ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తామని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు.
కూడేరు: ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తామని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ‘రైతు భరోసా యాత్ర’లో భాగంగా ఈ నెల 24న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మండలంలోని అంతరగంగకు విచ్చేసే అవకాశాలు ఉండడంతో ఆయన బస కోసం ఏర్పాట్లను పరిశీలించేందుకు ఎమ్మెల్యే విచ్చేశారు. తొలుత కూడేరులోని షిర్డిసాయిబాబా నిర్మాణ కర్త శివరామిరెడ్డి గృహాన్ని, కమ్మూరు వద్ద ఉన్న అగ్రిగోల్డ్ గృహాన్ని, హాల్‌ను ఎమ్మెల్యే పరిశీలించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ అప్పుల బాధ తాళ లేక జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి, కు టుంబ సభ్యలకు భరోసా కల్పిం చేందుకు పార్టీ అధ్యక్షుడు రైతు భరోసా యాత్ర కార్యక్రమాన్ని చేపడుతున్నారన్నారు. రైతుల బాధలను అసెంబ్లీలో వినిపించి ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన బాటపడతామన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు కడదరగుంట హీరో రామాంజనేయులు, మాదన్న, రాకెట్ల అశోక్, ఆనంద్ రెడ్డి ,మస్తాన్‌తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.