vips
-
HYD:10 మంది వీఐపీలపై డ్రగ్స్ కేసు
హైదరాబాద్, సాక్షి: రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ కేసులో పురోగతి చోటు చేసుకుంది. డ్రగ్స్ పార్టీలో పాలు పంచుకున్న పది మంది వీఐపీలపై కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఇద్దరు అమ్మాయిలతో పాటు మొత్తం 9 మందిపై కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్తలు గజ్జల వివేకానంద్, అబ్బాస్, కేదార్, సందీప్‌లు.. సెల్రబిటీ శ్వేతతో పాటు లిశి, నీల్‌పైనా కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. అలాగే.. డ్రగ్స్ సేవించిన నిర్భయతో పాటు రఘు చరణ్‌పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అబ్బాస్ దగ్గర వివేకానంద డ్రగ్స్ కొనుగోలు చేసి.. తన స్నేహితులతో పార్టీ చేసుకున్నట్లు తేలింది. వీళ్లంతా కొకైన్ పేపర్లో చుట్టి డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొని ఉంది. అంతేకాదు.. ఈ డ్రగ్స్ పార్టీలో మరికొంత మంది ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి.. ‘‘రాడిసన్ బ్ల్యూ హోటల్ పై స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులతో దాడి చేశాం. అక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం రావడం తో సెర్చ్ చేశాం. అప్పటికే హోటల్ నుండి నిందితులు పరారయ్యారు . అప్పటికే అందించిన సమాచారంతో.. వివేకానంద ఇంటికి వెళ్ళాం. వివేకానంద మంజీర గ్రూప్ కి డైరెక్టర్ గా ఉన్నాడు. ఇంటికి వెళ్లిన సమయం లో పోలీసులకు విచారణకు సహకరించకుండా కొంత ఇబ్బంది పెట్టారు. వివేకానందను అదుపులోకి తీసుకొని డ్రగ్స్ టెస్ట్ చేశాం. వివేకా నంద తో పాటు నిర్భయ్ , కేదార్‌లకు పాజిటివ్ వచ్చింది. వివేక్ కు యూరిన్ టెస్ట్ చేయించాము, కొకైన్ తీసుకున్నట్లు రిపోర్ట్ వచ్చింది. మొత్తం ఈ పార్టీ లో 10 మంది ఉన్నట్లు గుర్తించాం. రాడిసన్ హోటల్ లో గతంలో పార్టీలు జరిగాయి. సయ్యద్ అబ్బాస్ అనే వ్యక్తి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించాం. వివేకా నంద, నిర్భయ్ , కేదార్ పై 121b 27, NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేశాం. డ్రగ్స్ ద్వారా సంపాదించిన ఆస్తులు ను కూడా మేము అటాచ్ చేస్తున్నాం అని సీపీ వెల్లడించారు. -
వీఐపీల డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ముఖ్యమైన వ్యక్తుల (వీఐపీ) డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. చిన్నచిన్న తప్పిదాలతో వీఐపీలు ప్రాణాలు కోల్పోతున్నారని.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి ఘటన నేపథ్యంలో రవాణా శాఖ సుమోటోగా ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. వీఐపీలంతా తమ డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని కోరుతూ లేఖలు రాస్తామన్నారు. ఈ జాబితాలో చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, రాజకీయ నాయకులు ఉంటారని వివరించారు. వారి డ్రైవర్లకు అన్ని జిల్లాల్లో ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించేందుకు రెండు, మూడు రోజుల్లో ఏర్పాట్లు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ పరీక్షల అనంతరం డ్రైవర్లకు సర్టిఫికెట్లు జారీ చేస్తామని, వారిని కొనసాగించుకోవాలా వద్దా అనేది వీఐపీల ఇష్టమని చెప్పారు. పొన్నంప్రభాకర్ శనివారం గాం«దీభవన్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగింది మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం వల్ల ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగిందని మంత్రి పొన్నం చెప్పారు. గతంలో రోజూ సగటున 45లక్షల మంది వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారని, ఇప్పుడా సంఖ్య 55–60 లక్షల వరకు ఉంటోందని తెలిపారు. మహిళలతో పాటు పురుష ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగిందన్నారు. ఆర్టీసీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా నడుస్తోందని చెప్పారు. పురుషులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసే ఆలోచనేదీ లేదని, గ్రామాలకు బస్సుల కనెక్టివిటీ పెంచుతామని వెల్లడించారు. ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని.. పీపీపీ పద్ధతిలో ఆర్టీసీ స్థలాల్లో ప్రాజెక్టులు చేపడతామని వివరించారు. మహాలక్ష్మి పథకం కింద అనవసరంగా జీరో టికెట్లు కొట్టే కండక్టర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీకి మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, ప్రతిమా శ్రీనివాసరావు లాంటి వారు పాత బకాయిలు చెల్లిస్తున్నారన్నారు. ఆర్టీసీలోకి కొత్తగా వెయ్యి బస్సులు తీసుకువస్తామన్నారు. ఇప్పటికే 100 వచ్చాయని, దశలుగా మిగతావి తెస్తామని చెప్పారు. ఆర్టీసీ కార్గో ఆదాయం రూ.150 కోట్లకు చేరిందని, రూ.2 వేల కోట్ల ఆదాయార్జన ధ్యేయంగా ప్రణాళికలు రచిస్తున్నామని వివరించారు. బీఆర్ఎస్, బీజేపీలది డ్రామా బీఆర్ఎస్– బీజేపీ ఒకటేనని.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కొత్త డ్రామా మొదలుపెట్టాయని పొన్నం విమర్శించారు. బీఆర్ఎస్–బీజేపీ ఒకటి కాదని చెప్పుకొనేందుకు ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇస్తున్నారని.. అందుకే వాయిదాల పద్ధతుల్లో నోటీసులు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. బిహార్ మోడల్లో కులగణన త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపడతామని, ఇందుకోసం బిహార్‌లో అమలు చేసిన ప్రక్రియను అనుసరిస్తామని మంత్రి పొన్నం తెలిపారు. ఈ గణన కోసం ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకుంటామన్నారు. ప్రతి ఎన్యూమరేటర్‌కు శిక్షణ ఇస్తామని, కొత్త కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ అంశంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సూచనలు తీసుకుంటామన్నారు. కులగణన బిల్లును దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఆమోదించలేదని, అలాంటిది ఏదైనా ఉంటే బీఆర్ఎస్ నేతలు చూపాలని సవాల్ చేశారు. ఆటో కార్మి కులకు ఏటా రూ.12వేలు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చామని.. దీనిపై కేబినెట్లోనూ చర్చించామని మంత్రి తెలిపారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆటోల రంగం ఇబ్బంది పడుతుందనడంలో వాస్తవం లేదని.. అందుకు ప్రతి నెలా అమ్ముడవుతున్న ప్యాసింజర్ ఆటోల గణాంకాలే నిదర్శనమని పేర్కొన్నారు. -
ప్రపంచంలోని ఆ ముగ్గురు పాస్‌పోర్టు లేకుండా ఎక్కడికైనా వెళ్లొచ్చు.. వారెవరో తెలిస్తే..
ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే ఎవరికైనా పాస్‌పోర్ట్ అవసరమనే సంగతి మనకు తెలిసిందే. ఈ నియమం పెద్దపెద్ద వీఐపీలకు కూడా వర్తిస్తుంది. సెలబ్రిటీలు కూడా పాస్‌పోర్టు లేకుండా ఏ దేశంలోనూ కాలుమోపలేరు. అయితే ప్రపంచంలోని ఆ ముగ్గురు ఎటువంటి పాస్‌పోర్టు లేకుండా ఏ దేశానికైనా వెళ్లవచ్చు. ఆ ముగ్గురికి పాస్పోర్టుతో పనేమీ లేదు. మరి ఆ ముగ్గురు ఎవరో తెలుసా? ఆ ముగ్గురు వీరే.. ప్రపంచంలో పాస్‌పోర్ట్ అవసరం లేని ఆ ముగ్గురు ఎవరనే విషయానికొస్తే.. వారు బ్రిటన్ కింగ్, జపాన్ కింగ్, జపాన్ క్వీన్. వీరు విదేశాలు వెళ్లాలనుకుంటే పాస్‌పోర్ట్ అవసరం లేదు. బ్రిటన్ రాయల్ ఫ్యామిలీకి చెందిన క్వీన్ ఎలిజబెత్‌కు ఈ అధకారం ఉండేది. తరువాత ఛార్లెస్ రాజయ్యాక అతనికి ఈ అధికారం సంక్రమించింది. ఈ అధికారం కేవలం ఛార్లెస్‌కు మాత్రమే ఉంటుంది. వారి ఫ్యామిలీలో ఎవరికీ ఈ అధికారం లభించదు. వారు విదేశాలు వెళ్లాలంటే వారికి పాస్‌పోర్టు అవసరమవుతుంది. ప్రముఖుల విషయంలో.. ఏ దేశంలోనైనా ఎంతటి ప్రముఖులైనా విదేశాల్లో కాలుమోపేందుకు వారికి పాస్‌పోర్ట్ అవసరమవుతుంది. అయితే వారి దగ్గర డిప్లొమెట్ పాస్‌పోర్టు ఉంటుంది. ఇది ఏదేశానికి వెళ్లాలన్నా వారికి ప్రత్యేక గుర్తింపును కల్పిస్తుంది. అలాగే ఎయిర్‌పోర్టులో వీరికి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. వీరు ప్రత్యేక ప్రొటోకాల్‌ను పాటించాల్సివుంటుంది. భారత్ విషయానికొస్తే ఇక్కడ రాజ్యాంగబద్ధమైన కొన్ని పదవుల్లో ఉండే కొందరి దగ్గర డిప్లొమెట్ పాస్‌పోర్టు ఉంటుంది. దీని సాయంతో వారు తగిన ప్రొటోకాల్ పాటిస్తూ విదేశీయాత్ర చేయవచ్చు. అయితే వీరికి కూడా పాస్‌పోర్టు అవసరమవుతుంది. ఇది కూడా చదవండి: రాత్రి భోజనం ఉదయం 11కే కానిచ్చేస్తాడు.. 45లో 18లా కనిపిస్తూ.. -
రాజకీయ నేతలతో సెల్ఫీలు.. ఉద్యోగికి కలెక్టర్ షాకింగ్ ట్విస్ట్
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): ఎన్నికల విధుల్లో ఉండగా వీఐపీల వద్ద సెల్ఫీ తీసుకున్న ఉద్యోగిపై సస్పెన్షన్ వేటుపడింది. వివరాలు.. నెలమంగల తాలూకా సోలూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డ్రిల్ మాస్టర్ అయిన అంజన్‌కుమార్‌ను సోలూరు వద్ద చెక్ పోస్టులో తనిఖీ బృందం మేనేజర్‌గా నియమించారు. మధ్యాహ్నం 2గంటల నుండి రాత్రి 10 గంటల వరకూ డ్యూటీ. ఈ సమయంలో అటుగా వచ్చిన ప్రముఖ రాజకీయ నేతలతో ఆయన సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై ఫిర్యాదులు రావడంతో బెంగళూరు గ్రామీణ జిల్లా కలెక్టర్ ఆర్.లత అతన్ని సస్పెండ్ చేశారు. చదవండి: బ్యూటీషియన్‌కు షాక్.. లక్ష కడితే నెలకు రూ.40 వేల వడ్డీ.. చివరికి.. -
వైభవంగా వైకుంఠ ఏకాదశి: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
-
Vaikunta Ekadasi 2022 : శ్రీవారి సేవలో పెద్దఎత్తున ప్రముఖులు
-
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందడి.. శ్రీవారి సేవలో ప్రముఖులు
-
ఆసక్తికరంగా వీఐపీల గ్రామాల పోరు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : గ్రామ పంచాయతీ పోరు ఆసక్తి రేపుతోంది. గత పంచాయతీ ఎన్నికల్లో పోటీ పడినన్ని పార్టీలు ఈసారి తెరపై కనపడకపోవడం, రెండు ప్రధాన రాజకీయ పార్టీలే ఈ ఎన్నికల్లో ఢీ అంటే ఢీ అని తలపడనుండడంతో పంచాయతీ పోరు రక్తికడుతోంది. అధికార టీఆర్ఎస్ అధిష్టానం మెజారిటీ పంచాయతీలను ఏకగ్రీవం చేయాలని నిర్ణయించడంతో ఆ పార్టీ నాయకులు సవాల్‌గా తీసుకున్నారు. ఇన్నాళ్లు అడపాదడపా మాత్రమే సొంత గ్రామాలవైపు కన్నెత్తి చూసినవారు ఇప్పుడు తమ సొంత ఊళ్లలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఏకగ్రీవ పంచాయతీలను తమ సొంతూరునుంచే మొదలు పెట్టి ఆదర్శంగా నిలవాలని తలపోస్తున్నారు. గత ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఎక్కువగా గెలుపొందారు. ఇవి పార్టీ రహితంగా జరిగే ఎన్నికలే అయినా.. అంతటా రాజకీయమే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన వారిలో అత్యధికులు టీఆర్ఎస్లో చేరగా, మరి కొందరు కాంగ్రెస్‌లోనే కొనసాగారు. ఈసారి గ్రామ పోరు టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే హోరాహోరీగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఆయా పార్టీల్లోని ముఖ్య నాయకుల సొంతూళ్లు ఈ సారి కొత్తగా పంచాయతీలుగా రూపుదిద్దుకున్నాయి. దీంతో సహజంగానే ఇరు పార్టీల నాయకులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందరి దృష్టిని ఆకర్శిస్తున్న నకిరేకల్ నకిరేకల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ముఖ్య నాయకులు ఉన్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మ¯న్ నేతి విద్యాసాగర్, టీచర్స్ ఎమ్మెల్సీ పూల రవీందర్ కేతేపల్లి మండలంచెరుకుపల్లి పంచాయతీకి చెందిన వారు. నేతి విద్యాసాగర్ కృషితో గత ఎన్నికల్లో ఈ పంచాయతీని కాంగ్రెస్ ఏకగ్రీవం చేసుకుంది. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ కేతేపల్లి మండలం బీమారం వాసి. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యది నకిరేకల్ మండలం నోముల గ్రామం. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డిది నార్కట్‌పల్లి మండలం నక్కలపల్లి గ్రామం. కాంగ్రెస్ నాయకుడు దుబ్బాక నర్సింహారెడ్డి, సీపీఎం సీనియర్ నేత చెరుపల్లి సీతారాములు ఇద్దరిదీ చిట్యాల మండలం నేరేడ గ్రామం. ఈ గ్రామాల్లో పోరు పూర్తిగా టీఆర్ఎస్, కాంగ్రెస్ మ«ధ్యే ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీటిల్లో గత ఎన్నికల్లో నక్కలపల్లి (టీఆర్ఎస్), నేరేడ (సీపీఎం) గెలుపొందాయి. నల్లగొండ ఎంపీ, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన వారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఉరుమడ్లలో గెలిచిన సర్పంచ్.. ఆ తర్వాత కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి టీఆర్ఎస్లో చేరారు. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య .. ఈ ముగ్గురు నార్కట్‌పల్లి మండలం, బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన వారే. ఈ గ్రామంలో ఎప్పుడూ కాంగ్రెస్సే విజయం సాధిస్తూ వస్తోంది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సొంతూరు శాలిగౌరారం మండలం ఉట్కూరు కాగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. దీంతో ఈ సారి ఈ నేతల సొంతూళ్లలో ఎన్నిక చర్చనీయాంశమవుతోంది. ఇవిగో ... మరికొన్ని వీఐపీ పంచాయతీలు ! మునుగోడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సొంతూరు సంస్థాన్ నారాయాణ్పూర్ మండలం లింగవారిగూడెం. ఈ గ్రామం మొన్నటి వరకు సర్వేల్ పంచాయతీ పరిధిలో ఉండేది. ఇక్కడినుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఈసారి లింగవారిగూడెం కొత్త పంచాయతీగా ఏర్పడింది. దీంతో ఈ గ్రామంలో తొలిసారి పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మునుగోడు నియోజకవర్గానికే చెందిన ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సొంత గ్రామం సంస్థాన్నారాయణ్ పూర్. గత ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ గెలుపొందింది. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ సొంత గ్రామం దేవరకొండ మండలం రత్యతందా. జెడ్పీ చైర్మన్ బాలునాయక్ సొంతూరు సూర్యతండా, మరోనేత బిల్యానాయక్ స్వగ్రామం చింతపల్లి మండలం ప్రశాంతపురి తండా. ఈ మూడు తండాలు ఇప్పుడు కొత్త పంచాయతీలుగా ఏర్పడ్డాయి. వంద శాతం తండాల జాబితాలో ఉన్నాయి. దీంతో ఇక్కడి ఎన్నిక ఆసక్తి గొల్పుతోంది. నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె.జానారెడ్డి స్వగ్రామం అనుముల, కొత్తగా ఏర్పడిన హాలియా మున్సిపాలిటీలో విలీనం అయ్యింది. టీఆర్ఎస్ నాయకుడు ఎంసీ కోటిరెడ్డి తిరుమలగిరి మండలం బోయగూడెంవాసి. కోటిరెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఈ పంచాయతీ కూడా కాంగ్రెస్ ఖాతాలోనే ఉంది. ఇప్పుడు ఆయన టీఆర్ఎస్లోకి మారడంతో ఈసారి ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందా అన్న అంచనాలు మొదలయ్యాయి. జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డిది పెద్దవూర కాగా, గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందింది. ఈసారి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ బలంగానే ఉంటుందని అంటున్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్.భాస్కర్‌రావు స్వగ్రా మం నిడమనూరు మండలం శాఖాపురం. గత ఎన్ని కల్లో కాంగ్రెస్ ఈ పంచాయతీని ఏకగ్రీవంగా దక్కిం చుకుంది. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్లో ఉండడంతో పోటీ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి సొంతూరు సుబ్బారెడ్డిగూడెం. ఇది ఆలగడప పంచాయతీ పరిధిలో ఉండేది. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఈసారి సుబ్బారెడ్డి గూడెం కొత్త పంచాయతీగా ఏర్పాటైంది. మొత్తంగా రాజకీయ ముఖ్యులకు చెందిన సొంతూళ్లను ఈసారి ఏ పార్టీలు గెలుచుకుంటాయి..? ఇక్కడ సర్పంచ్ పీఠం ఎవరి సొంతం కానుందన్న చర్చ జోరుగా సాగుతోంది. -
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ హెచ్.ఎల్. దత్తు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖులు
సాక్షి, విజయవాడ: దుర్గగుడిలో కనకదుర్గమ్మను పలువురు ప్రముఖులు ఆదివారం దర్శించుకున్నారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి ప్రతిభరాణి దంపతులు, రాష్ట్ర హైకోర్టు జడ్జి సురే్‌షకుమార్ కైట్ దంపతులు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర స్పీకర్ సిరికొండ మధుసూదన్‌చారి, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్, దుర్గగుడి అదనపు ఈవో వై.వి.అనురాధ ఉన్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆశీర్వచన మండపంలో వేదపండితులు వారికి అమ్మవారి ఆశీస్సులు అందజేశారు. అనంతరం అధికారులు వారికి అమ్మవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం, శేషవస్త్రం బహుకరించారు. -
తిరుమలలో 30 గంటలుగా క్యూలైన్లోనే..
సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామునుంచే ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం అయింది. ఆలయంలో వైకుంఠ ద్వారాలను ఆలయ పెద్ద జీయర్ స్వామి తెరిచారు. ధనుర్మాస కైంకర్యాల అనంతరం విఐపి దర్శనం ప్రారంభం అయింది. స్వామి దర్శనానికి విఐపిలు బారులు తీరారు. సామాన్య భక్తులు 30 గంటలుగా క్యూలైన్లో పడిగాపులు పడుతూ చలికి అల్లాడుతున్నారు. నాలుగు కిలోమీటర్ల వరకు భక్తులు క్యూలైన్లో వేచివున్నారు. ఉదయం 8 గంటలకు సామాన్య భక్తులకు వైకుంఠ దర్శనం ప్రారంభం అయింది. భక్తులు భారీగా తరలిరావడంతో వసతి దొరక్క రోడ్లపైనే ఉండాల్సి వచ్చింది. వైకుంఠ ఏకాదశికి 3563 విఐపి టికెట్లను టీటీడీ జారీ చేసింది. విఐపిలకు 4 గంటలుగా శ్రీవారి దర్శనం కొనసాగుతున్నది. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖుల్లో జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సంతానగౌడర్, హైకోర్టు న్యాయమూర్తులు రామలింగేశ్వర్రావు, శంకర్‌నారాయణ, సునీల్ చౌదరి,అమర్నాథ్గౌడ్, నాగార్జునరెడ్డి, మాజీ న్యాయమూర్తులు డి.సుబ్రహ్మణ్యం, నూతి రామ్మోహన్, రవీంద్రన్ ఉన్నారు. అలాగే ఏపీ మంత్రులు కళా వెంకటరావు, అయ్యన్నపాత్రుడు, కొల్లు రవీంద్ర, అమర్నాథ్రెడ్డి, నిమ్మకాయల చినరాజప్ప, పితాని సత్యనారాయణ, శిద్ధా రాఘవరావు, సోమిరెడ్డి, విప్‌లు మేడా మల్లికార్జునరెడ్డి, రామసుబ్బారెడ్డి, కోన రవికుమార్, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, మాధవనాయకుడు, సుగుణమ్మ, బొల్లినేని రామారావు, సత్యప్రభ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రామరెడ్డి ప్రతాప్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తలారి ఆదిత్య, అనిల్‌కుమార్ యాదవ్, మండలి బుద్ద ప్రసాద్, నారాయణస్వామి, రవీంద్రరెడ్డి, శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీలు అవంతి శ్రీనివాస్, రాయపాటి సాంబశివరావు, సీఎం రమేష్, రామ్మోహన్ నాయుడు, తెలంగాణ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, సండ్ర వెంకటవీరయ్య, డి.కె.అరుణ ఉన్నారు. టీటీడీ మాజీ చైర్మన్లు కనుమూరి బాపిరాజు, చదలవాడ కృష్ణమూర్తి, సినీ నటులు మోహన్‌బాబు, సప్తగిరి, అంబరీష్, నిర్మాత బండ్ల గణేష్‌లు శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కేంద్ర సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు, మాజీ ప్రధాని దేవెగౌడ, చిత్తూరు కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీ రాజశేఖర్, జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, మృదంగ వాద్య కళాకారుడు ఎల్లా వెంకటేశ్వర్లు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. -
స్పెషల్ ట్రీట్మెంట్.. ఇక చాలా కష్టం!
సాక్షి, న్యూఢిల్లీ: వీఐపీ ట్రీట్మెంట్కు ముగింపు పలకాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో అడుగు ముందుకు వేసింది. వారి భద్రతా సిబ్బందిని గణనీయంగా తగ్గించేందుకు కేంద్ర హోంశాఖ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. యూపీఏ హయాంలో 350 మందికి వీపీపీ ట్రీట్మెంట్ కింద ప్రత్యేక భద్రతను కల్పించగా, ఇప్పుడు 457 మందికి ఆ సౌకర్యాన్ని కలిగిస్తున్నారు. ‘నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ) తోపాటు పారామిలిటరీ దళాలు రెండూ కూడా వీరికి భద్రత కల్పిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలులోకి వస్తే గనుక చాలా మంది ఎన్ఎస్జీ సిబ్బందిని వదలుకోవాల్సి ఉంటుంది’ అని ఓ ఉన్నత అధికారి వ్యాఖ్యానించారు. కేవలం రాష్ట్రాలకు మాత్రమే పరిమితమయ్యే నేతలకు ముందుగా ఈ నిర్ణయం అమలు చేయబోతున్నారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, డీఎంకే సీనియర్ నేత కరుణానిధిలతోపాటు బీజేపీకి చెందిన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌లకు భద్రతా సిబ్బందిలో కొత పడే ఆస్కారం కనిపిస్తోంది. ప్రస్తుతం వీరందరికి జ ఫ్లస్ సెక్యూరిటీ కింద 50 మందిని కేటాయించగా, వాళ్లు బయటకు వెళ్లే సమయాలల్లో 35 నుంచి 40 మంది ఎప్పుడూ వెంట ఉంటారు. గత ప్రభుత్వ హయాంలో ఈ సంఖ్య కేవలం 26గా మాత్రమే ఉండేది. అయితే భద్రతా సిబ్బందిని తగ్గించటం.. పెంచటం అనే వ్యవహారంపై పూర్తిగా రాజకీయ స్థితిగతుల మీదే ఆధారపడి ఉంటుందని ఓ అధికారి వ్యాఖ్యానిస్తున్నారు. ఉదాహరణకు.. అస్సాం సీఎంగా తరుణ్ గొగోయ్ ఉన్న సమయంలో బ్లాక్ క్యాట్ కమాండోలను ఉపసంహరించుకుంటూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. సర్బనందా సోనోవల్ బీజేపీ తరపున ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక వెంటనే తిరిగి అదే సెక్యురిటీని కేటాయించింది. ఇదే విషయాన్ని ఆ అధికారి ప్రస్తావించారు. గతంలో తమ సిబ్బందిపై నేతలు దురుసుగా వ్యవహరించిన దాఖలాలు కూడా అనేకం ఉన్నాయని ఆయన అంటున్నారు. నేతలకు పొంచి ఉన్న ముప్పు ఆధారంగా ఎక్స్ నుంచి జెడ్ కేటగిరిగా విభజించి వారికి భద్రతా సిబ్బందిని నియమిస్తుంటారు. వై కేటగిరీల్లో ఉన్నవారికి 11 మంది సిబ్బందిని, జెడ్ కేటగిరీల్లో ఉన్న వారికి 30 మంది సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తోంది. బాబా రాందేవ్, మాతా అమృతానందమయి, మహంత్ నృత్యగోపాల్ దాస్, సాక్షి మహరాజ్, ముకేష్ అంబానీ-సతీమణి నీతా అంబాని ప్రస్తుతం వీఐపీ ట్రీట్ మెంట్ అందుకుంటుండగా.. ఉత్తర ప్రదేశ్ నుంచే ఎక్కువ మంది ఈ లిస్ట్‌లో ఉండటం విశేషం. -
ఎయిర్ పోర్టులో వీఐపీల సందడి
మధురపూడి : వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ, వై.ఎస్. జగ¯ŒS మోహ¯ŒS రెడ్డి సోదరి షర్మిల సోమవారం స్పైస్ జెట్ విమాన సర్వీసులో హైదరాబాద్ వెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తిరుగు ప్రయాణంలో భాగంగా రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరికి రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే, పార్టీ కో–ఆరి్డనేటర్ రౌతు సూర్యప్రకాశరావు, పశ్చిమ గోదావరి జిల్లా మాజీ ఎమ్మెల్యేలు ప్రసాదరాజు, తానేటి వనిత, గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్, పార్టీ కార్యదర్శి అడపా శ్రీహరి, పార్టీ అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్, వాణిజ్యవిభాగం రాష్ట్ర కార్యదర్శి రాయపురెడ్డి చిన్నా, మహిళా విభాగం రాజమహేంద్రవరం అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పోలు కిరణ్ మోహ¯ŒS రెడ్డి, పార్టీ నాయకులు సుంకర చిన్ని, ఈశ్వర్, రాజమహేంద్రవరం మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. బ్రదర్ అనిల్‌కుమార్‌కు స్వాగతం రాజమహేంద్రవరం విమానాశ్రయానికి సోమవారం ప్రముఖుల సందడి ఏర్పడింది. బ్రదర్ అనిల్ కుమార్ జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులో హైదరాబాద్ వెళ్లారు. మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజుబాబు, ఫాస్టర్స్ ఫెలోషిప్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాప్ సిన్హా, ఫెలోషిప్ జిల్లా అధ్యక్షుడు కోడి మోజేష్, శుభాకర్ శాస్త్రి, జోహ¯ŒS అలో¯ŒS ఆయనను కలిసి స్వాగతం పలికారు. సమాచార హక్కుల చట్టం కమిషనర్ పి. విజయబాబు స్పైస్ జెట్ విమాన సర్వీసులో ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఆయన ఇక్కడి నుంచి కాకినాడ వెళ్లారు. సినీ హీరో చరణ్, హీరోయి¯ŒS సమంతలు తిరుగు పయనం ప్రముఖ సినిమా హీరో రామ్‌చరణ్, హీరోయి¯ŒS సమంతలు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. గత కొన్ని రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన షూటింగుల్లో వీరు పాల్గొన్నారు. -
‘ఎర్రబుగ్గ’పై బ్యాన్ పడింది
-
‘ఎర్రబుగ్గ’పై బ్యాన్ పడింది
న్యూఢిల్లీ : ఎర్రబుగ్గ కార్లతో అధికారదర్పం ప్రదర్శించే నాయకులు, అధికారులకు చెక్ పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్కార్ ఎరుపురంగు బుగ్గకార్ల వినియోగంపై ఆంక్షలు విధించింది. దీంతో ప్రతిష్టకు సంకేతంగా భావిస్తూ బుగ్గకార్ల (కార్లపై రెడ్‌లైట్ల)తో వెలిగిపోతున్న పలువురు వీఐపీలు, ఉన్నతాధికారులు ఇకపై ఈ అవకాశాన్ని కోల్పోనున్నారు. మే 1వ తేదీ నుంచి ఈ ఎర్ర బుగ్గ కార్ల వినియోగంపై ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. కేవలం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, లోక్ సభ స్పీకర్ మాత్రమే బుగ్గకార్ల వినియోగించేందుకు అనుమతి ఉంది. ఇంతవరకు జిల్లాధికారులు, జిల్లా మేజిస్ట్రేట్లు, ఎస్పీలు, పార్లమెంటు సభ్యులు, ఇతర వీఐపీలకు ఉన్న ఈ సదుపాయం తొలగిపోనుంది. ప్రధాని మోదీ తాజా నిర్ణయంతో వీఐపీ కల్చర్‌కి చరమగీతం పాడినట్లు అయింది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌తో పాటు పంజాబ్‌లో ఎర్రబుగ్గ కార్ల వినియోగంపై అక్కడ ముఖ్యమంత్రులు బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. కాగా 2002, 2005లో కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ల ప్రకారం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, కేబినెట్ మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, త్రివిధ దళాల అధిపతులు ఎర్రబుగ్గ వాహనాలు వాడొచ్చు. అయితే నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా ఎర్రలైటు వాహనాలను ఉపయోగించేవారికి భారీగా జరిమానాలు విధించేలా మోటారు వాహనాల చట్టానికి సవరణలు తేవాలని సూచించాలంటూ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. నీలిరంగు బీకర్లను అంబులెన్స్, పోలీసులు మాత్రమే అత్యవసర సమయాల్లో ఉపయోగించాలని సుప్రీంకోర్టు గతంలో సూచనలు చేసిన విషయం తెలిసిందే. -
భూమాకు ప్రముఖుల నివాళి
-
అప్పన్న సన్నిధిలో ప్రముఖులు
సింహాచలం : శ్రీ వరహాలక్ష్మి నరసింహ స్వామిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈస్టు కోస్టు రైల్వే జనరల్ మేనేజర్ ఉమేష్‌సింగ్ దంపతులు, ఎల్.పాణిగ్రహి స్వామిని దర్శించుకున్నవారిలో ఉన్నారు. వీరంతా కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకొని అంతరాలయంలో అష్టోత్తరం పూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. నాలుగు వేదాలతో అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం అధికారులు ప్రసాదాన్ని అందజేశారు. -
దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖులు
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మను శుక్రవారం మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ మురళీమోహన్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర డీజీపీ ఎన్.సాంబశివరావు దంపతులు, సమాచార హక్కు చట్టం కమిషనర్ విజయనిర్మల దంపతులు, పోలవరం ఎమ్మెల్యే ఎం.శ్రీనివాస్, పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే బి.ప్రభాకరచౌదరి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే యు.హనుమంతరాయ చౌదరి, గుంతకల్లు ఎమ్మెల్యే జీ.జితేంద్రగౌడ్ కూడా అమ్మను దర్శించుకున్నారు. -
మండలి వెంకటకృష్ణారావు స్మారక పురస్కారాలు ప్రదానం
అవనిగడ్డ : దివంగత మండలి వెంకటకృష్ణారావు స్మారక పురస్కారాలను మూడు రంగాల్లోని ప్రముఖులకు ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అందజేశారు. స్థానిక గాంధీ క్షేత్రంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో సినీగేయ రచయిత భువనచంద్ర, అంతర్జాతీయ చిత్రకారుడు ఎస్వీ రామారావు, ఫొటోగ్రాఫర్ తమ్మా శ్రీనివాసరెడ్డికి మండల వెంకటకృష్ణారావు స్మారక పురస్కారాలను బుద్ధప్రసాద్ అందజేశారు. సినీగేయ రచయిత భువనచంద్ర మాట్లాడుతూ 1977 దివిసీమ ఉప్పెన సమయంలో తాను మిలటరీలో ఉన్నానని, ఆ నాటి ఘోరకలికి కకావికలమైన దివిసీమను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు మండలి వెంకటకృష్ణారావు ఎంతో శ్రమించారన్నారు. తెలుగుభాషాభివృద్ధికి వెంకటకృష్ణారావు ఎనలేని సేవలు అందించారని, ఆయన జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శమని పేర్కొన్నారు. ఊపిరున్నంతకాలం చిత్రకళను కొనసాగి స్తానని చిత్రకారుడు ఎస్వీ రామారావు చెప్పారు. ఫొటోగ్రాఫర్ తమ్మా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూదివిసీమ దేవాలయాలపై తీసిన లఘు చిత్రం దివి దర్శిని ఉత్తమ లఘు చిత్రంగా ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. తొలుత మండలి వెంకటకృష్ణారావు విగ్రహానికి ప్రముఖులు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ముగ్గురు పురస్కార గ్రహీతలను ఘనంగా సత్కరించారు. కేసీపీ సీవోవో జి.వెంకటేశ్వరరావు, మండలి వెంకట్రామ్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని గురువారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఏపీ డీజీపీ సాంబశివరావు శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనమనంతరం వీరికి టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని గురువారం రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సభ్యులు, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కార్గ్ దర్శించుకున్నారు. వీరికి డెప్యూటీఈవోలు కోదండరామారావు, హరీంద్రనాథ్, ఓఎస్డీ లక్ష్మీనారాయణ యాదవ్ ప్రత్యేకంగా శ్రీవారి దర్శనం కల్పించి, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం సినీనటి శ్రియ కుటుంబ సభ్యులతో కలసి ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని, తర్వాత శ్రీవారిని, వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల వచ్చిన ఆమెను చూసేందుకు అభిమానులు, భక్తులు ఉత్సాహం చూపారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని పలువురు ప్రముఖులు ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కుటుంబ సభ్యులతో కలసి వీఐపీ విరామ సమయంలో స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అలాగే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. -
గన్నవరం ఎయిర్‌పోర్టుకు వీఐపీల తాకిడి.
-
గన్నవరం ఎయిర్‌పోర్టుకు వీఐపీల తాకిడి
గన్నవరం: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి అతిథులు తరలి వస్తున్నారు. దీంతో గన్నవరం విమానాశ్రయానికి వీఐపీల తాకిడితో కిటకిటలాడుతోంది ఇప్పటికే పలువురు అతిథులు అమరావతి చేరుకోగా, మరికొందరు తరలి వస్తున్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ నేత కిషన్ రెడ్డి, నటుడు సుమన్, జపాన్ ప్రతినిథులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోస్లే, సింగపూర్ మంత్రి ఈశ్వరన్, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, పలువురు ప్రముఖులు గన్నవరం చేరుకుని అక్కడ నుంచి ఉద్దండరాయపాలెం బయల్దేరారు. ఇక ఇప్పటికే ఏపీ మంత్రులు, ఎంపీలు, ఇతర నేతలు అక్కడకు చేరుకున్నారు. మరోవైపు అమరావతి శంకుస్థాపన పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం ఎస్పీజీ ఆధీనంలో ఉండగా, మరో 14వేల మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 25 సీసీ కెమెరాలు, టీవీల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. -
ప్రముఖులకు ప్రకాశం బ్యారేజీ మీదుగా అనుమతి
విజయవాడ : ఏఏఏ పాస్‌లు ఉన్న ప్రముఖలకు ప్రకాశం బ్యారేజీ మీదుగా నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన ప్రాంగణానికి ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చారు. సాధారణ వాహనాలకు మాత్రం ఎన్ఆర్ఐ ఆసుపత్రి, మంగళగిరి, నిడుమర్రు మీదగా అనుమతిచ్చారు. మధ్యాహ్నం 12.00 గంటల వరకు మాత్రమే వాహనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 2.00 గంటల తర్వాత మళ్లీ వాహనాలు తిరిగి వెళ్లేందుకు అనుమతి ఇస్తామని వెల్లడించారు. గుంటూరు ఐజీ ఎన్ సంజయ్ నేతృత్వంలో వాహనాల రాకపోకలను పర్యవేక్షిస్తున్నారు.