ఘాట్ల వద్ద 146 పడవలు | 146 boats near ghats | Sakshi
Sakshi News home page

ఘాట్ల వద్ద 146 పడవలు

Aug 8 2016 7:32 PM | Updated on Apr 3 2019 5:26 PM

ప్రమాదాల నివారణకు పుష్కరఘాట్ల వద్ద మత్స్య శాఖ 146 పడవలను సిద్ధం చేసింది.

– 438 మంది గజ ఈతగాళ్లు నియామకం
 
కర్నూలు(అగ్రికల్చర్‌): ప్రమాదాల నివారణకు పుష్కరఘాట్ల వద్ద మత్స్య శాఖ 146 పడవలను సిద్ధం చేసింది. పుష్కరాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే గాక దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని, దుర్ఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకున్నట్లుగా మత్స్యశాఖ డీడీ శ్రీహరి  సోమవారం విలేకరులకు తెలిపారు. పుష్కర స్నానాలు ఆచరించే ఘాట్ల వద్ద 146 పడవలు, 438 మంది గజ ఈతగాళ్లను విపత్తుల నిర్వహణకు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.  పాతాళగంగలో 52 , లింగాలగట్టులో 70, సంగమేశ్వరంలో 24 పడవలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఒక్కో పడవకు ఒక గజ ఈతగాడు ఉంటారని, మూడు షిఫ్ట్‌లు నిర్వహించే విధంగా గత ఈతగాళ్లను ఎంపిక చేసినట్లు వివరించారు. పాతాళగంగలో 156 మంది, లింగాలగట్టులో 210 మంది, సంగమేశ్వరంలో 72 మందిని నియమించినట్లు వివరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement