
'చంద్రబాబు నాయుడు విఫలమయ్యారు'
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉరవకొండ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉరవకొండ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అభివృద్ధిలో చంద్రబాబు విఫలమయ్యారని, నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యేలకు నిధులు విడుదల చేయటం లేదని ఆయన బుధవారమిక్కడ విమర్శించారు.
ఉరవకొండను మున్సిపాలిటీ చేయకపోవడం వల్లే అభివృద్ధికి దూరంగా ఉందని వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.