అవినీతి కేసులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాలనుకోవడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూర్ఖత్వమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు.
అనంతపురం: అవినీతి కేసులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాలనుకోవడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూర్ఖత్వమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఓటుకు కోట్టు వ్యవహారంపై సీఎం నైతిక బాధ్యతగా పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్పై ఆధారాలుంటే వెంటనే బయట పెట్టాలన్నారు. చంద్రబాబుకు నోటీసులు ఇచ్చే అధికారం ఏసీబీకి ఉందని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ను బ్లాక్ మెయిల్ చేసేందుకే ఏపీలో 87 కేసులు నమోదు చేశారని ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు మంట గలిపారని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు.