Y. Visweswara reddy
-
ఉరవకొండలో ఆటో కార్మికుల సంబరాలు
సాక్షి, అనంతపురం: ఆటో కార్మికుల సమస్యలు తెలుసుకుని..వారికి పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఉరవకొండలో సోమవారం విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆర్థిక సాయం అందించిన సీఎం జగన్‌కు ఆటో కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మాదిరిగా హామీలను గాలికొదిలేయకుండా ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారని తెలిపారు. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని నాలుగు నెలల్లోనే నెరవేర్చి వైఎస్ జగన్ మాట నిలబెట్టుకున్నారన్నారు. (చదవండి: నేను విన్నాను.. నేను చేశాను : సీఎం జగన్) -
పయ్యావులకి ఆపదవి ఇవ్వాల్సింది: వైఎస్సార్సీపీ నేత
సాక్షి, ఉరవకొండ : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మెదటి సారి జరిగిన అసెంబ్లీ సమావేశాలు చరిత్రలో నిలిచిపోతాయని ఆ పార్టీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను దాదాపు 80 నుంచి 90 శాతం దాకా అమలుపరుస్తూ, అనేక బిల్లులను ఆమోదించారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఎన్నికల్లో ప్రజలు తమను ఎందుకు తిరస్కరించారో ఆలోచించడం మాని ఇంకా తప్పులు చేస్తున్నారని విమర్శించారు. ఇక ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పెద్ద అవినీతి తిమింగళమని హంద్రీనీవా, డ్రిప్ పథకాలు తదితర వాటిలో అవినీతికి పాల్పడి వందల కోట్ల రూపాయలు దోచుకున్నారన్నారు. చంద్రబాబు పయ్యావులకు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చే బదులు లూటీ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి దానికి చైర్మన్ చేసి ఉంటే సరిగ్గా సరిపోతుందని ఎద్దేవా చేశారు. -
'పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలో వైఎస్ జగన్‌కు తెలుసు'
సాక్షి, ఉరవకొండ: టీడీపీ నేతలు సృష్టించే పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుసునని ఆ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు వైఖరి గాడిద, ఒంటె సామెతలా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కూడేరులో నిర్వహించిన బహిరంగసభలో ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రసంగించారు. టీడీపీ నేతలకు సవాల్ విసురుతున్నా.. మీరు ఏ విషయంలో వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చర్చకు వస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇరిగేషన్, ఎడ్యూకేషన్, ఇలా ఏ శాఖ తీసుకున్నా వైఎస్ జగన్‌తో చర్చలో పాల్గొనే సత్తా మీకుందా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ అసెంబ్లీలో అడుగు పెడితే టీడీపీ శ్రేణుల్లో వణుకు పుడుతుందన్నారు. 'గాడిద ఎలా పాట పాడుతుందో తెలుసా.. ఓండ్రు పెడుతుంది. అలాంటి గాడిద పాట విని ఒంటే తన్మయత్వంతో డ్యాన్స్ చేసిందట.. అలా ఉంది చంద్రబాబు తీరు, పరిపాలన. నాలుగేళ్లలో ఏపీలో జరిగింది అసమర్థ పాలన. నియోజకవర్గానికి నీళ్లు కూడా తీసుకురాలేని అసమర్థుడు పయ్యావుల కేశవ్. అలాంటి అసమర్థ నేత కేశవ్ నాపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. పయ్యావుల దౌర్జన్యాలకు ఎవరూ భపడొద్దు. మీకు అండగా మేం ఉంటాం. చంద్రబాబు, పయ్యావుల కేశవ్ వల్లే కూడేరుకు నీళ్లు రావడం లేదు. నీళ్ల కోసం ధర్నాలు చేస్తే నన్ను అరెస్ట్ చేయించారు. కేశవ్ ఇంట్లో అంట్లు తోమడానికి అధికారులున్నారా. ఉరవకొండ ప్రాంతాన్ని సుభిక్షం చేయాలని వేల ఎకరాలకు నీళ్లివ్వాలని దివంగత సీఎం రాజశేఖరరెడ్డి హంద్రీ నీవా జలాలను అందించగా, ప్రస్తుత సీఎం చంద్రబాబు ఏం చేశాడని ప్రశ్నిస్తున్నాను. నియోజవర్గానికి నీళ్ల కోసం ఎన్నోసార్లు ధర్నాలు చేశాం. వీధుల వెంబడి అరెస్టులు చేసినా భరించాం. అత్యల్ప వర్షపాతం కురిసే మండలం మాది. కేవలం 250 మి.మీ వర్షం కురిసే ప్రాంతాన్ని చంద్రబాబు పట్టించుకోలేదు. తాగడానికి నీళ్లులేక అలమటిస్తుంటే చంద్రబాబు సర్కార్ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇళ్లిళ్లు తిరుగుతా.. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను కలుస్తాను. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటాను. మరో ఏడాది ఆగితే వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వస్తుందని, ప్రజల ప్రభుత్వంలో రైతుల సమస్యలను వైఎస్ జగన్ తీరుస్తారని' ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తే టీడీపీకి వణుకు -
ఎన్ని ఎకరాల్లో పంటలను కాపాడారు ?
-
పుష్కర పనుల్లో రూ.కోట్ల దోపిడీ
-
పుష్కర పనుల్లో రూ.కోట్ల దోపిడీ
► పచ్చ నేతలకు నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగింత ► స్మార్ట్ పల్స్ సర్వేను వెంటనే నిలిపివేయాలి ► ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండ: రాష్ట్రంలో సాగుతున్న దోపిడి దందాకు ఉదాహరణగా కృష్ణా పుష్కర ఏర్పాట్లు నిలుస్తాయుని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. కోట్లు దోపిడి చేయుడం కోసం టెండర్లు పిలవడంలో జాప్యం చేసి నామినేషన్ పద్ధతిలో తనకు అనూకులమైన వారికి పనులను చంద్రబాబు కేటాయిస్తూ కోట్లు దోపిడి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో జరిగిన గోదావరి పుష్కరాల్లో మొదటి రోజే పుష్కారాల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమై 29 వుంది అవూయుకుల ప్రాణాలు పొట్టన పెట్టుకోవడంతో పాటు 51 వుంది గాయపడటానికి కారుకులైయ్యారు. వురోసారి అదే తరహాలో సీఎం చంద్రబాబు తానే ధర్మకర్త అన్న రీతిలో వ్యవహరిస్తారని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయూలన్న సాకుతో ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే పనులు చేపడుతున్నారని తెలిపారు. స్మార్ట్ పల్స్ సర్వేను వెంటనే నిలిపివేయాలి: స్మార్ట్ పల్స్ సర్వే పేరుతో ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలను స్మార్ట్‌గా మోసగించడానికి సిద్ధమైరుుందని ఎమ్మెల్యే తెలిపారు. సర్వే పై ప్రజల్లో అనేక అనువూనాలు ఉన్నాయుని, బైక్, సెల్‌ఫోన్, ఫ్రిజ్ తదితర వస్తువులు వినియోగిస్తే వారికి బియ్యుం, ఇంటి స్థలాలు కూడా రాకుండా చూడాలని కుట్ర పన్నుతున్నారని సూచించారు. సర్వే ప్రారంభించినప్పటి నుంచి వుండల కేంద్రాల్లో రెవెన్యూ అధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. సవూవేశంలో పార్టీ జిల్లా వుహిళా విభాగం అధ్యక్షురాలు బోయు సుశీలవ్ము, జోగి సంఘం రాష్ట్ర నాయుకులు జోగి వెంకటేష్, సుబ్బయ్యు, జడ్పీటీసీలు లలితవ్ము , తిప్పయ్యు తదితరులు పాల్గొన్నారు. -
'ఏపీ డెయిరీని మూయించే పనిలో చంద్రబాబు'
హైదరాబాద్: హెరిటేజ్ ప్రయోజనాల కోసం ఏపీ డెయిరీని మూయించే పనిలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. ఏపీలో పాడి పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. వెంటనే ఏపీ డెయిరీకి రూ.100 కోట్లు కేటాయించాలని విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఒకే నెలలో మూడు సార్లు పాల సేకరణ ధర తగ్గించడం దారుణమన్నారు. పాడి పరిశ్రమను ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పని చేయొద్దని విశ్వేశ్వరరెడ్డి సూచించారు. -
ముగిసిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి జాగరణ దీక్ష
బెళుగుప్ప : అనంతపురం జిల్లా బెళుగుప్పలో శనివారం సాయంత్రం నుంచి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ప్రారంభించిన జల జాగరణ దీక్ష ఆదివారం ఉదయం ముగిసింది. హంద్రీనీవా మొదటి దశ ఆయకట్టుకు నీరు అందించాలని, జాడిపల్లె గ్రామస్తులకు పునారావాసం కల్పించాలని, జీవో నంబర్ 22ను రద్దు చేయాలన్న డిమాండ్లతో ఆయన ఈ జాగరణ దీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా రాత్రంతా నిద్రపోకుండా విశ్వేశ్వరరెడ్డి మేల్కొని ఉన్నారు. పలువురు పార్టీ నాయకులు ఆయన చేపట్టిన జాగరణ దీక్షకు మద్దతు తెలిపారు. -
'ఈ బడ్జెట్ లోనైనా న్యాయం చేస్తారా?'
హైదరాబాద్: ఏపీలో రుణమాఫీ కోసం రూ.4300 కోట్లు గత బడ్జెట్ లో కేటాయిస్తే ఇప్పడు ఏ ఒక్కరికి రుణమాఫీ కాని పరిస్థితి కనిపిస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీ లో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా ఆయన రుణమాఫీపై మాట్లాడారు. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం ఈ రోజు వరకు రూ. 5 వేల కోట్ల పైగా రుణమాఫీ చేయాల్సి ఉందన్నారు. కేంద్రం నుంచి నిధులు రావడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని కానీ అమిత్ షా మాత్రం లక్షా 50 వేల కోట్లు ఏపీకి నిధులు ఇచ్చామంటున్నారని ఆయన తెలిపారు. బంగారు రుణాలు ఇంతవరకూ చెల్లించలేదని రుణం తీసుకున్నవారికి బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయని గుర్తు చేశారు. నోటీసులు జారీ చేయడంపై ప్రభుత్వం బ్యాంకర్లను నిందిస్తూ తప్పించుకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతు నష్టపోతున్నాడని, కనీసం ఈ బడ్జెట్ లోనైనా రైతన్నకు న్యాయం చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. రుణమాఫీ కాకపోవడం వల్లే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. మరో ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి మాట్లాడుతూ 'ఇంటి ముందు బ్యాంకర్లు వచ్చి కూర్చున్నారని అర్థరాత్రి ఓ రైతు ఫోన్ చేశాడు. పండుగ పూట కూడా ఇంట్లో ఉండలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందాడు. ఇప్పడికైనా దయ ఉంచి రైతు రుణాలను మాఫీ చేయండి. రుణమాఫీ చేసి రైతుల పల్లెల్లో రైతులు ఉండేలా చూడండి' అని అన్నారు. -
'చంద్రబాబు వెంటనే స్పందించాలి'
అనంతపురం: ప్రత్యేక హోదా అంశంపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రానికి టీడీపీ మద్దతు ఉపసంహరించుకోవాలన్నారు. వైఎస్ జగన్ నిరవధిక నిరాహారదీక్షకు మద్దతుగా అనంతపురం జిల్లా ఉరవకొండలో ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. ఉరవకొండ మండలం పునుగుప్పలో దుద్దేకుంట రామాంజనేయులు ఆధ్వర్యంలో కార్యకర్తలు రిలే దీక్షకు దిగారు. జననేత దీక్షకు మద్దతుగా హిందూపురంలో వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త నవీన్ నిశ్చల్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతపురం తంతి తపాలా కార్యలయం వద్ద ధర్నాకు దిగిన మాజీ ఎమ్మెల్యే గురునాధ్ రెడ్డి, 100 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. తాడిపత్రి వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త రమేశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మారో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. యాడికిలో వైఎస్ఆర్ సీపీ నేత బొంబాయి రమేశ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేశారు. ఎస్కేయూలో వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం నేతలు సీఎం చంద్రబాబు శవయాత్ర నిర్వహించారు. -
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి
-
రైతులకు ఇన్సూరెన్స్ చెల్లించాలి: వైఎస్ఆర్సీపీ
హైదరాబాద్ : అన్ని విధాల నష్టపోయిన రైతులకు ఎలాంటి పరిహారం అందలేదని ప్రతిపక్షం స్పష్టం చేసింది. శనివారం చివరిరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతేడాది పంట నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్ చెల్లింపుతో పాటు, ఇన్పుట్ సబ్సిడీపై చర్చకు పట్టుపడుతూ వాయిదా తీర్మానం కోరారు. అయితే దానికి తిరస్కరించిన స్పీకర్.. ప్రశ్నోత్తరాలు చేపట్టారు. దీనిపై చర్చ కోరిన వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు చివరకు ఈ విషయాన్ని ప్రస్తావించే అవకాశం ఇచ్చారు. గత ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ఇన్సూరెన్స్ చెల్లించాలని కోరారు. -
రైతులకు ఇన్సూరెన్స్ చెల్లించాలి: వైఎస్ఆర్సీపీ
-
బాబుపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి
అనంతపురం: ఎన్నికల నేపథ్యంలో రైతులకు రుణ మాఫీ హమీపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి గురువారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. బ్యాంక్ అధికారులు రైతులు, మహిళల బంగారం, వ్యవసాయ పనిముట్లు వేలం వేస్తున్నా... సీఎం చంద్రబాబు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రుణమాఫీ చేయకపోవడంతో రైతులు, డ్వాక్రా మహిళలకు బకాయిదారులుగా మిగిలిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బంది పెట్టవద్దని వజ్రకరూర్ బ్యాంక్ అధికారులను వై. విశ్వేశ్వర్‌రెడ్డి కోరారు. -
'మా జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వాలి'
అనంతపురం: గుంటూరు-విజయవాడ మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అనడం మంచిదికాదని ఉరవకొండ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం చేకూర్చడానికే గుంటూరు - విజయవాడ మధ్య రాజధాని ఉంటుందని టీడీపీ నేతలు ప్రకటన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నిపుణుల కమిటీ నివేదించక ముందే ఇలాంటి ప్రకటనలు చేయడం మంచి పద్దతి కాదని హితవు పలికారు. వెనుకబడిన తమ జిల్లాకు ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. -
ముందు పాలనపై దృష్టి సారించండి
చంద్రబాబుకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి సూచన సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనపై విమర్శలు మానివేసి ఆంధ్రప్రదేశ్‌లోని సవాళ్లను ఎదుర్కొనేందుకు సీఎం చంద్రబాబు పాలనపై దృష్టి సారించాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి సూచించారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉండడానికి కారణం రాజశేఖరరెడ్డి పాలనేనని చంద్రబాబు విమర్శించడం సమంజసంగా లేదన్నారు. వాస్తవానికి గతంలో చంద్రబాబు పరిపాలనలో గ్రామీణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్నారు. మీ పాలనలో రైతాంగం సంక్షోభంలో, అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంగతి మరిచారా అని ప్రశ్నించారు. వైఎస్‌ను నిందించే లక్ష్యంతో రాష్ట్ర పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని, విజన్ 2020 పత్రాన్ని రూపొందిస్తామని చంద్రబాబు అంటున్నారని, గతంలో శ్వేతపత్రం, విజన్ 2020 గురించి చంద్రబాబు మాట్లాడారంటే అది కొత్త పన్నులను వేయడానికో లేదా ప్రపంచబ్యాంకు విధానాలను అమలు చేయడానికో అని రాష్ట్ర ప్రజలు భయపడేవారని గుర్తుచేశారు. ఇపుడు మళ్లీ అదే మాటలు చెబుతున్నారంటే రైతుల రుణమాఫీని నీరుగార్చడానికో లేదా వైఎస్ సంక్షేమ పథకాలను కుదించడానికో అనే అనుమానాలు, భయాందోళనలు ప్రజల్లో కలుగుతున్నాయని చెప్పారు. -
'వైఎస్ జగన్‌పై కక్ష సాధిస్తే సహించేది లేదు'
తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వై.విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం అనంతపురంలో విశ్వేశ్వరరెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. పార్టీలోని సంస్థాగత లోపాలుంటే వాటిని సవరించుకుంటామన్నారు. మే 7వ తేదీన ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 67 శాసనసభ స్థానాలను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఉరవకొండ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వై. విశ్వేశ్వరరెడ్డి... ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవుపై గెలుపొందిన విషయం విదితమే.