జస్టిస్ టీబీ రాధాకృష్ణన్
న్యూఢిల్లీ : తెలంగాణ, ఏపీ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ నియా మకానికి కేంద్రం ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సీజేగా పనిచేస్తున్న ఆయన త్వరలోనే బాధ్యతలు చేపట్టే అవకాశముందని వెల్లడించాయి. అలాగే పట్నా హైకోర్టులో జడ్జీగా ఉన్న అజయ్ కుమార్ త్రిపాఠీని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించినట్లు పేర్కొన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే సుప్రీంకోర్టు కొలీజియం వీరి పేర్లను సిఫార్సు చేయగా, తాజాగా కేంద్రం దీనికి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు జస్టిస్ రమేశ్ రంగనాథన్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment