Badminton academy
-
టీడీపీ కబ్జాలకు చెక్ పెట్టిన పీవీ సింధు
-
శుభవార్త చెప్పిన పీవీ సింధు.. చిరకాల ఆశయానికి ముందడుగు(ఫొటోలు)
-
గుడ్‌న్యూస్ చెప్పిన పీవీ సింధు.. పునాది పడింది!
భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట సింధు అభిమానులకు శుభవార్త చెప్పింది. తన చిరకాల ఆశయం దిశగా తొలి అడుగు వేసినట్లు తెలిపింది. విశాఖపట్నంలో తన కలల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు గురువారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.సింధు భావోద్వేగంఈ మేరకు.. ‘‘విశాఖపట్నంలో పీవీ సింధు సెంటర్ ఫర్ బ్యాడ్మింటన్ అండ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్‌కు పునాది పడింది. ఇది కేవలం క్రీడాకారులకు ఓ సౌకర్యం మాత్రమే కాదు. భవిష్యత్ తరాల చాంపియన్లను తీర్చిదిద్దేందుకు, భారత క్రీడారంగాన్ని అభివృద్ధి చేసేందుకు తీసుకున్న సాహసోపేత నిర్ణయం.ఇందులో నా భాగస్వాములు, నా టీమ్ అందించిన సహకారం మరువలేనిది. భారత భవిష్య క్రీడాకారులకు స్ఫూర్తిని పంచుతూ.. వారి భవిష్యత్‌కు మార్గం వేసే ఈ గొప్ప అడుగు వేసినందుకు సంతోషంగా ఉంది’’ అని సింధు ఉద్వేగపూరిత పోస్టు పెట్టింది.ఈ క్రమంలో సింధుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా రియో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్‌లో రజతం, టోక్యో విశ్వక్రీడల్లో కాంస్యం సాధించిన సింధు.. ప్యారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. రెండుసార్లు వరుసగా ఒలింపిక్ మెడల్స్ గెలిచిన సింధుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖపట్నంలో అకాడమీ కోసం స్థలం కేటాయించింది. ఇప్పుడు అక్కడే ఆమె తన బ్యాడ్మింటన్ సెంటర్‌కు పునాది వేసింది.వైఎస్ జగన్ ప్రభుత్వం స్థలం కేటాయించింది: సింధుఈ క్రమంలో తోటగరువులో తనకు కేటాయించిన భూమిలో అకాడమీ నిర్మాణానికి పీవీ సింధు, ఆమె కుటుంబ సభ్యులు తాజాగా పూజ చేశారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. ఏడాదిలోపు అకాడమీ పనులు పూర్తయ్యేలా సన్నాహకాలు చేస్తున్నా మని తెలిపింది. గత ప్రభుత్వం తమకు అన్ని అనుమతులతో స్థలం కేటాయించిందని.. మెరికల్లాలాంటి బ్యాడ్మింటన్ ప్లేయర్లను తయారు చేసేందుకు, ఓ మంచి అకాడమీ ఏర్పాటు చేస్తామని పేర్కొంది.చదవండి: IPL 2025 Mega Auction: కోట్లాభిషేకమే! భారత క్రికెటర్లకు జాక్‌పాట్ తగలనుందా? View this post on Instagram A post shared by PV Sindhu (@pvsindhu1) -
‘మాతో పోలిస్తే అంతరం చాలా ఎక్కువ’
సాక్షి, హైదరాబాద్: భారత మహిళల బ్యాడ్మింటన్‌లో వస్తున్న కొత్త తరం ఆటగాళ్లలో దూకుడు లోపించిందని ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించే ధాటైన ఆట వారి నుంచి రావాలని ఆమె సూచించింది. సరిగ్గా చెప్పాలంటే తనతో పాటు సింధు తర్వాత వచ్చిన ప్లేయర్లు ఆశించిన ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారని సైనా చెప్పింది. ‘నిజాయితీగా చెప్పాలంటే మా ఇద్దరికీ, కొత్తగా వచ్చిన మహిళా షట్లర్లకు మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉంది. మ్యాచ్ ఆరంభం నుంచి అటాక్ చేసే మాలాంటి ప్లేయర్లు ఇప్పుడు భారత్‌కు కావాలి. త్వరలోనే మహిళల బ్యాడ్మింటన్‌లో మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నా’ అని సైనా పేర్కొంది. ‘బ్యాడ్మింటన్ ప్రోస్’ పేరుతో కొత్తగా రానున్న బ్యాడ్మింటన్ అకాడమీకి సైనా మెంటార్‌గా వ్యవహరించనుంది. మాజీ ఆటగాడు అనూప్ శ్రీధర్, విజయ్ లాన్సీ కలిసి దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొంది. ‘ప్రోస్ అకాడమీకి ప్రత్యేక కోచ్‌ల బృందం ఉంది. నాకున్న అనుభవాన్ని వారితో పంచుకునేందుకే మెంటార్‌గా పని చేయబోతున్నా. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బ్యాడ్మింటన్ అకాడమీలు రావడం సానుకూల పరిణామం’ అని సైనా పేర్కొంది. భారత షట్లర్ పారుపల్లి కశ్యప్, ప్రస్తుతం భారత టీమ్ కోచ్‌ల బృందంలో ఒకడైన గురుసాయిదత్ కూడా ఈ అకాడమీకి మెంటార్లుగా పని చేస్తారు. -
మణిపూర్ అల్లర్లలో దొరికిన ఆణిముత్యం
-
PV Sindhu: పీవీ సింధు అకాడమీకి స్థలం కేటాయింపు
ఆరిలోవ (విశాఖ తూర్పు): ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం విశాఖ నగరంలోని తోటగరువులో స్థలం కేటాయించింది. దీనికి సంబంధించిన జీవో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసింది. దీని ప్రకారం విశాఖ రూరల్ (చినగదిలి) మండల పరిధిలో 73/11, 83/5,6 సర్వే నంబర్లలో 2 ఎకరాల స్థలం కేటాయించినట్లు తహసీల్దారు ఆర్.నర్సింహమూర్తి తెలిపారు. ఈ స్థలానికి మండల సర్వేయర్‌తో ఇప్పటికే సర్వే నిర్వహించామని చెప్పారు. పీవీ సింధు నెలకొల్పే అకాడమీకి రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో స్థలం కేటాయించడం పట్ల నగర వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అకాడమీ ఏర్పాటుతో నగరం నుంచి క్రీడాకారులు తయారవడానికి మంచి అవకాశం కలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రేయసికి నటుడి విషెస్; ‘ఇది బిగినింగ్ మాత్రమే’
నటుడు విష్ణు విశాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల కొన్నేళ్లుగా రిలేషన్ షిప్లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల లాక్డౌన్ సమయంలో జ్వాల పుట్టిన రోజు సందర్భంగా ఈ జంట వివాహానికి మొదటి మెట్టుగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. తాజాగా నవంబర్ 2న (సోమవారం) గుత్తా జ్వాల రంగారెడ్డిలో జ్వాల గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్కలెన్సీని స్థాపించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రియుడు, కాబోయే భర్త విశాల్ జ్వాలకు శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్ వేదికగా..‘ వుహ్.. ఇది నీకు బిగ్ డే.. జ్వాలా గుత్తా అకాడమీ ప్రారంభమైంది. భారతదేశపు అతిపెద్ద బ్యాడ్మింటన్ అకాడమీ. జ్వాలా నన్ను క్షమించు. ఈరోజు హైదరాబాద్ రాలేక పోయాను. అందుకే నా ట్విట్టర్ స్నేహితులు, నా నుంచి నీకు శుభాకాంక్షలు చెబుతున్నాను. కానీ గుర్తుంచుకో.. ఇది బిగినింగ్ మాత్రమే..’ అంటూ ట్వీట్ చేశారు. చదవండి: జ్వాలా గుత్తా అకాడమీని ప్రారంభించిన కేటీఆర్ Wohoooo... Big day..@JwalaGuttaAcad opens today... India's biggest badminton academy...@Guttajwala 🤗🤗🤗🤗 Sorry i could not make it to hyderabad.. Sending you lots of wishes from my twitter friends and me🤗 But remember.. This is just the begining..💪💪💪 pic.twitter.com/EY7kiGLsKs — VISHNU VISHAL - stay home stay safe (@TheVishnuVishal) November 2, 2020 కాగా మొయినాబాద్‌లోని సుజాత స్కూల్లో జ్వాల గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్సలెన్సీని ఐటీ మినిస్టర్, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. 55 ఎకరాల విస్తీర్ణంలో 600ల సీటింగ్ కెపాసిటీతో 14 అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కోర్ట్స్, క్రికెట్ అకాడమీ, స్విమింగ్ పూల్, వరల్డ్ క్లాస్ జిమ్, యోగా సెంటర్లను ఏర్పాటు చేశారు. అకాడమీ కల నెరవేరిందని, హైదరాబాద్ నుంచి మరింత మంది ఒలింపియన్లను తయారు చేయడమే తన లక్ష్యమని జ్వాల గుత్తా పేర్కొన్నారు. చదవండి: విష్ణు విశాల్‌తో గుత్తా జ్వాల ఎంగేజ్మెంట్ Happy birthday @Guttajwala New start to LIFE.. Lets be positive and work towards a better future for us,Aryan,our families,friends and people around.. Need all your love n blessings guys..#newbeginnings thank you @basanthjain for arranging a ring in d middle of d night.. pic.twitter.com/FYAVQuZFjQ — VISHNU VISHAL - stay home stay safe (@TheVishnuVishal) September 7, 2020 -
‘ ఆ విషయంలో దీపిక చాలా క్రూరం’
ముంబై: లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు ఇండస్ట్రీ జనాలు. కానీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్‌లోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్, ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ చెత్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఎలెవన్ ఆన్ టెన్’ కార్యక్రమం ద్వారా అభిమానులతో ముచ్చటించారు. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలో సునీల్ చెత్రీ ‘బ్యాడ్మింటన్‌లో మీరు ఎప్పుడైనా దీపికను ఓడించారా’ అని రణ్వీర్ను ప్రశ్నించాడు. అందుకు రణ్వీర్ తాను ‘త్రీ పాయింట్ చాంపియన్’ని అని చెప్పుకొచ్చాడు. అంటే 21 పాయింట్స్ సెట్లో రణ్వీర్ కేవలం మూడు పాయింట్స్ మాత్రమే సాధించానని తెలిపాడు. అంతేకాక బ్యాడ్మింటన్ కోర్టులో దీపిక చాలా క్రూరంగా ఉంటుందని.. తనను చాలా ఇబ్బంది పెడుతుందన్నాడు రణ్వీర్. (ఆట వాయిదా) అయితే ఇక మీదట తాను బాగా కష్టపడతానని.. కనీసం 10 పాయింట్లు అయినా సాధిస్తానని అభిమానులకు ప్రామిస్ చేశాడు రణ్వీర్. ఈ లైవ్ చాట్ షోలో దీపికా పదుకొనే కూడా కొన్ని సెకన్ల పాటు కనిపించింది. అనంతరం తన భర్తను ఉద్దేశించి ‘మీ మామగారి అకాడమీలో చేరి శిక్షణ పొందు’ అంటూ కామెంట్ చేసింది. దీపిక తండ్రి ప్రకాష్ పదుకొనే బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బ్యాడ్మింటన్ కోచింగ్ సెంటర్ స్థాపించి ఔత్సాహిక క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం దీపిక, రణ్వీర్ ‘83’ చిత్రంలో కలిసి నటించారు. 1983లో భారతజట్టు మొదటిసారి క్రికెట్ వరల్డ్‌కప్ గెలిచిన మధుర సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. ఈ చిత్రానికి కబీర్‌ఖాన్ దర్శకత్వం వహించారు. ఇందులో ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ పాత్రలో నటించారు రణ్వీర్ సింగ్. అలాగే కపిల్‌దేవ్ భార్య రోమీగా నటించారు రణ్వీర్ సింగ్ భార్య దీపికాపదుకోన్. ‘83’ సినిమాను తొలుత ఏప్రిల్ 10న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటించడానికి చిత్రబృందం సన్నహాలు చేస్తుంది. (దీపికకు రణ్వీర్ భావోద్వేగ లేఖ!) -
బ్యాడ్మింటన్ అకాడమీకి ఐదెకరాలు
సాక్షి, అమరావతి/విజయవాడ స్పోర్ట్స్ : ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు శుక్రవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. పర్యాటక, యువజన వ్యవహారాల శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, తల్లిదండ్రులు పీవీ రమణ, లక్ష్మిలతో కలసి వచ్చి ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీల్లో సాధించిన స్వర్ణ పతకాన్ని ముఖ్యమంత్రికి సింధు చూపించారు. ఈ సందర్భంగా ఆమెను అభినందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. శాలువతో సత్కరించారు. అనంతరం పీవీ సింధు మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తనను అభినందించడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులోనూ ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారని చెప్పారు. విశాఖపట్నంలో ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తామని చెప్పడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పద్మభూషణ్ కోసం కేంద్రం తన పేరును సిఫారసు చేసినట్లు తెలిసిందని, ఈ విషయం చాలా సంతోషంగా ఉందని, దీనిపై ఇంకా అధికారికంగా సమాచారం రాలేదని తెలిపారు. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలి.. అనంతరం మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సింధు సాధించిన విజయం పట్ల ముఖ్యమంత్రి చాలా సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారని, రాబోయే ఒలింపిక్స్‌లో సింధు గోల్డ్ మెడల్ సాధించాలని అభిలషించారని తెలిపారు. అమ్మాయిల కోసం ఒక బ్యాడ్మింటన్ అకాడమీ ఉంటే బాగుంటుందని సింధు కోరారని, ఇందుకు విశాఖపట్నంలో ఐదు ఎకరాలను కేటాయిస్తామని ముఖ్యమంత్రి ఆమెకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. సింధుతో పాటు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, క్రీడాసంఘాల ప్రతినిధి చాముండేశ్వరనాథ్ ఉన్నారు. సింధును సత్కరించిన గవర్నర్ విజయవాడలోని రాజ్‌భవన్ దర్బార్ హాలులో సింధును గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాకుండా, భారతీయులందరికీ గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు, గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తదితరులు పాల్గొన్నారు. సింధుకు ‘శాప్’ సన్మానం రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ పీవీ సింధుతో పాటు ఆమె తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మంత్రులు ముత్తంశెట్టి, కురసాల, ఏపీ అధికార భాష సంఘం చైర్మన్ యార్లగడ్డ, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, శాప్ వీసీ అండ్ ఎండీ కాటమనేని భాస్కర్, క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శి కె. ప్రవీణ్ పాల్గొన్నారు. -
గోపీ అకాడమీకి ఐఐటీ సహకారం
కోల్‌కతా: బ్యాడ్మింటన్‌లో సాంకేతిక అంశాల్లో సహకారం అందించే విషయంలో పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ (పీజీబీఏ)తో ప్రఖ్యాత సాంకేతిక విద్యా సంస్థ ఐఐటీ ఖరగ్‌పూర్ జతకట్టింది. క్రీడాకారులకు ఇచ్చే కోచింగ్‌తో పాటు సాంకేతిక రంగాల్లో సహకారం అందించేందుకు ఈ సంస్థ సిద్ధమైంది. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఐఐటీ ఖరగ్‌పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ పీపీ చక్రవర్తి, పీజీబీఏ వ్యవస్థాపకుడు పుల్లెల గోపీచంద్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం క్రీడాకారులకు అందించే కోచింగ్‌లో వినూత్న పద్ధతులు రూపొందించే విషయంలో ఐఐటీ ఖరగ్‌పూర్ సహాయపడుతుంది. క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన కనబరిచేలా శిక్షణలో ఎలాంటి పద్ధతులు ఉపయోగించాలనే అంశాలపై కోచ్‌లకు సహకరిస్తుంది. దీనితో పాటు ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రాంగణంలో మరో స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేయనుంది. దీనిపై గోపీచంద్ స్పందిస్తూ ‘ఐఐటీ ఖరగ్‌పూర్‌లో అకాడమీ అందుబాటులోకి రానుండటం శుభపరిణామం. ఈ అకాడమీ అభివృద్ధికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తానని’ పేర్కొన్నారు. ఈ ఒప్పందంపై ప్రొఫెసర్ చక్రవర్తి హర్షం వ్యక్తం చేశారు. గోపీచంద్‌తో సమన్వయం చేసుకుంటూ బ్యాడ్మింటన్ క్రీడకు మరింత ప్రాచుర్యం తీసుకువస్తామని ఆయన అన్నారు. -
గోపీచంద్ మరో అకాడమీ
నయా రాయ్‌పూర్: బ్యాడ్మింటన్ క్రీడలో భారత్ పేరును విశ్వవ్యాప్తం చేసిన కోచ్ పుల్లెల గోపీచంద్ ఛత్తీస్‌గఢ్‌లోని నయా రాయ్‌పూర్‌లో కొత్త అకాడమీని ప్రారంభించారు. పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ వంటి ఆణిముత్యాలను తీర్చిదిద్దిన ఆయన టాటా ట్రస్ట్స్ సహాయంతో రాయ్‌పూర్‌లోని ఐటీఎం యూనివర్సిటీలో ‘పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ’ని నెలకొల్పారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ చేతుల మీదుగా ఈ అకాడమీ భూమి పూజ సోమవారం చేశారు. ఈ కార్యక్రమంలో గోపీచంద్‌తో పాటు కోచ్ సంజయ్ మిశ్రా, భారత స్టార్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, టాటా ట్రస్ట్స్ ప్రతినిధులు ఆనంద్, నీలమ్, ఐటీఎం యూనివర్సిటీ చాన్స్‌లర్ పీవీ రమణ, వైస్ చాన్స్‌లర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించనున్న ఈ అకాడమీలో అత్యాధునికమైన బ్యాడ్మింటన్ కోర్టులు, జిమ్, ఫిజియోథెరపీ న్యూట్రిషన్ ల్యాబ్, బయో మెకానిక్స్ ల్యాబ్స్‌తో పాటు కోచ్‌లు, సిబ్బందికి నివాస వసతిని ఏర్పాటు చేస్తారు. భారత జాతీయ జూనియర్ కోచ్ సంజయ్ మిశ్రా అకాడమీ బాధ్యతలను చూసుకుంటారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రమణ్ సింగ్ మాట్లాడుతూ ఛత్తీస్‌గడ్‌లో క్రీడాభివృద్ధికి గోపీచంద్ అకాడమీ దోహదపడుతుందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో క్రీడా ప్రతిభకు లోటు లేదన్న రమణ్ సింగ్ సరైన సమయంలో ఈ అకాడమీని ఏర్పాటు చేశారని అన్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలో అంతర్జాతీయ స్థాయి అకాడమీ ఉండటంతో విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి చెందుతారని అన్నారు. త్వరలోనే ఈ అకాడమీ నుంచి ప్రపంచ స్థాయి క్రీడాకారులు తయారవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రమణ్ సింగ్ మాటలతో ఏకీభవించిన కోచ్ గోపీచంద్ వచ్చే తరంలో స్టార్ ప్లేయర్లంతా ఛత్తీస్‌గఢ్ నుంచే వస్తారని అన్నారు. ఐటీఎం సహకారంతో చదువుతో పాటు సమాంతరంగా క్రీడలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాడ్మింటన్‌లో దూసుకుపోతున్న శ్రీకాంత్, ప్రణయ్ ఐటీఎం యూనివర్సిటీ బ్రాండ్ అంబాసిడర్లు కావడం విశేషం. యూనివర్సిటీలో అకాడమీ ఏర్పాటు చేయడం ఎంతోమంది విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని వారన్నారు. గోపీచంద్‌లాంటి గురువు పర్యవేక్షణలో ఐటీఎం యూనివర్సిటీ నుంచి చాంపియన్లు పుట్టుకొస్తారని విశ్వాసం కనబరిచారు. ప్రస్తుతం గోపీచంద్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌తోపాటు పశ్చిమ గోదావరిలోని తణుకు, గ్రేటర్ నోయిడా, గ్వాలియర్, వడోదరల్లో అకాడమీలు నడుస్తున్నాయి. -
మరో బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభం
దుండిగల్: హైదరాబాద్ నగరంలో వేగంగా అభివృద్ధి చెందుతోన్న బ్యాడ్మింటన్ క్రీడలో రాణించాలనుకునే వారి కోసం మరో అకాడమీ అందుబాటులోకి వచ్చింది. దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో బ్యాడ్మింటన్ అకాడమీని నెలకొల్పారు. ఇందులో భాగంగా ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ భాస్కర్బాబుతో కళాశాల యాజమాన్యం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ కోచ్‌గా భాస్కర్‌బాబు జాతీయ, రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దారన్నారు. -
మరో బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభం
హైదరాబాద్: నగరవాసులకు మరో బ్యాడ్మింటన్ అకాడమీ అందుబాటులోకి వచ్చింది. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని బొంగ్లూర్ గ్రామంలో భారత మాజీ కోచ్ బాస్కర్‌బాబు నెలకొల్పిన ‘లినింగ్ బ్యాడ్మింటన్ అకాడమీ’ సోమవారం ప్రారంభమైంది. జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, స్థానిక ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి అకాడమీని ప్రారంభించారు. ‘ప్రపంచదేశాలను తలదన్నేలా భారత క్రీడాకారులను తయారుచేసే బాధ్యత అకాడమీలపైనే ఉంది. ఈ మధ్య కాలంలో బ్యాడ్మింటన్‌లో భారత్ ఎంతో పురోగతి సాధించింది. కామన్వెల్త్, ఒలింపిక్స్ క్రీడల్లో మన ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ఒకప్పుడు చిన్న దేశాలతో పోటీకి భయపడే స్థాయి నుంచి టాప్ సీడ్ ఆటగాళ్లను నిలువరించే స్థాయికి భారత బ్యాడ్మింటన్ ఎదిగింది’ అని గోపీచంద్ హర్షం వ్యక్తం చేశారు. బాస్కర్‌బాబు అకాడమీ దేశానికి పేరు తెచ్చే క్రీడాకారులను అందించాలని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాతీయ జమ్నాస్టిక్ కోచ్ రామ్మోహన్, బీబీబీఏ చైర్మన్ భాస్కరబాబు, క్రీడాకారులు నీలిమా చౌదరి, చేతన్ అనంద్, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
హైదరాబాద్ లో మరో బ్యాడ్మింటన్ అకాడమీ!
హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో ఆటగాళ్లను తీర్చిదిద్దుతున్న భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ హైదరాబాద్ లో మరో బ్యాడ్మింటన్ అకాడమీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపాడు. సైబారాబాద్ ఏరియాలోని గచ్చిబౌలిలో తొమ్మిది కోర్టులతో కూడిన బ్యాడ్మింటన్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు తాజాగా స్సష్టం చేశాడు. వచ్చే రెండు నెలల్లోపే అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందన్నాడు. అకాడమీ ప్రారంభోత్సవానికి కేంద్ర క్రీడామంత్రి సర్బానంద్ సోనావాల్, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లను ఆహ్వానించనున్నట్లు గోపీచంద్ పేర్కొన్నాడు. వారు ఇచ్చిన సమయాన్ని బట్టి ఈ కార్యక్రమం తేదీని ఖరారు చేస్తామన్నాడు. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రస్తుతం ఉన్న బ్యాడ్మింటన్ అకాడమీలో చాలా మందికి శిక్షణ ఇచ్చినా.. రానురాను శిక్షణ తీసుకునే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతుందన్నాడు. దీనిలో భాగంగానే కొత్త అకాడమీని ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్టు పేర్కొన్నాడు. అంతకుముందు 2003లో గోపీచంద్ ఎనిమిది కోర్టులతో ఉన్న బ్యాడ్మింటన్ అకాడమీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇది ఆసియాలో ఉన్న అత్యుత్తుమ బ్యాడ్మింటన్ అకాడమీలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇదే బ్యాడ్మింటన్ అకాడమీలో పలువురు తెలుగు తేజాలు శిక్షణ తీసుకుని అంతర్జాతీయం విశేషంగా రాణిస్తున్నారు. వారిలో సైనా నెహ్వాల్, పీవీ సింధు, పారుపల్లి కశ్యప్, కిదాంబి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. -
‘మహావీర్’ భూమి లీజుకు గవర్నర్ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: మహావీర్ ఆస్పత్రి భూమి లీజుకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు. వివిధ సంస్థలకు భూముల కేటాయింపునకు సంబంధించి శనివారం గవర్నర్ వద్ద ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి, గవర్నర్ సలహాదారులు సలావుద్దీన్ అహ్మద్, ఏఎన్ రాయ్, సీనియర్ అధికారులు అజయ్ కల్లం, పీవీ రమేష్, ప్రదీప్ చంద్ర, శివ శంకర్, లక్ష్మీ పార్థసారధి, బీఆర్ మీనా తదితరులు హాజరయ్యారు. మహావీర్ ఆస్పత్రికి ఇప్పుడున్న భూమిని మరో 30 ఏళ్ల పాటు లీజుకోసం అనుమతిని ఇచ్చారు. అయితే లీజు అద్దె విషయంలో తుది నిర్ణయాన్ని కొత్త ప్రభుత్వానికి వదిలి పెట్టారు. అలాగే పుల్లెల గోపీచంద్ ఏర్పాటు చేసే బ్యాడ్మింటన్ అకాడమీకి భూ కేటాయింపునకు కూడా గవర్నర్ ఆమోదం తెలిపారు. అయితే ఈ విషయంలో పొందుపరిచే నిబంధనలపై కొత్తగా ఏర్పడే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వీటితో పాటు నెల్లూరు జిల్లాలో 4.79 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 502.30 ఎకరాలను దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించే విషయాన్ని కొత్త ప్రభుత్వానికి వదిలి పెట్టారు. కాగా రాజ్‌భవన్‌లో పనిచేయడానికి అదనపు సిబ్బంది, వారు ఉండడానికి వసతి, వాహనాలను సమకూర్చడానికి సంబంధించిన ఫైల్‌ను గవర్నర్ ఆమోదించారు. -
తణుకులో గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ
తణుకు, న్యూస్‌లైన్: అంతర్జాతీయస్థాయి బ్యాడ్మిం టన్ ఆటగాళ్లను తీర్చి దిద్దిన పుల్లెల గోపీచంద్ అకాడమీ ఇప్పుడు తొలిసారి హైదరాబాద్ బయట ఏర్పాటు కాబోతోంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు గోపీచంద్ అధికారికంగా ప్రకటించారు. చిట్టూరి సుబ్బారావు-గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీగా దీనికి పేరుపెట్టారు. ఇక్కడ అకాడమీ నిర్వహణకు అవసరమైన కోచ్‌లు, సాంకేతిక నైపుణ్యం, సహకారం తదితరాలను గోపీచంద్ అకాడమీ పర్యవేక్షిస్తుంది. ఆర్థిక పరమైన సహకారం చిట్టూరి సుబ్బారావు బ్యాడ్మింటన్ ట్రస్ట్ అందజేస్తుంది. ఇందులో ప్రధానంగా 8-10 ఏళ్ల వయసు ఉన్న చిన్నారులను ఎంపిక చేసి శిక్షణనిస్తారు. వచ్చే ఫిబ్రవరిలో సెలక్షన్స్ నిర్వహించి 25 మందిని ఎంపిక చేయనున్నారు. వచ్చే మార్చి నుంచి అకాడమీలో శిక్షణ ప్రారంభమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు కూడా బ్యాడ్మింటన్‌ను చేరువ చేసి భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించేందుకు దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు గోపీచంద్ వెల్లడించారు. -
త్వరలో జ్వాల బ్యాడ్మింటన్ అకాడమీ
న్యూఢిల్లీ: అంతా అనుకున్నట్లు జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో మరో బ్యాడ్మింటన్ అకాడమీ అందుబాటులోకి రానుంది. ప్రస్తు తం హైదరాబాద్‌లో పుల్లెల గోపీచంద్... విజయవాడలో చేతన్ ఆనంద్ ఇప్పటికే అకాడమీలు నిర్వహిస్తుండగా వారి సరసన భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ ప్లేయర్ గుత్తా జ్వాల కూడా చేరనుంది. త్వరలోనే స్వస్థలం హైదరాబాద్‌లో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు జ్వాల వెల్లడించింది. ‘నిజమే. నేను అకాడమీ నెలకొల్పే ఆలోచనలో ఉన్నాను. ఈ మేరకు ప్రభుత్వంతో చర్చిస్తున్నాను. నా ప్రతిపాదనలు వారికి పంపించాను. భారత్‌లో బ్యాడ్మింటన్ నిర్వహణతీరు చూశాకే నేను అకాడమీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాను. నా అకాడమీలో కేవలం బ్యాడ్మింటన్‌ను మాత్రమే నేర్పిస్తారు. మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూద్దాం’ అని జ్వాల వివరించింది. -
బ్యాడ్మింటన్ అకాడమీకి అవార్డు
సాక్షి, హైదరాబాద్: స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, పి.వి.సింధు, కశ్యప్‌లాంటి ప్రపంచస్థాయి ఆటగాళ్లను తయారు చేసిన ‘పుల్లెల గోపీచంద్-నిమ్మగడ్డ ఫౌండేషన్ బ్యాడ్మింటన్ అకాడమీ’కి ప్రతిష్టాత్మక ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్’ లభించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ అవార్డు ప్రైవేట్ అకాడమీకి రావడం ఇదే తొలిసారి. ఈ అకాడమీ బ్యాడ్మింటన్‌కు చేస్తున్న కృషికి మెచ్చి కేంద్ర క్రీడా శాఖ ఈ పురస్కారానికి ప్రతిపాదన చేసింది. ‘ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్’ విభాగం కింద ఈ అవార్డును ప్రకటించారు. సర్వీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఆర్థిక సహాయం), పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (క్రీడాకారులకు ఉద్యోగం, సంక్షేమం), అలహాబాద్‌లోని యూకే మిశ్రా జాతీయ స్పోర్ట్స్ అకాడమీ (కమ్యూనిటీ క్రీడల గుర్తింపు, యువ క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడం)లకు ఈ అవార్డు దక్కింది. ఈనెల 31న జరిగే కార్యక్రమంలో ఈ నాలుగు అకాడమీలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డును అందజేస్తారు. ప్రతిష్టాత్మక ఈ పురస్కారం లభించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని జాతీయ చీఫ్ కోచ్, పీజీబీఏ యజమాని గోపీచంద్ సంతోషం వ్యక్తం చేశారు. ‘మనం పడుతున్న శ్రమను ప్రభుత్వం గుర్తిస్తే చాలా ఆనందం కలుగుతుంది. మంచి పని చేయడానికి ఇది మరింత ప్రోత్సాహన్ని ఇస్తుంది. మా కోచ్‌లు, సహాయక సిబ్బంది, అకాడమీ ఉద్యోగులు కనబరుస్తున్న సమష్టి కృషికి లభించిన గుర్తింపు ఇది’ అని గోపీ వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ ప్రసాద్ సహకారంతోనే... ఈ రోజు దేశంలో అగ్రశ్రేణి షట్లర్లను తయారు చేస్తున్న బ్యాడ్మింటన్ అకాడమీకి అంకురార్పణ 2006లో జరిగింది. ఆల్‌ఇంగ్లండ్ టోర్నీ గెలిచిన గోపీచంద్‌కు ప్రభుత్వం స్థలం ఇచ్చినా... అకాడమీ నిర్మాణానికి ఆర్థిక వనరులు లేవు. దీంతో గచ్చిబౌలిలోని స్టేడియంను శాప్ దగ్గర అద్దెకు తీసుకుని అకాడమీ ప్రారంభించారు. క్రీడలపై ఆసక్తి ఉన్న పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్... చొరవ తీసుకుని అకాడమీ నిర్మాణం చేయించారు. 2007 కల్లా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నగరంలో అకాడమీ సిద్ధమైంది. నాడు ప్రసాద్, గోపీచంద్‌ల చొరవ వల్ల నేడు దేశంలో బ్యాడ్మింటన్‌కు భాగ్యనగరం కేరాఫ్ అడ్రస్‌గా మారింది.