పుష్కరాల్లో వీఐపీల వికృతహేల | vips in pushkara ghats | Sakshi
Sakshi News home page

పుష్కరాల్లో వీఐపీల వికృతహేల

Published Sun, Jul 26 2015 11:58 PM | Last Updated on Sun, Sep 3 2017 6:13 AM

పుష్కరాల్లో వీఐపీల వికృతహేల

పుష్కరాల్లో వీఐపీల వికృతహేల

సందర్భం
భారీ జనసందోహం పోగుపడే పుష్కరాల వంటి సందర్భాల్లో తమ అహాలకంటే, వ్యక్తిగత పుణ్యాన్ని సాధించాలనే యావ కంటే ప్రజా ప్రయోజనాన్ని అన్నిటికంటే  ప్రథమస్థానంలో ఉంచాలని గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు గ్రహించాలి.
 
ప్రియమైన ఐ.వై.ఆర్. కృష్ణా రావు గారూ!
గోదావరి పుష్కరాల సంద ర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు మెల గిన విధానం నన్ను చాలా బాధించింది, వ్యాకులపర్చింది. ముఖ్యమంత్రి, ఆయన కుటుం బం యాత్రికుల వ్యథపై కాసింత సున్నితంగా వ్యవహరించి ఉంటే పుష్కరాల ప్రారంభ దినాన 30 మంది (పిల్లలతో సహా) తొక్కిసలాటలో అసు వులు బాసిన ఘటన జరిగి ఉండేది కాదు.

ఇలాంటి ఘటనల్లో ఒక్కరంటే ఒక్క వీఐపీ ఉన్నా చాలు.. అది భద్రతా ఏర్పాట్లపై, ట్రాఫిక్‌పై, ఇతర సేవలపై ప్రభావం చూపుతుంది. ప్రముఖ వ్యక్తులు లేకున్నట్లయితే రాజమండ్రిలో పుష్కరాలకు తరలివచ్చిన  లక్షలాది మంది యాత్రికులకు పైసేవలన్నీ అందుబాటులో ఉండేవి. ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో అతి పెద్ద తొక్కిసలాట సందర్భంగా క్షమా ర్హం కాని ఘటన జరిగినప్పటికీ, స్వయం ప్రకటిత వీఐపీలు తమ కుటుంబాలు, ఇతర పరివారం తోడుగా పుష్కరాల్లో పాల్గొనడానికి కదం తొక్కారని వార్తలు. యాత్రికులు సొం త ఖర్చులు పెట్టుకోవాల్సివచ్చింది కానీ, తమ ప్రైవేట్ ఖర్చులను చెల్లించడానికి ప్రభుత్వ ఖజానా అన్ని వేళలా పుష్కరాల్లో అందుబాటులో ఉందన్న చందాన వీఐపీలు పుష్కరాలకు పోటెత్తారు.

నాకు అర్థమయిందేమిటంటే, రాజమండ్రి చేరుకుని పుష్కర జలాల్లో మునగడానికి ఉత్తరాన తుని నుంచి, దక్షి ణాన ఏలూరు వరకు యాత్రికులు భారీ సంఖ్యలో క్యూ కట్టి వేచి ఉన్నారు. ఇంత భారీ జనసందోహం మున్నె న్నడూ కనీవినీ ఎరుగనిది. మామూలు పరిస్థితుల్లో అయితే బాధ్యత గల ఏ ప్రభుత్వమైనా.. అతడు లేదా ఆమె క్యూలో నిల్చుని వేచి చూడటానికి సిద్ధపడితే తప్ప, ఈ స్వయం ప్రకటిత వీఐపీల ప్రవేశంపై నిషేధం విధించేది. వీఐపీలను కూడా ఇతర యాత్రికులలాగే భావించి వారు మామూ లుగా పుష్కరాల్లో పాలు పంచుకునేలా చేసేది. దురదృష్ట వశాత్తూ ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో కనీస బాధ్య తతో అయినా వ్యవహరించినట్లు కనిపించలేదు.

పైన పొందుపర్చిన చిత్రాన్ని చూసినట్లయితే, తొక్కిస లాట జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా గవర్నర్ తన కుటుంబంతోపాటు రాజమండ్రిని సం దర్శించి ప్రత్యేకంగా రూపొందించిన వీఐపీ ఘాట్‌లో మునకవెయ్యడానికే సిద్ధపడినట్లు కనిపిస్తుంది. మనలాం టి ప్రజాస్వామ్యవ్యవస్థలో, కొంతమందిని వీఐపీలుగా గుర్తించి ప్రజాధనంతో వారికి అవసరమైన దానికంటే ఎక్కువ స్థలాన్ని వారు ఆక్రమించడానికి అనుమతించడం జరిగితే అలాంటి పరిస్థితి ఎవరికైనా అసహ్యం కలిగించ దా? పుష్కరాల సందర్శన కోసం రాజమండ్రి రావడానికి గవర్నర్ తన కుటుంబ సభ్యులతో కలసి హెలికాప్టర్‌ను ఉపయోగించారని నాకర్థమైంది. పూర్తిగా వ్యక్తిగతమైన ఇలాంటి సందర్శనలకు ఎవరు డబ్బు చెల్లిస్తున్నారు? గవ ర్నర్ కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగులు కారు. ప్రభు త్వ ఖజానా నుంచి వారికోసం ఎలాంటి చెల్లింపులు చేయ కూడదు. ఇలాంటి వ్యవహారాల్లో ప్రభుత్వం జవాబుదారీత నాన్ని తప్పక పాటించాలి. తమకు తాము పుణ్యం సంపా దిం చుకోవడం కోసం వీఐపీలు చెల్లింపులు జరిపేలా ప్రభు త్వ పన్ను చెల్లింపుదారును ఒత్తిడికి గురిచేయకూడదు. అలాంటి పుణ్యసాధన కోసం తాము ప్రజలను అసౌకర్యా నికి గురి చేయకూడదని వీఐపీలు తెలుసుకోవాలి.

ఒక రాష్ట్ర గవర్నర్ పాత్ర ఏమిటన్నది రాజ్యాంగంలో చక్కగా నిర్వచించారు. ఆయన పాత్రకు పరిమితులు న్నాయి. రాజ్యాంగంలో తమకు నిర్దేశించని పాత్రలను వారు చేపట్టనే కూడదు.

పైగా, ఈ తొక్కిసలాట ఘటన మధ్యనే సింగపూర్ నుంచి అత్యున్నత స్థాయి బృందం రాజమండ్రిని సంద ర్శించిందని విన్నాను. ఈ బృందం సందర్శన కూడా యాత్రికులకు మరిన్ని ఇబ్బందులను కలుగజేసి ఉంటుం దని నా నమ్మకం. ప్రజలకు అసౌకర్యం కలిగించటమే కాక, ప్రజా భద్రతకు ప్రమాదకరంగా మారే వీఐపీలను ఇలాంటి పరిమాణాలకు పూర్తి బాధ్యత వహించేలా చేసి, వారిపై ఆరోపణలను బుక్ చేసే రోజొకటి వస్తుంది.

టైమ్స్ టీవీ న్యూస్ చానల్లో వీఐపీల ఉపద్రవాన్ని విస్తృతంగా కవర్ చేయడం నా దృష్టికి వచ్చింది. కింది లిం కులో దాన్ని మీరు కూడా చూడవచ్చు.  https://www.youtube.com/watch?t=75&v=WlLD0kF7DfQ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఆర్నాబ్ గోస్వామి సంధించిన ప్రశ్నలకు నేరుగా సమా ధానం చెప్పకూడదు. ఎందుకంటే ఆ ఘటనకు సంబం ధించి వాస్తవంగానే ఎలాంటి సమాధానాలు లేవు. 2014 అక్టోబర్‌లో హుద్ హుద్ తుపాను సమయంలో ముఖ్య మంత్రి విశాఖపట్నంలో ఉండిపోయిన ఘటన అసాధారణ మని, అది సహాయ చర్యలను వేగవంతం చేయడంలో ఎంతగానో తోడ్పడిందన్న భావం కలిగించడానికి సీఎం అప్పట్లో ప్రయత్నించారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే సహా య చర్యలకు నేతృత్వం వహించడం అభినందనీయమే కానీ బహుశా సీఎం తెలుసుకోని విషయం ఏమిటంటే, విశాఖపట్నంలోని 90 శాతం అధికారులు ఆ సమయంలో సీఎం వద్ద హాజరు వేయించుకోవడంలోనే కాలం గడిపేశా రు. పైగా నిజంగా తుపాను ప్రభావానికి గురైన గుడిసెవా సులను అధికారులు పలకరించలేకపోయారు. ఈ అధికా రుల్లో చాలామంది 5 స్టార్ హోటల్‌లో బస చేశారు. తుపా ను ముగిసిన తొమ్మిది నెలల తర్వాత కూడా పేదలలో కేవలం 15 శాతం మంది మాత్రమే తుపాను సహాయాన్ని అందుకోగలిగారు. మిగతావారు ఈనాటికీ సహాయం కోసం వేచి చూస్తూనే ఉంటున్నారు. హుద్ హుద్ తుపాను అనంతరం ప్రధానమంత్రి విశాఖపట్నం సందర్శన ఎంత ఇబ్బంది కలిగించిందంటే, బాధితులకు ఉద్దేశించిన ఆహార సామగ్రి మొత్తంగా పాడయిపోయింది, అధికారుల అప్ర మత్తత కూడా దారి తప్పింది.

ఇలాంటి సందర్భాల్లో తమ అహాలకంటే, వ్యక్తిగత పుణ్యాన్ని సాధించాలనే యావకంటే ప్రజా ప్రయోజనాన్ని అన్నిటికంటే  ప్రథమస్థానంలో ఉంచాలన్న సందేశాన్ని గవ ర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు గ్రహిస్తారని ఆశిస్తు న్నాను. ప్రచారం పట్ల ఆత్రుత, రాజకీయ ప్రయోజనాలకు కూడా వీరు దూరంగా ఉంటేనే మంచిది. తాము ప్రజాస్వా మ్యంలో భాగమే కానీ జమీందారీ వ్యవస్థలో భాగం కాదన్న విషయాన్ని వారు తప్పక దృష్టిలో ఉంచుకోవాలి.

తన ఘోరమైన, అతిశయించిన వీఐపీ సంస్కృతిని భారతదేశం అధిగమించే రోజొకటి వస్తుందని నేను ఆశిస్తు న్నాను. ప్రజాస్వామ్యంలో వీఐపీలకు చోటు లేదు.  ఈ ఉత్తరాన్ని గవర్నర్, ముఖ్యమంత్రుల ముందు ఉంచాలని నేను అభ్యర్థిస్తున్నాను. ఇలాంటి సందర్భాల్లో వారు ఎలాంటి పాత్రలను నిర్వహించాలనే విషయంపై నా ఉత్తరం ప్రభావం చూపుతుందని ఆశిస్తున్నాను. తొక్కిసలాటపై న్యాయవిచారణపై ఇకనయినా దృష్టి పెడతారని ఆశిస్తాను. ఈ ఘటనలో పోలీసులు, జూనియర్ అధికారుల పాత్రపైనే కాదు.. వీఐపీల పాత్రపై కూడా దృష్టి పెట్టగలరని ఆశిస్తున్నాను.
(ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావుకు భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇ.ఎ.ఎస్ శర్మ రాసిన లేఖ)






ఈఎఎస్ శర్మ
(వ్యాసకర్త మొబైల్: 9866021646)
 ఈ మెయిల్:eassarma@gmail.com.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement