సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలో పలు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్నది. ఇందుకోసం వివిధ భవనాలను అధికారుల త్రిసభ్య కమిటీ పరిశీలించినట్లు తెలుస్తున్నది. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం డిసెంబర్ నుంచి విశాఖ నుంచి ప్రభుత్వ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు.
ఇందులో భాగంగా మునిసిపల్, ఆర్థికశాఖ ప్రత్యే క ప్రధాన కార్యదర్శులతో పాటు పరిపాలనశాఖ కార్యదర్శులతో కూడిన త్రిసభ్య కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ మిలీనియం టవర్స్‌తో పాటు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను పరిశీలించినట్టు సమాచారం. ప్రధానంగా మిలీనియం టవర్స్‌లో అందుబాటులో ఉన్న 2 లక్షల చదరపు అడుగుల భవనాలను అధికారుల త్రిసభ్య కమిటీ పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇక్కడే ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నట్టు గుర్తించినట్లు సమాచారం.
అదేవిధంగా గ్రే హౌండ్స్‌లో ఉన్న భవనాలనూ కమిటీ పరిశీలించింది. ఇక్కడ పోలీసుశాఖ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు అవకాశం ఉన్నట్లు ప్రాథ మికంగా నిర్ధా్దరణకు వచ్చారు. వీఎంఆర్‌డీఏ కు చెందిన వివిధ భవనాలను కూడా త్రిసభ్య కమిటీ స్వయంగా పరిశీలించింది. వీఎంఆర్‌డీకు చెందిన భవనాల్లో మునిసిపల్‌శాఖ ఉన్నతాధికారులు.. వైద్యారోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు అరిలోవలోని విమ్స్ నుంచి విధులకు హాజరయ్యే అవకాశం ఉందని త్రిసభ్య కమిటీ ప్రాథమికంగా భావించినట్టు సమాచారం. ఇక ఇక్కడకు వచ్చే అధికారులకు అవసరమైన వసతి సౌకర్యాలను మాత్రం ఆయా శాఖలే చూసుకోవాలని కమిటీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
చదవండి: రామోజీ మా సంతకాలు ఫోర్జరీ చేశారు
Comments
Please login to add a commentAdd a comment