
పయ్యావుల గోడౌన్లపై విజిలెన్స్ దాడులు
అనంతపురం : అనంతపురం జిల్లా ఉరవకొండలో విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్కు చెందిన గోడౌన్లలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.20 కోట్ల విలువైన శనగ, ధనియాలును సీజ్ చేశారు. నిల్వలకు సంబంధించిన రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. జిల్లాలో విజిలెన్స్ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.