త్వరలో జ్వాల బ్యాడ్మింటన్ అకాడమీ | Jwala Gutta to open badminton academy | Sakshi
Sakshi News home page

త్వరలో జ్వాల బ్యాడ్మింటన్ అకాడమీ

Published Sun, Dec 22 2013 3:08 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

గుత్తా జ్వాల - Sakshi

గుత్తా జ్వాల

న్యూఢిల్లీ: అంతా అనుకున్నట్లు జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో మరో బ్యాడ్మింటన్ అకాడమీ అందుబాటులోకి రానుంది. ప్రస్తు తం హైదరాబాద్‌లో పుల్లెల గోపీచంద్... విజయవాడలో చేతన్ ఆనంద్ ఇప్పటికే అకాడమీలు నిర్వహిస్తుండగా వారి సరసన భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ ప్లేయర్ గుత్తా జ్వాల కూడా చేరనుంది.
 
  త్వరలోనే స్వస్థలం హైదరాబాద్‌లో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు జ్వాల వెల్లడించింది. ‘నిజమే. నేను అకాడమీ నెలకొల్పే ఆలోచనలో ఉన్నాను. ఈ మేరకు ప్రభుత్వంతో చర్చిస్తున్నాను. నా ప్రతిపాదనలు వారికి పంపించాను. భారత్‌లో బ్యాడ్మింటన్ నిర్వహణతీరు చూశాకే నేను అకాడమీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాను. నా అకాడమీలో కేవలం బ్యాడ్మింటన్‌ను మాత్రమే నేర్పిస్తారు. మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూద్దాం’ అని జ్వాల వివరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement