
అకాడమీకి కేటాయించిన స్థలం
ఆరిలోవ (విశాఖ తూర్పు): ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం విశాఖ నగరంలోని తోటగరువులో స్థలం కేటాయించింది. దీనికి సంబంధించిన జీవో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసింది. దీని ప్రకారం విశాఖ రూరల్ (చినగదిలి) మండల పరిధిలో 73/11, 83/5,6 సర్వే నంబర్లలో 2 ఎకరాల స్థలం కేటాయించినట్లు తహసీల్దారు ఆర్.నర్సింహమూర్తి తెలిపారు.
ఈ స్థలానికి మండల సర్వేయర్‌తో ఇప్పటికే సర్వే నిర్వహించామని చెప్పారు. పీవీ సింధు నెలకొల్పే అకాడమీకి రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో స్థలం కేటాయించడం పట్ల నగర వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అకాడమీ ఏర్పాటుతో నగరం నుంచి క్రీడాకారులు తయారవడానికి మంచి అవకాశం కలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment