నేడు సీఎం పర్యటన | today cm tour in anantapur | Sakshi
Sakshi News home page

నేడు సీఎం పర్యటన

Published Thu, Jun 8 2017 10:56 PM | Last Updated on Sat, Jul 28 2018 3:15 PM

today cm tour in anantapur

అనంతపురం అర్బన్‌ : ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఉదయం పది గంటలకు రాయదుర్గం మండలం 74ఉడేగోళం గ్రామానికి చేరుకుంటారు. ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. గంగ పూజ చేస్తారు. అనంతరం విత్తనం విత్తే కార్యక్రమంలో పాల్గొంటారు. ఇటీవల ప్రకటించిన ఇన్‌పుట్‌ సబ్సిడీకి సంబంధించిన చెక్కును కూడా విడుదల చేస్తారని తెలిసింది.  అనంతరం అరగంట పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తరువాత జల వనరుల శాఖ అధికారులతో సమీక్షిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి వెళతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement