అనంతపురం : టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్పై వైఎస్ఆర్ సీపీ నేత వై.విశ్వేశ్వరరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించే స్థాయి పయ్యావుల కేశవ్కు లేదని అన్నారు. కేశవ్కు చేతనైతే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ధర్నా చేసి సమైక్యాంధ్రకు మద్దతుగా లేఖ ఇప్పించాలి సవాల్ విసిరారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం పాటిస్తూ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై రాష్ట్రాన్ని విభజిస్తున్నారని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు.