నకిలీ ఆడియో, వీడియో, ఫొటోలు సృష్టించి సైబర్ నేరగాళ్ల ఆగడాలు
సోషల్ మీడియాలో పెట్టే ఫొటోలే వారికి వనరు
కొన్ని కిటుకులతో డీప్ ఫేక్‌ను గుర్తించవచ్చంటున్న నిపుణులు
మీరు చెప్పనిది చెప్పినట్టుగా.. అనని మాటలు అన్నట్టుగా.. చెయ్యని పనులు చేసినట్టుగా.. ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని మీరు నమ్మలేనంతగా మాయ చేసి ఏమార్చే డీప్ ఫేక్ కాలం నడుస్తోంది. ఈ టెక్నాలజీని గతంలో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులను బద్నాం చేసేందుకే అధికంగా వినియోగించగా.. ఇప్పుడది సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి కూడా వెళ్లింది.
మీరు మీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ‘ఎక్స్’ వంటి సోషల్ మీడియా అకౌంట్లలో పంచుకునే ఒకే ఒక్క హై రిజల్యూషన్ ఫొటో ఉంటే చాలు.. సైబర్ నేరగాళ్లు మీకు సంబంధించి ఏ డీప్ ఫేక్‌నైనా సృష్టించగలరని పేర్కొంటున్నారు. - సాక్షి, హైదరాబాద్
డీప్ ఫేక్‌లో ఏమేం చేయవచ్చు?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ వాడి డీప్ ఫేక్ వీడియోలు, ఆడియోలు, ఫొటోలు సృష్టించవచ్చు. సాంకేతికంగా చెప్పాలంటే డీప్ ఫేక్‌లో ఫేస్ స్వాపింగ్, వాయిస్ క్లోనింగ్, లిప్ సింక్రనైజింగ్, ఎమోషనల్ మ్యానుపులేషన్, ఆడియో డీప్ ఫేక్ వంటివి చేయవచ్చు.
ఒరిజినల్ వాయిస్‌లోంచి మనకు కావాల్సిన పదాలను ఎంపిక చేసుకుని వాటి నుంచి ఫేక్ కంటెంట్‌ను స్పీచ్ సింథసిస్ చేసే వీలు కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. అమాయకులను మోసగించేందుకు సైబర్ నేరగాళ్లు ఈ డీప్ ఫేక్‌ను అస్త్రంగా మార్చుకుంటున్నారు.
సోషల్‌మీడియాలోఅతి వద్దు
ఫేస్‌బుక్, ‘ఎక్స్’, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలపై కొందరు అవసరానికి మించి వ్యక్తిగత, ఫొటోలు, వీడియోలను పంచుకుంటారు. ఇలా చేస్తే సైబర్ నేరగాళ్లకు అవకాశం ఇచ్చినట్టేనని నిపుణులు చెబుతున్నారు.
ఇలా మనం పెట్టే ఫొటోలు, వీడియోలను వాడుకుని డీప్ ఫేక్ చేసేందుకు అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా యాప్‌లు వాడే విష యంలో ప్రైవసీ సెట్టింగ్స్‌ను మరవొద్దని సూచిస్తున్నారు. మనం పెట్టే ఫొటోలు, వీడియోలు మన కాంటాక్ట్ లిస్ట్‌లోనివారే చూసేలా సెట్టింగ్స్ అప్‌డేట్ చేసుకోవడం మంచిదని చెబుతున్నారు.
డీప్ ఫేక్‌నుఎలా గుర్తించవచ్చు?
» డీప్ ఫేక్ వీడియోను గుర్తించేందుకుఅందులోని వ్యక్తుల ముఖ కవళికలను నిశితంగా పరిశీలించాలి. అసహజంగా కళ్లు ఆర్పుతున్నట్టుగా ఉన్నా, సహజపరిస్థితులకు భిన్నంగా ముఖంపై వచ్చే లైటింగ్‌లో తేడాలు ఉన్నాఅది డీప్ ఫేక్ అని గుర్తించాలి.
»శరీర కదలికల్లో అకస్మాత్తుగాతేడాలు ఉన్నా అనుమానించాలి.
»ఆడియోలో పెదాల కదలికలు సరిగానే అనిపిస్తున్నా..కొన్ని పదాలు వెనుక,ముందు అవుతుండడం గమనించవచ్చు.
»డీప్ ఫేక్ ఆడియోల్లో నిశితంగా గమనిస్తే.. వాయిస్ మాడ్యులేషన్‌లో తేడాలను, ఆడియో క్వాలిటీలో తేడాలను
గుర్తించవచ్చు.
» డీప్ ఫేక్ ఇమేజ్‌లలో చివరలు బ్లర్‌అయినట్టుగా ఉంటాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో తేడాలు, వెలుతురులో తేడాలు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment