
ఇందల్వాయి/చండూరు(మునుగోడు)/సిద్దిపేట రూరల్: అప్పుల బాధలు తాళలేక ఇద్దరు రైతులు వేర్వేరు చోట్ల ఆత్మహత్య చేసుకున్నా రు. నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలం లోలం గ్రామంలో పంట ఎండిపోవడంతో గుండెపోటుతో పెద్ద గంగారాం అనే రైతు మృతిచెందాడు. గంగారాం సాగు కోసం రూ.3 లక్షల వరకు అప్పులు చేశాడు. పంట ఎండిపోవడంతో మనస్తాపానికి గురై గుండె పోటుతో మృతిచెందాడు.
నల్లగొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డకు చెందిన రైతు బోయపల్లి యాదయ్య (35) పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సాగు కోసం రూ.11 లక్షల వరకు అప్పు చేశా డు. దిగుబడులు సరిగా రాకపోవడంతో మనస్తాపానికి గురై మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలంలో తెగి పడిన విద్యుత్ వైర్లు కాలికి తగలడంతో ఓ రైతు మృతిచెందిన ఘటన సిద్దిపేట అర్బన్ మండలంలోని తడ్కపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది.