ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అనంతపురం కరవును ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటుందనిఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వర్ రెడ్డి, చాంద్బాషా మండిపడ్డారు. శుక్రవారమిక్కడ వారిక్కడ మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయ కూలీల వలసలు చంద్రబాబుకు పట్టవా అని సూటిగా ప్రశ్నించారు.
అనంత కరవును జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విలాసాల కోసమే రైతులు, కూలీలు వలస వెళుతున్నారని డిప్యూటీ సీఎం చినరాజప్ప వ్యాఖ్యానించడం దారుణమన్నారు. కరవు రైతులపై స్పందిచకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వర్ రెడ్డి, చాంద్బాషా హెచ్చరించారు.