Y.Visweswara Reddy
-
సీమపై వివక్షకు గుణపాఠం తప్పదు
అనంతపురం టౌన్: అభివృద్ధి మొత్తాన్ని ఒకే చోట కేంద్రీకృతం చేస్తూ రాయలసీమ పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. గుంతకల్‌ను రైల్వే జోన్‌గా ప్రకటించాలని రాయలసీమ విమోచన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన 48గంటల నిరాహార దీక్షను ఆయన నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో రాయలసీమ అభివృద్ధికి చేసింది శూన్యం అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చలువతోనే రాయలసీమలో హంద్రీ నీవా నీరు పారుతోందని గుర్తు చేశారు. మొదటి దశలో 95శాతం పనులను గత ప్రభుత్వంలోనే పూర్తి కాగా మిగిలిన 5శాతం పనులను టీడీపీ ప్రభుత్వం పూర్తి చేసి నీళ్లు తామే తీసుకువచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు కేంద్రం రూ.50కోట్లు కేటాయిస్తే వాటిని సైతం వినియోగించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. అభివృద్ధి మొత్తాన్ని ఒకే చోట కేంద్రీకృతం చేయరాదని శివరామకృష్ణన్, శ్రీకృష్ణ కమిటీలు స్పష్టమైన నివేదిక ప్రభుత్వానికి ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోతోందన్నారు. గతంలోనే అసెంబ్లీలో సైతం రాయలసీమ వెనుకబాటుపై స్పీకర్‌కు నోటీసులు ఇచ్చి ప్రస్తావించామని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పోరాట ఫలితంగా హంద్రీనీవా, గాలేరు, తెలుగు గంగ ప్రాజెక్టులను నిర్మిస్తామని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రకటించారన్నారు. ఏటా జిల్లాలో కరువు మండలాలను ప్రకటించడమే తప్పా వాటి అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అమరావతి, పట్టిసీమపై ఉన్న ప్రేమ రాయలసీమపై లేదన్నారు. ఇదే దోరణిలో వ్యవహరిస్తే రాయలసీమ వాసులు గణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాయలసీమ అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. జలసాధన సమితి నాయకులు దశరథరామిరెడ్డి, రామ్‌కుమార్, రాయలసీమ వియోచన సమితి నాయకులు రాజశేఖర్‌రెడ్డి, రాజేంద్ర, సీమకృష్ణతోపాటు పలువురు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అరెస్ట్
అనంతపురం: ప్రజా సమస్యలపై గళమెత్తిన ప్రతిపక్ష నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సాగునీటి కోసం ఆందోళనకు దిగిన ఉవరకొండ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉరవకొండ సాగునీటి పథకాన్ని తక్షణమే ప్రారంభించాలన్న డిమాండ్‌తో వీరిద్దరూ అనంతపురం ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం, అధికారులు హామీయిచ్చే వరకు ఆందోళన కొనసాగించేందుకు సిద్ధపడ్డారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు అడ్డుతగిలారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ప్రాంగణం హోరెత్తింది. కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనను చేస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం దారుణమని వైఎస్సార్ సీపీ నాయకులు మండిపడ్డారు. -
ఎమ్మెల్యే రోజాపై కక్ష సాధింపు కుట్రలు
విజయవాడ: ఎమ్మెల్యే రోజాపై టీడీపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మరో ఏడాదిపాటు ఆమెపై సస్పెన్షన్ కొనసాగించాలని కుట్ర చేస్తున్నారని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. మహిళా సమస్యలపై రోజా రాజీలేని పోరాటం చేస్తున్నారని, ఆమెను ఎదుర్కొనే ధైర్యం లేకనే ...గొంతు నొక్కాలని చూస్తున్నారని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రోజా మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పలేదని అని ప్రివిలేజ్ కమిటీ ఎలా నిర్ణయానికి వస్తుందని ఆయన అడిగారు. ప్రివిలేజ్ కమిటీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విచారకరమని, ఇలాంటి చర్యల వల్ల కమిటీ పై గౌరవం తుగ్గుతోందని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అనితను తన వ్యాఖ్యలు బాధించి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని రోజా తెలిపారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రోజా సస్పెన్షన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విశ్వేశ్వరరెడ్డి సూచించారు. అలాగే అసెంబ్లీ స్పీకర్ అనుమతి లేకుండా వీడియోలు విడుదల చేసినవారిపై ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎమ్మెల్యే రోజా అనని మాటలను అన్నట్లుగా మార్పులు చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారన్నారు. ఆ వీడియో ఫుటేజ్‌లను ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు...టీడీపీ కార్యాలయంలో విడుదల చేశారని, ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. అయితే వాటితో తనకు సంబంధం లేదని, తాను ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పీకర్ దానిపై విచారణకు ఆదేశించారన్నారు. అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ఇచ్చిన వీడియోకు... ఆ వీడియోకు ఎలాంటి సంబంధం లేదన్నారు. వాళ్లు ఆరోపిస్తున్న క్లిప్పింగ్స్ అందులో లేవనే విషయం స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. రోజాపై దుష్ప్రచారం చేయడానికి కుట్ర పన్నుతున్నారని, అలాంటి పరిణామం శాసనసభ గౌరవానికి మంచిది కాదన్నారు. టీడీపీ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. -
'నంద్యాల సీటు వైఎస్సార్ సీపీదే'
-
'నంద్యాల సీటు వైఎస్సార్ సీపీదే'
అమరావతి: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణం బాధాకరమని వైఎస్సార్ సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. రెండేళ్లలో వ్యవధిలో శోభా నాగిరెడ్డి, ఆమె భర్త మరణించడం కలచివేసిందని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. భూమా కుటుంబం పడుతున్న బాధలో పాలుపంచుకుంటామని చెప్పారు. అసెంబ్లీలో సంతాపం పేరిట వైఎస్ జగన్ ను, వైఎస్సార్ సీపీని విమర్శించి వివాదస్పదం చేశారని తెలిపారు. తమ పార్టీకి భూమా అందించిన సేవల పట్ల గౌరవం ఉంది కాబట్టే ఏ కుటుంబాన్ని ఆదరించని విధంగా జగన్ ఆదరించారని గుర్తు చేశారు. భూమా కుటుంబానికి మూడు అసెంబ్లీ స్థానాలు కేటాయించారని, నాగిరెడ్డికి పీఏసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారని తెలిపారు. శోభా నాగిరెడ్డి మరణించినప్పుడు జగన్, వారి కుటుంబం అందరికంటే ఎక్కువ బాధ పడిందని గుర్తు చేశారు. ఏ సంస్కారంతో చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు. ఏ సంస్కారం ఉందని ఫిరాయింపు ఎమ్మెల్యేలతో జగన్ పై విమర్శలు చేయిస్తున్నారని నిలదీశారు. నైతికత గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు, టీడీపీకి లేదన్నారు. ఫిరాయింపులపై హైకోర్టు, స్పీకర్ దగ్గర పోరాటం చేస్తున్నామని తెలిపారు. నంద్యాల సీటు వైఎస్సార్ సీపీదేనని విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. -
చినరాజప్ప వ్యాఖ్యలు దారుణం..
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అనంతపురం కరవును ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటుందనిఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వర్ రెడ్డి, చాంద్‌బాషా మండిపడ్డారు. శుక్రవారమిక్కడ వారిక్కడ మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయ కూలీల వలసలు చంద్రబాబుకు పట్టవా అని సూటిగా ప్రశ్నించారు. అనంత కరవును జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విలాసాల కోసమే రైతులు, కూలీలు వలస వెళుతున్నారని డిప్యూటీ సీఎం చినరాజప్ప వ్యాఖ్యానించడం దారుణమన్నారు. కరవు రైతులపై స్పందిచకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వర్ రెడ్డి, చాంద్‌బాషా హెచ్చరించారు. -
'చిచ్చు పెట్టాలనుకోవడం చంద్రబాబు మూర్ఖత్వం'
అనంతపురం: అవినీతి కేసులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాలనుకోవడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూర్ఖత్వమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఓటుకు కోట్టు వ్యవహారంపై సీఎం నైతిక బాధ్యతగా పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలుంటే వెంటనే బయట పెట్టాలన్నారు. చంద్రబాబుకు నోటీసులు ఇచ్చే అధికారం ఏసీబీకి ఉందని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను బ్లాక్ మెయిల్ చేసేందుకే ఏపీలో 87 కేసులు నమోదు చేశారని ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు మంట గలిపారని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. -
పెన్నహోబిలంలో ప్రొటోకాల్ వివాదం
-
పెన్నహోబిలం ఆలయంలో ప్రొటోకాల్ వివాదం
అనంతపురం: అనంతపురం జిల్లా పెన్నహోబిలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. శనివారం అక్కడ రథోత్సవం జరిగింది. స్థానిక ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి రాకుండానే ఆలయ అధికారులు రథోత్సవాన్ని ప్రారంభించారు. దీంతో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆలయ అధికారి సుధారాణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ అధికారులు టీడీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. -
లక్ష సంతకాల ఉద్యమం!
అనంతపురం: హంద్రీనీవా ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కోరుతూ కూడేరు, విడపనకల్లు మండల కేంద్రాలలో లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. హంద్రీనీవాపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిద్ర చేయడం కేవలం ఫొటోలకు ఫోజులు ఇవ్వడానికేనని ఆయన విమర్శించారు. అనంత జీవనాడి హంద్రీనీవాను వెంటనే పూర్తి చేయాలని విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. -
చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే...
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉరవకొండ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ-బీజేపీ పదేపదే చెప్పాయని వై.విశ్వేశ్వరరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్రంలో భాగస్వామ్య పక్షం అయినా.. రాష్ట్రానికి న్యాయం చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. స్వప్రయోజనాల కోసమే తప్ప... రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు పని చేయటం లేదని వ్యాఖ్యానించారు. కాగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏమీ ఉండబోదని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం పరోక్షంగా తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా కేటగిరీ కలిగిన రాష్ట్రాలకూ తాజా బడ్జెట్లో ప్రత్యేక ప్రణాళిక సాయం (ఎస్పీఏ) కేటాయించలేదని కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి ఇందర్జిత్ సింగ్ నిన్న లోక్ సభలో స్పష్టం చేశారు. అంటే ఇకపై స్పెషల్ కేటగిరీ స్టేటస్ హోదా రాష్ట్రాలకు ఇప్పటివరకు ఉన్న ప్రయోజనాలేవీ ఉండవని పరోక్షంగా చెప్పారు. -
'చంద్రబాబు నాయుడు విఫలమయ్యారు'
అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉరవకొండ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అభివృద్ధిలో చంద్రబాబు విఫలమయ్యారని, నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యేలకు నిధులు విడుదల చేయటం లేదని ఆయన బుధవారమిక్కడ విమర్శించారు. ఉరవకొండను మున్సిపాలిటీ చేయకపోవడం వల్లే అభివృద్ధికి దూరంగా ఉందని వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. -
'చంద్రబాబు ఇచ్చిన మాట తప్పారు'
-
'చంద్రబాబు ఇచ్చిన మాట తప్పారు'
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట తప్పారని అనంతపురం జిల్లా ఉరవకొండ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. సభ పదినిమిషాలు వాయిదా అనంతరం వై.విశ్వేశ్వరరెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీలపై ఇప్పుడు తుంగలోకి తొక్కారన్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ విషయంలో ప్రభుత్వం నిస్సిగ్గుగా మాటమార్చుతోందన్నారు. 'అనంతపురం జిల్లాను దత్తత తీసుకుంటాం. అనంత జిల్లావాసులకు బిడ్డగా ఉంటా. రైతులను ఆదుకుంటాం' అని హామీలను చంద్రబాబు గుప్పించారన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ల గురించి అడిగితే గత ప్రభుత్వాలు చెప్పినవి మాకు సంబంధం లేదని ప్రభుత్వం చెబుతుందన్నారు. పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ మేము ఇవ్వం అని ప్రభుత్వం... బహిరంగం చెప్పాలని వై.విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. కరువు రైతుల్ని ఆదుకునే పద్దతి ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. -
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం
కూడేరు: ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తామని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ‘రైతు భరోసా యాత్ర’లో భాగంగా ఈ నెల 24న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండలంలోని అంతరగంగకు విచ్చేసే అవకాశాలు ఉండడంతో ఆయన బస కోసం ఏర్పాట్లను పరిశీలించేందుకు ఎమ్మెల్యే విచ్చేశారు. తొలుత కూడేరులోని షిర్డిసాయిబాబా నిర్మాణ కర్త శివరామిరెడ్డి గృహాన్ని, కమ్మూరు వద్ద ఉన్న అగ్రిగోల్డ్ గృహాన్ని, హాల్‌ను ఎమ్మెల్యే పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అప్పుల బాధ తాళ లేక జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి, కు టుంబ సభ్యలకు భరోసా కల్పిం చేందుకు పార్టీ అధ్యక్షుడు రైతు భరోసా యాత్ర కార్యక్రమాన్ని చేపడుతున్నారన్నారు. రైతుల బాధలను అసెంబ్లీలో వినిపించి ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన బాటపడతామన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు కడదరగుంట హీరో రామాంజనేయులు, మాదన్న, రాకెట్ల అశోక్, ఆనంద్ రెడ్డి ,మస్తాన్‌తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. -
'వైఎస్సార్ విగ్రహం ధ్వంసంపై ఎస్పీకి ఫిర్యాదు'
అనంతపురం: కనగానపల్లి మండలం తగరకుంట గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసం చేసిన ఘటనపై వైఎస్సార్సీపీ నాయకులు వై.విశ్వేశ్వర రెడ్డి, అనంతవెంకట రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాశ రెడ్డి, శంకర్ నారాయణ తదితరులు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా నేతలు విజ్ఞప్తి చేశారు. -
కాంట్రాక్టు కార్మికుల పట్ల సర్కార్ తీరు దారుణం
హైదరాబాద్ : కాంట్రాక్టు కార్మికుల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా సేవలందిస్తున్నా.... వారిని కాంట్రాక్ట్ సేవలకే పరిమితం చేయడం దారుణమన్నారు. న్యాయబద్ధమైన వేతనాల కోసం ఆందోళనలు, నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. అసెంబ్లీ విరామ సమయంలో మీడియాతో మాట్లాడిన విశ్వేశ్వరరెడ్డి....కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై చంద్రబాబును నిలదీశారు. -
రైతుల చెవిలో సీఎం పూలు పెడుతున్నారు..
ఉరవకొండ: కరువుతో కునారిల్లుతున్న జిల్లా రైతాంగాన్ని రైతుల్ని ఆదుకుంటామంటూ సీఎం చంద్రబాబు నాయుుడు రైతుల చెవిలో పూలు పెడుతున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వుంగళవారం స్థానిక ఆర్టీసీ డిపో ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో ఆయన వూట్లాడారు. సోవువారం జరిగిన సీఎం పర్యటన పై ఎన్నో ఆశలు ఉండేవని, కానీ ఆయన ఉపన్యాసంలో రైతులను ఆదుకునే ఒక్క వూటా మాట్లాడలేదని విమర్శించారు. నాలుగేళ్లలోపు రైతుల బ్యాంకు రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని సీఎం చెప్పడం బాధాకరమన్నారు. మొత్తానికి ఆయన పర్యటన రైతుల్లో తీవ్ర నిరాశను కలిగించిందన్నారు. ‘బ్యాంకులు మీ దగ్గరకు రాకుండా చేస్తా.. వేలం నోటీసులు ఇవ్వకుండా చర్యలు తీసుకుంటాన’ని చెప్పిన ఆయన వూటల్ని వినే పరిస్థితిలో బ్యాంకర్లు లేరన్నారు. జిల్లా రైతాంగానికి రూ.వెరుు్య కోట్ల క్రాప్ ఇన్సూరెన్స్ అందాల్సి ఉందని, దీనిపై సీఎం ఎలాంటి ప్రకటనా చేయుక పోవడం దారుణవున్నారు. వ్యవసాయు మిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు గొప్పలు చెబుతున్న ‘బాబు’ ఆ రంగ బడ్జెట్ అత్యంత పేలవంగా ప్రవేశ పెట్టారని ఆరోపించారు. సాధికారిక మిషన్లు, గ్రిడ్లు, స్మాట్ సిటీ, మోగా సిటీలకు రూ.లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని ప్రశ్నించారు. జిల్లాలో సెప్టెంబర్‌లో 4.80 లక్షల వుందికి పింఛన్లు వచ్చేవని, అక్టోబర్ నెలలో కేవలం 2.86 లక్షల వుందికి వూత్రమే పింఛన్లు ఇచ్చారని, 1.20 లక్షల వుంది లబ్ధిదారులకు కోత పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 16న ధర్నాను జయుప్రదం చేయుండి : రైతు, డ్వాక్రా, చేనేత రుణాలను వెంటనే వూఫీ చేయూలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16న వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ‘అనంత’లో తలపెట్టిన ధర్నాకు, రైతులు, వుహిళలు స్వచ్ఛందంగా తరలి వచ్చి జయుప్రదం చేయూలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంపై ఈ నెల 9న జిల్లా పార్టీ కార్యాలయుంలో రాష్ట్ర నాయుకుల ఆధ్వర్యంలో సమీక్షిస్తావున్నారు. సవూవేశంలో వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ బసవరాజు, విడపనకల్లు జెడ్పీటీసీ సభ్యుడు తిప్పయ్యు, కిసాన్ సెల్ నియోజకవర్గ నాయుకులు అశోక్, తదితరులు పాల్గొన్నారు. -
రుణమాఫీపై దశలవారీ ఉద్యమం
ఉరవకొండ / ఉరవకొండ రూరల్ : డ్వాక్రా రుణాల మాఫీ కోసం జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాలతో కలిసి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనలు చేస్తామని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. షరతులు లేకుండా రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సోవువారం ఉరవకొండ తహశీల్దార్ కార్యాలయుం ఎదుట పలువురు మహిళా సంఘాల లీడర్లు, సభ్యులు ఎమ్మెల్యే ఎదుట తమ గోడు వెల్లబోసుకుని, వినతిపత్రం సమర్పించారు. డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి.. ఇప్పుడు గ్రూప్‌కు రూ.లక్ష అని ప్రకటించి అది కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని నమ్మి తాము బ్యాంకులకు రుణాలు చెల్లించలేదన్నారు. రుణ మాఫీ ప్రక్రియ జాప్యం కావడంతో రుణాలపై వడ్డీ పెరిగిపోతోందని తమ పొదుపు ఖాతాల్లోంచి డబ్బు జమ చేసుకున్నారన్నారు. తమను నిలువునా మోసం చేశారని సీఎంపై ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే స్పందిస్తూ రూ.10 లక్షల కోట్లు వెచ్చించి సింగపూర్ తరహాలో స్మార్ట సిటీలు నిర్మిస్తామంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ర్ట వ్యాప్తంగా రూ.15 వేల కోట్ల డ్వాక్రా రుణాల మాఫీకి నిధులు లేవని చెప్పడం దారుణమని విరుచుకుపడ్డారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీపై అసెంబ్లీలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి ప్రభుత్వాన్ని గట్టిగా కోరామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వీఓఏల సమస్యల పరిష్కారం కోసం ఒత్తిడి తెస్తాం వీఓఏల సవుస్యలను ప్రభుత్వం పరిష్కరించే విధంగా ఒత్తిడి తీసుకొస్తామని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. సోవువారం తహశీల్దార్ కార్యాలయుం ఎదుట రిలేదీక్ష చేస్తున్న వీఓఏలను ఆయన కలిసి సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో మహిళా సంఘాలు, వీఓఏల వ్యవస్థ నిర్వీర్యంగా మారిందన్నారు. 15 నెలలుగా జీతాలు అందకపోవడంతో వీఓఏల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. జీఓ ప్రకారం సెర్ప వారు నెలకు రూ.2 వేలు ఇవ్వడానికి కూడా నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ఈ సమస్యపై అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రవుంలో జెడ్పీటీసీ సభ్యుడు తిప్పయ్యు, ఉప సర్పంచ్ జిలకర మోహన్, వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ బసవరాజు పాల్గొన్నారు. -
రుణమాఫీపై సర్కారు మాయ
బెళుగుప్ప : తెలుగుదేశం ప్రభుత్వం రుణ మా ఫీపై రైతులను మాయ చేస్తోందని ఎమ్మె ల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన బెళుగుప్పలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీనివాస కల్యాణమంట పంలో సర్పంచ్ రామేశ్వరరెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు శివలింగప్ప, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ దుద్దేకుంట రామాంజనేయులు తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో రైతులకు రూ.5000 కోట్ల రుణాలు ఉన్నాయన్నారు. ఇవన్నీ మాఫీ అవుతాయన్న ఆశ తో వారు ఎదురు చూస్తున్నారన్నారు. అయితే ప్రస్తుత ం ప్రభుత్వం చెబుతున్న నిబంధనల మేరకు రూ. 1200 కోట్లు మాత్రమే మాఫీ అవుతాయని అన్నారు. అనంతపురాన్ని రెండవ రాజధాని ఏర్పా టు చేసే విషయం, పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, కొత్త రుణాలు, డ్వాక్రా రుణా లు మాఫీ పక్కనపెట్టి రాజధాని నిర్మాణం కోసం అంటూ విరాళాల రూపంలో రూ.కోట్లు తీసుకెళ్లారని సీఎం చంద్రబాబునాయుడును విమర్శించారు. జిల్లాకు గత ఏడాదికి వచ్చిన రూ.678 కోట్ల ఇన్పుట్ సబ్సిడీలో కేంద్రం వాటా 57 శాతం ఇప్పటికే ఇవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను రైతుల ఖాతాలకు జమ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నా రు. ఖరీప్ సమయం పూర్తవుతున్నా రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయకుం డా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఈ సమస్యలపై తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సారధ్యంలో అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రజల కు మద్దతుగా ఉండి ఎన్నికల హామీలు అమలు చేసేవరకు పోరాడుమని తెలిపా రు. కార్యక్రమంలో డీసీసీబీ డెరైక్టర్ లాల్యానాయక్, పార్టీ జిల్లా అధికార ప్రతి నిది వీరన్న, సర్పంచ్‌లు అనిత, గోవిం దప్ప, ఎర్రిస్వామి, ఎంపీటీసీ సభ్యులు వెంకటేశులు, సాలాబాయి, పార్టీ మండ ల మహిళా కన్వీనర్ యశోదమ్మ, సీనియ ర్ నాయకులు జక్కన్నగారి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ఎర్రిస్వామి, మాజీ సర్పం చ్ నక్కలపల్లి భాస్కర్‌రెడ్డి, పురుషోత్తం రాజు, లక్ష్మన్న, చౌదరి, నరిగన్న తదితరులు పాల్గొన్నారు. -
''చంద్రబాబు శ్వేతపత్రాలంటే ప్రజలకు భయం''
-
చంద్రబాబు శ్వేతపత్రాలు, విజన్లంటే ప్రజలకు భయం
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేత పత్రాలన్నా, విజన్ డాక్యుమెంట్లన్నా ఈ రాష్ట్ర ప్రజలకు చాలా భయం అని వైఎస్ఆర్ సిపి ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ గతంలో చంద్రబాబు ఇలాంటి పత్రాలు విడుదలచేసినప్పుడు కొత్త పన్నులు వేసేవారని, ప్రపంచ బ్యాంకు షరతులను అమలుచేసేవారని చెప్పారు. చంద్రబాబు విజన్ 2020 పెద్ద బోగస్ అని కొట్టిపారేశారు. వీటన్నింటి పేరుపై సంక్షేమ కార్యక్రమాలను కుదించే ప్రయత్నాన్ని ఆయన చేస్తారన్న అనుమానం ఆయన వ్యక్తం చేశారు. విజన్ డ్యాంక్యుమెంట్ల పేరుతో మరోసారి ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, దీనికి వేరే వారు కారణమని చంద్రబాబు చెప్తున్నారని విమర్శించారు. 30 సంవత్సరాలుగా ఆయన వివిధ హోదాల్లో ఉన్నారని, అలాంటి చంద్రబాబు తన ముందు ఏదో కొత్త పరిస్థితి ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రుణమాఫీ అమలును కూడా నీరుగారుస్తారనే అనుమానం తమకు ఉందన్నారు. ఈ హామీలు ఇచ్చినప్పుడు ఆయనకు రాష్ట్ర పరిస్థితులు తెలియనివికావన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో రైతులు అప్పుల్లో కూరుకుపోయారని గుర్తు చేశారు. ఆయన వైఎస్సార్సీపీని నిందించడం మానుకొని, చిత్తశుద్ధితో పనిచేయాలని విశ్వేశ్వర్‌రెడ్డి సలహా ఇచ్చారు. -
'జగన్‌ను ప్రశ్నించే స్థాయి కేశవ్‌కు లేదు'
అనంతపురం : టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌పై వైఎస్ఆర్ సీపీ నేత వై.విశ్వేశ్వరరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించే స్థాయి పయ్యావుల కేశవ్‌కు లేదని అన్నారు. కేశవ్‌కు చేతనైతే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ధర్నా చేసి సమైక్యాంధ్రకు మద్దతుగా లేఖ ఇప్పించాలి సవాల్ విసిరారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం పాటిస్తూ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై రాష్ట్రాన్ని విభజిస్తున్నారని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. -
'కాంగ్రెస్ నిర్ణయాన్ని సీఎం తెలివిగా అమలు చేస్తున్నారు'
అనంతపురం: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ నిర్ణయాన్ని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలివిగా అమలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ సీఈసీ మెంబరు వై. విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానానికి వంత పాడుతూనే సమైక్యంధ్రా ముసుగు వేసుకున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నాలుగు కళ్ల సిద్దాంతంతో ముందుకు వెళుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డిని ఎదుర్కొలేకే కాంగ్రెస్-టీడీపీలు కుట్రలు చేస్తున్నాయన్నారు. ఈ క్రమంలోనే సీఎం కాంగ్రెస్ నిర్ణయాన్ని తెలివిగా అమలు చేస్తున్నారన్నారు. ఈ నెల 26వ తేదీన వైఎస్సార్ సీపీ తలపెట్టిన సమైక్య శంఖారావాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. సమైక్య వాదులంతా ఈ సభకు కలిసి రావాలని విశ్వేశ్వర రెడ్డి పిలుపునిచ్చారు.