uravakonda mla
-
పయ్యావులకి ఆపదవి ఇవ్వాల్సింది: వైఎస్సార్సీపీ నేత
సాక్షి, ఉరవకొండ : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మెదటి సారి జరిగిన అసెంబ్లీ సమావేశాలు చరిత్రలో నిలిచిపోతాయని ఆ పార్టీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను దాదాపు 80 నుంచి 90 శాతం దాకా అమలుపరుస్తూ, అనేక బిల్లులను ఆమోదించారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఎన్నికల్లో ప్రజలు తమను ఎందుకు తిరస్కరించారో ఆలోచించడం మాని ఇంకా తప్పులు చేస్తున్నారని విమర్శించారు. ఇక ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పెద్ద అవినీతి తిమింగళమని హంద్రీనీవా, డ్రిప్ పథకాలు తదితర వాటిలో అవినీతికి పాల్పడి వందల కోట్ల రూపాయలు దోచుకున్నారన్నారు. చంద్రబాబు పయ్యావులకు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చే బదులు లూటీ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి దానికి చైర్మన్ చేసి ఉంటే సరిగ్గా సరిపోతుందని ఎద్దేవా చేశారు. -
చంద్రబాబుపై మండిపడ్డ విశ్వేశ్వర్ రెడ్డి
అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబుపై ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. అనంతపురంలో విలేకరులతో మాట్లాడుతూ..పార్లమెంటులో వైస్సార్సీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు కేంద్రం భయపడుతోందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై రాష్టానికి జరిగిన అన్యాయానికి ప్రధాన ముద్దాయి చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు. చంద్రబాబుకు ఏ ఎండకు ఆ గొడుగు పట్టడటం అలవాటని విమర్శించారు. మొన్నటి దాకా ప్రత్యేక ప్యాకేజీ నాటకమాడి రాజకీయ అవసరాల కోసమే ఇప్పుడు ప్రత్యేకహోదా నినాదాన్ని ఎత్తుకున్నాడని చంద్రబాబు నాయుడిపై ధ్వజమెత్తారు. -
సాగునీరిద్దామన్న ధ్యాసేదీ?
వజ్రకరూరు (ఉరవకొండ) : హంద్రీ-నీవా డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తిచేసి ఆయకట్టుకు సాగునీరు ఇద్దామన్న ధ్యాసే ప్రభుత్వానికి లేదని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. అధికార పార్టీ నేతల దృష్టంతా ప్రజాధనాన్ని ఎలా దోపిడీ చేయాలి అనే దానిపైనే ఉందని, వారికి రైతుల సంక్షేమం ఏమాత్రం పట్టడం లేదని దుయ్యబట్టారు. వజ్రకరూరు మండలం చిన్నహోతూరు సమీపంలో ఆగిపోయిన హంద్రీ - నీవా« సుజల స్రవంతి ధర్మపురి డిస్ట్రిబ్యూటరీ పనులను ఆదివారం వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. హంద్రీ - నీవా మొదటి దశ కింద ఉరవకొండ నియోజకవర్గంలోని 80 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నా, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించినా ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందన్నారు. కాలువల్లో నీరు పారుతున్నా ఆయకట్టుకు ఇవ్వకుండా రైతులను నిలువునా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది జిల్లాకు 29 టీఎంసీల మేర కృష్ణా జలాలు వచ్చాయని, అంతకుముందు 16 టీఎంసీల మేర నీరు జిల్లాకు వచ్చిందన్నారు. 2012 నుంచి కృష్ణాజలాలు వస్తున్నా ఆయకట్టుకు చుక్కనీరు అందించలేదని మండిపడ్డారు. ఆయకట్టుకు నీరిస్తే ఈ ప్రాంతంలో బంగారు పంటలు పండుతాయని, రైతులంతా బాగుపడతారని అన్నారు. గత ఆగస్టులోనే ఆయకట్టుకు నీరిస్తామని అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మపురి డిస్ట్రిబ్యూటరీ కాలువకు రూ.5 కోట్లు కేటాయిస్తే పనులు పూర్తవుతాయన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా నియోజకవర్గంలో ఒక్క ఎకరాకు కూడా సాగునీరు తీసుకురాలేనందుకు ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ సిగ్గుపడాలన్నారు. రైతులను మభ్యపెట్టేందుకు ఇప్పుడు హంద్రీ- నీవా ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామని కేశవ్ అంటున్నారన్నారు. సాగునీటిపై మాట్లాడే నైతిక హక్కు కేశవ్‌కు ఏమాత్రం లేదన్నారు. హంద్రీ- నీవా మొదటి దశకింద రెండు లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన తరువాతే ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కొర్రా వెంకటమ్మ, వైస్ ఎంపీపీ నారాయణప్ప, వైఎస్సార్సీపీ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జయేంద్రరెడ్డి, ఉస్మాన్, జిల్లాకార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, నాయకులు మన్యం ప్రకాష్, కాకర్ల నాగేశ్వరరావు, పీఏసీఎస్ డైరెక్టర్ భరత్‌రెడ్డి, విజయ్, ప్రసాద్‌రెడ్డి, పూజారి సురేష్, ఆది, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
రైతు క్షేమం పట్టని ప్రభుత్వం
- ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ మంజూరులో అన్యాయం - పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో వైఫల్యం - ఉరవకొండ ధర్నాలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ధ్వజం ఉరవకొండ : జిల్లా రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి దుయ్యబట్టారు. పంటలకు గిట్టుబాటు ధర లభించక, రుణమాఫీ కాక అన్నదాతలు ఆత్మహత్యల బాట పడుతున్నా వారిని ఆదుకోవాలన్న చిత్తశుద్ధి చంద్రబాబు ప్రభుత్వానికి ఏ కోశానా లేదన్నారు. రైతాంగ సమస్యలతో పాటు చేనేత, ఉరవకొండ పట్టణ సమస్యలపై బుధవారం స్థానిక కవితా హోటల్ సర్కిల్లో ధర్నా నిర్వహించారు. పార్టీ మండల కన్వీనర్ వెలిగొండ నరసింహులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ తీవ్ర కరువుతో అల్లాడుతున్న జిల్లా రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వకుండా సర్కారు చోద్యం చూస్తోందన్నారు. ఇన్పుట్ సబ్సిడీ రూ.1,030 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇందులో కేంద్రం వాటా రూ.500 కోట్లు విడుదల చేసినా, రాష్ట్రవాటా రూ.500 కోట్లు విడుదల చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తుండటంతో కూలీలు కేరళ, కర్ణాటక తదితర ప్రాంతాలకు వలసలు వెళుతున్నారన్నారు. తీవ్ర వర్షాభావం వల్ల భూగర్భజల మట్టం పడిపోయిందని, 75వేల బోర్లు ఎండిపోయాయని వివరించారు. పశువులకు మేత, నీరు కూడా దొరకని దయనీయ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం కరువు సహాయక చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ఇంకుడు గుంతల్లో దోపిడీ జిల్లాలోని టీడీపీ నేతలకు ఇంకుడు గుంతల తవ్వకం పనులు కాసులు కురిపిస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. మొత్తం పది లక్షల ఇంకుడు గుంతలు తవ్వాల్సి ఉండగా..ఇందులో 3.50 లక్షలు పూర్తి చేశారన్నారు. ఇంకా 7.50 లక్షలు తవ్వాల్సి ఉందని, వీటిలోనూ నిధులు కొల్లగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక జిల్లాలో రూ.1200 కోట్లతో చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టారని, ఇందులో సగానికి పైగా నిధులు స్వాహా చేశారని అన్నారు. మొక్కల పెంపకంలోనూ నిధులు దుర్వినియోగం చేశారన్నారు. ధర్నాలో వైఎస్సార్సీపీ కిసాన్‌సెల్ రాష్ట్ర కార్యదర్శులు అశోక్, తేజోనాథ్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సుశీలమ్మ, జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, ఉపసర్పంచ్ జిలకరమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
'నంద్యాల సీటు వైఎస్సార్ సీపీదే'
-
'నంద్యాల సీటు వైఎస్సార్ సీపీదే'
అమరావతి: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణం బాధాకరమని వైఎస్సార్ సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. రెండేళ్లలో వ్యవధిలో శోభా నాగిరెడ్డి, ఆమె భర్త మరణించడం కలచివేసిందని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. భూమా కుటుంబం పడుతున్న బాధలో పాలుపంచుకుంటామని చెప్పారు. అసెంబ్లీలో సంతాపం పేరిట వైఎస్ జగన్ ను, వైఎస్సార్ సీపీని విమర్శించి వివాదస్పదం చేశారని తెలిపారు. తమ పార్టీకి భూమా అందించిన సేవల పట్ల గౌరవం ఉంది కాబట్టే ఏ కుటుంబాన్ని ఆదరించని విధంగా జగన్ ఆదరించారని గుర్తు చేశారు. భూమా కుటుంబానికి మూడు అసెంబ్లీ స్థానాలు కేటాయించారని, నాగిరెడ్డికి పీఏసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారని తెలిపారు. శోభా నాగిరెడ్డి మరణించినప్పుడు జగన్, వారి కుటుంబం అందరికంటే ఎక్కువ బాధ పడిందని గుర్తు చేశారు. ఏ సంస్కారంతో చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు. ఏ సంస్కారం ఉందని ఫిరాయింపు ఎమ్మెల్యేలతో జగన్ పై విమర్శలు చేయిస్తున్నారని నిలదీశారు. నైతికత గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు, టీడీపీకి లేదన్నారు. ఫిరాయింపులపై హైకోర్టు, స్పీకర్ దగ్గర పోరాటం చేస్తున్నామని తెలిపారు. నంద్యాల సీటు వైఎస్సార్ సీపీదేనని విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. -
నీళ్లివ్వకపోతే చూస్తూ ఊరుకోవాలా..?
- కళ్ల ముందు నీళ్లున్నా దొంగగా వాడుకోవాల్సిన దుస్థితేంటి? - హంద్రీనీటిని కుప్పంకు తరలిస్తే ఉద్యమిస్తాం - ఫిబ్రవరి 6న వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఉరవకొండలో మహాధర్నా - పార్టీ శ్రేణులు, రైతులు, ప్రజలు తరలిరావాలి - ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పిలుపు వజ్రకరూరు : ‘‘ఉరవకొండ నియోజకవర్గంలోని 80 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి అనేకమార్లు విన్నవిస్తున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇంకెన్నాళ్లు చూస్తూ ఊరుకోవాలి’’ అని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. ఉరవకొండ నియోజకవర్గంలోని ఆయకట్టు రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 6వ తేదీ ఉరవకొండ పట్టణంలో వైఎస్సార్సీపీ అ«ధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మండలంలోని పీసీ.ప్యాపిలి, రాగులపాడు, పందికుంట గ్రామాల్లో ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో కలిసి మహాధర్నాను విజయవంతం చేయాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. నియోజకవర్గంలోని 80 వేల ఎకరాలకు హంద్రీనీవా కాలువ ద్వారా అధికారికంగా సాగునీరు ఇవ్వాలని రైతులతో కలిసి జలజాగరణ, ధర్నాలు, నిరాహార దీక్షలు, పంప్ హౌస్ ముట్టడి తదితర కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. అంతేకాకుండా ముఖ్యమంత్రిని కూడా నేరుగా కలిసి సమస్యను విన్నవిస్తే... మీ విధానం, మా విధానం వేరని మాట్లాడారన్నారు. ఈ ప్రాంత రైతులకు సాగునీరు ఇవ్వాలన్న చిత్తశుద్ధి సీఎంకు లేదని విమర్శించారు. ఈప్రాంత రైతులకు నీరు ఇవ్వకుండా కుప్పంకు నీరు తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నాడన్నారు. జిల్లాలో మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీరు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హంద్రీనీవా పనులు 95 శాతం పూర్తి చేస్తే మిగిలిన 5 శాతం పనులను పూర్తి చేయడంలో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 సంవత్సరాలుగా మాల్యాల నుంచి జీడిపల్లికి నీరు వస్తున్నా వాడుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. దొంగగా వాడుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. జిల్లాకు నీళ్లు వస్తున్నాయంటే అది వైఎస్సార్ పుణ్యమేనన్నారు. చంద్రబాబు సర్కార్ కేవలం చెరువులకు నీరిచ్చి అంతా తామే చేశామంటూ రైతులను మభ్యపెట్టడం సరికాదని హితవు పలికారు. 2016 ఆగస్టులో ఆయకట్టుకు నీరు ఇస్తామని చెప్పడంతో పాటు డిస్ట్రిబ్యూటరీ లను పూర్తిచేస్తామని చెప్పి ఇంతవరకు ఆ హామీని నిలబెట్టుకోలేదని ఎద్దేవా చేశారు. దీని వల్ల రైతులు నష్టపోయారన్నారు. అలాగే ఉరవకొండలో మహానేత వైఎస్ఆర్ హయాంలో కొనుగోలు చేసిన 89 ఎకరాల్లో ఇంతవరకు పేదలకు పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని చెప్పారు. దీని కోసం ఆందోళన చేసినా స్పందించలేదన్నారు. రైతులు, ప్రజలకు జరుగు తున్న అన్యాయన్ని ప్రశ్నించడానికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిబ్రవరి 6న ఉరవకొండకు వస్తున్నారని స్పష్టం చేశారు. డిస్ట్రిబ్యూటరీలు, పిల్లకాల్వలు పూర్తిచేసి వెంటనే సాగునీరు ఇవ్వాలని, గుంతకల్ బ్రాంచ్‌కాలువ ఆధునీకరణ చేపట్టాలని, ఎకరాకు కనీసం రూ.15 వేలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, చేనేత కార్మికులకు ప్రతినెలా నూలు కొనుగో లుపై రూ. 1000 సబ్సిడీ ఇవ్వాలని, రైతుల రుణమాఫీ ఓకే విడతలో ఇవ్వాలని, కూలీలు వలస వెళ్లకుండా పనులు కల్పించాలని కోరుతూ ఈ ధర్నా చేపట్టడం జరుగుతోందన్నారు. -
అధికార పార్టీ పెత్తనానికి వేదిక
- జన్మభూమి తీరుపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కూడేరు : ‘జన్మభూమి - మా ఊరు’ కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారానికి కాకుండా అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల దౌర్జన్యాలకు, ఘర్షణలకు వేదిక అయిందని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. కూడేరులో బుధవారం ‘జన్మభూమి’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ పాలనపై దుమ్మెత్తి పోశారు. అర్హత ఉన్న నిరుపేదలకు సంక్షేమ పథకాలు దక్కడం లేదని, అర్హులకు న్యాయం చేద్దామని అధికారులు భావించినా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఒత్తిడి తెచ్చి వారికి ఆ అవకాశం లేకుండా చేస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు మితిమీరిపోయాయన్నారు. జన్మభూమిలో పింఛన్ అడిగిన వికలాంగులు, రేషన్‌కార్డు అడిగిన పేదలపై దాడులకు దిగడమే అందుకు నిదర్శనమన్నారు. తమ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతిని«ధులకు లబ్ధి చేకూర్చే విధంగా నడుచుకోవాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించడం చాలా దారుణమన్నారు. పక్కాగృహాలు అరకొరగా మంజూరు చేసి, అవి కూడా టీడీపీ వారికే దక్కేలా చేస్తున్నారని విమర్శించారు. జన్మభూమి కమిటీల నియామకంతో ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు, ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోయిందని, ఈ కమిటీలతో అర్హులకు తీరని అన్యాయం జరుగుతోందని విచారం వ్యక్తం చేశారు. బాబు నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుపై ప్రజల్లో భారీ వ్యతిరేకత ఉందని, చంద్రబాబు ప్రజల ఆగ్రహానికి గురయ్యే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఆయనతోపాటు ఎంపీపీ మహేశ్వరి, జెడ్పీటీసీ నిర్మలమ్మ, వైఎస్సార్ సీపీ నాయకులు ఉన్నారు. -
పోలవరం ఘనత వైఎస్‌దే
ఉరవకొండ : దేశంలో నదుల అనుసంధానంతో కరువును తరిమికొట్టాలన్న మహోన్నత లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అనుమతులు సాధించారని, పోలవరం ఘనత ఆయనకే దక్కుతుందని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. గడప గడపకు వైఎస్ఆర్లో భాగంగా గురువారం స్థానిక గాంధీచౌక్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరానికి వైఎస్ హయాంలో 2వేల కోట్లు ఖర్చు పెడితే, చంద్రబాబు మూడేళ్లలో కేవలం కేంద్రం నుంచి నాబార్డు నిధులు రూ.1900 కోట్ల రుణాన్ని మాత్రమే తీసుకొచ్చారన్నారు. నాబార్డు రుణాన్ని తీసుకొచ్చి చంద్రబాబు ఇతర నాయకులు స్వీట్లు పంచుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. విభజన చట్టంలోని అంశాలకు ఆధారంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రజలు ఒత్తిడి మేరకు పోలవరానికి నాబార్డు రుణం మంజురైందన్నారు. ప్రభుత్వం జనవరి 2 నుంచి నిర్వహించే జన్మభూమి సభలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్‌కార్డులు, పింఛన్లు, ముఖ్యంగా ఇంటి పట్టాలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సభలను ప్రజలు బహిష్కరించడం ఖాయమన్నారు. వైఎస్ హయంలో పేదలకు 40లక్షలు ఇళ్లు నిర్మించి ఇస్తే, చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండున్నరేళ్లలో ఒక్క సెంటు స్థలం కానీ, ఇళ్లు కానీ మంజురు చేసినా పాపాన పోలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు అద్యాపకులు తమ న్యాయ పరమైన డిమాండ్ల కోసం సమ్మె చేపడుతుంటే చంద్రబాబు దుర్మార్గంగా వారిని బెదిరిస్తూ విధుల్లోకి రావాలంటూ నోటీసులు జారీ చేయడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం వెంటనే గతంలో టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టో లో వున్న కాంట్రాక్టు అద్యాపకులను రెగ్యూలర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు తిప్పయ్య, లలితమ్మ, రాష్ట్ర కార్యదర్శి బసవరాజు ఉన్నారు. -
అబద్ధాలలో చంద్రబాబు గిన్నిస్ రికార్డు
- ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు తగిని బుద్ధి చెబుతారు - విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి బూదగెవి(ఉరవకొండ) : అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు సరికొత్త గిన్నిస్‌బుక్ రికార్డు సృష్టించారని స్థానిక ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన విలేరులతో మాట్లాడారు. చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కుడా చేపట్టలేకపోయారన్నారు. దేశంలో వృద్ధి రేటు పురోగతిలో రాష్ట్రం ముందుందని అబద్ధాలు చెబుతున్నారని, క్షేత్రస్థాయిలో ఆ లెక్కల్లో ఎంతో వ్యత్యాసం ఉందని తెలిపారు. గడప గడపకూ వెళ్తున్న తమ వద్ద గ్రామీణులు ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. త్వరగా మరో అవకాశం ఇస్తే ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని తమతో చెబుతున్నారన్నారు. ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎదురవుతున్నా చంద్రబాబు మాత్రం పూటకో అబద్ధం చెబుతున్నారని పేర్కొన్నారు. వైఎస్ హయాంలో రైతులకు 100 శాతం వ్యవసాయ రుణాలు ఇచ్చారని, ప్రస్తుతం పెద్దనోట్ల రద్దు సాకుగా చూపుతూ చంద్రబాబు ఒక్క పైసా కుడా రుణాలు మంజూరు చేయలేదని విమర్శించారు. అధికారం చేపట్టినప్పటి నుంచి వందల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించిన ఆయన నీరుచెట్టు, ఇసుక మాఫియా, తాగునీటి ప్రాజెక్టుల పనుల్లో ఈ దోపిడీ సాగినట్లు తెలిపారు. నోట్ల రద్దు సమాచారాన్ని కేంద్రం నుంచి ముందుగానే అందుకున్న చంద్రబాబు తన నల్లధనాన్ని అంతా తెల్లధనంగా మార్చుకున్నారని అన్నారు. చంద్రబాబు తన అవినీతి ధనంతో రాబోవు ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నాడని, అయితే ప్రజలు దీన్ని గమనించి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు తిప్పయ్య, బసవరాజు, పార్టీ మండల, పట్టణ కన్వీనర్లు నరసింహులు, తిమ్మప్ప, నాయకులు ధనంజయలు పాల్గొన్నారు. -
ప్రభుత్వం మీనమేషాలు
వజ్రకరూరు : హంద్రీనీవా డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉరవకొండ మండల పరిధిలోని రేణుమాకులపల్లిలో గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. గ్రామంలోఇంటింటికీ వెళ్లి రైతులు, మహిళలు, యువకులు, నిరుద్యోగులు, ప్రజలను కలుసుకొని ప్రజాబ్యాలెట్‌ను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉరవకొండ ప్రాంతంలోని రేణుమాకులపల్లి, చీకలగురికి డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఆగస్టులో హంద్రీనీవా ద్వారా 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇస్తామని చెప్పి ఇంతవరకూ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. హంద్రీనీవా ద్వార ఉరవ కొండ ప్రాంతంలోని 80 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వాన్ని అనేక రోజులు డిమాండ్ చేస్తున్నా దాన్ని అమలు చేయడంలో శ్రద్ధ చూపడం లేదన్నారు. హక్కుగా ఇవ్వాల్సిన నీటి విషయంలో ప్రభుత్వం రైతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు, ఉరవకొండ , బెళుగుప్ప మండలాల్లో హంద్రీనీవా కాలువ సమీపంలో రైతులు లక్షలాది రూపాయలు వ్యయం చేసి పంటలు సాగుచేశారన్నారు. ప్రస్తుతం పంటలు మధ్యదశలో ఉన్నాయన్నారు. ఈనేపథ్యంలో రెవెన్యూ అధికారులు, హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులు రైతుల వద్దకు వెళ్లి పైపులు ,మోటార్లు వెంటనే తీసివేయాలని లేని పక్షంలో స్వాదీనం చే సుకుంటామని హెచ్చ రించడం భాదకరమన్నారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్‌లో ఈ ప్రాంతంలో నీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. రబీ సీజన్లో రైతులకు రుణాలు మంజూరు చేయాల్సి ఉన్నా ఇంత వరకు పట్టించుకోలేదన్నారు. నగదు రహితలావాదేవీలంటూ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందన్నారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. సమావేశంలో ఉపసర్పంచు పెద్ద ఆంజనేయ, మాజీ సర్పంచు వీరభద్రప్ప, వైఎస్సార్సీపీ కిసాన్‌సెల్ రాష్ట్రకార్యదర్శి రాకెట్ల అశోక్, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు, జెడ్పీటీసీ తిప్పయ్య, జిల్లా అధికార ప్రతినిధి వీరన్న , వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు ఉన్నారు. -
ప్రజాస్వామ్యం అపహాస్యం
ఉపాధి పనుల కల్పనలో నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ధ్వజం వజ్రకరూరు : ప్రజలచేత ఎన్నిౖకెన సర్పంచులను డమ్మీలను చేస్తూ గ్రామసభల నిర్వహణను జన్మభూమి కమిటీలకు అప్పగించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఉరవకొండ మండలం వ్యాసాపురంలో గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వాటన్నింటినీ పక్కనపెట్టి కలెక్టర్ల సమావేశంలో ఊకదంపుడు ఉపన్యాసాలకు ప్రాధాన్యమిచ్చారని మండిపడ్డారు. రాజ్యాంగం ద్వారా సర్పంచులకు కల్పించిన అధికారాలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా కాలరాస్తోందని విరుచుకుపడ్డారు. ఉపాధి హామీ పథకం నిధులు పుష్కలంగా ఉన్నా కూలీలకు పనులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మరుగుదొడ్ల నిర్మాణ బిల్లులు, ఇ¯ŒSపుట్ సబ్సిడీ మంజూరులో తాత్సారం చేస్తోందన్నారు. టీడీపీ పాలనలో మహిళా సంఘాలు నిర్వీర్యమైపోయాయన్నారు. కరువు ఉపశమన చర్యలు తీసుకోవడంలో దారుణంగా విఫలమైందన్నారు. ప్రభుత్వం ఒంటెత్తు పోకడలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఉరవకొండ మండల అధ్యక్షుడు వెలిగొండ నరసింహులు, జెడ్పీటీసీ తిప్పయ్య, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్రకార్యదర్శి బసవరాజు తదితరులు పాల్గొన్నారు. -
అరెస్టులతో ఆపలేరు
- సమçస్యలపై ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా? - 80 శాతం ప్రజల్లో సంతృప్తి ఉంటే 30, 144 సెక్షన్లు ఎందుకు - పోలీసులు లేకుండా పాలించగలరా! - రాష్ట్ర ప్రభుత్వంపై ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వ ఫైర్ అనంతపురం : రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంకుశ పాలన సాగిస్తున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు. ఉరవకొండలో ఆందోళన కార్యక్రమాల నేపథ్యంలో హౌస్ అరెస్టులో ఉన్న ఆయన శనివారం సాయంత్రం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఉరవకొండ పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆందోళన చేస్తే బలవంతంగా అరెస్ట్ చేశారన్నారు. ఆపై విడుదల చేసినట్లే చేసి ఇంటికి వచ్చాక హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రజల సమస్యలు తీర్చకుండా ప్రభుత్వం అహంకార పూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో కొనుగోలు చేసిన భూమిలో పేదలకు పట్టాలివ్వాలని రెండేళ్లుగా పోరాడుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ముసుగులో ప్రజల హక్కులను కాలరాస్తోందని దుయ్యబట్టారు. తమ పాలనపై 80 శాతం ప్రజలు సంతృప్తి చెందుతున్నారని ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. అదే నిజమైతే మరి రాష్ట్రమంతా 30 యాక్టు, 144 సెక్షన్ ఎందుకు అమలు చేస్తున్నారని, అంత అసాధారణ పరిస్థితి ఏమొచ్చిందని మండిపడ్డారు. పోలీసులు లేకుండా పరిపాలన సాగించే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. తీరు మార్చకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. ప్రచార యావ తప్ప.. ప్రజల సమస్యలు పట్టవు ముఖ్యమంత్రికి కేవలం ప్రచార యావ తప్ప ప్రజల సమస్యలు పట్టడం లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ విమర్శించారు. స్వయంగా ఎమ్మెల్యే పోరాటాలు చేస్తుంటే స్పందించకపోగా, అక్రమ కేసులు బనాయిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌కు ఉరవకొండ ప్రజల సమస్యలు పట్టడం లేదన్నారు. పేదల ఇళ్ల కోసం కొనుగోలు చేసిన స్థలాన్ని టీడీపీ నాయకులు కబ్జా చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ సమావేశలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డి పాల్గొన్నారు. -
నేడు రాగులపాడు లిఫ్ట్ ముట్టడి
ఉరవకొండ: హంద్రీనీవా మొదటి దశ కింద నిర్దేశించిన ఆÄýæుకట్టుకు సాగునీరు ఇవ్వాలని డివూండ్ చేస్తూ నేడు హంద్రీనీవా ఆÄýæుకట్టు సాధన సమితి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చేపట్టే రాగులపాడు లిఫ్ట్ వుుట్టడికి జిల్లా వ్యాప్తంగా ఆÄýæుకట్టు రైతులు భారీగా తరలివచ్చేందుకు సిద్ధవువ#తున్నారు. హంద్రీనీవా ఆÄýæుకట్టుకు సాగునీరు ఇవ్వాలని కోరుతూ గతంలో దీక్షలు, ధర్నాలు చేసి ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టించిన స్థానిక ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి వురోసారి సాగునీటి సాధన కోసం ఉద్యవూన్ని చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ నిరసన కార్యక్రవుంతో ప్రభుత్వం వజ్రకరూర్ వుండలం ధర్మపురి, చాబాల వద్ద గత రెండు రోజుల నుంచి డిస్ట్రిబ్యూటరీ పనులు చేపట్టడానికి సిద్ధమైంది. అయితే మొదటి దశ కింద 10 శాతం మిగిలి ఉన్న డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేసి నియోజకవర్గంలోని 80 వేల ఎకరాలకు సాగు నీరు ఇచ్చే వరకు ఉద్యవుం కొనసాగిస్తావుని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వానికి ఇది వరకే హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాలతో పోలీసుల భారీ బందోబస్తు రాగులపాడు లిఫ్ట్ వుుట్టడికి తరలి వస్తున్న రైతులను, వైఎస్సార్ సీపీ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వుుఖ్య నాÄýæుకులను బైండోవర్, హౌస్ అరెస్ట్ చేÄýæుడానికి సిద్ధమైనట్లు విశ్వసనీÄýæు సవూచారం. -
రాగులపాడు లిఫ్ట్ ముట్టడికి తరలిరండి
విడపనకల్లు/ఉరవకొండ : హంద్రీ నీవా ఆయుకట్టుకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ ఆయుకట్టు సాధన సమితి ఆధ్వర్యంలో వే లాది మంది రైతులతో కలిసి ఈ నెల 29న వజ్రకరూరు మండలంలోని రాగులపాడు లిప్్టను ముట్టడిస్తున్నామని, ఈ కార్యక్రమానికి రైతులు, రైతు కూలీలు భారీగా తరలివచ్చి విజÄýæయవంతం చేయాలని స్థానిక ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపుని చ్చారు. గురువారం మండల పరిధిలోని చీకులగురికి గ్రామం లో హంద్రీ నీవా ఆయుకట్టు సాధన సమితి సభ్యులతో కలిసి ఎమ్మెల్యే నిరసన కార్యక్రవూన్ని విజయవంతం చేయాలని విస్తృతంగా ప్రచారం చేపట్టారు. అంతకుముందు ఆయన చిన్న ముషూ్టరు గ్రామంలో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాలుగేళ్లుగా కృష్ణా జలాలు హంద్రీనీవా కాలువ ద్వారా మన ప్రాంతానికి వస్తున్నా రైతులు ఆ నీళ్లను పొలాలకు మళ్ళించుకోలేని దుస్ధితిలో ఉన్నారని అన్నారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల ఒక్క ఎకరాకు సైతం సాగు నీరు అందలేదన్నారు. ప్రభుత్వానికి కనువిప్పు కల్గించేలా రైతులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. -
ప్రజా సమస్యలు గాలికి
విడపనకల్లు: ప్రజాసమస్యల ను గాలికి వదిలే సి కృష్ణా పుష్కరాల పేరిట హంగు, ఆర్భాటాలకు మాత్ర మే ప్రాధాన్యమిస్తున్నారని ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన విడపనకల్లులో విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. రుణమాఫీ చేయకుండా మభ్యపెడుతున్నారంటూ ప్రభుత్వ తీరుపై రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు మండిపడుతున్నారన్నారు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. వాటి పరిష్కారానికి ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. ఎంతో మంది పత్తి రైతులు నాసిరకం విత్తనాలు కొనుగోలు చేసి నష్ట పోయినా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇంత వరకు ఒక్క నిరుపేదకు కూడా పక్కాగృహం నిర్మించి ఇవ్వలేదని ప్రభుత్వానికి చురకలంటించారు. -
అనంతపురం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా!
-
బాబుపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి
అనంతపురం: ఎన్నికల నేపథ్యంలో రైతులకు రుణ మాఫీ హమీపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి గురువారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. బ్యాంక్ అధికారులు రైతులు, మహిళల బంగారం, వ్యవసాయ పనిముట్లు వేలం వేస్తున్నా... సీఎం చంద్రబాబు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రుణమాఫీ చేయకపోవడంతో రైతులు, డ్వాక్రా మహిళలకు బకాయిదారులుగా మిగిలిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బంది పెట్టవద్దని వజ్రకరూర్ బ్యాంక్ అధికారులను వై. విశ్వేశ్వర్‌రెడ్డి కోరారు. -
'కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శివరామకృష్ణన్ నివేదిక మేరకే ఏపీలో అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. అనంతపురంలో స్టీల్ ఫ్యాక్టరీ, ఎయిమ్స్ తో పాటు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ సీపీ సీఈసీ సభ్యులు మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీబాగ్ ఒప్పందం మేరకు రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని అంతకుముందు వైఎస్ఆర్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కేంద్రంలో ఎయిమ్స్, ట్రి పుల్ ఐటీ, ఇండియన్ సర్వీసెస్ సెంటర్, సెంట్రల్ యూనివర్సిటీ నెలకొల్పాలన్నారు. హిందూపురం ప్రాంతంలో ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని సూచించారు. -
'మా జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వాలి'
అనంతపురం: గుంటూరు-విజయవాడ మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అనడం మంచిదికాదని ఉరవకొండ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం చేకూర్చడానికే గుంటూరు - విజయవాడ మధ్య రాజధాని ఉంటుందని టీడీపీ నేతలు ప్రకటన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నిపుణుల కమిటీ నివేదించక ముందే ఇలాంటి ప్రకటనలు చేయడం మంచి పద్దతి కాదని హితవు పలికారు. వెనుకబడిన తమ జిల్లాకు ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. -
ఉరవకొండలో విశ్వకు నీరా‘జనం’
ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే హోదాలో తొలిసారి పట్టణానికి విచ్చేసిన వై.విశ్వేశ్వరరెడ్డికి శనివారం స్థానిక ప్రజలు నీరాజనం పలికారు. ఆయన రాక కోసం పార్టీ కార్యాలయం వద్ద మధ్యాహ్నం నుంచే భారీ సంఖ్యలో జనం వేచివున్నారు. బైపాస్ రోడ్డు వద్దకు రాగానే ఘన స్వాగతం పలికారు. ఆయనతో పాటు సోదరుడు, వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు మధుసూదన్‌రెడ్డిలను భుజాలపెకైత్తుకుని ఊరేగించారు. అనంతరం విశ్వేశ్వరరెడ్డి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. వైఎస్ విగ్రహనికి పాలాభిషేకం చేశారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సుశీలమ్మ, మండల, పట్టణ కన్వీనర్లు సుంకన్న, బసవరాజు, జెడ్పీటీసీ సభ్యులు మీనుగ లలిత, సింగాడి తిప్పయ్య తదితరులు పాల్గొన్నారు.