నటుడు విష్ణు విశాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల కొన్నేళ్లుగా రిలేషన్ షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల లాక్‌డౌన్ సమయంలో జ్వాల పుట్టిన రోజు సందర్భంగా ఈ జంట వివాహానికి మొదటి మెట్టుగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. తాజాగా నవంబర్ 2న (సోమవారం) గుత్తా జ్వాల రంగారెడ్డిలో జ్వాల గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్కలెన్సీని స్థాపించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రియుడు, కాబోయే భర్త విశాల్ జ్వాలకు శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్ వేదికగా..‘ వుహ్.. ఇది నీకు బిగ్ డే.. జ్వాలా గుత్తా అకాడమీ ప్రారంభమైంది. భారతదేశపు అతిపెద్ద బ్యాడ్మింటన్ అకాడమీ. జ్వాలా నన్ను క్షమించు. ఈరోజు హైదరాబాద్ రాలేక పోయాను. అందుకే నా ట్విట్టర్ స్నేహితులు, నా నుంచి నీకు శుభాకాంక్షలు చెబుతున్నాను. కానీ గుర్తుంచుకో.. ఇది బిగినింగ్ మాత్రమే..’ అంటూ ట్వీట్ చేశారు. చదవండి: జ్వాలా గుత్తా అకాడమీని ప్రారంభించిన కేటీఆర్
Wohoooo...
— VISHNU VISHAL - stay home stay safe (@TheVishnuVishal) November 2, 2020
Big day..@JwalaGuttaAcad opens today...
India's biggest badminton academy...@Guttajwala 🤗🤗🤗🤗
Sorry i could not make it to hyderabad..
Sending you lots of wishes from my twitter friends and me🤗
But remember..
This is just the begining..💪💪💪 pic.twitter.com/EY7kiGLsKs
కాగా మొయినాబాద్‌లోని సుజాత స్కూల్‌లో జ్వాల గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్సలెన్సీని ఐటీ మినిస్టర్, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. 55 ఎకరాల విస్తీర్ణంలో 600ల సీటింగ్ కెపాసిటీతో 14 అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కోర్ట్స్, క్రికెట్ అకాడమీ, స్విమింగ్ పూల్, వరల్డ్ క్లాస్ జిమ్, యోగా సెంటర్లను ఏర్పాటు చేశారు. అకాడమీ కల నెరవేరిందని, హైదరాబాద్ నుంచి మరింత మంది ఒలింపియన్లను తయారు చేయడమే తన లక్ష్యమని జ్వాల గుత్తా పేర్కొన్నారు. చదవండి: విష్ణు విశాల్‌తో గుత్తా జ్వాల ఎంగేజ్‌మెంట్
Happy birthday @Guttajwala
— VISHNU VISHAL - stay home stay safe (@TheVishnuVishal) September 7, 2020
New start to LIFE..
Lets be positive and work towards a better future for us,Aryan,our families,friends and people around..
Need all your love n blessings guys..#newbeginnings
thank you @basanthjain for arranging a ring in d middle of d night.. pic.twitter.com/FYAVQuZFjQ
Comments
Please login to add a commentAdd a comment