తిరుమలకు వీఐపీల తాకిడి
తిరుమల : తిరుమలకు వీఐపీల తాకిడి పెరిగింది. సోమవారం ఉదయం కూడా పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. గవర్నర్ నరసింహన్ దంపతులు, టీడీపీ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో అర్చకులు తీర్థప్రసాదాలు అందచేశారు.
రెండు రాష్ట్రాల్లో విభేదాలున్నా.... ప్రజలందరూ కలిసి సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు సీఎం రమేష్ తెలిపారు. ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు స్వామివారికి మెక్కుచెల్లించుకోవడానికి వచ్చినట్లు పయ్యావుల కేశవ్ చెప్పారు.