నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణం బాధాకరమని వైఎస్సార్ సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. రెండేళ్లలో వ్యవధిలో శోభా నాగిరెడ్డి, ఆమె భర్త మరణించడం కలచివేసిందని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.