pushkara ghats
-
ఘాట్లలో హుండీల లెక్కింపు
ఆత్మకూర్: కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆత్మకూర్ మండల పరిధిలోని నందిమల్ల, మూలమల్ల, జూరాల గ్రామాల్లోని ఆలయాల్లో ఏర్పాటు చేసిన హుండీలను బుధవారం కురుమూర్తి దేవస్తానం ఈవో శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో లెక్కించారు. మూలమల్లలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలో రూ.58,470లు, నందిమల్లలోని శ్రీ బ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయం హుండీలో రూ.23,130లు, జూరాల గ్రామంలోని శివాలయంలో ఏర్పాటు చేసిన హుండీలో రూ.24,097లు ఉన్నట్లు తెలిపారు. లెక్కింపులను సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఆలయ నిర్వాహకుల సమక్షంలో చేపట్టినట్లు తెలిపారు. -
పుష్కరాల్లో పురోహితులు
భక్తితో నదిలో మునిగితే పాపం హరించుకుపోతుందన్నది భక్తుల విశ్వాసం. పుష్కరుడు ఉన్న నదిలో స్నానం చేస్తే పాపం హరించడంతో పాటు పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. పుష్కర స్నానానికి వచ్చినవారు నదిలో వివిధ రకాల కర్మలు, విధులు ఆచరిస్తుంటారు. సంకల్పం చెప్పుకోవడం నుంచి పితృదేవతలకు పిండ ప్రదానాల వరకు నిర్వహించే ప్రతి కార్యక్రమానికి పురోహితులు తప్పనిసరి. ఆలయాల్లోని అర్చకులతో పాటు భక్తుల సౌకర్యార్థం పుష్కరఘాట్ల వద్ద ప్రత్యేకంగా పురోహితులను అందుబాటులో ఉంచారు. పుష్కర విధుల్లో ఉన్న పూజారులు మనోగతం వారి మాటల్లో.. – పుష్కరఘాట్ల నుంచి ‘సాక్షి’ బృందం భక్తులకు అవగాహన పెరిగింది – గురురాజాచార్యులు, భక్తాంజనేయస్వామి ఆలయ అర్చకుడు, రంగాపూర్ గతంలో పుష్కరస్నానాలపై భక్తులకు అవగాహన లేకపోవడంతో గ్రామాల నుంచి బయటికి వచ్చి పుష్కరస్నానాలు చేయలేదు. ప్రస్తుతం పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రభుత్వ ప్రచారంతో పుష్కరస్నానంపై అవగాహన వచ్చింది. రంగాపూర్ పుష్కరఘాట్ వద్ద కొన్ని లక్షల మంది భక్తులు పుణ్యస్నానం చేశారు. రాబోయే రోజుల్లో ఇంకా భక్తులు పెరిగే అవకాశం ఉంది. పూజలు చేయడం అదృష్టం రంగాపూర్ ఘాట్ సమీపంలోని శ్రీ భక్త ఆంజనేయస్వామి దేవాలయంలో రెండోసారి అశేష భక్తుల కోసం పూజలు చేయడం అదృష్టంగా భావిస్తున్నా. రోజుకు 50వేల మంది భక్తులతో పూజలు చేయిస్తున్నాను. స్వరాష్ట్రంలో జరుగుతున్న తొలి కృష్ణా పుష్కరాలకు భక్తుల ఊహించని విధంగా వస్తున్నారు. నవగ్రహ పూజలు, పంచామృతం, హారతులు, అభిషేకాలు చేస్తూ ఆశీర్వదిస్తున్నాను. – ఎం. గురురాజాచారి, పూజారి, పెబ్బేరు కొత్త అనుభూతి.. కృష్ణా పుష్కరాల సమయంలో మేము దేవాలయంలో భక్తులతో పూజలు చేయించే అవకాశం రావడం మా అదృష్టం. ఇంత మంది భక్తులు కృష్ణా పుష్కరాలకు వచ్చి పుణ్య స్నానాలు చేయడం మరిచిపోలేము. కొత్త అనుభూతిని ఇస్తుంది. –మారుతీశర్మ, బీచుపల్లి పూజలతో సంతృప్తి .. భక్తుల రద్దీ బాగా పెరుగుతుంది. పవిత్ర కృష్ణా పుష్కరాల్లో స్నానం ఆచరించేందుకు వస్తున్న భక్తులు వారి పెద్దల ఆత్మశాంతి కోసం వందల సంఖ్యలో పిండ ప్రదానాలు చేస్తున్నారు. కనీవినీ ఎరగని రీతిలో భక్తులు వస్తుండటంతో వారిచే పూజలు చేయించడం సంతృప్తినిస్తుంది. – శేషాచార్యులు, ప్రధాన అర్చకుడు, ఆత్మకూర్ ఎంతో ఆనందం.. కృష్ణా పుష్కరాల సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ పుణ్యస్నానాలు చేసేందుకు వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. మూలమల్ల ఘాట్‌లో 60మందికిపైగా పూజారులు పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు పుష్కరాల విశిష్టత గురించి చెబుతూ పూజలు చేస్తుండటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. – రాఘవేందర్రావు, ఆత్మకూర్ -
కృష్ణాతీరం.. జనసంద్రం
భక్తులతో కిటికిటలాడిన దత్తక్షేత్రం వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు పస్పుల ఘాట్ నుంచి సాక్షి : పవిత్ర కృష్ణా పుష్కరాలకు నదీతీరం భక్తులతో పోటెత్తింది. పుణ్యస్నానాల కోసం 8వరోజు శుక్రవారం పస్పుల ఘాట్‌లో దాదాపు 60వేల మంది భక్తులు స్నానమాచరించారు. భక్తుల రద్దీ పెరగడంతో ట్రెయినీ కలెక్టర్ పలేమా సత్పతి, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి పర్యటించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. దత్తక్షేత్రంతో పాటు పంచదేవ్‌పాడ్ శ్రీపాద వల్లభస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తల్తెకుండా దేవాదాయశాఖ తరుపున సౌకర్యాలు కల్పించారు. భక్తుల రద్దీ పెరగడంతో అదనంగా మరో షవర్ ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా నది నీటిని పరీక్షలు నిర్వహించారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదనంగా పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. భక్తులు పిండప్రదానం, చాటవాయనం తదితర మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీపాదచాయ ఆశ్రమంలో అన్నదానం చేశారు. పార్కింగ్‌లో వాహనాలు నిండుకున్నాయి. -
ఉచిత బస్సులేమయ్యాయి..?
అధికారులపై మంత్రి మహేందర్‌రెడ్డి ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: పుష్కర ఘాట్లకు దూరంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినందున అక్కడ వాహనాలు నిలిపి, నది వద్దకు వెళ్లేందుకు భక్తులకు ఉచితంగా బస్సులను ఏర్పాటు చేయటంలో ఆర్టీసీ విఫలమైన నేపథ్యంలో అధికారులపై రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత బస్సులు లేవని భక్తుల నుంచి పెద్దసంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లోని రంగాపూర్ పుష్కర ఘాట్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. పుష్కర స్నానం అనంతరం ఆర్టీసీ అధికారులతో సమీక్షించారు. పార్కింగ్ స్థలాల నుంచి నది వరకు ఉచిత బస్సులు ఏర్పాటు చేసి భక్తులను తరలించాల్సిందేనని ఆదేశించారు. పుష్కరాల్లో 20 ల క్షల మంది భక్తులను ఆర్టీసీ బస్సుల ద్వారా తరలించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు 4 లక్షల మందిని తరలించినట్లు వెల్లడించారు. -
ఐదో రోజూ భక్తుల హోరు
దాదాపు 10 లక్షల మంది పుణ్యస్నానాలు * పుష్కర ఘాట్లలో తగ్గుతున్న నీటిమట్టం * జూరాల ఘాట్‌కు భక్తులను అనుమతించని పోలీసులు * నల్లగొండలో ఇంద్రకరణ్, జగదీశ్‌రెడ్డి విహంగ వీక్షణం * వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సతీమణి, * పార్టీ ఎంపీ రేణుక పుణ్యస్నానాలు సాక్షి ప్రతినిధులు, మహబూబ్‌నగర్/నల్లగొండ: కృష్ణా పుష్కరాల ఐదో రోజు మంగళవారం కూడా జనప్రవాహం కొనసాగింది. అయితే పుష్కర ఘాట్లలో నీటిమట్టం తగ్గుతుండటంతో భక్తుల సంఖ్య కూడా కాస్త తగ్గింది. వీటితోపాటు పలు పుష్కరఘాట్లలో నీటిమట్టం సైతం తగ్గింది. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో దాదాపు 10 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారని అధికారులు తెలిపారు. మహబూబ్‌నగర్‌లో 7,80,415, నల్లగొండ ఘాట్లలో 2 లక్షల పై చిలుకు స్నానాలు చేశారన్నారు. ఎగువ నుంచి జూరాలకు వరద నీరు తగ్గడంతో ప్రాజెక్టునుంచి నీటి విడుదలను కట్టడి చేశారు. జూరాల ఘాట్‌కు వచ్చిన భక్తులను మరో ప్రాంతానికి తరలించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పోలీసు అమర వీరులకు వారి కుటుంబాల సమక్షంలో ఎస్పీ రెమా రాజేశ్వరి నేతృత్వంలో పిండ ప్రదానం చేశారు. మంత్రులు మహేందర్‌రెడ్డి రంగాపూర్ ఘాట్‌లో, లక్ష్మారెడ్డి గొందిమళ్లలో పుష్కర స్నానం చేశారు. గొందిమళ్ల ఘాట్‌లో రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి సతీమణి కుటుంబసభ్యులతో కలిసి పుణ్యస్నానమాచరించారు. పార్టీ ఎంపీ బుట్టా రేణుక కూడా పుష్కర స్నానం చేశారు. ఇక వరుస సెలవులు ముగియడంతో నల్లగొండ జిల్లాలో ఐదో రోజు భక్తులు తగ్గారు. మూడు ప్రధాన ఘాట్లు మినహా మిగతావన్నీ వెలవెలబోయాయి. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి పలు ఘాట్లను రోడ్డు, ఆకాశమార్గాన పరిశీలించారు. 20న గవర్నర్ నరసింహన్ మట్టపల్లిలో పుష్కర స్నానం చేస్తారని ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నాగార్జునసాగర్‌లో ఆది, సోమవారాల్లో నిబంధనలు సడలించిన పోలీసులు మంగళవారం మళ్లీ కఠినతరం చేయడంతో కిలోమీటర్ల కొద్దీ నడవలేక భక్తులు ఇబ్బందులు పడ్డారు. మీడియా ప్రతినిధులను కూడా పోలీసులు వదలకపోవడంతో వారు సాగర్‌లో రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. నేడు వైఎస్‌కు పిండ ప్రదానం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి కొల్లాపూర్ నియోజకవర్గం మంచాలకట్ట పుష్కరఘాట్ వద్ద వైఎస్సార్సీపీ నేతలు బుధవారం పిండ ప్రదానం చేయనున్నారు. పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, సెంట్రల్ గవర్నింగ్ కమిటీ సభ్యుడు రాం భూపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు భగవంత్‌రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొంటారు. -
మరికల్ నుంచి పుష్కరాలకు బస్సు సర్వీసులు
ధన్వాడ : కష్ణా పుష్కరాల సందర్భంగా నారాయణపేట ఆర్టీసీ అధికారులు శనివారం మరికల్ బస్టాండ్ నుంచి బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది శ్రీశైలమ్మ, కేఆర్ గౌడ్, కేవీఆర్గౌడ్ మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్ధం మరికల్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి 12రోజుల పాటు ప్రత్యేక బస్సులను నడిపించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారని తెలిపారు. కష్ణ, పస్పుల, జూరాల ఘాట్లతో పాటు అధిక శాతం ప్రయాణికులు కోరుకున్న పుష్కర ఘాట్లకు తీసుకెళ్లేందుకు కూడా అవకాశం కల్పించారని తెలిపారు. -
ఏ ఘాటుకు ఎంత చార్జి?
కర్నూలు(రాజ్‌విహార్): కృష్ణా పుష్కరాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పుష్కర స్నానం చేసి పునీతులు అయ్యేందుకు కుటుంబ సభ్యులందరూ సిద్ధమవుతుంటారు. నదీ స్నానం చేసేందుకు ఏ ఘాటుకు వెళ్దాం.. ఎలా వెళ్దాం.. ఎంత దూరం ఉంటుంది.. ఆర్టీసీ చార్జీలు ఎంత ఉంటాయి.. పిల్లలకు బస్సుల్లో ఎంత తీసుకుంటారు.. సమీపంలోని ఊరి నుంచి ఫలాన ఘాటుకు వెళ్లోస్తే చార్జీలు ఎంతవుతాయి.. అని భక్తులు లెక్కలు వేసుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ చార్జీల వివరాలు ఇస్తున్నాం.. చార్జీల వివరాలు.. నుంచి వరకు కిలో మీటర్లు పెద్దల చార్జీ పిల్లల చార్జీ కర్నూలు శ్రీశైలం 195 రూ.225 రూ.115 కర్నూలు సంగమేశ్వరం 104 రూ.110 రూ.60 కర్నూలు బీచుపల్లి 51 రూ.60 రూ.35 ఆత్మకూరు సంగమేశ్వరం 45 రూ.50 రూ.25 నందికొట్కూరు సంగమేశ్వరం 72 రూ.65 రూ.34 నంద్యాల బస్టాండ్ లింగాలగటు 176 రూ.210 రూ.110 నందికొట్కూరు నెహ్రూనగర్ 15 రూ.15 రూ.12 సంగమేశ్వరం శ్రీశైలం 168 రూ.148 రూ.75 నంద్యాల శ్రీశైలం 176 రూ.155 రూ.78 మంత్రాలయం శ్రీశైలం 286 రూ.306 రూ.156 ఆళ్లగడ్డ శ్రీశైలం 221 రూ.250 రూ.130 కోవెలకుంట్ల శ్రీశైలం 218 రూ.250 రూ.130 బనగానపల్లె శ్రీశైలం 223 రూ.250 రూ.130 ఎమ్మిగనూరు శ్రీశైలం 262 రూ.285 రూ.145 ఆదోని శ్రీశైలం 292 రూ.310 రూ.160 ఆత్మకూరు శ్రీశైలం 123 రూ.160 రూ.85 కర్నూలు విజయవాడ 342 రూ.300 రూ.152 నంద్యాల విజయవాడ 327 రూ.286 రూ.145 శ్రీశైలం విజయవాడ 272 రూ.238 రూ.120 గమనిక: కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సులను మాత్రమే నడుపుతోంది. ఆయా బస్సుల్లో కిలో మీటరుకు 0.87పైసల చొప్పున వసూలు చేస్తారు. ఈ చార్జీలపై ఆర్టీసీ డెవెలప్మెంట్ సెస్సు, రిజర్వేషన్ చార్జీ, ప్యాసింజరు ఇన్ఫర్మేషన్ చార్జీ, ఘాట్ రూట్లలో ఒక కిలో మీటరుకు వసూలు చేసే రూ.1.74ను కూడా కలిపి టికెట్ ఇస్తారు. ఇక్కడ ఇచ్చిన చార్జీల్లో కొద్దిగా తేడా ఉండవచ్చు. -
ఘాట్లవద్ద అనువైన వాతావరణం
మహబూబ్‌నగర్ న్యూటౌన్: కష్ణా పుష్కరాలకు వచ్చిన ప్రతీ భక్తుడు మంచి వాతావరణంలో పుష్కర స్నానం చేసి వెళ్లడమే తమ లక్ష్యమని, ఆమేరకు ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ డాక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పుష్కరాల నిర్వహణపై ఆర్డీఓలు, ప్రత్యేకాధికారులతో సమీక్షించారు. పుష్కరాలలో భక్తుల రద్దీ, వారి ఆరోగ్యం, స్వచ్ఛత, పరిశుభ్రతలపై అధికారులు ఎక్కువ దష్టి కేంద్రీకరించాలని అన్నారు. పుష్కర విధుల్లో ఉన్న వారందరికీ భోజనం, వసతి, తప్పనిసరిగా కల్పించాలని ఆదేశించారు. పుష్కర ఘాట్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. ఈ విషయాల్లో రాజీ పడవద్దని చెప్పారు. తరచుగా పారిశుద్ధ్య పనులు చేపట్టడంతో పాటు ప్రతిరోజు రాత్రి స్నానం ముగిశాక ఘాట్లు శుబ్రం చేయించాలన్నారు. ఈ సందర్భంగా పుష్కరాల బ్రోచర్‌ను విడుదల చేశారు. జాయింట్ కలెక్టర్ ఎం.రాంకిషన్, ఏజేసీ బాలాజీ రంజిత్ ప్రసాద్, డీఆర్ఓ భాస్కర్, ఆర్డీఓలు, ప్రత్యేకాధికారులు ఉన్నారు. అవాంతరాలు లేకుండా ఏర్పాట్లు పుష్కరాల నిర్వహణకు ఎలాంటి అవాంతరాలు కలుగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ సమావేశాన్ని నిర్వహించారు.విపత్తు పరిస్థితులలో అనుసరించాల్సిన విధానాలు, ముందస్తు చర్యలు తదితర అంశాలను చర్చించారు. జేసీ ఎం. రాంకిషన్, ఏజేసీ బాలాజీ రంజిత్ ప్రసాద్, డీఆర్ఓ భాస్కర్, డీఆర్డీఏ పీడీ మధుసూధన్‌నాయక్, డీఎంహెచ్ఎం డా.నాగారాం తదితరులు హాజరయ్యారు. -
ఘాట్ల వద్ద 146 పడవలు
– 438 మంది గజ ఈతగాళ్లు నియామకం కర్నూలు(అగ్రికల్చర్): ప్రమాదాల నివారణకు పుష్కరఘాట్ల వద్ద మత్స్య శాఖ 146 పడవలను సిద్ధం చేసింది. పుష్కరాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే గాక దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని, దుర్ఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకున్నట్లుగా మత్స్యశాఖ డీడీ శ్రీహరి సోమవారం విలేకరులకు తెలిపారు. పుష్కర స్నానాలు ఆచరించే ఘాట్ల వద్ద 146 పడవలు, 438 మంది గజ ఈతగాళ్లను విపత్తుల నిర్వహణకు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పాతాళగంగలో 52 , లింగాలగట్టులో 70, సంగమేశ్వరంలో 24 పడవలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఒక్కో పడవకు ఒక గజ ఈతగాడు ఉంటారని, మూడు షిఫ్ట్‌లు నిర్వహించే విధంగా గత ఈతగాళ్లను ఎంపిక చేసినట్లు వివరించారు. పాతాళగంగలో 156 మంది, లింగాలగట్టులో 210 మంది, సంగమేశ్వరంలో 72 మందిని నియమించినట్లు వివరించారు. -
సా..గుతున్న ఎగువ ఘాట్ పనులు
సంగమేశ్వరం(కొత్తపల్లి): సప్తనదుల సంగమేశ్వరంలో ఎగువ ఘాట్ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఎగువప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతుండటంతో సోమవారం సాయంత్రం నాటికి సంగేశ్వరాలయం పూర్తిగా నీటిలో మునిగిపోనుంది. దిగువనున్న పుష్కరఘాట్లు పూర్తిగా మునిగిపోవటంతో భక్తులు పుష్కర స్నానాలు చేసేందుకుగాను ఎగువఘాట్ల నిర్మాణం పనులు చేస్తున్నారు. కేవలం నాలుగురోజులు మాత్రమే ఉండటంతో ఎగువఘాట్ల నిర్మాణం పనులు పూర్తవుతాయా అనే అనుమానాలను భక్తులు వ్యక్తం చేస్తున్నారు. -
భక్తులకు ఇబ్బంది కలిగించొద్దు : కలెక్టర్
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని కలెక్టర్ బాబు.ఎ అధికారులను ఆదేశించారు. పద్మావతి, కృష్ణవేణి ఘాట్లలో జరుగుతున్న పనులను కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్ గురువారం పరిశీలించారు. కృష్ణవేణి ఘాట్‌లో టైల్స్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్నాన ఘాట్‌లో మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాటు చేస్తున్న గదులను కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు. కృష్ణవేణి ఘాట్‌లో ఏర్పాటు చేసిన పుష్కర కెనాల్‌కు 7వ తేదీ నాటికి నీరు విడుదల చేసేలా చూడాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. హోటల్ నిర్వాహకులు నిబంధనలు పాటించాలి : సబ్‌కలెక్టర్ విజయవాడ : కృష్ణాపుష్కరాల సందర్భంగా ప్రభుత్వం రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా హోటళ్లలో గదులు కేటాయించాలని సబ్ కలెక్టర్ డాక్టర్ జి.సృజన సూచించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం నగరంలోని 105 హోటళ్ల ప్రతినిధులతో సబ్‌కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సబ్‌కలెక్టర్ సృజన మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలకు మూడున్నర కోట్ల మంది భక్తులు ఇచ్చే అవకాశం ఉందన్నారు. సమాన్యులతోపాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతస్థాయి అధికారులు, దేశవిదేశాల ప్రముఖులు, పర్యాటకులకు హోటళ్లలో బసకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గదుల కేటాయింపులో అధికారులకు హోటళ్ల నిర్వాహకులు సహకరించాలని కోరారు. నిర్ణయించిన మేరకే గదుల ధరలు వసూలు చేయాలని, ఆహార పదార్థాలను నాణ్యతతో అందించాలని కోరారు. 12 గంటల టారిఫ్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ట్రైనీ కలెక్టర్ బాలాజీ, గేట్‌వే, మురళీఫార్చ్యూన్, డీవీమానర్, ఐలాపురం తదితర హోటళ్ల ప్రతినిధులు హాజరయ్యారు. -
పుష్కర ఘాట్లు.. ఎంతెంత దూరం?
– కర్నూలు నుంచి శ్రీశైలానికి 195 కిలో మీటర్లు – సంగమేశ్వరం 104, బీచుపల్లి 51 కిలో మీటర్లు కర్నూలు(రాజ్‌విహార్): కృష్ణా పుష్కరాలు మరో ఎమిమిది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే వేడుకల సందర్భంగా పవిత్ర నదిలో స్నానం చేసి పునీతులు కావాలని అందరూ కోరుకుంటారు. మహారాష్ట్రలోని మహాబళేశ్వరంలో పుట్టిన కృష్ణానది కొత్తపల్లి మండలం సంగమేశ్వరం వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తోంది. ఈ నది 1400కిమీ దూరం ప్రవహించి.. కృష్ణా జిల్లా ప్రకాశం బ్యారేజీ వద్ద హంసలదీవిలో బంగాళాఖాతంలో కలుస్తోంది. ఈనెల 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కృష్ణా పుష్కరాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో నదీ స్నానమాచరించేందుకు వెళ్లే భక్తులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వారి కోసం పుష్కర ఘాట్ల దూరంపై ప్రత్యేక కథనం.. – జిల్లా కేంద్రం కర్నూలు నుంచి శ్రీశైలానికి 195కిలో మీటర్ల దూరం ఉంది. ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి తప్పనిసరిగా ఆర్టీసీ బస్ సౌకర్యం ఉంటుంది. ఆదోని నుంచి కర్నూలుకు 97కిలో మీటర్ల దూరం ఉండగా ఎమ్మిగనూరు–67, మంత్రాలయం–91, ఆలూరు–108, పత్తికొండ–82, కోడుమూరు–35, డోన్–53, నంద్యాల–72, ఆళ్లగడ్డ–117, పాణ్యం–52, నందికొట్కూరు–32, బనగానపల్లె–76, కోవెలకుంట్ల –92, ఆత్మకూరు (శ్రీశైలం) 72 కిలో మీటర్లు ఉంది. – ఆత్మకూరు, నందికొట్కూరు రూటులో ఉన్న పట్టణాలు, గ్రామాలకు చెందిన భక్తులు కర్నూలుకు రావాల్సిన అవసరం లేదు. బనగానపల్లెతోపాటు కోవెలకుంట్ల పరిసర ప్రాంత ప్రయాణికులు నంద్యాలకు చేరుకొని అక్కడి నుంచి ఆత్మకూరు మీదుగా సంగమేశ్వరం, శ్రీశైలానికి చేరుకోవచ్చు. – లింగాలగట్టు ఘాట్లలో స్నానం చేయాలనుకున్న భక్తులు శ్రీశైలం కంటే ముందే వచ్చే సున్నిపెంట నుంచి శ్రీశైలం డ్యాం (ప్రాజెక్టు) మీదుగా లింగాలగట్టు (14కిలోమీటర్లు) చేరుకోవచ్చు. సున్నిపెంట నుంచి శ్రీశైలం 10కిలో మీటర్ల దూరం ఉంది. – కర్నూలు నుంచి 32కిలో మీటర్ల దూరంలో ఉన్న నందికొట్కూరు చేరుకుంటే అక్కడి నుంచి నెహ్రూనగర్ 15కిలో మీటర్ల దూరం ఉంది. అక్కడ కష్ణానది బ్యాక్ వాటర్ (వేరే తీరం)లో స్నానం చేయవచ్చు కానీ అక్కడ ప్రభుత్వ పరంగా అధికారిక పుష్కర ఘాట్ లేదు. – కర్నూలుకు చేరుకున్న భక్తుల కోసం రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ స్నానపు ఘాట్లకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది. బస్సుల్లో కాకుండా సొంత వాహనాలు లేదా ప్రైవేట్ట్యాక్సీ, ట్రావెల్స్ ద్వారా కూడా పుష్కర ఘాట్లకు చేరుకోవచ్చు. – జిల్లా కేంద్రం నుంచి మహబూబ్ నగర్ జిల్లా బీచుపల్లి వద్ద ఉన్న పుష్కర ఘాట్ 51కిలో మీటర్ల దూరంలో బెంగుళూరు – హైదరాబాదు జాతీయ రహదారి పక్కనే ఉంది. – కర్నూలు నుంచి నందికొట్కూరు 32కిలో మీటర్ల దూరం ఉండగా అక్కడి నుంచి పాములపాడు 28కిలో మీటర్లు ఉంది. అక్కడి నుంచి సంగమేశ్వరం 44కిలో మీటర్లు ఉండగా ఆత్మకూరు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి దోర్నాల (ప్రకాశం జిల్లా) 63, అక్కడి నుంచి శ్రీశైలం 60కిలో మీటర్ల దూరం ఉంది. మల్లన్న క్షేత్రం చేరుకుంటే అక్కడి నుంచి ఆర్టీసీ అధికారులు నడుపుతున్న ఉచిత బస్సుల్లో పాతాళగంగ వరకు వెళ్లవచ్చు. – కర్నూలు నుంచి విజయవాడకు 342కిలో మీటర్ల దూరం ఉంది. ఆర్టీసీ పుష్కర దినాల్లో రోజుకు 10 చొప్పున బస్సులు నడుపుతోంది. -
పుష్కర ఘాట్ పరిశీలన
పెదకళ్లేపల్లి(మోపిదేవి) : దక్షిణకాశీగా పేరొందిన పెదకళ్లేపల్లిలో నిర్మాణ దశలో ఉన్న పుష్కరఘాట్‌ను జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్ సోమవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విజయవాడ కృష్ణానదిపై భారీ వాహనాలను నిషేదించినట్లు చెప్పారు. ఒంగోలు నుంచి చీరాల, బాపట్ల, రేపల్లే, మోపిదేవి, చల్లపల్లి, మచిలీపట్నం మీదుగా వాహనాల మళ్లింపు ఉంటుందని తెలిపారు. ట్రాఫిక్‌ను మళ్లించడంతో పాటు సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు మోనిటరింగ్ చేస్తామని, ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద క్యూలైనులోనే దర్శనం కల్పించనున్నట్లు వివరించారు. సమాచార కేంద్రాలు ఏర్పాటు చేసి భక్తులకు రూట్ వివరాలు తెలియజేస్తామని తెలిపారు. అనంతరం మోపిదేవి శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకున్నారు. భక్తులకోసం చేపడుతున్న చర్యలను ఆలయ ఏసీ ఎం శారదాకుమారిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట అవనిగడ్డ డీఎస్పీ ఖాదర్‌బాషా, సీఐ మూర్తి, ఎస్ఐలు మణికుమార్, రామకృష్ణ, ఆదిప్రసాద్, ఆర్సీ ఏఈ చలపతిరావు, గ్రామ సర్పంచ్ అరజా వెంకట సుబ్బారావు, పోలీసులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
రిపోర్టు రాసేస్తా..!
పనుల నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం ఈఓతో కలసి పుష్కర ఘాట్ల పరిశీలన కొండ చరియలు విరిగిపడకుండా చర్యలు శ్రీశైలం : పుష్కర పనుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ విజయమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా ఉన్న వారందరిపై రిపోర్టు రాసేస్తానని హెచ్చరించారు. గురువారం శ్రీశైలం చేరుకున్న ఆయన ఈఓ భరత్ గుప్తాతో కలిసి పాతాళగంగ పుష్కరఘాట్లను పరిశీలించారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఘాట్ వద్ద ఏర్పాటు చేస్తున్న మెట్లను పరిశీంచి భక్తుల స్నానానికి ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయలేదా అని అక్కడి ఇంజనీర్లను ప్రశ్నించారు. 10 అడుగుల దూరంలో ప్లాట్‌పాం ఉంటుందని చెప్పారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ పనుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై రిపోర్టు రాస్తానని హెచ్చరించారు. కొండచరియ రాళ్లు విరిగిపడడంపై దేవస్థానం ఈఈపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొండ చరియలు పడకుండా ఏర్పాట్లు కొండ చరియలు విరిగిపడకుండా హైటెన్షన్ వైర్‌తో గ్రాటింగ్ చేస్తామని కలెక్టర్ తెలిపారు. పుష్కరాల్లో విధులు నిర్వర్తించే అధికారులందరికి వచ్చే నెల 1 నుంచి శిక్షణా తరగతులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వారంతా ఆగస్టు 2 నుంచి పుష్కర విధుల్లో పాల్గొంటారన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు మూడు ప్రదేశాలలో భక్తులకు అన్ని సౌకర్యాలతో కూడిన పుష్కర నగర్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పుష్కర నగర్ చేరుకున్న భక్తులు క్లోక్‌రూమ్‌లో సామాన్లు భద్రపర్చుకుని తాత్కాలికంగా సేద తీరేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అందరికీ భోజన వసతి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పుష్కర నగర్ల వద్ద సాంస్కతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుందన్నారు. ఐదు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామన్నారు. ఐదారు రోజుల్లో పనులు పూర్తి లింగాలగట్టు, పాతాళగంగలో జరుగుతున్న పనులన్నీ ఐదారు రోజుల్లో పూర్తవుతాయని కలెక్టర్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే పాతాళగంగకు వచ్చే ఘాట్ రోడ్డు నిర్మాణానికి బీటీ రోడ్డు వేయాలని ప్రతిపాదనలు పంపించామని, రక్షణ గోడ కట్టాల్సిన అవసరం ఉండడంతో ముందుగా అది పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఒకవేళ బీటీ కాకపోతే వెట్‌మిక్స్ లేదా గ్రావెల్ రోడ్డు వేసి రోలింగ్ చేస్తామన్నారు. 28 ఎస్ఆర్ఐ 03 ః పాతాళగంగ వద్ద పుష్కర ఘాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ విజయమోహన్, ఈఓ భరత్ గుప్తా -
కృష్ణా పుష్కరాలపై చంద్రబాబు సమీక్ష
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం కృష్ణా పుష్కరాలపై అధికారులతో సమీక్ష జరిపారు. ఘాట్ నిర్మాణం అసంపూర్తిగా ఉన్న నేపథ్యంలో సీతానగరం ఘాట్ కాంట్రాక్టర్‌ను పిలిచి ఆయన ఇవాళ మందలించారు. కాంట్రాక్టర్లపై ఆధారపడకుండా పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. కాగా ముఖ్యమంత్రి నిన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కృష్ణానది పుష్కర ఘాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీతానగరం ఘాట్ కాంట్రాక్టర్‌పై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో పనులు పూర్తి చేయకపోవడంపై సంజాయిషీ చెప్పాలని హుకుం జారీ చేశారు. ఆ కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టడమే కాకుండా అరెస్ట్ చేయాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. -
పుష్కర ఘాట్లను పర్యవేక్షించిన చంద్రబాబు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కృష్ణానది పుష్కర ఘాట్లను పర్యవేక్షించారు. ఆయన దుర్గగుడి, కృష్ణవేణి పుష్కర ఘాట్లను సందర్శించి పనుల తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. కృష్ణానదిలో బ్యారేజ్ దగ్గర నీటిమట్టం స్థాయిలపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి అంతకు ముందు గుంటూరు జిల్లా సీతానగరం ఘాట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సీతానగరం ఘాట్ కాంట్రాక్టర్‌పై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో పనులు పూర్తి చేయకపోవడంపై సంజాయిషీ చెప్పాలని హుకుం జారీ చేశారు. ఆ కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టడమే కాకుండా అరెస్ట్ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ కృష్ణా పుష్కరాలు చరిత్రాత్మకమైనవి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి నిర్వహిస్తోంది. ఎంతో విశ్వాసంతో పనులు అప్పగిస్తే చేసిన పనులు ఇవేనా? అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీతానగరం ఘాట్ కాంట్రాక్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఆయన గుంటూరు కృష్ణా జిల్లాలలో నిర్మిస్తున్న పుష్కర ఘాట్లను రెండుగంటలకు పైగా కలియదిరిగి ఆసాంతం పరిశీలించారు. ‘నేనెంతో కష్టపడి నిమిష నిమిషం ఎక్కడ ఉన్నా పుష్కరాల పనులను సమీక్షిస్తున్నాను’ అని అన్నారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోక్యం చేసుకుని వివరణ ఇవ్వటంతో ఇవ్వటంతో ముఖ్యమంత్రి శాంతించారు. పనుల వేగం పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దుర్గగుడి ఫ్లైఓవర్ పనులు ఎంతవరకు వచ్చాయో పరిశీలించారు. పుష్కరాల నాటికి ఫ్లయ్ ఓవర్ కింద రహదారి రెండులైన్లయినా అందుబాటులోకి రావాలన్నారు.కృష్ణవేణి ఘాట్‌లో మెట్లపై నీరు నిలిచి వుండటాన్ని గమనించి అధికారులను వివరణ అడిగారు. నెలాఖరుకల్లా పనులు పూర్తిచేయటానికి పనుల వేగం పెంచాలని చెప్పారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ కోనేరు శ్రీధర్, కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు ఎ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ వీరపాండ్యన్, డిజి గౌతం సవాంగ్ లు ఉన్నారు. -
పుష్కర ఘాట్ల నిర్మాణ పనులపై మంత్రి అసంతృప్తి
గుంటూరు: గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం సమీపంలోని ప్రకాశం బ్యారేజి దిగువన నిర్మిస్తున్న పుష్కర ఘాట్ల పనులను పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ గురువారం పరిశీలించారు. పనులు నత్తనడకన సాగుతుండటం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో రాజీపడకూడదని అధికారులకు నారాయణ సూచించారు. దాదాపు రూ.6.50 కోట్ల వ్యయంతో ఈ పుష్కర ఘాట్లను నిర్మిస్తున్నారు. మంత్రి నారాయణ వెంట ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. -
శ్రీశైలంలో సీఎం
-
పుష్కరాల్లో వీఐపీల వికృతహేల
సందర్భం భారీ జనసందోహం పోగుపడే పుష్కరాల వంటి సందర్భాల్లో తమ అహాలకంటే, వ్యక్తిగత పుణ్యాన్ని సాధించాలనే యావ కంటే ప్రజా ప్రయోజనాన్ని అన్నిటికంటే ప్రథమస్థానంలో ఉంచాలని గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు గ్రహించాలి. ప్రియమైన ఐ.వై.ఆర్. కృష్ణా రావు గారూ! గోదావరి పుష్కరాల సంద ర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు మెల గిన విధానం నన్ను చాలా బాధించింది, వ్యాకులపర్చింది. ముఖ్యమంత్రి, ఆయన కుటుం బం యాత్రికుల వ్యథపై కాసింత సున్నితంగా వ్యవహరించి ఉంటే పుష్కరాల ప్రారంభ దినాన 30 మంది (పిల్లలతో సహా) తొక్కిసలాటలో అసు వులు బాసిన ఘటన జరిగి ఉండేది కాదు. ఇలాంటి ఘటనల్లో ఒక్కరంటే ఒక్క వీఐపీ ఉన్నా చాలు.. అది భద్రతా ఏర్పాట్లపై, ట్రాఫిక్‌పై, ఇతర సేవలపై ప్రభావం చూపుతుంది. ప్రముఖ వ్యక్తులు లేకున్నట్లయితే రాజమండ్రిలో పుష్కరాలకు తరలివచ్చిన లక్షలాది మంది యాత్రికులకు పైసేవలన్నీ అందుబాటులో ఉండేవి. ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో అతి పెద్ద తొక్కిసలాట సందర్భంగా క్షమా ర్హం కాని ఘటన జరిగినప్పటికీ, స్వయం ప్రకటిత వీఐపీలు తమ కుటుంబాలు, ఇతర పరివారం తోడుగా పుష్కరాల్లో పాల్గొనడానికి కదం తొక్కారని వార్తలు. యాత్రికులు సొం త ఖర్చులు పెట్టుకోవాల్సివచ్చింది కానీ, తమ ప్రైవేట్ ఖర్చులను చెల్లించడానికి ప్రభుత్వ ఖజానా అన్ని వేళలా పుష్కరాల్లో అందుబాటులో ఉందన్న చందాన వీఐపీలు పుష్కరాలకు పోటెత్తారు. నాకు అర్థమయిందేమిటంటే, రాజమండ్రి చేరుకుని పుష్కర జలాల్లో మునగడానికి ఉత్తరాన తుని నుంచి, దక్షి ణాన ఏలూరు వరకు యాత్రికులు భారీ సంఖ్యలో క్యూ కట్టి వేచి ఉన్నారు. ఇంత భారీ జనసందోహం మున్నె న్నడూ కనీవినీ ఎరుగనిది. మామూలు పరిస్థితుల్లో అయితే బాధ్యత గల ఏ ప్రభుత్వమైనా.. అతడు లేదా ఆమె క్యూలో నిల్చుని వేచి చూడటానికి సిద్ధపడితే తప్ప, ఈ స్వయం ప్రకటిత వీఐపీల ప్రవేశంపై నిషేధం విధించేది. వీఐపీలను కూడా ఇతర యాత్రికులలాగే భావించి వారు మామూ లుగా పుష్కరాల్లో పాలు పంచుకునేలా చేసేది. దురదృష్ట వశాత్తూ ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో కనీస బాధ్య తతో అయినా వ్యవహరించినట్లు కనిపించలేదు. పైన పొందుపర్చిన చిత్రాన్ని చూసినట్లయితే, తొక్కిస లాట జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా గవర్నర్ తన కుటుంబంతోపాటు రాజమండ్రిని సం దర్శించి ప్రత్యేకంగా రూపొందించిన వీఐపీ ఘాట్‌లో మునకవెయ్యడానికే సిద్ధపడినట్లు కనిపిస్తుంది. మనలాం టి ప్రజాస్వామ్యవ్యవస్థలో, కొంతమందిని వీఐపీలుగా గుర్తించి ప్రజాధనంతో వారికి అవసరమైన దానికంటే ఎక్కువ స్థలాన్ని వారు ఆక్రమించడానికి అనుమతించడం జరిగితే అలాంటి పరిస్థితి ఎవరికైనా అసహ్యం కలిగించ దా? పుష్కరాల సందర్శన కోసం రాజమండ్రి రావడానికి గవర్నర్ తన కుటుంబ సభ్యులతో కలసి హెలికాప్టర్‌ను ఉపయోగించారని నాకర్థమైంది. పూర్తిగా వ్యక్తిగతమైన ఇలాంటి సందర్శనలకు ఎవరు డబ్బు చెల్లిస్తున్నారు? గవ ర్నర్ కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగులు కారు. ప్రభు త్వ ఖజానా నుంచి వారికోసం ఎలాంటి చెల్లింపులు చేయ కూడదు. ఇలాంటి వ్యవహారాల్లో ప్రభుత్వం జవాబుదారీత నాన్ని తప్పక పాటించాలి. తమకు తాము పుణ్యం సంపా దిం చుకోవడం కోసం వీఐపీలు చెల్లింపులు జరిపేలా ప్రభు త్వ పన్ను చెల్లింపుదారును ఒత్తిడికి గురిచేయకూడదు. అలాంటి పుణ్యసాధన కోసం తాము ప్రజలను అసౌకర్యా నికి గురి చేయకూడదని వీఐపీలు తెలుసుకోవాలి. ఒక రాష్ట్ర గవర్నర్ పాత్ర ఏమిటన్నది రాజ్యాంగంలో చక్కగా నిర్వచించారు. ఆయన పాత్రకు పరిమితులు న్నాయి. రాజ్యాంగంలో తమకు నిర్దేశించని పాత్రలను వారు చేపట్టనే కూడదు. పైగా, ఈ తొక్కిసలాట ఘటన మధ్యనే సింగపూర్ నుంచి అత్యున్నత స్థాయి బృందం రాజమండ్రిని సంద ర్శించిందని విన్నాను. ఈ బృందం సందర్శన కూడా యాత్రికులకు మరిన్ని ఇబ్బందులను కలుగజేసి ఉంటుం దని నా నమ్మకం. ప్రజలకు అసౌకర్యం కలిగించటమే కాక, ప్రజా భద్రతకు ప్రమాదకరంగా మారే వీఐపీలను ఇలాంటి పరిమాణాలకు పూర్తి బాధ్యత వహించేలా చేసి, వారిపై ఆరోపణలను బుక్ చేసే రోజొకటి వస్తుంది. టైమ్స్ టీవీ న్యూస్ చానల్లో వీఐపీల ఉపద్రవాన్ని విస్తృతంగా కవర్ చేయడం నా దృష్టికి వచ్చింది. కింది లిం కులో దాన్ని మీరు కూడా చూడవచ్చు. https://www.youtube.com/watch?t=75&v=WlLD0kF7DfQ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఆర్నాబ్ గోస్వామి సంధించిన ప్రశ్నలకు నేరుగా సమా ధానం చెప్పకూడదు. ఎందుకంటే ఆ ఘటనకు సంబం ధించి వాస్తవంగానే ఎలాంటి సమాధానాలు లేవు. 2014 అక్టోబర్‌లో హుద్ హుద్ తుపాను సమయంలో ముఖ్య మంత్రి విశాఖపట్నంలో ఉండిపోయిన ఘటన అసాధారణ మని, అది సహాయ చర్యలను వేగవంతం చేయడంలో ఎంతగానో తోడ్పడిందన్న భావం కలిగించడానికి సీఎం అప్పట్లో ప్రయత్నించారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే సహా య చర్యలకు నేతృత్వం వహించడం అభినందనీయమే కానీ బహుశా సీఎం తెలుసుకోని విషయం ఏమిటంటే, విశాఖపట్నంలోని 90 శాతం అధికారులు ఆ సమయంలో సీఎం వద్ద హాజరు వేయించుకోవడంలోనే కాలం గడిపేశా రు. పైగా నిజంగా తుపాను ప్రభావానికి గురైన గుడిసెవా సులను అధికారులు పలకరించలేకపోయారు. ఈ అధికా రుల్లో చాలామంది 5 స్టార్ హోటల్లో బస చేశారు. తుపా ను ముగిసిన తొమ్మిది నెలల తర్వాత కూడా పేదలలో కేవలం 15 శాతం మంది మాత్రమే తుపాను సహాయాన్ని అందుకోగలిగారు. మిగతావారు ఈనాటికీ సహాయం కోసం వేచి చూస్తూనే ఉంటున్నారు. హుద్ హుద్ తుపాను అనంతరం ప్రధానమంత్రి విశాఖపట్నం సందర్శన ఎంత ఇబ్బంది కలిగించిందంటే, బాధితులకు ఉద్దేశించిన ఆహార సామగ్రి మొత్తంగా పాడయిపోయింది, అధికారుల అప్ర మత్తత కూడా దారి తప్పింది. ఇలాంటి సందర్భాల్లో తమ అహాలకంటే, వ్యక్తిగత పుణ్యాన్ని సాధించాలనే యావకంటే ప్రజా ప్రయోజనాన్ని అన్నిటికంటే ప్రథమస్థానంలో ఉంచాలన్న సందేశాన్ని గవ ర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు గ్రహిస్తారని ఆశిస్తు న్నాను. ప్రచారం పట్ల ఆత్రుత, రాజకీయ ప్రయోజనాలకు కూడా వీరు దూరంగా ఉంటేనే మంచిది. తాము ప్రజాస్వా మ్యంలో భాగమే కానీ జమీందారీ వ్యవస్థలో భాగం కాదన్న విషయాన్ని వారు తప్పక దృష్టిలో ఉంచుకోవాలి. తన ఘోరమైన, అతిశయించిన వీఐపీ సంస్కృతిని భారతదేశం అధిగమించే రోజొకటి వస్తుందని నేను ఆశిస్తు న్నాను. ప్రజాస్వామ్యంలో వీఐపీలకు చోటు లేదు. ఈ ఉత్తరాన్ని గవర్నర్, ముఖ్యమంత్రుల ముందు ఉంచాలని నేను అభ్యర్థిస్తున్నాను. ఇలాంటి సందర్భాల్లో వారు ఎలాంటి పాత్రలను నిర్వహించాలనే విషయంపై నా ఉత్తరం ప్రభావం చూపుతుందని ఆశిస్తున్నాను. తొక్కిసలాటపై న్యాయవిచారణపై ఇకనయినా దృష్టి పెడతారని ఆశిస్తాను. ఈ ఘటనలో పోలీసులు, జూనియర్ అధికారుల పాత్రపైనే కాదు.. వీఐపీల పాత్రపై కూడా దృష్టి పెట్టగలరని ఆశిస్తున్నాను. (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావుకు భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇ.ఎ.ఎస్ శర్మ రాసిన లేఖ) ఈఎఎస్ శర్మ (వ్యాసకర్త మొబైల్: 9866021646) ఈ మెయిల్:eassarma@gmail.com. -
కాలుష్యం కోరల్లో పుష్కర ఘాట్లు
గోదారి తీరం విషతుల్యం * ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణం.. పిండ ప్రదానాలు, పూజా సామగ్రి అంతా నదిలోకే.. భద్రాచలం నుంచి సాక్షి బృందం: ఏడు రోజులుగా లక్షల సంఖ్యలో స్నానాలు, పిండ ప్రదానాలు, కుంకుమ పూజలతో భద్రాచలం వద్ద గోదావరి తీరం ప్రమాదకరంగా మారుతోంది. ఘాట్ల సమీపంలో నీరంతా కాలుష్యపు కోరల్లో చిక్కుకుంటోంది. పిండ ప్రదానాల సామగ్రిని నదిలో పడేస్తుండడం, వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలూ అక్కడే వేస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొం ది. లక్షలాది మంది భక్తులకు తోడు పుష్కర విధుల కోసం వచ్చిన వేలాది మంది సిబ్బం దికి సరిపడ మరుగుదొడ్లు ఏర్పాటు చేయలేదు. ఫలితంగా బహిరంగ ప్రదేశాల్లోనే మల, మూత్ర విసర్జన చేస్తున్నారు. దీంతో తీర ప్రాంతం దుర్గంధం వెదజల్లుతోంది. కంపుకొడుతున్న ఘాట్లు.. అపరిశుభ్రత వాతావరణంతో ఘాట్లు కంపుకొడుతుండటంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అడపాదడపా వర్షం పడుతోంది. ఆ సమయంలో దుర్వాసన మరింతగా పెరుగుతోంది. ఘాట్ల వద్ద ప్రత్యేకంగా ట్రాక్టర్లను ఏర్పాటు చేసి చెత్తను తరలిస్తున్నా.. పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఇప్పటిదాకా సుమారు 20 లక్షల మందికిపైగా భద్రాచలంలోని పుష్కర ఘాట్లలో స్నానమాచరించారు. స్నానాల సమయంలో భక్తులు షాంపూలు, సబ్బులు వాడుతున్నారు. దీపాలు వదులుదున్నారు. దీంతో ఆ ప్రాంతంలో స్నానం చేసే వారికి దురదలు వస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. పిండ ప్రదానం, పూజా సామగ్రి నదిలో వేయొద్దని సూచిస్తున్నారు. ప్రబలుతున్న అతిసారం.. తీరంలో అపరిశుభ్రత నెలకొనడంతో అతిసారం లక్షణాలు పెరిగాయి. వాంతులు, విరేచనాలతో ఇప్పటికే జనం ఆసుపత్రుల బాటపడుతున్నారు. ఇక్కడ విధులు నిర్వహించేందుకు వచ్చిన సిబ్బందితోపాటు స్థానికులు అతిసారంతో బాధపడుతున్నారు. ఏడు రోజుల వ్యవధిలో అతిసారంతో 381 మంది చికిత్సలు చేయించుకున్నట్టు వైద్య ఆరోగ్యశాఖాధికారులు చె బుతున్నారు. అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘాట్ల వద్దే స్నానం చేయండి అధికారులు సిద్ధం చేసిన ఘాట్ల వద్ద మాత్రమే పుష్కర స్నానాలు ఆచరించాలని ప్రభుత్వం సూ చించింది. రద్దీ ఉందన్న ఉద్దేశంతో కొన్నిచోట్ల ఘాట్లు లేని ప్రాంతాల్లో కూడా భక్తులు స్నానాలు చేస్తున్నారని, ఇది ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతుందని ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి పేర్కొన్నారు. ఉపవాస స్నానాలొద్దు: స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్, సాక్షి: పుష్కరస్నానాలు ఆచరించడానికి వెళుతున్నవారిలో ఎవరికైనా బీపీ, షుగర్ తదితర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే వారు ఉపవాసాలు, మందులు తీసుకోకుండా వెళ్లటం మంచిది కాదని స్వామి పరిపూర్ణానంద తెలిపారు. అవసరమైన ఆహారం, మందులు తీసుకుని పుష్కర స్నానాలు చేయవచ్చునన్నారు. దీంతో పాటు స్నానాలు ఆచరిస్తున్న భక్తులు మట్టి, పసుపు కుంకుమలు, గాజులు, చీరల వం టి వస్తువుల్ని గోదావరిలో వేస్తున్నారని, అది సరి కాదని చెప్పారు. -
'స్వచ్ఛ' పుష్కరం
భద్రాచలం : పుష్కరాల్లో పారిశుధ్య కార్మికులు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. భద్రాచలంతోపాటు ఆలయ పరిసరాలు, ఘాట్ల వద్ద పరిశుభ్రంగా ఉండేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. గోదావరి పుష్కరాల్లో పాల్గొనడానికి భక్తులు లక్షలాదిగా భద్రాచలానికి వస్తున్నారు. భక్తులు కవర్లు, ఇతర వస్తువులతోపాటు పెద్ద ఎత్తున మంచినీటి ప్యాకెట్లను పడేస్తున్నారు. అవి అలాగే ఉండిపోతే గుట్టలుగా పేరుకుపోయి రోగాలు ప్రబలే ప్రమాదం ఉంటుంది. అయితే వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ పారిశుధ్యం చెడకుండా కార్మికులు నిరంతరం పనిచేస్తున్నారు. వ్యర్థాలను ఊడ్చివేయడం, వాటిని డ్రమ్ముల్లోకి ఎత్తడం, అనంతరం వాటిని ట్రాక్టర్లలోకి ఎత్తి దూరంగా తరలించడం చేస్తున్నారు. ఇక బురదమయంగా మారుతున్న ప్రాంతాల్లో నీటిని తొలగించడంతోపాటు బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. 19 జోన్లుగా.. భద్రాద్రిలో భక్తుల రద్దీని ఊహించిన అధికారులు ముందుగానే పారిశుధ్య కార్మికులను నియమించారు. నెల్లూరు, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన 410 మంది కార్మికులను ఇక్కడకు రప్పించారు. వారికి రోజూ రూ. 300 వేతనంతోపాటు టిఫిన్, భోజన వసతులు కల్పించారు. 410 మంది కార్మికులను 19 జోన్లుగా విభజించి పారిశుధ్య పనులు అప్పగించారు. జిల్లా పరిషత్ సిబ్బంది జోన్లను పర్యవేక్షిస్తున్నారు. 20 ట్రాక్టర్ల ద్వారా కార్మికులు సేకరించిన చెత్తను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కార్మికుల పిల్లల కోసం.. పారిశుధ్య కార్మికుల పిల్లల సంరక్షణకు సైతం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డు ప్రాంగణంలో శిబిరం ఏర్పాటుచేసి, పిల్లలకు అంగన్వాడీ కార్యకర్తలతో ఆటపాటలతో కూడిన విద్య అందిస్తున్నారు. వారికి అవసరమైన స్నాక్స్, ఆట వస్తువులు, ఇతర సౌకర్యాలను కల్పించారు. కలెక్టర్ ఆదేశాలతో.. భద్రాద్రిలో పారిశుధ్య సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు కార్మికుల పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్య అందిస్తున్నాం. - ఆశాలత, డీఎల్పీవో -
పుష్కర ఘాట్లలో నీటి ఉధృతి
కరీంనగర్(రామగుండం): కరీంనగర్ జిల్లాలోని పుష్కర ఘాట్లకు నీటి ఉధృతి పెరిగింది. సోమవారం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో పలు పుష్కర ఘాట్లలో ప్రవాహ వేగం పెరిగింది.మర్ముల్, మంథని, రామగుండం, గొలివాడ, గోదావరిఖని పుష్కర ఘాట్లలో నీటి ఉధృతి పెరిగింది. దీంతో భక్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు. -
భక్తులకు జాగ్రత్తలు.. అధికారులకు సూచనలు
భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ స్నాన ఘట్టాలు ఖాళీగా ఉంటాయి, ఏది సురక్షితం అనే విషయాన్ని స్థానికులను అడిగి తెలుసుకోవాలి. అనారోగ్యంతో బాధపడే వారు, బీపీ, షుగర్, కీళ్లనొప్పులున్నవారు, చిన్నారులు, వృద్ధులు గుంపులోకి వెళ్లకుం డా ఉండడమే ఉత్తమం. పుష్కరఘాట్ల వద్ద ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు వృద్ధులు, చిన్నారులకు సేవలందిస్తున్నారు. వారి సేవలు ఉపయోగించుకోవాలి. భక్తులు తమ వెంట తప్పనిసరిగా గ్లూకోజ్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, బిస్కట్లు, డ్రైఫ్రూట్స్, బ్రెడ్జామ్ వంటివి తీసుకెళ్లాలి. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే సందర్భాల్లో నాలుగువైపులా గేట్లు ఉండే పుష్కరఘాట్లకు వెళ్లకపోవడం మంచిది. గేట్లు, ప్రహరీలు లేని పుష్కరఘాట్ల వద్దకు వెళ్లడం సురక్షితం. భక్తులు తప్పనిసరిగా అధికారుల సూచనలు పాటించాలి. క్రమశిక్షణతో ఉండడం వల్ల ఎదుటివారి ప్రాణాలతో పాటు, తమ ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఎమర్జెన్సీ ఫోన్ నంబర్లు పుష్కర కేంద్రాల వద్ద అందుబాటులో ఉంటాయి. వాటిని భక్తులు నోట్ చేసుకోవాలి. పుష్కర స్నానాల్లో ఎవరో భక్తులు తప్పు చేస్తున్నారని, వారితో పాటు మనమూ తప్పులు చేయవద్దు. అలా చేస్తే పుష్కర స్నానాల్లో గందరగోళం ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. ఈత రానప్పుడు ఎక్కువ లోతుకు వెళ్లి స్నానం చేయడం మంచిది కాదు. పిల్లలు, వృద్ధుల జేబులో వారి వివరాలతో కూడిన చీటీలను ఉంచాలి. రద్దీలో వారు తప్పిపోతే.. గుర్తించడానికి వీలుగా ఉంటుంది. వదంతులను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మవద్దు. అధికారులకు సూచనలు సెలవు రోజుల్లో పుష్కర స్నానాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఈనెల 18న రంజాన్, 19న ఆదివారం సెలవు కావడంతో దూరప్రాంతాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఏర్పాట్లు చేయాలి. వాలంటీర్ల సేవలను సద్వినియోగం చేసుకోండి. వారిని గైడ్ చేస్తూ, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా తగిన సూచనలివ్వండి. భక్తులు స్నానాలు చేసిన తరువాత.. వెంటనే ఘాట్లనుంచి వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవాలి. గోదావరిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటే.. అధిక లోతు ఉన్నచోటును భక్తులు సులువుగా గుర్తించేలా తాడు గానీ, జెండా వంటివి గాని ఏర్పాటు చేసి అప్రమత్తం చేయాలి. లోతు తక్కువగా ఉన్న చోటే భక్తులు స్నానాలు చేసేలా చూడాలి. గజ ఈతగాళ్లను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి. భక్తులు పడేసిన పదార్థాలతో అపరిశుభ్ర వాతావరణం ఏర్పడి, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు చెత్తాచెదారాన్ని తొలగించి, పారిశుధ్య సమస్యలు లేకుండా చూడాలి. రైల్వేస్టేషన్లలో ఒకేసారి జనం రైలు ఎక్కేందుకు, సీట్లు ఆపుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఆయూ సందర్భాల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి. రైలు రాగానే భద్రత వలయం ముందుకు వచ్చి, ఆగిన తర్వాతే ప్రయాణికులు రైలు దిగేలా, ఎక్కేలా చర్యలు తీసుకోవాలి. నదీ ప్రాంతం కావడంతో పాములు సంచరించే అవకాశాలుంటాయి. పుష్కర ఘాట్ల వద్ద పాముకాటుకు చికిత్స అందించడానికి వైద్యులను, మందులను సిద్ధంగా ఉంచాలి. అవసరమైనవారికి వైద్య సేవలు అందించడానికి అనుభవం ఉన్న వైద్యాధికారులను అందుబాటులో ఉంచాలి. వీఐపీల కోసం సామాన్య భక్తులను గంటల తరబడి క్యూలైన్లలో నిలపవద్దు. ఇలా చేస్తే భక్తుల్లో సహనం నశించి, తొక్కిసలాట జరిగే అవకాశాలుంటారుు. రద్దీ తక్కువగా ఉండే పుష్కర ఘాట్ల వద్దకు భక్తులను మళ్లించాలి.