయితే ఇవి స్విమ్మింగ్ రేసులు మాత్రం కాదని ఆర్గనైజర్లు తెలిపారు. ఆస్ట్రేలియన్ చారిటీల కోసం, మంచి పనులు చేయడానికి నిధులు సమకూర్చడానికి ఈ న్యూడ్ స్విమ్ ఈవెంట్ ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. 'ప్రతి ఒక్కరూ ఎలాంటి ఇబ్బందిలేకుండా న్యూడ్‌గా నీళ్లలో సరదాగా దిగండి. న్యూడ్‌గా ఉండటం మాత్రమే ఈ ఈవెంట్ ప్రధాన అంశం కాదు. మిమ్మల్ని మీరు ప్రకృతితో మమేకమై సరదగా గడుపుతున్నామని భావించండి' అని ఈ కార్యక్రమానికి అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న బీచ్‌లే అన్నారు. -
జిల్లా క్రీడలకే గర్వకారణం
స్విమ్మింగ్‌లో ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించిన సిక్కోలు స్విమ్మర్లు శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ స్థాయి మాస్టర్ స్విమ్మింగ్ పోటీల్లో శ్రీకాకుళం స్విమ్మర్లు అద్భుతమైన ఫలితాలు సాధించి జిల్లాకే గర్వకారణంగా నిలిచారని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌కుమార్ అన్నారు. తెలంగాణా రాష్ట్రంలోని సికింద్రాబాద్‌లో ఈ నెల 23, 24 తేదీల్లో మాస్టర్ అక్వాటెక్ స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన 3వ జాతీయస్థాయి అక్వాటెక్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో శ్రీకాకుళం మాస్టర్ స్విమ్మర్లు సరికొత్త రికార్డుకు శ్రీకారం చుట్టారు. ఏపీ స్విమ్మింగ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జిల్లా స్విమ్మర్లు మొత్తం 26 పతకాలతో అదరగొట్టారు. ఇందులో 17 బంగారు పతకాలతో పాటు 4 రజత, 5 కాంస్య పతకాలు ఉన్నాయి. వీరంతా సోమవారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం మాస్టర్స్ స్విమ్మింగ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్జీవో హోంలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. డీఎస్డీఓ శ్రీనివాస్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పతకాలు సాధించిన మాస్టర్ స్విమ్మర్లను అభినందించారు. క్రీడాకారులకు పూలమాలలువేసి సత్కరించారు. ఆంధ్రరాష్ట్రంలో ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించడంలో సిక్కోలు స్విమ్మర్లదే కీలకపాత్ర అని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ స్విమ్మింగ్ సంఘ అధ్యక్షులు బుక్కూరు ఉమామహేశ్వరరావు, సంఘ కార్యదర్శి నౌపడ రాజారావు, సహధ్యక్షులు దుప్పల వెంకటరావు, ఉపాధ్యక్షులు సీహెచ్ వెంకట్, ఐ.గోవిందరావు, లక్ష్మణరావు, కోశాధికారి డి.అజిత్‌కుమార్, గీతాశ్రీకాంత్, సీనియర్ స్విమ్మర్లు పాల్గొన్నారు. -
గజ ఈతగాళ్లకు అభినందన
పాన్‌గల్/వీపనగండ్ల: చెల్లపాడు ఘాట్‌లో మంగళవారం ఓ భక్తురాలు పుణ్యస్నానం చేస్తుండగా ఆమె పుస్తెల తాడుకు ఉన్న బంగారు తాళిబొట్టు బిళ్లలు నీటమునిగాయి. ఆందోళన చెందిన ఆమె, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు గజ ఈతగాళ్లకు సమాచారం ఇచ్చారు. అరగంటపాటు శ్రమించిన ఈతగాళ్లు తాళిబొట్టుబిళ్లలను వెతికిపట్టుకున్నారు. తహసీల్దార్ ప్రభాకర్‌రావు ఈతగాళ్లను అభినందించారు. రూ.116 నగదును అందజేశారు. తన బొట్టుబిళ్లలు వెదికిచ్చినందుకు భక్తురాలు ఈతగాళ్లకు రూ.500 నగదు ఇచ్చారు. -
ఘాట్ల వద్ద 146 పడవలు
– 438 మంది గజ ఈతగాళ్లు నియామకం కర్నూలు(అగ్రికల్చర్): ప్రమాదాల నివారణకు పుష్కరఘాట్ల వద్ద మత్స్య శాఖ 146 పడవలను సిద్ధం చేసింది. పుష్కరాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే గాక దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని, దుర్ఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకున్నట్లుగా మత్స్యశాఖ డీడీ శ్రీహరి సోమవారం విలేకరులకు తెలిపారు. పుష్కర స్నానాలు ఆచరించే ఘాట్ల వద్ద 146 పడవలు, 438 మంది గజ ఈతగాళ్లను విపత్తుల నిర్వహణకు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పాతాళగంగలో 52 , లింగాలగట్టులో 70, సంగమేశ్వరంలో 24 పడవలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఒక్కో పడవకు ఒక గజ ఈతగాడు ఉంటారని, మూడు షిఫ్ట్‌లు నిర్వహించే విధంగా గత ఈతగాళ్లను ఎంపిక చేసినట్లు వివరించారు. పాతాళగంగలో 156 మంది, లింగాలగట్టులో 210 మంది, సంగమేశ్వరంలో 72 మందిని నియమించినట్లు వివరించారు. -
గజ ఈతగాళ్లకు అవగాహన
ఆత్మకూర్ : కష్ణాపుష్కరాల సందర్భంగా మండల పరిధిలోని జూరాల పుష్కరఘాట్ వద్ద మత్స్యశాఖ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆ శాఖ ఏడీ ఖాజా మాట్లాడుతూ ప్రభుత్వం పుష్కరాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని ఒక్క భక్తుడికి కూడా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత గజ ఈతగాళ్లదే అన్నారు. ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, పుష్కరస్నానం ఆచరించే భక్తులకు భరోసా ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా తమకు పుట్టీలు ఏర్పాటు చేయాలని మత్స్యకారులు కోరగా ఆ పుట్టీలను వారే సమకూర్చుకోవాలన్నారు. ప్రతి మత్స్యకారుడికి రోజుకు రూ.350 గౌరవ వేతనం అందజేస్తామన్నారు. జూరాల పుష్కరఘాట్ వద్ద 12మంది గజ ఈతగాళ్లను నియమిస్తున్నామని, అదేవిధంగా జిల్లాలోని అన్ని ఘాట్ల వద్ద 12మంది గజ ఈతగాళ్లను నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మత్స్యకారులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఘాట్లలో ఈతగాళ్లను నియమించాలి
రావులపాలెం: గోదావరి అంత్య పుష్కరాలకు ఏవిధమై నిధులు కేటాయించకుండా చేతులు ఎత్తేసిన ప్రభుత్వం కనీసం స్నానాలకు వచ్చే భక్తుల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు ఘాట్లలో ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో ఏ నదికీ లేని విధంగా ఒక్క గోదావరికి మాత్రమే అంత్య పుష్కరాలు ఉన్నాయని, వాటి నిర్వహణకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రస్తుతం గోదావరి ప్రవాహం ఉధృతంగా ఉన్నందున స్నానాలకు దిగే భక్తులు నీట మునిగే ప్రమాదం పొంచి ఉందన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో 31 ఘాట్లు ఉన్నాయని, వీటిలో ఆలమూరు మండలం బడుగువానిలంక, జొన్నాడ, కొత్తపేట మండలం సూర్యగుండాలరేవు, రావులపాలెం, గోపాలపురం ఘాట్లలో ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ ఘాట్ల వద్ద రక్షణ ఏర్పాట్లు చేయాలని కోరారు. గత పుష్కరాల్లో ఘాట్లలో ఉన్న ఈతగాళ్లు(మత్స్యకారుల)కు నేటికీ కూలీ డబ్బులు ఇవ్వలేదన్నారు. అందుకే అంత్య పుష్కరాల్లో వారిని నియమిస్తే ఆ డబ్బులు అడుగుతారని భయపడుతున్నారన్నారు. -
జలపాతంలో పడి సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం చూసేందుకు వచ్చి ఓ వ్యక్తి మృతి చెందాడు. హైదరాబాద్‌కు చెందిన ఒత్తూరి చైతన్య(24) తొమ్మిది మంది స్నేహితులతో కలసి శనివారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతానికి వచ్చారు. జలపాతం పైభాగం నుంచి దాటే క్రమంలో చైతన్య కాలు జారి అందులో పడిపోయి మృతి చెందాడు. హైదరాబాద్‌లోని దుండిగల్‌కి చెందిన చైతన్య పుణెలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తున్నాడని మిత్రులు తెలిపారు. మృతదేహాన్ని గజ ఈతగాళ్లు సాయంత్రానికి వెలికితీయగా, బోథ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. -
పుష్కరాలకు 400 మంది ఈతగాళ్లు
కొవ్వూరు: గోదావరి పుష్కరాల సందర్భంగా తొలిసారిగా అగ్నిమాపక శాఖ ద్వారా ఈతగాళ్లను ఏర్పాటు చేస్తున్నామని ఆ శాఖ రీజినల్ అగ్నిమాపకశాఖ అధికారి డి.మురళీమోహన్ తెలిపారు. జిల్లాలోని కొవ్వూరు, తాళ్లపూడి, పోలవరం మండలాల పరిధిలోని స్నానఘాట్టాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. కొవ్వూరులో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 400 మంది అగ్నిమాపక సిబ్బందిని ఎంపిక చేసి ఈతలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఈనెల 30వ తేదీతో శిక్షణ పూర్తవుతుందని, వచ్చేనెల 7న రిహార్సులు నిర్వహిస్తామన్నారు. వచ్చేనెల 12వ తేదీన సిబ్బందికి విధులు కేటాయిస్తామని తెలిపారు. వీరిలో 200 మంది చురుకైన ఈతగాళ్లను ఎంపిక చేసి నది లోపల బోట్లపై ఉంచుతామన్నారు. పుష్కర నగర్, లైటింగ్ తక్కువగా ఉన్న ప్రదేశాలలో ఆష్కా లైట్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. పుష్కరనగర్, బస్టాండ్, రైల్వే స్టేషన్ వంటి జనరద్దీ ప్రదేశాలలో ప్రమాదాలు సంభవించకుండా ముందు జాగ్రత్తగా అగ్నిమాపక శకటాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలో 14 ఏ గ్రేడు, 54 బీ గ్రేడు స్నానఘట్టాలను గుర్తించామని ఇక్కడ 600 మంది అగ్నిమాపక సిబ్బంది విధులు నిర్వహిస్తారన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 15 ఏ గ్రేడు, 64 బీ గ్రేడు స్నానఘట్టాలున్నాయని ఇక్కడ 700 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నట్టు తెలిపారు. భక్తుల రక్షణ కోసం తూర్పుగోదావరిలో 13, పశ్చిమగోదావరిలో 10 రబ్బర్ బోట్లను వినియోగించనున్నట్టు పేర్కొన్నారు. స్నానఘట్టాలు శుభ్రం చేసేం దుకు తూర్పుగోదావరిలో 40, పశ్చిమగోదావరిలో 30 పోర్టబుల్ పంప్‌లను వినియోగిస్తామన్నారు. కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో ఐదు పోర్టబుల్ పంపుసెట్లు, నాలుగు రబ్బర్ బోట్లను ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. ఉభయగోదావరి జిల్లాల అగ్నిమాపకశాఖ అధికారులు బి.వీరభద్రరావు, టి.ఉదయ్‌కుమార్, స్ధానిక అగ్నిమాపక అధికారి ఎన్. సుబ్రమణేశ్వరరావు, నీటిపారుదల శాఖ ఏఈ జి.మణికంఠరాజు ఆయన వెంట ఉన్నారు. -
రంగారెడ్డికి టీమ్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా సబ్ జూని యర్, జూనియర్ అక్వాటిక్స్ పోటీల్లో రంగారెడ్డి జిల్లా జట్టు టీమ్ టైటిల్ సొంతం చేసుకుంది. విజయవాడలో జరిగిన ఈ పోటీల్లో రంగారెడ్డి జిల్లా స్విమ్మర్లు 19 అంశాల్లో అగ్రస్థానంలో నిలిచారు. ముఖ్య ఫలితాలు ఇలా ఉన్నాయి. గ్రూప్-1 బాలికలు: 100 మీటర్ల ఫ్రీస్టయిల్: 1. ఆత్మిక కృష్ణన్ (రంగారెడ్డి-1ని:15.64 సెకన్లు), 2. సాయిశ్రీ (కృష్ణా), 3. అలేఖ్య (కరీంనగర్). 50 మీటర్ల ఫ్రీస్టయిల్: 1. ఆత్మిక కృష్ణన్ (రంగారెడ్డి-32.01 సెకన్లు), 2. సాయిశ్రీ (కృష్ణా), 3. మేఘాంజలి (తూర్పు గోదావరి). 200 మీటర్ల బటర్‌ఫ్లయ్: 1. యు.శ్రేష్ట (రంగారెడ్డి-3ని:50.56 సెకన్లు), 2. శ్రీ రమ్య (పశ్చిమ గోదావరి). 1500 మీటర్ల ఫ్రీస్టయిల్: 1. యు.శ్రేష్ట (రంగారెడ్డి-25ని:03.07 సెకన్లు), 2. కె.ఎస్.భవ్య (హైదరాబాద్). గ్రూప్-2 బాలుర 800 మీటర్ల ఫ్రీస్టయిల్: 1. నాగసాయి (రంగారెడ్డి-11ని:05.62 సెకన్లు), 2. గురుహంత్ సాయి (హైదరాబాద్), 3. తేజస్విన్ (ఖమ్మం), తారకరామ్ (రంగారెడ్డి). 50 మీటర్ల బటర్‌ఫ్లయ్: 1. మొహిత్ రాజ్ (రంగారెడ్డి-30.15 సెకన్లు), 2. గౌతమ్ సూర్య (రంగారెడ్డి), 3. మునిశేఖర్ (కడప). 100 మీటర్ల ఫ్రీస్టయిల్: 1. గురుహంత్ సాయి (హైదరాబాద్-1ని:12.99 సెకన్లు), 2. శివ సాకేత్ (నిజామాబాద్), 3. సాయి లక్ష్మణ్ (రంగారెడ్డి), సాయి కుమార్ (విశాఖపట్నం).