
బాబుపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి
అనంతపురం: ఎన్నికల నేపథ్యంలో రైతులకు రుణ మాఫీ హమీపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి గురువారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. బ్యాంక్ అధికారులు రైతులు, మహిళల బంగారం, వ్యవసాయ పనిముట్లు వేలం వేస్తున్నా... సీఎం చంద్రబాబు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రుణమాఫీ చేయకపోవడంతో రైతులు, డ్వాక్రా మహిళలకు బకాయిదారులుగా మిగిలిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బంది పెట్టవద్దని వజ్రకరూర్ బ్యాంక్ అధికారులను వై. విశ్వేశ్వర్రెడ్డి కోరారు.