chandbasha
-
చినరాజప్ప వ్యాఖ్యలు దారుణం..
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అనంతపురం కరవును ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటుందనిఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వర్ రెడ్డి, చాంద్బాషా మండిపడ్డారు. శుక్రవారమిక్కడ వారిక్కడ మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయ కూలీల వలసలు చంద్రబాబుకు పట్టవా అని సూటిగా ప్రశ్నించారు. అనంత కరవును జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విలాసాల కోసమే రైతులు, కూలీలు వలస వెళుతున్నారని డిప్యూటీ సీఎం చినరాజప్ప వ్యాఖ్యానించడం దారుణమన్నారు. కరవు రైతులపై స్పందిచకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వర్ రెడ్డి, చాంద్బాషా హెచ్చరించారు. -
మైండ్ గేమ్ ఆడుతున్నారు..!
*చివరి వరకు వైఎస్ జగన్ వెంటే ఉంటా.. *ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే అవాస్తవాల ప్రచారం *కదిరి శాసన సభ్యుడు అత్తార్ చాంద్బాషా కదిరి : 'ఓటమిని జీర్ణించుకోలేని కొందరు నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారు. లేనిపోని కథనాలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. నేను టీడీపీలో చేరబోతున్నానంటూ మంగళవారం ఓ దినపత్రిలో కథనం ప్రచురించడం కూడా ఇందులో భాగమే. ఈ కథనం పూర్తిగా వాస్తవ విరుద్ధం’ అంటూ కదిరి శాసన సభ్యులు అత్తార్ చాంద్బాషా ఖండించారు. అత్తార్ రెసిడెన్సీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజా సేవ లక్ష్యంతో టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన తనను నమ్మి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు టికెట్ ఇచ్చారని, ప్రజలు సైతం తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించారన్నారు. వారి నమ్మకాన్ని ఎన్నటికీ వమ్ము చేయనన్నారు. రాజకీయాల్లో ఉన్నంతవరకు జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటానని, కదిరి నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేశారు. మంత్రి పదవుల కంటే వ్యక్తిత్వమే తనకు ముఖ్యమన్నారు. చేతనైతే అభివృద్ధి విషయంలో తనతో కలసిరావాలి కానీ, అవాస్తవాల ప్రచారంతో చిల్లర రాజకీయాలు చేయడం తగదన్నారు. ఇలాంటి విషయాలను పట్టించుకునేది లేదన్నారు. అందరి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ప్రస్తుతం తనముందున్న కర్తవ్యమన్నారు. -
కదిరిలో చాంద్బాషా, ఉరవకొండలో విశ్వేశ్వర్ రెడ్డి
అనంతపురం : అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలను కైవసం చేసుకుంది. కదిరిలో చాంద్ బాషా, ఉరవకొండ నుంచి విశ్వేశ్వరరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపును విజయం సాధించారు. ఇక గెలుపొందిన టీడీపీ అభ్యర్థుల వివరాలు: *అనంతపురం అర్బన్- వి.ప్రభాకర్ చౌదరి *తాడిపత్రి-జేసీ ప్రభాకర్ రెడ్డి *గుంతకల్లు-జితేందర్ గౌడ్ *కళ్యాణదుర్గం-ఉన్నం హనుమంతరాయ చౌదరి *పెనుకొండ-వీకే పార్థసారధి *హిందూపురం-బాలకృష్ణ *మడకశిర-ఈరన్న *పుట్టపర్తి-పల్లె రఘునాథ్ రెడ్డి *ధర్మవరం-వరదాపురం సూరి *రాప్తాడు-పరిటాల సునీత *అనంతపురం ఎంపీగా- జేసీ దివాకర్ రెడ్డి *హిందూపురం ఎంపీగా- నిమ్మల కిష్టప్ప