ఘాట్లవద్ద అనువైన వాతావరణం
Published Tue, Aug 9 2016 2:04 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
మహబూబ్‌నగర్ న్యూటౌన్: కష్ణా పుష్కరాలకు వచ్చిన ప్రతీ భక్తుడు మంచి వాతావరణంలో పుష్కర స్నానం చేసి వెళ్లడమే తమ లక్ష్యమని, ఆమేరకు ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ డాక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పుష్కరాల నిర్వహణపై ఆర్డీఓలు, ప్రత్యేకాధికారులతో సమీక్షించారు. పుష్కరాలలో భక్తుల రద్దీ, వారి ఆరోగ్యం, స్వచ్ఛత, పరిశుభ్రతలపై అధికారులు ఎక్కువ దష్టి కేంద్రీకరించాలని అన్నారు. పుష్కర విధుల్లో ఉన్న వారందరికీ భోజనం, వసతి, తప్పనిసరిగా కల్పించాలని ఆదేశించారు. పుష్కర ఘాట్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. ఈ విషయాల్లో రాజీ పడవద్దని చెప్పారు. తరచుగా పారిశుద్ధ్య పనులు చేపట్టడంతో పాటు ప్రతిరోజు రాత్రి స్నానం ముగిశాక ఘాట్లు శుబ్రం చేయించాలన్నారు. ఈ సందర్భంగా పుష్కరాల బ్రోచర్‌ను విడుదల చేశారు. జాయింట్ కలెక్టర్ ఎం.రాంకిషన్, ఏజేసీ బాలాజీ రంజిత్ ప్రసాద్, డీఆర్‌ఓ భాస్కర్, ఆర్డీఓలు, ప్రత్యేకాధికారులు ఉన్నారు.
అవాంతరాలు లేకుండా ఏర్పాట్లు
పుష్కరాల నిర్వహణకు ఎలాంటి అవాంతరాలు కలుగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ సమావేశాన్ని నిర్వహించారు.విపత్తు పరిస్థితులలో అనుసరించాల్సిన విధానాలు, ముందస్తు చర్యలు తదితర అంశాలను చర్చించారు. జేసీ ఎం. రాంకిషన్, ఏజేసీ బాలాజీ రంజిత్ ప్రసాద్, డీఆర్‌ఓ భాస్కర్, డీఆర్‌డీఏ పీడీ మధుసూధన్‌నాయక్, డీఎంహెచ్‌ఎం డా.నాగారాం తదితరులు హాజరయ్యారు.
Advertisement