ఒలింపిక్స్‌లో 9 స్వర్ణాల చొప్పన గెలిచిన అమెరికా స్విమ్మర్లు
పారిస్: విశ్వ క్రీడల్లో అతికొద్ది మందికే సాధ్యమైన ఘనతను అమెరికా స్విమ్మర్లు కేటీ లెడెకీ, సెలబ్ డ్రెసెల్ సాధించారు. ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో అత్యధిక స్వర్ణాలు సాధించిన క్రీడాకారుల జాబితాలో వీరిద్దరు మరో నలుగురితో కలిసి ఉమ్మడిగా రెండో స్థానానికి చేరుకున్నారు. తాజాగా పారిస్ ఒలింపిక్స్‌లో లెడెకీ, డ్రెసెల్ రెండు స్వర్ణాల చొప్పున సాధించారు. దాంతో ఓవరాల్‌గా ఒలింపిక్స్ క్రీడల్లో వీరిద్దరు నెగ్గిన పసిడి పతకాల సంఖ్య 9కి చేరుకుంది.
ఇప్పటికే ‘పారిస్’లో 1500 మీటర్లలో బంగారు పతకం గెలిచిన లెడెకీ ఆదివారం జరిగిన 800 మీటర్ల విభాగంలోనూ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు డ్రెసెల్ 4్ఠ100 మీటర్ల ఫ్రీస్టయిల్ టీమ్ స్వర్ణానికి 4్ఠ100 మీటర్ల మిక్స్‌డ్ మెడ్లే పసిడి పతకాన్ని జత చేశాడు. ఒలింపిక్స్‌లో అత్యధిక స్వర్ణ పతకాలు గెలిచిన రికార్డు అమెరికా స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ (23 స్వర్ణాలు) పేరిట ఉంది.
ఆ తర్వాత 9 స్వర్ణాలతో లారిసా లాతినినా (జిమ్నాస్టిక్స్; సోవియట్ యూనియన్), పావో నుర్మీ (అథ్లెటిక్స్; ఫిన్‌లాండ్), మార్క్ స్పిట్జ్ (స్విమ్మింగ్; అమెరికా), కార్ల్ లూయిస్ (అథ్లెటిక్స్; అమెరికా), కేటీ లెడెకీ, డ్రెసెల్ ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment