payyavula kesav
-
పీఏసీ చైర్మన్‌గా పయ్యావుల కేశవ్
సాక్షి, అమరావతి: చట్టసభలకు సంబంధించి ప్రజాపద్దుల సంఘం(పబ్లిక్ అకౌంట్స్ కమిటీ - పీఏసీ) చైర్మన్‌గా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బుధవారం పయ్యావుల పేరును ఖరారు చేశారు. కాగా అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ నాలుగోసారి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా పీఏసీ చైర్మన్ పదవి రేసులో టీడీపీ సీనియర్ పేర్లు వినిపించినా చంద్రబాబు చివరకు పయ్యావుల వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాంకు ప్రతిపాదనలు పంపారు. -
చీఫ్ విప్‌లుగా పయ్యావుల, పల్లె
సాక్షి ప్రతినిధి, అనంతపురం: శాసనసభ చీఫ్ విప్‌గా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘనాథరెడ్డి, శాసనమండలి చీఫ్‌విప్‌గా ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఎంపిక దాదాపుగా ఖరారయింది. వీరిద్దరికీ పదవులు కట్టబెడుతున్నట్లు సీఎంఓ నుంచి ఫోన్ చేసినట్లు సమాచారం. అయితే నియామకానికి సంబంధించిన జీఓ వెలువడాల్సి ఉంది. శాసనమండలి ఎన్నిక రోజు, లేదంటే అంతకు ముందుగానే జీఓ వెలువడనున్నట్లు తెలిసింది. పయ్యావుల కేశవ్ తొలిసారి 1994లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 1999లో ఓటమిపాలయ్యారు. అనంతరం 2004, 2009 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. 2014లో ఓటమి చవిచూశారు. 2015లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. 2014 టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో మంత్రి పదవిపై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. అయితే ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందని ఆశపడ్డారు. అప్పుడు కూడా చంద్రబాబు మొండిచేయి చూపారు. దీంతో కేశవ్ తీవ్ర నిరాశ చెందినా.. చివరకు మండలి చీఫ్‌విప్ పదవిని కట్టబెట్టారు. = పల్లె రఘునాథరెడ్డి తొలిసారి 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో ఓడిపోయారు. ఆ తర్వాత 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం 2009, 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో సమాచార, పౌరసంబంధాలు, మైనార్టీ, ఐటీశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ ఏడాదిలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో పదవి కోల్పోయారు. ఇప్పుడు తిరిగి చీఫ్ విప్‌గా ఎంపికయ్యారు. అనంతపురం చరిత్రలో చీఫ్ విప్‌గా తొలిసారి నల్లమాడ ఎమ్మెల్యే వీరప్ప ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014లో రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు.. అనంతరం చీఫ్‌విప్‌లుగా పల్లె, పయ్యావుల నియమితులయ్యారు. -
చర్చకు మీ ఊరికే వస్తాం.. సిద్ధమా కేశవ్
* నీ మొఖానికి జగన్ అవసరం లేదు.. మా కార్యకర్త చాలు * టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావులపై అంబటి ఫైర్ సాక్షి, హైదరాబాద్: రాజధాని భూ దురాక్రమణపై చర్చకు వైఎస్ జగన్ ప్రకాశం బ్యారేజీ వద్దకు రావాలని టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ విసిరిన సవాలుకు వైఎస్సార్సీపీ గట్టిగా ప్రతిస్పందించింది. కేశవ్ సవాలును స్వీకరించిన వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు.. ప్రకాశం బ్యారేజీ వద్ద అవసరం లేదని చర్చకు తాము కేశవ్ ఊరు ఉరవకొండకే వస్తామని బదులిచ్చారు. గురువారం అంబటి విలేకరులతో మాట్లాడుతూ.. అనంతపురానికి చెందిన కేశవ్ రాజధాని ప్రాంతంలో ఎందుకు భూములు కొన్నారో చెప్పాల్సింది పోయి జగన్‌పై విరుచుకు పడటం ఏమిటని ప్రశ్నించారు. జగన్‌కు దమ్మూ, ధైర్యం ఉంటే, నీతి నిజాయితీ ఉంటే రాయలసీమ రక్తం ప్రవహిస్తూ ఉంటే చర్చకు ప్రకాశం బ్యారేజీ వద్దకు రావాలని కేశవ్ రంకెలు వేశారన్నారు. ‘‘కేశవ్.. నీ మొఖానికి జగన్ రావాలా.. నీ అవినీతిని నిరూపించడానికి మా నాయకుడి అవసరమే లేదు. మా కార్యకర్త చాలు... నీ ఉరవకొండకే చర్చకు వస్తాం. నీకు సిగ్గు, శరం, చీము నెత్తురు ఏ మాత్రం ఉన్నా నిజంగా రాయలసీమ రక్తంతో మండే వాడివే అయితే చర్చకు రా’’ అని అంబటి ప్రతి సవాలు విసిరారు. భూ కుంభకోణంలో తన వ్యవహారం గురించి సాక్షి పత్రికలో వార్త వస్తున్నదని తెలుసుకున్న కేశవ్ బుధవారం రాత్రి 11 గంటల వరకూ సాక్షి కార్యాలయం వాచ్‌మన్ దగ్గరి నుంచీ స్టింగర్ వరకూ కాళ్ల బేరానికి వచ్చి బతిమిలాడారని అంబటి వెల్లడించారు. రాత్రి కాళ్లబేరానికి వచ్చిన కేశవ్ పగలు జగన్‌పై ఘీంకరిస్తూ మాట్లాడారన్నారు. రాజధాని ప్రకటనకు ముందే కేశవ్ ఆ ప్రాంతంలో భూమికి అడ్వాన్సు ఇచ్చి ఆ తరువాత రిజిస్ట్రేషన్ చేయిం చుకున్నారని తెలిపారు. సీబీఐ దృష్టికి రాని జగన్ అంశాలను కూడా ఇపుడు తెస్తానని బెది రిస్తున్నారని అయితే ఆయన వీటిని ఇంత కాలం ఎందుకు దాచారో చెప్పాలని నిలదీశారు. సాక్షి కథనాలకు కోతుల్లా ఎగురుతున్నారు అవినీతిపరుల గుండెల్లో నిద్ర పోతానని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు ఇపుడు లింగమనేని కట్టిన అక్రమ భవనంలో నిద్ర పోతున్నారని అంబటి ఎద్దేవా చేశారు. సాక్షిలో వచ్చే కథనాలకు సమాధానం చెప్పలేక నిప్పు తొక్కిన కోతిలాగా ఎగరడం దేనికన్నారు. అవినీతికి సమాధానం చెప్పుకోవాలి గానీ జగన్‌పై బురద జల్లి తప్పుకు పోవాలంటే కుదరదన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో గానీ, సీబీఐ చేత గానీ విచారణకు చంద్రబాబు సిద్ధం కాకపోతే టీడీపీ నేతలంతా అవినీతికి ప్పాడినట్లేనని అంబటి పేర్కొన్నారు. ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ వెనుక జగన్ హస్తం ఉందని మంత్రి నారాయణ వ్యాఖ్యానించడం విడ్డూరమన్నారు. వాస్తవానికి ముద్రగడ పోరాడుతున్నది చంద్రబాబు ఇచ్చిన హామీ అమలు కోసమేనన్నారు. రాజధాని భూదందాపై బీజేపీ స్పందించాలని కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని అంబటి కోరారు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం పేరుతో ప్రపంచం ఆశ్చర్యపోయే కుంభకోణానికి పాల్పడ్డారని ఆయన అన్నారు. -
సిగ్గు శరం ఉంటే ఉరవకొండలో చర్చకు రా!
టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌కు సిగ్గు, శరం, చీము, నెత్తురు ఉంటే ఉరవకొండలో చర్చకు రావాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాలు విసిరారు. వాళ్లకు దమ్ముంటే సీబీఐ విచారణకో, సిట్టింగు జడ్జితో విచారణకో సిద్ధం కావాలని, లేనిపక్షంలో ఈ ఆరోపణలన్నింటినీ వాళ్లు అంగీకరించినట్లేనని ఆయన అన్నారు. తాను బినామీ పేర్లతో కొనలేదని, మగాడిలా తన కొడుకు పేరుమీదే భూమి కొన్నానని పయ్యావుల కేశవ్ చెప్పడంపై ఆయన మండిపడ్డారు. మీరు మగాడిలా కొంటే.. మరి బినామీ పేర్లతో కొన్న చంద్రబాబు, లోకేష్, నారాయణల పరిస్థితేంటి.. వాళ్లు మగాళ్లు కారా అని ప్రశ్నించారు. మగాడిలా కొన్నానంటున్నావే.. రావెల కిశోర్ బాబు భార్య కూడా డైరెక్టుగా నీలాగే కొన్నారని ఆయన అన్నారు. అసలు అక్కడ ఎందుకు కొన్నారు.. రాజధాని వస్తోందని ముందే తెలిసి కొన్న మాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. ఆ విషయం చెప్పకుండా జగన్ మీద ఆరోపణలు చేయడం, నిందలు వేయడం ఎందుకని నిలదీశారు. ఇకమీదట ఈ కథనాలు రాయొద్దంటూ రాత్రి 11 గంటల వరకు సాక్షిలో స్ట్రింగర్ నుంచి వాచ్‌మన్ వరకు అందరి దగ్గరకు కాళ్ల బేరానికి వచ్చిన మాట వాస్తవమా కాదా అని అంబటి రాంబాబు కేశవ్‌ను ప్రశ్నించారు. ఉరవకొండ వచ్చి చర్చించేందుకు తాము సిద్ధమని, మీ మొహానికి జగన్ మోహన్ రెడ్డి రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నీకు సిగ్గు, శరం, చీము, నెత్తురు ఉంటే ఉరవకొండలో చర్చిద్దాం రా.. అని సవాలు విసిరారు. రాయలసీమలో పుట్టినవాడివి.. రాజధాని ప్రాంతం గురించి ముందే తెలుసుకుని, అక్కడ భూములు కొనే నక్కజిత్తులు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. మగాడినని ప్రగల్భాలు పలకడం కాదు, చేతల్లో చూపించుకోవాలని హితవు పలికారు. ఇప్పుడు పయ్యావుల కొత్త పల్లవి అందుకుంటున్నారని, ఇప్పటివరకు సీబీఐ దృష్టికి రాని కొన్ని వాస్తవాలను వాళ్లు బయటకు తీస్తామంటున్నారని, కడపలో ఉన్న బినామీ మైనింగులను కూడా తీస్తామని చెబుతున్నారని.. మరి ఇన్నాళ్లూ గాడిదలు కాస్తున్నారా అని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఎందుకు బయటకు తేలేదు? ఇన్నాళ్లూ ఎందుకు దాచావు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా పయ్యావుల కేశవ్ గారూ అని నిలదీశారు. కేవలం వాళ్ల మీద వార్త వచ్చింది కదాని బెంబేలెత్తిపోతున్నారన్నారు. అన్నీ బయటపడ్డాక ప్రకాశం బ్యారేజి మీదకు వస్తారో, పట్టిసీమకు వస్తారో చర్చకు తాము సిద్ధమని తెలిపారు. మీ పెదబాబు, చినబాబు, పరివారం మొత్తాన్ని తీసుకురావాలని అన్నారు. మీ నాయకులు బినామీ పేర్లతో కొన్న స్థలంలోకి వస్తారో.. మీ అబ్బాయి పేరు మీద కొన్న నాలుగెకరాల్లోకి వస్తారో రావాలని సవాలు చేశారు. అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతానన్న చంద్రబాబు.. ఇప్పుడు లింగమనేని వారు అక్రమంగా కట్టిన అవినీతి బంగ్లాలో నిద్రపోతున్నారని, టీడీపీ నేతలు అంతా సిగ్గుమాలిన పనులు చేస్తూ, నిప్పుతొక్కిన కోతుల్లా వ్యవహరిస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వాటిపై విచారణ ఎదుర్కోడానికి సిద్ధం కావాలి తప్ప జగన్ మోహన్ రెడ్డి మీద బురద చల్లి తప్పుకోవాలని చూడద్దని హితవు పలికారు. కాపు రిజర్వేషన్ల విషయంలోను, ఇతర విషయాల్లోను తామిచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఎందుకు వెనకాడుతున్నారని అంబటి ప్రశ్నించారు. మద్రగడ పద్మనాభం ఉద్యమం, మంద కృష్ణమాదిగ పోరాటాల వెనుక జగన్ హస్తం ఉందని అంటున్నారని.. ప్రతి దాని వెనక ఆయన హస్తం ఉండటం ఏంటి, బుద్ధి ఉండి మాట్లాడుతున్నారా లేకుండా మాట్లాడుతున్నారా అని మండిపడ్డారు. మరోవైపు.. అసలు చంద్రబాబు లాంటి నాయకుడు ఏపీకి ముఖ్యమంత్రిగా రావడం తెలుగుప్రజల అదృష్టం అని వెంకయ్యనాయుడు అంటున్నారని, దాన్నిబట్టి చూస్తే చంద్రబాబు విలువలు పెరిగిపోయాయో, వెంకయ్య విలువలు దిగజారిపోయాయో అర్థం కావట్లేదన్నారు. ఈ నీచ వ్యవహారంపై కేంద్రం విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రపంచస్థాయి రాజధాని పేరుతో లోకేష్, చంద్రబాబు బినామీ పేర్లతో ప్రపంచస్థాయి దోపిడీ జరుపుతున్నారని ఆయన మండిపడ్డారు. -
అక్కడ భూములు కొన్నది నిజమే: పయ్యావుల
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భూములు కొన్నది వాస్తవమేనని టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అంగీకరించారు. 'సాక్షి' కథనంపై స్పందించిన ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ బినామీ పేరుతో కాదని, తన కొడుకు పేరుతోనే భూములు కొన్నానని తెలిపారు. కాగా కోర్ కేపిటల్లోని తుళ్లూరుకు అతి దగ్గరగా ఉండే అయినవోలు గ్రామంలో పయ్యావుల 4.09 ఎకరాలు కొనుగోలు చేశారు. సర్వే నెంబరు 48/3లో 2.13ఎకరాలు, సర్వే నెంబరు 49/3లో 1.96 ఎకరాలు కలిపి మొత్తం 4.09 ఎకరాల భూమిని 2014 అక్టోబరు 13న కేశవ్ పెద్దకుమారుడు పయ్యావుల విక్రమసింహ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎకరం 3.7 లక్షల చొప్పున 4.09 ఎకరాలను 12.27లక్షల రూపాయలకే కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కానీ అయినవోలులో ప్రస్తుతం మార్కెట్ విలువ ఎకరా రూ.2కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఏడాది వ్యవధిలో పయ్యావుల భూములకు 50 రెట్లకు పైగా ధర పలుకుతోంది. మరోవైపు రైతుల వద్ద భూములు కొంటే తప్పేంటని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర అన్నారు. రాజధానిలో ఎంతోకొంత భూమి ఉండాలని ఎవరైనా కోరుకుంటారని, 2,3 ఎకరాలు కొనుక్కోలేని పరిస్థితిలో తాము ఉన్నామా అని ఎదురు ప్రశ్నించారు. కాగా నంబూరులో సర్వే నెంబరు 274లోని 3.89 ఎకరాల వాగు పోరంబోకు భూమిని తన సమీప బంధువు దేవర పుల్లయ్య పేరుతో సొంతం చేసుకోవడానికి ధూళిపాళ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. రెవిన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చి రెండుమూడు చేతులు మార్చినట్లుగా చూపి డాక్యుమెంట్ నెంబర్లు 2638, 2639, 2640లలో 3.89 ఎకరాల భూమిని తమ బినామీదారుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు. -
నీలా రాజకీయాలు చేస్తే జగన్ ఎన్నోసార్లు సీఎం అయి ఉండేవారు
♦ చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపాటు ♦ పక్క పార్టీ ఎమ్మెల్యేల్ని పార్టీలో చేర్చుకోవడమేనా మీ క్యారెక్టర్? సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు మాదిరిగా.. జగన్మోహన్రెడ్డి కూడా వైశ్రాయి తరహాలో రాజకీయాలు చేసి ఎమ్మెల్యేలకు సూట్కేసులిచ్చుంటే తన తండ్రి చనిపోయినప్పటినుంచి ఇప్పటికే ఎన్నోసార్లు సీఎం అయిఉండేవారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ప్రజల ఓట్లతో అధికారంలోకి రావాలనుకున్నారేతప్ప తప్పుడుదారిలో అధికారం చేపట్టాలని ఆయనెప్పుడూ అనుకోలేదన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు.చంద్రబాబు, ఆయన మం త్రులు, నేతలు చెప్పేది శ్రీరంగనీతులు.. చేసేది నీతిమాలిన రాజకీయాలని దుయ్యబట్టారు. ‘నాకుండేదే క్యారెక్టర్’ అన్న సీఎం మాటలు ఎవరికైనా నవ్వు వస్తుందన్నారు. ‘రాజకీయాల్లో విలువలకోసం పాటుపడుతున్నానంటారు.. పక్క పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలపై కేసులుపెట్టి, సూట్కేస్లిచ్చి మీ పార్టీలో చేర్చుకోవడమేనా విలువలు కాపాడడమంటే?’ అని ప్రశ్నించారు. 35ఏళ్ల రాజకీయజీవితంలో తానే తప్పూ చేయలేదని సీఎం అనడంపై ఆమె మండిపడ్డారు. ‘ఆయన రాజకీయ జీవితమే తప్పుడుమార్గంలో మొదలైందని అందరికీ తెలుసు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి మొదలుపెట్టిన రాజకీయం.. ఈరోజు ఆయన, ఆయన కుమారుడు కలసి ఈ రాష్ట్రాన్ని దోచుకునేంతవరకు కొనసాగిస్తున్నారని ప్రజలందరికీ తెలుసు. క్యారెక్టర్ అంటాడు. రాజకీయాల్ని వ్యాపారంగా మార్చేసి, అప్పుడు ఎన్టీఆర్ దగ్గరున్న ఎమ్మెల్యేల్ని, ఈరోజు జగన్ వద్దనున్న ఎమ్మెల్యేల్ని కొన్న నీతిమాలిన క్యారెక్టర్ ఆయనది’ అని దుయ్యబట్టారు. ప్రత్యేకహోదాకానీ, రైల్వేజోన్కానీ సాధించలేని అసమర్థ క్యారెక్టర్.. మాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళల్ని మోసగించిన మోసకారి, దగాకోరు క్యారెక్టర్ ఆయనదని తూర్పారపట్టారు. ‘మా వాళ్లు బ్రీఫ్డ్ మీ’ అంటూ ప్రపంచంలో తెలుగువారందరి పరువును తీసిన క్యారెక్టర్ బాబుదన్నారు. లోకేశ్ తప్పుడు ఆలోచనల్ని తుంచేయాలి రాజకీయాలకు పట్టిన తుప్పు చంద్రబాబు అయితే, ఆయన అడుగుజాడల్లోనే వాళ్లఅబ్బాయి రాజకీయాలు ప్రారంభించారని రోజా దుయ్యబట్టారు. ‘ఇసుకమాఫియా నుంచి కల్తీమద్యం మాఫియాదాకా.. సీఎస్‌లు సంతకం పెట్టకున్నా ప్రాజెక్టు పనుల్లో వేలకోట్లు దోచుకుంటున్న విషయం.. ఆయన అనుచరులే కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌లో మహిళల్ని వ్యభిచారంలో దించుతున్న విషయం ప్రజలందరికీ తెలుసు. అయినా తాను తప్పుచేసినట్టు నిరూపిస్తే.. రాజకీయాలనుంచి తప్పుకుంటానంటున్నారు. ఇంత చిన్నవయస్సులో చేసిన తప్పులు దొరకకుండా తప్పుచేయడం నేర్చుకున్నాడంటే.. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌కు లోకేశ్వల్ల పెనుముప్పు పొంచిఉంది. కాబట్టి మొగ్గలోనే ఆయన తప్పుడు ఆలోచనల్ని తుంచివేయాలని కోరుతున్నా’ అన్నారు. రాజీనామాకు మీరు సిద్ధమేనా? సొంత నియోజవర్గంలో ఎమ్మెల్యేగా గెలవలేని పయ్యావుల కేశవ్ తమ పార్టీ అధినేతను శాశ్వతంగా రాజకీయాలనుంచి తప్పిస్తామని మాట్లాడడం హాస్యాస్పదమని రోజా అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామాకు సిద్ధపడితే.. వైఎస్సార్సీపీ తరఫున మిగిలిన ఎమ్మెల్యేలమంతా రాజీనామాకు సిద్ధమన్నారు. తన ఎమ్మెల్యేల్ని తిరిగి ప్రజా క్షేత్రంలో గెలిపించుకురాగల సత్తా జగన్‌కుందని, ఆ దమ్మూధైర్యం టీడీపీకి, చంద్రబాబుకుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పక్కపార్టీ ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడుతున్నారంటే.. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేకనేనన్నారు. తెలంగాణ టీడీపీ కేసీఆర్ పార్టీలో విలీనమయ్యాక.. ఏపీలోనూ ఎక్కడ తమ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లిపోతారన్న భయంతోనే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. తండ్రిపై ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టి.. క్షణాల్లో జైల్లోపెట్టిన చంద్రబాబుకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే ఆఖిలప్రియ నమస్కారం చేసిందంటే రాజకీయాల్లో ఏమి విలువలున్నట్టని ప్రశ్నించారు. -
తిరుమలకి వీఐపిల తాకిడి
-
తిరుమలకు వీఐపీల తాకిడి
తిరుమల : తిరుమలకు వీఐపీల తాకిడి పెరిగింది. సోమవారం ఉదయం కూడా పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. గవర్నర్ నరసింహన్ దంపతులు, టీడీపీ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో అర్చకులు తీర్థప్రసాదాలు అందచేశారు. రెండు రాష్ట్రాల్లో విభేదాలున్నా.... ప్రజలందరూ కలిసి సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు సీఎం రమేష్ తెలిపారు. ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు స్వామివారికి మెక్కుచెల్లించుకోవడానికి వచ్చినట్లు పయ్యావుల కేశవ్ చెప్పారు. -
ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ
మూడు నామినేషన్లు దాఖలు అనంతపురం అర్బన్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. ఈ నెల 9 నుంచి మూడు నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి లక్ష్మీకాంతం తెలిపారు. తెలుగుదేశం పార్టీ తరఫున పయ్యావుల కేశవ్ నాలుగు సెట్లు, పయ్యావులు శ్రీనివాసులు ఒక సెట్టు, యాట వెంకటసుబ్బన్న ఒక సెట్టు మొత్తం ముగ్గురు అభ్యర్థులు ఆరు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారన్నారు. బుధవారం నామినేషన్లను స్క్రూటినీ చేస్తామని చెప్పారు. ఉపసంహరణకు ఈ నెల 19వ తేదీ చివరి రోజని, అదే రోజు మధ్యాహ్నం పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. -
'పయ్యావుల సోదరులు రాజ్యాంగేతర శక్తులు'
అనంతపురం: టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఇప్పటి కూడా ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని వైఎస్ఆర్ సీపీనేత, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. పోలీసులను గుప్పెట్లో పెట్టుకుని వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉరవకొండలో పయ్యావుల సోదరులు రాజ్యాంగేతర శక్తులుగా మారారని విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పయ్యావుల కేశవ్ వెనుకంజ
అనంతపురం : అనంతపురం టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ వెనుకంజలో ఉన్నారు. అలాగే హిందూపురం లోక్‌సభ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ ఆధిక్యంలో ఉంది. -
పయ్యావుల గోడౌన్లపై విజిలెన్స్ దాడులు
అనంతపురం : అనంతపురం జిల్లా ఉరవకొండలో విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు చెందిన గోడౌన్లలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.20 కోట్ల విలువైన శనగ, ధనియాలును సీజ్ చేశారు. నిల్వలకు సంబంధించిన రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. జిల్లాలో విజిలెన్స్ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. -
కోడ్ ఉల్లంఘించిన కాల్వ శ్రీనివాసులు
అనంతపురం : రాయదుర్గం టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. నిబంధనలకు విరుద్ధంగా బీసీరేహల్లో శివలింగస్వామి ఆలయంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ...కోడ్ ఉల్లంఘించిన కాల్వ శ్రీనివాసులుపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు మహిళా సంఘాలతో పాటు సామాన్య, మధ్య తరగతికి చెందిన మహిళలను ప్రలోభపెట్టేందుకు టీడీపీ నాయకులు ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కారు. విందు ఏర్పాటు చేసి వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో స్థానిక ఎంఎస్ ఫంక్షన్ హాల్ లో మహిళా సంఘాల సభ్యులు, ఇతర మహిళలకు బిర్యానీతో పాటు విందు ఏర్పాటు చేసి, ఒక్కొక్కరికి రూ.100 నగదుతో పంచిపెట్టారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే రుణాలు మాఫీ చేస్తారని నమ్మబలికారు. -
'పయ్యావుల నుంచి ప్రాణహాని ఉంది'
అనంతపురం : టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు బుధవారం డిమాండ్ చేశాయి. పయ్యావుల నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితుడు నాగన్న ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా కూడేరు మండలం చోళసముద్రంలోని దళితవాడలో ఐదేళ్ల కిందట తాగునీటి సమస్యపై ఇచ్చిన హామీని నెరవేర్చలేదని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ కార్యకర్త దళిత నాగన్న కుటుంబంపై ఎమ్మెల్యే సమక్షంలోనే ఆయన అనుచరులు కర్రలతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కూడేరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. అయితే కేసు ఉపసంహరించుకోవాలని పయ్యావుల కేశవ్ అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని నాగన్న తెలిపాడు. -
ఢీ అంటే ఢీ!
* టీడీపీలో కేశవ్, పరిటాల సునీత మధ్య ఆధిపత్య పోరు తీవ్రం * ఒకరిని ఓడించేందుకు మరొకరు ఎత్తుకు పైఎత్తు * వలస పక్షులతో బలం పెంచుకుంటున్న కేశవ్... * మండిపడుతున్న సునీత సాక్షి, అనంతపురం : జిల్లాలో తెలుగుదేశం పార్టీలో పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ వర్గాలు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరినొకరు దెబ్బతీసుకునేందుకు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నారు. పరిటాలకు బద్ధ శత్రువులైన వారందరిని కేశవ్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని పరిటాల వర్గం మండిపడుతోంది. ఇవన్నీ పట్టనట్లు కేశవ్ తన పని తాను వేగంగా పూర్తి చేస్తున్నారు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ.. పరిటాల వర్గాన్ని దెబ్బకొడుతున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. రెండు వర్గాల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో తాము ఎవరికి మద్దతు తెలపాలో తెలియక కార్యకర్తలు తికమక పడుతున్నారు. సోమవారం కేశవ్ తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సైతం పార్టీ శ్రేణులు ఎవరూ కనిపించకపోవడం ఆ పార్టీలో నెలకొన్న పరిస్థితికి అద్దం పడుతోంది. బహిరంగంగా సునీతకు మద్దతు తెలిపేందుకు కొందరు భయపడుతుండగా, మరికొంత మంది కేశవ్‌కు మద్దతు తెలిపేందుకు ఆందోళన చెందుతున్నారు. పార్టీ నియోజకవర్గ వ్యవహారాల్లో ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల తీరు పట్ల ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో కాంగ్రెస్ వలస పక్షులను కేశవ్ ముందుండి పార్టీలోకి తీసుకువస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బలహీనంగా ఉన్న టీడీపీని బలోపేతం చేయాలనే ఉద్దేశమని చెబుతూనే.. తన స్వార్థం కోసం కేశవ్ కాంగ్రెస్ నేతలందర్నీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని పేర్కొంటున్నారు. జిల్లాలో పరిటాల వర్గ ఆధిపత్యాన్ని పూర్తిగా తగ్గించేసి వారి కార్యకలాపాలను అణచివేసేందుకు కేశవ్ వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పరిటాల రవీంద్ర హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేసీ సోదరులను పార్టీలోకి తీసుకురావడంలో కేశవ్ కీలక పాత్ర వహించారని పరిటాల వర్గం భావిస్తోంది. తనకు అనుకూలమైన సీఎం రమేష్‌ను జిల్లా ఇన్చార్జ్గా నియమించుకుని ఆయన ద్వారా పనులను చక్కబెట్టుకుంటున్నట్లు ఆ పార్టీ నాయకులే ఆరోపిస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికీ మంత్రి పదవులు రావని కేశవ్, సునీత ఒకరినొకరు ఓడించుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇటీవల ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటించిన జేసీ దివాకర్‌రెడ్డికి ఏమాత్రం సహకరించవద్దని పరిటాల సునీత ఆమె వర్గీయులకు సూచించినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న కేశవ్.. ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లో సునీతను ఓడిస్తే తనకెదురుండదని పథకం రూపొందించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే జేసీ సోదరులు, ఎమ్మెల్సీ తిప్పేస్వామి, అంబికా లక్ష్మినారాయణను పార్టీలోకి తీసుకొచ్చి కేశవ్ తన ఆధిపత్యాన్ని పెంచుకున్నారని చెబుతున్నారు. ఇది వరకు జిల్లాలో పరిటాల రవీంద్ర వర్గీయులు ఎక్కువగా ఉండేవారు. ఎమ్మెల్యేలు కూడా పరిటాల పట్ల విధేయతగా ఉండేవారు. ప్రస్తుతం టీడీపీలో జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, కేశవ్ తదితరులు మూడు గ్రూపులుగా విడిపోయారు. ప్రస్తుతం కేశవ్ వర్గం జిల్లాలో బలపడిందనే అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో మాజీ మంత్రి శైలజానాథ్, గుంతకల్లు ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తాలను సైతం పార్టీలోకి తీసుకువస్తే జిల్లా టీడీపీలో తనకెదురుండదని కేశవ్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే చంద్రబాబు వద్ద సునీత మాటకు విలువలేకుండా చేయడంలో కేశవ్ విజయం సాధించారని ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. -
'సోనియా ఇటాలియన్....విమర్శిస్తే ఊరుకోం'
హైదరాబాద్ : తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఈటెల రాజేందర్ వ్యాఖ్యలతో అసెంబ్లీ సోమవారం స్తంభించింది. పయ్యావుల ....సోనియా గాంధీ ఇటాలియన్ అంటూ చేసిన వ్యాఖ్యలపై శైలజానాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ అధినేత్రిని విమర్శిస్తే ఊరుకునేది లేదని శైలజానాథ్ అన్నారు. మరోవైపు నిజాం పాలను ప్రశంసిస్తూ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపైనా శైలజానాథ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజాం కాలంలో అభివృద్ధితో పాటు పరిశ్రమలు కూడా వచ్చాయన్న ఈటెల వ్యాఖ్యలను అడ్డుకున్నారు. నిజాం కాలాన్ని కీర్తించటమంటే రాజ్యాంగాన్ని అవమానపరచటమేనని శైలజనాథ్ అన్నారు. దానిపై ఈటెల స్పందిస్తూ నిరంకుశత్వానికి మద్దతు ఇవ్వలేదని సమర్థించుకున్నారు. -
'జగన్‌ను ప్రశ్నించే స్థాయి కేశవ్‌కు లేదు'
అనంతపురం : టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌పై వైఎస్ఆర్ సీపీ నేత వై.విశ్వేశ్వరరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించే స్థాయి పయ్యావుల కేశవ్‌కు లేదని అన్నారు. కేశవ్‌కు చేతనైతే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ధర్నా చేసి సమైక్యాంధ్రకు మద్దతుగా లేఖ ఇప్పించాలి సవాల్ విసిరారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం పాటిస్తూ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై రాష్ట్రాన్ని విభజిస్తున్నారని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. -
విభజన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో 18న విచారణ
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన నాలుగు పిటిషన్లపై విచారణ ఈనెల 18వ తేదీకి వాయిదా పడింది. విభజనకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకోవటాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేసుకు సంబంధించి సర్క్యూలేట్ అయిన లేఖ చదవలేదని...పూర్తి స్థాయిలో చదివిన తర్వాత విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వెల్లడించారు. కాగా విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్సీపీ నేత, పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజు, డీఏ సోమయాజులు దాఖలు చేసిన పిటిషన్లతో పాటు టీడీపీ నేత పయ్యావుల కేశవ్, కృష్ణమూర్తి అనే వ్యక్తి వేసిన పిటిషన్లను కూడా న్యాయస్థానం 18న విచారణ చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని, విభజన ప్రక్రియ తీరుతెన్నులను సవాల్ చేస్తూ పయ్యావుల కేశవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ హైదరాబాద్‌కు చెందిన సదాశివరెడ్డితో కలిసి 32వ అధికరణం కింద ప్రజా ప్రయోజనం వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి, కేబినెట్ కార్యదర్శి, పీఎంవో కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు.