ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నకిలీ సదరం సర్టిఫికెట్ల కుంభకోణం
2022లో ఆధారాలతోసహా బయటపెట్టిన ‘సాక్షి’
నాడు అధికారులు హడావిడి చేసినా తేలని దోషులు
తాజాగా ఆ ఫైల్ దుమ్ము దులిపిన విజిలెన్స్ విభాగం
దర్యాప్తును స్వయంగా పర్యవేక్షిస్తున్న ఏసీబీ డీజీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో నకిలీ సదరం సర్టిఫికెట్ల కుంభకోణంపై అధికారులు మళ్లీ దృష్టి సారించారు. పింఛన్లు, పన్ను మినహాయింపులు, ఇతర సౌకర్యాలు పొందేందుకు కొందరు అనర్హులు అక్రమంగా వైకల్య సర్టిఫికెట్లు పొందినట్లు ‘సాక్షి’2022 జనవరిలోనే బయటపెట్టింది.
నాడు అధికారులు కొద్దిరోజులు హడావిడి చేసి.. ఆ తర్వాత మిన్నకుండిపోయారు. ఏసీబీ విచారణ జరిపినా దోషులను తేల్చలేకపోయింది. తాజాగా విజిలెన్స్ విభాగం నాటి ఏసీబీ నివేదిక దుమ్ము దులిపింది.
లోతుగా దర్యాప్తు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నకిలీ సదరం సర్టిఫికెట్ల దందాను నాడు సాక్షి బయటపెట్టింది. ఒక్క ఇల్లందకుంట మండలంలోనే 1,086 వైకల్య పింఛన్లలో అనేకం అనుమానాస్పదంగా ఉన్నాయన్న విషయా న్ని వెలుగులోకి తెచి్చంది. దీనిపై ఆ సమయంలో డీఆర్‌డీఏ, కరీంనగర్ సివిల్ ఆసుపత్రి వర్గాలు పరస్పరం నిందించుకుని ఇద్దరు తాత్కాలిక ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించి చేతులు దులుపుకున్నారు.
ఈ అంశంపై నిర్వహించిన ఏసీబీ విచా రణ కూడా డీఆర్‌డీఏ, సివిల్ ఆసుపత్రి కనుసన్నల్లోనే జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు లో ఇంతవరకూ దోషులను తేల్చకపోవటం ఆ ఆరోపణలకు బలాన్నిచి్చంది. తాజాగా ఈ కుంభకోణంపై దృష్టిపెట్టిన విజిలెన్స్ అధికారులు.. విష యాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి దృష్టికి తీసుకెళ్లారు. ఆవిడ ఆదేశాలతో రంగంలోకి దిగి.. అనుమానాస్పద సర్టిఫికెట్లు అన్నీ 2011 నుంచి 2021 మధ్య జారీ చేసినట్లు తేల్చారు.
ఆ సర్టిఫికెట్లు జారీ చేసిన వైద్యులను ప్రశ్నించినా పెద్దగా సమాచారం రాబట్టలేకపోయారు. ఈ కుంభకోణంపై ఏసీబీ డీజీ శ్రీనివాస్‌రెడ్డి స్వయంగా దృష్టిపెట్టి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. ఇది పైకి కనిపిస్తున్నంత చిన్న కుంభకోణం కాదని అధికారులు అంటున్నారు. ఈ సర్టిఫికెట్లను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగాలు, పన్ను రాయితీలు, పింఛన్లు, ఇంజినీరింగ్, మెడికల్ సీట్లు పొందుతున్న విషయాన్ని విజిలెన్స్ గుర్తించింది. ఈ కుంభకోణంలో నిందితులను ఎవరినీ ఉపేక్షించేది లేదని ఓ ఉన్నతాధికారి సాక్షికి తెలిపారు.
భారీ నష్టమే..
నెలకు రూ.3000 పింఛనే కదా.. వాటివల్ల ఏం నష్టం అని ఈ కుంభకోణం గురించి చాలామంది అనుకుంటున్నారు. కానీ, ఇది చాలా లోతైన కుంభకోణం. ఉదాహరణకు ఇల్లందకుంట మండలంలో 1,086 వైకల్య ఆసరా పింఛన్లు ఉన్నాయి. వీరందరికీ నెలకు రూ.3000 చొప్పున పింఛన్ చెల్లిస్తే.. దాదాపు రూ. 32 లక్షల పైనే అవుతుంది. ఏడాదికి దాదాపు రూ.4 కోట్లు అవుతుంది. అలాగే బస్ పాసులు, బ్యాంకు రుణాలు, లైసెన్సులు, రిజర్వేషన్లు, ఐటీ పన్ను మినహాయింపు.. ఇలా నెలనెలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లకు కోట్లలో చిల్లు పడుతోంది.
చాలామంది వ్యాపా రులు దివ్యాంగులమని సర్టిఫికెట్లు తీసుకుని ఏటా రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ఆదాయ పు పన్ను మినహాయింపు పొందుతున్నారు. ప్రభు త్వ ఉద్యోగులు బదిలీలు, పదోన్నతుల్లో వీటిని అడ్డం పెట్టుకుని కోరుకున్న చోట పోస్టింగులు పొందుతున్నారు. దీంతో ఎంతలేదన్నా.. ఒక్క నకిలీ సర్టిఫికెట్‌తో నెలనెలా సుమారు రూ.20 వేల వరకు లబ్ధి పొందవచ్చని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.
ఇప్పుడున్న నకిలీ సదరం సర్టిఫికెట్లలోనూ అధికభాగం చెవిటి సమస్య ఉన్నవారే కావడం గమనార్హం. ఇతర వైకల్యాలైతే ఆ సమస్య ఉన్నట్లు బయటకు నటించాల్సి ఉంటుంది. చెవుడు సమస్య అయితే.. పెద్దగా నటించాల్సిన అవసరం ఉండదు. అందుకే చాలామంది వాటినే తీసుకొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment