'వైఎస్ జగన్పై కక్ష సాధిస్తే సహించేది లేదు' | Stop harassment of Jagan, says YSR Congress party MLA Y. Visweswara reddy | Sakshi
Sakshi News home page

'వైఎస్ జగన్పై కక్ష సాధిస్తే సహించేది లేదు'

Published Thu, May 22 2014 2:27 PM | Last Updated on Mon, Aug 27 2018 8:57 PM

'వైఎస్ జగన్పై కక్ష సాధిస్తే సహించేది లేదు' - Sakshi

'వైఎస్ జగన్పై కక్ష సాధిస్తే సహించేది లేదు'

తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వై.విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం అనంతపురంలో విశ్వేశ్వరరెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. పార్టీలోని సంస్థాగత లోపాలుంటే వాటిని సవరించుకుంటామన్నారు.

 

మే 7వ తేదీన ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 67 శాసనసభ స్థానాలను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఉరవకొండ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వై. విశ్వేశ్వరరెడ్డి... ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవుపై గెలుపొందిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement