ఉరవకొండలో పోలీసులు ఓవరాక్షన్‌.. | Police Over Action in Uravakonda | Sakshi
Sakshi News home page

Jan 5 2019 8:55 PM | Updated on Jan 5 2019 9:01 PM

Police Over Action in Uravakonda - Sakshi

సాక్షి, అనంతపురం: ఉరవకొండలో పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉరవకొండలో శనివారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అయితే, ఈ బైక్‌ ర్యాలీకి అనుమతిలేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తమ విధులను అడ్డుకున్నారంటూ.. అనుమతి లేకుండా బైక్‌ ర్యాలీ నిర్వహించారంటూ.. విశ్వేశ్వర్‌రెడ్డి తనయుడు ప్రణయ్‌రెడ్డి సహా 10మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసులు వ్యవహరిస్తున్న పక్షపాతపూరితమైన తీరుపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు అక్రమ కేసులను బనాయించడాన్ని ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement