భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట సింధు అభిమానులకు శుభవార్త చెప్పింది. తన చిరకాల ఆశయం దిశగా తొలి అడుగు వేసినట్లు తెలిపింది. విశాఖపట్నంలో తన కలల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు గురువారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
సింధు భావోద్వేగం
ఈ మేరకు.. ‘‘విశాఖపట్నంలో పీవీ సింధు సెంటర్ ఫర్ బ్యాడ్మింటన్ అండ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్‌కు పునాది పడింది. ఇది కేవలం క్రీడాకారులకు ఓ సౌకర్యం మాత్రమే కాదు. భవిష్యత్ తరాల చాంపియన్లను తీర్చిదిద్దేందుకు, భారత క్రీడారంగాన్ని అభివృద్ధి చేసేందుకు తీసుకున్న సాహసోపేత నిర్ణయం.
ఇందులో నా భాగస్వాములు, నా టీమ్ అందించిన సహకారం మరువలేనిది. భారత భవిష్య క్రీడాకారులకు స్ఫూర్తిని పంచుతూ.. వారి భవిష్యత్‌కు మార్గం వేసే ఈ గొప్ప అడుగు వేసినందుకు సంతోషంగా ఉంది’’ అని సింధు ఉద్వేగపూరిత పోస్టు పెట్టింది.
ఈ క్రమంలో సింధుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా రియో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్‌లో రజతం, టోక్యో విశ్వక్రీడల్లో కాంస్యం సాధించిన సింధు.. ప్యారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.
ఇదిలా ఉంటే.. రెండుసార్లు వరుసగా ఒలింపిక్ మెడల్స్ గెలిచిన సింధుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విశాఖపట్నంలో అకాడమీ కోసం స్థలం కేటాయించింది. ఇప్పుడు అక్కడే ఆమె తన బ్యాడ్మింటన్ సెంటర్‌కు పునాది వేసింది.
వైఎస్ జగన్ ప్రభుత్వం స్థలం కేటాయించింది: సింధు
ఈ క్రమంలో తోటగరువులో తనకు కేటాయించిన భూమిలో అకాడమీ నిర్మాణానికి పీవీ సింధు, ఆమె కుటుంబ సభ్యులు తాజాగా పూజ చేశారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. ఏడాదిలోపు అకాడమీ పనులు పూర్తయ్యేలా సన్నాహకాలు చేస్తున్నా మని తెలిపింది. గత ప్రభుత్వం తమకు అన్ని అనుమతులతో స్థలం కేటాయించిందని.. మెరికల్లాలాంటి బ్యాడ్మింటన్ ప్లేయర్లను తయారు చేసేందుకు, ఓ మంచి అకాడమీ ఏర్పాటు చేస్తామని పేర్కొంది.
చదవండి: IPL 2025 Mega Auction: కోట్లాభిషేకమే! భారత క్రికెటర్లకు జాక్‌పాట్ తగలనుందా?
Comments
Please login to add a commentAdd a comment