అనంతపురం, అర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి ఈనెల 6న ప్రకటించిన షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. కర్నూలు జిల్లాలో జలసిరి హారతి కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం ముచ్చుమర్రి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 2.15 గంటలకు ఉరవకొండకు చేరుకుంటారు. 2.30 గంటలకు ఇంద్రావతి అక్విడెక్టు వద్ద జలసరి హారతిలో పాల్గొంటారు.
3.05 గంటలకు ఉరవకొండ సమీపంలోని హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కెనాల్ వద్ద అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. 3.15 గంటలకు బహిరంగ సభ వేదిక వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. అనంతరం సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్‌లో పుట్టపర్తి విమానాశ్రయం.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళ్తారు.
నేడు ఉరవకొండకు సీఎం
Published Thu, Sep 7 2017 9:17 PM | Last Updated on Sat, Jul 28 2018 3:15 PM
Advertisement
Advertisement