Know Who Doesn't Need a Passport for International Travel - Sakshi
Sakshi News home page

ప్రపంచంలోని ఆ ముగ్గురు పాస్‌పోర్టు లేకుండా ఎక్కడికైనా వెళ్లొచ్చు.. వారెవరో తెలిస్తే..

Published Sun, Jul 9 2023 1:59 PM | Last Updated on Sun, Jul 9 2023 3:37 PM

know who dont need passport for international travel - Sakshi

ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే ఎవరికైనా పాస్‌పోర్ట్‌ అవసరమనే సంగతి మనకు తెలిసిందే. ఈ నియమం పెద్దపెద్ద వీఐపీలకు కూడా వర్తిస్తుంది. సెలబ్రిటీలు కూడా పాస్‌పోర్టు లేకుండా ఏ దేశంలోనూ కాలుమోపలేరు. అయితే ప్రపంచంలోని ఆ ముగ్గురు ఎటువంటి పాస్‌పోర్టు లేకుండా ఏ దేశానికైనా వెళ్లవచ్చు. ఆ ముగ్గురికి పాస్‌పోర్టుతో పనేమీ లేదు. మరి ఆ ముగ్గురు ఎవరో తెలుసా?

ఆ ముగ్గురు వీరే..
ప్రపంచంలో పాస్‌పోర్ట్‌ అవసరం లేని ఆ ముగ్గురు ఎవరనే విషయానికొస్తే.. వారు బ్రిటన్‌ కింగ్‌, జపాన్‌ కింగ్‌, జపాన్‌ క్వీన్‌. వీరు విదేశాలు వెళ్లాలనుకుంటే పాస్‌పోర్ట్‌ అవసరం లేదు. బ్రిటన్‌ రాయల్‌ ఫ్యామిలీకి చెందిన క్వీన్‌ ఎలిజబెత్‌కు ఈ అధకారం ఉండేది. తరువాత ఛార్లెస్‌ రాజయ్యాక అతనికి ఈ అధికారం సంక్రమించింది. ఈ అధికారం కేవలం ఛార్లెస్‌కు మాత్రమే ఉంటుంది. వారి ఫ్యామిలీలో ఎవరికీ ఈ అధికారం లభించదు. వారు విదేశాలు వెళ్లాలంటే వారికి పాస్‌పోర్టు అవసరమవుతుంది.

ప్రముఖుల విషయంలో..
ఏ దేశంలోనైనా ఎంతటి ప్రముఖులైనా విదేశాల్లో కాలుమోపేందుకు వారికి పాస్‌పోర్ట్‌ అవసరమవుతుంది. అయితే వారి దగ్గర డిప్లొమెట్‌ పాస్‌పోర్టు ఉంటుంది. ఇది ఏదేశానికి వెళ్లాలన్నా వారికి ప్రత్యేక గుర్తింపును కల్పిస్తుంది. అలాగే ఎయిర్‌పోర్టులో వీరికి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. వీరు ప్రత్యేక ప్రొటోకాల్‌ను పాటించాల్సివుంటుంది. 

భారత్‌ విషయానికొస్తే ఇక్కడ రాజ్యాంగబద్ధమైన కొన్ని పదవుల్లో ఉండే కొందరి దగ్గర డిప్లొమెట్‌ పాస్‌పోర్టు ఉంటుంది. దీని సాయంతో వారు తగిన ప్రొటోకాల్‌ పాటిస్తూ విదేశీయాత్ర చేయవచ్చు. అయితే వీరికి కూడా పాస్‌పోర్టు అవసరమవుతుంది. 
ఇది కూడా చదవండి: రాత్రి భోజనం ఉదయం 11కే కానిచ్చేస్తాడు.. 45లో 18లా కనిపిస్తూ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement