today cm tour
-
నేడు ఉరవకొండకు సీఎం
అనంతపురం, అర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి ఈనెల 6న ప్రకటించిన షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. కర్నూలు జిల్లాలో జలసిరి హారతి కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం ముచ్చుమర్రి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 2.15 గంటలకు ఉరవకొండకు చేరుకుంటారు. 2.30 గంటలకు ఇంద్రావతి అక్విడెక్టు వద్ద జలసరి హారతిలో పాల్గొంటారు. 3.05 గంటలకు ఉరవకొండ సమీపంలోని హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ వద్ద అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. 3.15 గంటలకు బహిరంగ సభ వేదిక వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. అనంతరం సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్లో పుట్టపర్తి విమానాశ్రయం.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళ్తారు. -
నేడు జిల్లాలో సీఎం పర్యటన
అనంతపురం అర్బన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఇన్పుట్ సబ్సిడీ పంపిణీని పురస్కరించుకుని నిర్వహిస్తున్న రైతు కృతజ్ఞతా యాత్రలో ఆయన పాల్గొంటారు. ఉదయం 10.40 గంటలకు కనగానపల్లి మండలం ముక్తాపురం గ్రామం చేరుకుని అక్కడ హౌసింగ్ కాలనీని ప్రారంభిస్తారు. అనంతరం మొక్కలు నాటి కాలనీలో కల్పించిన వసతులను పరిశీలిస్తారు. లబ్ధిదారులతో మాట్లాడతారు. ఉదయం 11.15 గంటలకు బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. మధ్యాహ్నం 1.15 నుంచి 1.45 వరకు విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 1.50 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి పుట్టపర్తి విమానాశ్రయానికి.. ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లారు. -
నేడు సీఎం పర్యటన
అనంతపురం అర్బన్ : ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఉదయం పది గంటలకు రాయదుర్గం మండలం 74ఉడేగోళం గ్రామానికి చేరుకుంటారు. ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. గంగ పూజ చేస్తారు. అనంతరం విత్తనం విత్తే కార్యక్రమంలో పాల్గొంటారు. ఇటీవల ప్రకటించిన ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన చెక్కును కూడా విడుదల చేస్తారని తెలిసింది. అనంతరం అరగంట పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తరువాత జల వనరుల శాఖ అధికారులతో సమీక్షిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి వెళతారు.