vishweshwar reddy
-
టీడీపీ నేతల విధ్వంసాలపై విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్
-
చంద్రబాబు, లోకేష్ పై విశ్వేశ్వర రెడ్డి ఫైర్
-
మీ ప్రవర్తన మార్చుకోకపోతే.. మేము మారాల్సి వస్తుంది జాగ్రత్
-
ఉరవకొండలో జోరుగా విశ్వేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారం
-
కాంగ్రెస్‌లో చేరనున్న నేతలు
సాక్షి, హైదరాబాద్: చాలాకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరగనున్నాయి. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్, నిజామాబాద్ మాజీ మేయర్, ఎంపీ డీఎస్ తనయుడు ధర్మపురి సంజయ్, భూపాలపల్లి జిల్లా బీజేపీ నేత గండ్ర సత్యనారాయణలు త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నారు. మంగళవారం ఉదయం ఈ ముగ్గురు నేతలు టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తాము త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. కొండాతో రేవంత్ ఏకాంత చర్చలు రేవంత్‌రెడ్డి మంగళవారం చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో భేటీ అయ్యారు. కొండా నివాసానికి వెళ్లిన రేవంత్ ఏకాంతంగా సమావేశమయ్యారు. అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. కొండా రాజీనామా చేసింది కాంగ్రెస్ పార్టీకేనని, పార్టీ సిద్ధాంతాలకు కాదని రేవంత్ వ్యాఖ్యానించారు. ఆయన ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలోకి రావొచ్చునన్నారు. విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ రేవంత్ పీసీసీ అధ్యక్షుడు కావాలని అటు పార్టీలో, ఇటు బయట చాలా కొట్లాడానని చెప్పారు. ఆయన పీసీసీ అధ్యక్షుడు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే నిరుద్యోగ దీక్షలో పాల్గొంటానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరతాననేది త్వరలోనే చెబుతానని కొండా అన్నారు. కాంగ్రెస్‌లో అందరికీ న్యాయం: రేవంత్ కాంగ్రెస్ పార్టీలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని రేవంత్‌రెడ్డి చెప్పారు. మంగళవారం ఉదయం తన నివాసంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మున్నూరుకాపు, ముదిరాజ్, వెలమ సామాజిక వర్గాలకు చెందిన ముగ్గురు నేతలు తమ పార్టీలోకి రావడం సంతోషదాయకమన్నారు. ఇతర పార్టీల నేతలు చాలామంది టచ్‌లోకి వస్తున్నారని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో పార్టీ అధికార ప్రతినిధులను నియమిస్తామని తెలిపారు. -
సీఎం జగన్ కృషి అభినందనీయం
సాక్షి, అనంతపురం: లాక్డౌన్ నేపథ్యంలో ముంబైలో చిక్కుకున్న వలస కూలీలను రప్పించేందుకు చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ముంబై నుంచి గుంతకల్లుకు రేపు(బుధవారం) ఉదయం వలస కూలీలు చేరుకుంటారని ఆయన పేర్కొన్నారు. ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన 500 మంది వలస కార్మికులు రానున్నారని తెలిపారు. వలస కూలీలపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమన్నారు. కరోనా వైరస్ కట్టడి కోసం సీఎం జగన్ రేయింబవళ్లు శ్రమిస్తున్నారని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. -
మాజీ ఎమ్మెల్యేకు తప్పిన ముప్పు!
-
వైఎస్సార్సీపీ నేతకు తప్పిన ముప్పు!
సాక్షి,అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి లిఫ్టులో ఇరుక్కుపోయారు. శ్రీసెవన్ ఫంక్షన్ హాల్లో ఈ ఘటన జరిగింది. ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యకర్తలో సమావేశంలో పాల్గొన్న ఆయన.. సమావేశం అనంతరం కిందకు వెళ్తుండగా.. లిఫ్టు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. పోలీసులు, కార్యకర్తలు లిఫ్టును ధ్వంసం చేసి విశ్వేశ్వరరెడ్డిని బయటకు తీసుకురావడంతో అంతా ఊపరిపీల్చుకున్నారు. -
అభివృద్ధి,అధికార వికేంద్రీకరణ అవసరమే
-
ఉద్యోగాల కల్పనలో ఏపీ ‘నంబర్ వన్’
సాక్షి, అనంతపురం: ఉద్యోగాల కల్పనలో దేశంలోనే నంబర్ వన్‌గా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించిందని మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు సత్వర పరిష్కరించడానికే గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను కేవలం ఐదునెలల్లో నెరవేర్చి ఇతర నాయకుల కంటే తాను భిన్నమైన నేతగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరూపించుకున్నారన్నారు. ప్రజలకు నమ్మకం కలిగింది.. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలకు రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం కలిగిందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రతి పక్షాల పాత్ర నామ మాత్రమేనని చెప్పారు. -
‘నేతన్నల నిజమైన నేస్తం జగనన్న’
సాక్షి, అనంతపురం: కష్టాల్లో ఉన్న చేనేతలకు ఆపన్నహస్తం.. నేతన్న నేస్తం అని ఎంపీ తలారి రంగయ్య అన్నారు. శనివారం ఆయన అనంతపురంలోని ఉరవకొండలో నిర్వహించిన ‘చేనేతల ఆత్మీయసభ’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లానే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ప్రశంసించారు. రాబోయే ఐదేళ్లలో చేనేతరంగం దశ దిశలను సీఎం జగన్ మారుస్తారని తెలిపారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా చేనేతలకు ఏడాదికి రూ. 24 వేలు ప్రభుత్వం ఇస్తుందని రంగయ్య తెలిపారు. అదేవిధంగా నేతన్నల నిజమైన నేస్తం జగనన్న అని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. చంద్రబాబు చేనేతలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా అందరికి నేతన్న నేస్తం వర్తిస్తుందన్నారు. కార్మికుల ఉత్పత్తుల అమ్మకానికి ఈ-కామర్స్ దిగ్గజాలు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. -
హత్యా రాజకీయాలకు కేరాఫ్.. పయ్యావుల కేశవ్
సాక్షి, ఉరవకొండ(అనంతపురం) : ఉరవకొండ నియోజకవర్గంలో దౌర్జన్యాలకు, హత్యా రాజకీయాలకు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కుటుంబం కేరాఫ్ అడ్రస్ అని, ఇప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలంటూ ఆయన నీతులు చెప్పడం దయ్యాలు వేదాలు వళ్లించినట్లుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. ఉరవకొండ మండలం రాకెట్లలో సోమవారం సుంకలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆయన కౌకుంట్ల గ్రామ ప్రజలతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పయ్యావుల కేశవ్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసం పరిపాలన సౌలభ్యం కోసం పెద్ద కౌకుంట్ల పంచాయతీని విభజించేందుకు పెట్టిన గ్రామసభలో కేశవ్ వ్యవహరించిన తీరు సరైంది కాదన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను తెలియజేయకుండా ప్రజలను భయపెట్టారన్నారు. దాదాపు 8500 మంది జనాభా ఉన్న పంచాయతీలో కనీసం 1500 మంది కూడా పాల్గొనకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఎమ్మెల్యేగా కేశవ్ ఎన్నికే అప్రజాస్వామ్యం అని, కోట్లు ఖర్చుచేసి ప్రలోభాలకు గురిచేసి రిగ్గింగ్‌తో గెలుపొందిన ఆయన ఇప్పుడు ప్రజాస్వామ్యం, అభివృద్ధి గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో గత ఐదు దశాబ్ధాలుగా ఎవరు ఫ్యాక్షన్ రాజకీయాలు చేశారో, ఎవరు ఎవరు ఎవర్ని హత్యలు చేయించారో ప్రజలందరికీ తెలుసున్నారు. కేశవ్ గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అటు అమరావతిలో, ఇటు కియా కార్ల కంపెనీ వద్ద దాదాపు వందల ఎకరాల భూమిని కొనుగోలు చేసిన విషయం వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. గడిచిన ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులలో వందల కోట్లు రూపాయలు దోపిడీ చేసిన అతి పెద్ద దోపిడీ దొంగ కేశవ్ అని మండిపడ్డారు. సోమవారం కౌకుంట్లలో ప్రజాస్వామ్యం కచ్చితంగా అపహాస్యం అయిందన్నారు. -
పయ్యావుల ఊరిలో జరిపించి తీరుతాం!
సాక్షి, అనంతపురం : పయ్యావుల కేశవ్ సొంత పంచాయతీ కౌకుంట్లలో నలభై ఏళ్లుగా దౌర్జన్యకాండ కొనసాగిస్తున్నారని ఉరవకొండ మాజీ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆదివారం మండిపడ్డారు. కౌకుంట్ల పంచాయతీ విభజన కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా అధికారులను, ప్రజలను బెదిరిస్తున్నారనీ, ఈ ఆగడాలు ఇక సహించేదిలేదన్నారు. సోమవారం కౌకుంట్లలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామని విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
ఉరవకొండలో ఎన్నికల అధికారుల నిర్వాకం
అనంతపురం: ఉరవకొండలో ఎన్నికల అధికారుల నిర్వాకం బయటపడింది. ఫోటోలు లేవన్న కారణంతో 13 మంది వైఎస్సార్సీపీ నేతలకి ఉరవకొండ ఆర్వో శోభాస్వరూపారాణి కౌంటింగ్ పాసులు ఇవ్వలేదు. ఫోటోలతో కూడిన దరఖాస్తులు వైఎస్సార్సీపీ నేతలు ఇదివరకే సమర్పించినా కూడా వైఎస్సార్సీపీ కౌంటింగ్ ఏజెంట్ల ఫోటోలు కావాలని తొలగించి అక్రమాలకు పాల్పడ్డారు. ఈ ఘటనతో ఉరవకొండ కౌంటింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు లేకుండా చేసి, కౌంటింగ్‌లో అక్రమాలు చేసేందుకు కుట్ర రచించినట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ విషయంపై ఉరవకొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్‌కు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లకు కౌంటింగ్ పాసులు ఇవ్వాలని, ఫోటోలు తొలగించిన వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్‌కు సహకరిస్తున్న ఉరవకొండ ఎన్నికల అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ నేతలకు కౌంటింగ్ పాసులు ఇవ్వకపోవడంపై వైఎస్సార్సీపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు ప్రణయ్ రెడ్డి, ఎన్నికల అధికారిణి స్వరూపారాణితో వాగ్వాదానికి దిగారు. పయ్యావులకు ఉరవకొండల ఎన్నికల అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. -
జగన్ మాట ఇస్తే తప్పరు
-
జిల్లాకు అన్ని విధాలుగా అన్యాయం
అనంతగిరి: టీఆర్ఎస్ అన్నివిధాలుగా జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని చిగుళ్లపల్లి గ్రౌండ్లో వికారాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. టీఆర్ఎస్, బీజేపీల మధ్య రహస్య పొత్తు ఉందని, వచ్చే ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీల మధ్యే పోటీ ఉంటుందన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నల్లధనాన్ని వెనక్కి రప్పించడంలో ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్‌ది ఫెడరల్ ఫ్రంట్ కాదని.. అది బీజేపీ టీం అని ఎద్దేవా చేశారు. ప్రాణహిత–చేవెళ్ల డిజైన్‌ను మార్చి జిల్లాకు టీఆర్ఎస్ తీరని అన్యాయం చేసిందన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇంకా ప్రారంభానికి కూడా నోచుకోలేదన్నారు. జిల్లా విభజనలో అన్యాయం చేయడంతో పాటు, చార్మినార్ జోన్లో కలపకుండా జోగులాంబలో కలిపారని మండిపడ్డారు. జిల్లాకు అన్ని విధాలుగా అన్యాయం చేసిన టీఆర్ఎస్ నుంచి తాను కాంగ్రెస్‌లో చేరానని ఎంపీ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు. వికారాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ విషయం కోర్టులో ఉందని, త్వరలో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆయన ఆశాభావంవ్యక్తం చేశారు. అప్రజాస్వామయ్య పద్ధతిలో టీఆర్ఎస్ గెలుపు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సేనని, అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచిందని మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ ఆరోపించారు. కేసీఆర్‌ది నియంత పాలన అని, అక్కడ ఇమడలేకనే ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారని తెలిపారు. కొండా కాంగ్రెస్ పార్టీలోకి రావడం కొండంత బలం అని పేర్కొన్నారు. ఆయనను ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రైతుబంధు చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీలో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ త్వరలో మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు. వికారాబాద్ నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందని, ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేస్తున్నాడని తెలిపారు. ఒకే కుటుంబంతో అన్యాయం అనంతరం డీసీసీ అధ్యక్షుడు, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. వికారాబాద్, పరిగి ఈవీఎంల ట్యాంపరింగ్ ఘటనలో త్వరలో తమకు అనుకూల తీర్పు వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లాను ఒకే కుటుంబం అన్యాయం చేస్తోందని, ఇంట్లో ముగ్గురికి పదవులు ఉండడంతో అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని దుయ్యబట్టారు. వికారాబాద్‌లో పాస్‌పోర్టు కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. ఎంపీ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి పోటీ చేసేందుకు టీఆర్ఎస్కు అభ్యర్థి దొరకడం లేదని రోహిత్‌రెడ్డి ఎద్దేశా చేశారు. అసెంబ్లీలో మన జిల్లా విషయంలో గొంతెత్తని వ్యక్తి పార్లమెంట్లో ఏం మాట్లాడుతారని ఈ సందర్భంగా పైలెట్.. మహేందర్‌రెడ్డిని విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెఓచ్చరించారు. అనంతరం పరిగి మాజీ ఎమ్మెల్యే రామోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇది ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న యుద్ధమని, ఈ ఎన్నికల్లో ఎంపీని భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పారు. జోన్ విషయంలో అన్యాయంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారన్నారు. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం మాట్లాడుతూ..పార్లమెంట్లో ప్రజాసమస్యలపై గొంతువిప్పిన ఘనత ఎంపీకే దక్కుతుందన్నారు. కేసీఆర్‌ను అప్పట్లో తిట్టినోళ్లు ప్రస్తుతం పొగుడుతున్నారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ధూం ధాం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, జెడ్పీటీసీ రాములు, పీఏసీఎస్ చైర్మన్ కిషన్‌నాయక్, ఎంపీపీటీసీలు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడుద అనంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, సీనియర్ నాయకులు రత్నారెడ్డి, అడ్వకేట్ బస్వరాజు, నర్సింహారెడ్డి, కమాల్‌రెడ్డి, సంగమేశ్వర్, నర్సింలు, మురళి, విజయ్, సుధాకర్, శ్రీనివాస్‌గౌడ్, మేక చంద్రశేఖర్‌రెడ్డి, ఆయా మండలాల అధ్యక్షులు, సర్పంచులు తదితరులు ఉన్నారు. ఎంపీ జన్మదిన వేడుకలు సమావేశం అనంతరం నాయకులు, కార్యకర్తలు ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బర్త్‌డే సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. అతిథులతో పాటు నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి ఆయా గ్రామాల్లో ఒక్కో విద్యార్థికి తన ట్రస్టు తరుఫున రూ.1500 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. -
‘ఆ ఘనత వైఎస్సార్‌కే దక్కుతుంది’
సాక్షి, అనంతపురం: తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఎన్నికల జిమ్మిక్కులు చేస్తున్నారని, నాలుగున్నరేళ్లు నిద్రపోయి ఇప్పుడు ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో హడావుడి చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. ఉరవకొండలో పేదల కాలనీకి పయ్యావుల కేశవ్ పేరు పెట్టడంపై శుక్రవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారాయన. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉరవకొండలో పేదల కోసం 88 ఎకరాల భూమి కొనుగోలు చేసిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కతుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఒక్క ఎకరా భూమి కూడా అదనంగా కేటాయించలేదని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. పేదలకు ఏ పని చేయకపోయినా కాలనీకి తన పేరు పెట్టించుకోవటం.. పయ్యావుల కేశవ్ దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమంటూ మండిపడ్డారు. ఉరవకొండ రెవెన్యూ కార్యాలయాలను టీడీపీ ఆఫీసుగా మార్చేయటం దురదృష్టకరమన్నారు. -
ఉరవకొండలో పోలీసులు ఓవరాక్షన్..
సాక్షి, అనంతపురం: ఉరవకొండలో పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రకు మద్దతుగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉరవకొండలో శనివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. అయితే, ఈ బైక్ ర్యాలీకి అనుమతిలేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తమ విధులను అడ్డుకున్నారంటూ.. అనుమతి లేకుండా బైక్ ర్యాలీ నిర్వహించారంటూ.. విశ్వేశ్వర్‌రెడ్డి తనయుడు ప్రణయ్‌రెడ్డి సహా 10మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసులు వ్యవహరిస్తున్న పక్షపాతపూరితమైన తీరుపై వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు అక్రమ కేసులను బనాయించడాన్ని ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ఖండించారు. -
అనంత జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
మానవతా దృక్పథంతో ఏపీని ఆదుకోవాలి
అనంతపురం జిల్లా: జేఎన్టీయూలో సెంట్రల్ యూనివర్సిటీ తాత్కాలిక భవనాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావుతో కలిసి ప్రారంభించారు. రాష్ర్ట విభజన హామీల్లో భాగంగా అనంతపురానికి సెంట్రల్ యూనివర్సిటీ మంజూరైంది. బుక్కరాయసముద్రం మండలం జంతలూరు గ్రామంలో 600 ఎకరాల భూమి కేటాయించినా ఇప్పటిదాకా ఎలాంటి కట్టడాలు ప్రారంభించలేదు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై విమర్శలు వెలువెత్తిన నేపథ్యంలో ఏపీ సెంట్రల్ యూనివర్సిటీని అనంతపురం జేఎన్టీయూలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. సెంట్రల్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఏపీని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కోరారు. రాష్ర్ట విభజన హామీల కోసం నాలుగేళ్లుగా పోరాడుతున్నాం..ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. ఏపీ హక్కుల కోసం వైఎస్సార్సీపీ అనేక రకాలుగా పోరాటాలు చేస్తోందని, ఏపీ న్యాయం చేయాలని విన్నవించారు. -
బాబు ఓ రాజకీయ వ్యభిచారి
అనంతపురం జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ రాజకీయ వ్యభిచారి అని అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి తీవ్రంగా విమర్శించారు. అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఉరవకొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, హిందూపురం వైఎస్సార్సీపీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు శంకర్ నారాయణతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బాబు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకమని అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు దమ్మూ, ధైర్యం ఉంటే వెంటనే రాజీనామా చేసి ఒంటరిగా పోటీ చేసి గెలవాలన్నారు. విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..నాలుగేళ్లు బీజేపీతో అంటకాగిన చంద్రబాబు..ఇప్పుడు మైనార్టీలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. శంకర్ నారాయణ మాట్లాడుతూ..అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. -
బాబు ఓ రాజకీయ వ్యభిచారి
-
బాబు ఎలా మోసపోయారు?
అనంతపురం జిల్లా: భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేస్తే 40 ఏళ్ల అనుభవం ఉన్న టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎలా మోసపోయారని ఉరవకొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వంచనపై గర్జన దీక్షలో ప్రసంగిస్తూ.. ప్రజలను రక్షించాల్సిన చంద్రబాబు తననే కాపాడాలంటూ ప్రజలను కోరడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కేంద్రం స్పందించకపోతే కడప ఉక్కు పరిశ్రమ తానే ఏర్పాటు చేస్తానని చంద్రబాబు అనటం సరికాదన్నారు. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పెట్టిన అక్రమ కేసులకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయపడలేదని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసుకు భయపడి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన పిరికిపంద చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నిజమైన పోరాట యోధుడుగా ఫోజులు కొడుతున్నారని విమర్శించారు. చంద్రబాబులో ధర్మమూ లేదూ.. పోరాటమూ లేదని వ్యాఖ్యానించారు. -
చంద్రబాబుపై మండిపడ్డ విశ్వేశ్వర్ రెడ్డి
అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబుపై ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. అనంతపురంలో విలేకరులతో మాట్లాడుతూ..పార్లమెంటులో వైస్సార్సీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు కేంద్రం భయపడుతోందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై రాష్టానికి జరిగిన అన్యాయానికి ప్రధాన ముద్దాయి చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు. చంద్రబాబుకు ఏ ఎండకు ఆ గొడుగు పట్టడటం అలవాటని విమర్శించారు. మొన్నటి దాకా ప్రత్యేక ప్యాకేజీ నాటకమాడి రాజకీయ అవసరాల కోసమే ఇప్పుడు ప్రత్యేకహోదా నినాదాన్ని ఎత్తుకున్నాడని చంద్రబాబు నాయుడిపై ధ్వజమెత్తారు. -
ప్రభుత్వం కక్ష సాధిస్తోంది : ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి
సాక్షి, అనంతపురం : ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే 90 శాతం హంద్రీనీవా పనులు పూర్తయ్యాయనీ, పిల్లకాలువలు పూర్తిచేస్తే పొలాలకు నీరు అందించవచ్చని ఆయన పేర్కొన్నారు. పయ్యావుల కేశవ్‌కు మంత్రి పదవిపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని, కరవును తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. హంద్రీనీవా ఆయకట్టుకు నీరిచ్చేదాకా పోరాటం ఆపేదిలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి రైతు సమస్యలపై చేస్తున్న పోరాటాలు, పాదయాత్ర అభినందనీయమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాల దిశగా విశ్వేశ్వర రెడ్డి చేస్తున్న పాదయాత్రకు ఆయన సంఘీభావాన్ని తెలిపారు. -
'బుడుగజంగాలకు అన్యాయం చేస్తున్నారు'
చంద్రబాబు సర్కారుపై విశ్వేశ్వర్‌రెడ్డి మండిపాటు నంద్యాల: అట్టడుగున ఉన్న బుడుగజంగం సామాజికవర్గానికి చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. జీవో 114ను తీసుకురావడం ద్వారా బుడుగజంగాలకు ప్రభుత్వం అన్యాయం చేసిందని తెలిపారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే 70వేల మంది బుడుగజంగాలు ఉండగా, నంద్యాలలో నాలుగువేల మంది ఉన్నారని, వారందరికీ అన్యాయం చేసేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో 84ను తీసుకొచ్చి బుడుగజంగాలను ఆదుకున్నారని గుర్తుచేశారు. తెలంగాణ సహా పలు పొరుగు రాష్ట్రాలు బుడగజంగాలను ఎస్సీలుగా పరిగణించి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుండగా.. ఏపీలో మాత్రం వారిని ఎస్సీలుగా పరిగణించడం లేదని అన్నారు. అట్టడుగున ఉన్న బుడుగజంగాల వారి పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో న్యాయం కల్పించాలని, అందుకోసం వారిని ఎస్సీల్లో చేర్చాలని ఆయన కోరారు. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సమావేశాల పేరిట చంద్రబాబు సామాజిక పాచికలు వేస్తున్నారు, నిసిగ్గుగా కులాల వారీగా ఓటర్లను వాడుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. బ్రాహ్మణులు, కాపులు సహా అనేక సామాజిక వర్గాల వారిని చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. -
'బుడుగజంగాలకు అన్యాయం చేస్తున్నారు'
-
‘దౌర్జన్యం’పాయింట్
చెవిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డిలను నెట్టేసిన మంత్రి పల్లె, టీడీపీ ఎమ్మెల్యేలు సాక్షి, అమరావతి: అసెంబ్లీలో ప్రజాసమస్యలు ప్రస్తావించే అవకాశం లేకుండా ప్రతిపక్షం గొంతు నొక్కుతున్న పాలకపక్షం మీడియా పాయింట్‌లోను అదే తీరు కొనసాగిస్తోంది. వైఎస్సార్సీపీ మహిళా ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి మాట్లాడనీయకుండా మీడియా పాయింట్లో మంగళవారం మంత్రి పీతల సుజాత, టీడీపీ అనితా మీడియా లోగోలు లాగేసుకుని దురుసుగా వ్యవహరించిన సంగతి తెల్సిందే. బుధవారం కూడా అదే తీరును కొనసాగించిన అధికారపార్టీ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కొక్కిలిగడ్డ రక్షణనిధిలు మాట్లాడుతుండగానే పక్కకు నెట్టేశారు. -
‘చట్టం టీడీపీ నేతలకు చుట్టంగా మారింది’
-
‘చట్టం టీడీపీ నేతలకు చుట్టంగా మారింది’
అనంతపురం: చట్టం టీడీపీ నేతలకు చుట్టంగా మారిందని ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో మహిళకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే గుర్నాధ్ రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డిలతో కలిసి విశ్వేశ్వర్ రెడ్డి శుక్రవారం అనంతపురం జిల్లా ఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా జలిపల్లిలో మహిళలపై దాడి చేసిన టీడీపీ నేతలను శిక్షించాలని వైఎస్ఆర్ సీపీ నేతలు డిమాండ్ చేశారు. -
అధికారం నిలుపుకొనేందుకే ఫిరాయింపులు
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పిన్నెళ్లి, దాడిశెట్టి, విశ్వేశ్వరరెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకునేం దుకే టీడీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విప్ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయించిన పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనపై శుక్రవారం ఎమ్మె ల్యేలు దాడిశెట్టి రాజా, విశ్వేశ్వరరెడ్డిలతో కలిసి అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. కల్పనపై తక్షణమే అనర్హత వేటు వేయాలని కోరారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పిన్నెళ్లి విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ(వైఎస్సార్సీపీ) గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీ ప్రలోభ పెట్టి, అనధికారంగా చేర్చుకోవడం దారుణమన్నారు. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన సీఎం చంద్రబాబు అదే పద్ధతిలో ఏపీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొంటూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశా లను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కనీసం అసెంబ్లీ సమావేశాలను కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని ఎమ్మెల్యే దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా) ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు కేసుకు భయపడి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. తెలంగాణలో అనైతికమన్న పార్టీ ఫిరాయింపులను చంద్రబాబు సిగ్గువిడిచి ఏపీలో ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేదని విమర్శించారు. -
ఉరవకొండలో కొనసాగుతున్న బంద్
ఉరవకొండ: పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న డిమాండ్‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా శనివారం అనంతపురం జిల్లా ఉరవకొండలో బంద్ కొనసాగతుతోంది. పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలను సైతం నిరసన కార్యక్రమాల్లో పాల్గొనకుండా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. బంద్ సందర్భంగా పోలీసులు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. -
చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని....
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి బుధవారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. రాజధాని నిర్మాణంపై హైకోర్టు వ్యాఖ్యలు చంద్రబాబుకు చెంపపెట్టు అన్నారు. స్విస్ కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకుని స్విస్ ఛాలెంజ్ పద్దతిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. -
'రేపు సాయంత్రం జల జాగరణ చేపడతాం'
అనంతపురం : అనంతపురం జిల్లా బెలుగుప్పలో శనివారం సాయంత్రం జల జాగరణ చేపడతామని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి శుక్రవారం అనంతపురంలో స్పష్టం చేశారు. హాంద్రీనీవా ఆయుకట్టుకు వెంటనే నీరు విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హంద్రీనీవా డిస్ట్రిబ్యూటరీ పనులు నిలిపివేయడం దుర్మార్గమని అన్నారు. కృష్ణా జలాల అనంతపురంకు తీసుకువచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ఆర్దే అని విశ్వేశ్వరరెడ్డి గుర్తు చేశారు. అనంతపురానికి నీరు ఇచ్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీరు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
చంద్రబాబుపై విశ్వేశ్వర్‌రెడ్డి ఫైర్
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి శుక్రవారం అనంతపురంలో మండిపడ్డారు. చంద్రబాబు పత్రిక స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. రాజధాని భూ కుంభకోణంలో సాక్షి మీడియా ప్రతినిధులను బెదిరించడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే తమ పార్టీ ఎమ్మెల్యేలపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందని విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా చంద్రబాబు రుణమాఫీ అమలు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించాలన్న ధ్యాస చంద్రబాబుకు లేదని విశ్వేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. -
కేంద్రంపై బాబు ఒత్తిడి తెస్తే బాగుండేది
-
కేంద్రంపై బాబు ఒత్తిడి తెస్తే బాగుండేది
అనంతపురం : వైఎస్ జగన్ దీక్ష భగ్నం చేయడం సరికాదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వైఎస్ జగన్ దీక్ష భగ్నంపై మంగళవారం అనంతపురంలో వై.విశ్వేశ్వరరెడ్డి స్పందించారు. జగన్ దీక్షను ఉపయోగించుకుని... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లి ప్రత్యేక హోదా తేవాలని వై. విశ్వేశ్వరరెడ్డి ఈ సందర్బంగా చంద్రబాబును డిమాండ్ చేశారు. -
చంద్రబాబుది దుర్మార్గ పాలన
అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పాలనపై అనంతపురం జిల్లాకు చెందిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చాంద్‌బాషాలు మండిపడ్డారు. బుధవారం అనంతపురంలో వారు మాట్లాడారు. చంద్రబాబు పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. వారం రోజుల ముందే బెలుగుప్ప ధర్నాకు అనుమతి అడిగినా... ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తారా అంటూ టీడీపీ నేతలను విశ్వేశ్వరరెడ్డి నిలదీశారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలంటూ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌కు హితవు పలికారు. మరో ఎమ్మెల్యే చాంద్‌బాషా మాట్లాడుతూ... దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ఆర్ ని అభిమానించే వారందరిని చంపుతారా అని ప్రశ్నించారు. చంద్రబాబుది దుర్మార్గమైన పాలన అని చాంద్‌బాషా అభివర్ణించారు. -
'ఏపీ పరువు మంటగలిపారు'
-
'లంచం ఇవ్వజూపి ఏపీ పరువు మంటగలిపారు'
అనంతపురం: ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు అనేక కుట్రలు చేస్తున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలకు లంచం ఇవ్వజూపి, దానిని కప్పిపుచ్చుకునేందుకు కుట్రలకు పాల్పడున్నారని, అసలు ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రయోజనాల అంశం ఎక్కడుందని నిలదీశారు. బాబు కుటిల చర్యలు ఏపీ పరువును మంటగలపడంతోపాటు ప్రయోజనాలకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని విమర్శించారు. ఈ కేసును అడ్డం పెట్టుకుని తెలుగు ప్రజల మధ్య ఉద్రక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఇంత జరుగుతున్నా 'ఆడియో టేపుల్లో వాయిస్ నాది కాదు' అని చంద్రబాబు చెప్పలేకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. -
ఏడాదిలో పట్టిసీమ పూర్తయితే సభలో అడుగే పెట్టను!
వైఎస్సార్ సీపీ సభ్యుడు విశ్వేశ్వర్‌రెడ్డి సవాల్ సాక్షి, హైదరాబాద్: పట్టిసీమ ఎత్తిపోతలపై మంగళవారం అసెంబ్లీలో కొనసాగిన చర్చ సందర్భంగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. పట్టిసీమ ఎత్తిపోతల నిర్మాణాన్ని ప్రభుత్వం నిర్దేశించిన ఏడాది గడువులోపల పూర్తి చేస్తే సభలోకి అడుగే పెట్టనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్టు పని ఏదన్నా జరిగిందంటే అది మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనేనని మరో సభ్యుడు చిర్ల జగ్గిరెడ్డి స్పష్టం చేశారు. పట్టిసీమ జీవోలో రాయలసీమకు నీటి కేటాయింపు విషయం ఎక్కడుందో చెప్పాలని తాము కోరితే.. తామేదో రాయలసీమకే వ్యతిరేకమన్నట్టు మాట్లాడడం కుసంస్కారానికి నిదర్శనం కాదా? అని అధికారపక్షాన్ని విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆపిన చర్చను ఆయన మంగళవారం కొనసాగిస్తూ.. ఆ జీవోలో ‘వాటర్‌గ్రిడ్‌లో భాగంగా గోదావరి నుంచి కృష్ణాకు నీటి తరలింపు’ అనే పదం ఉందే తప్ప రాయలసీమ ప్రస్తావన లేదన్నారు. కృష్ణా డెల్టాకు నీళ్లు ఇవ్వకుండా రాయలసీమకు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పాలని నిలదీశారు. సీఎం ఏది చెబితే అది నమ్మడానికి తామేమీ గంగిరెద్దులం కాదన్నారు. రాయలసీమ ప్రాజెక్టుల కోసం తాను ఎలా పోరాడానో తన జిల్లా ప్రజలకు తెలుసునని, తనకు సీఎం గారి సర్టిఫికెట్ ఏమీ అవసరం లేదని తేల్చిచెప్పారు. మొత్తం బడ్జెట్లో నీటి పారుదల విభాగానికి రూ. 5 వేల కోట్లు కేటాయించి ఇన్ని ప్రాజెక్టులు ఎలా కడతారో చెప్పాలని నిలదీశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాయలసీమకు 13 వేల కోట్లు ఖర్చు చేస్తే బాబు తన 9 ఏళ్ల కాలంలో కేవలం 5 వేల కోట్లే ఖర్చు చేశారన్నారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు తొలిదశ పనులకు మరో వంద కోట్లు కేటాయిస్తే రెండు లక్షల ఎకరాలకు నీరు వచ్చేదని, కానీ బాబు ఆ పని చేయకపోవడమేనా రాయలసీమకు న్యాయం చేయడమంటే అని ప్రశ్నించారు. సర్ ఆర్దర్ కాటన్ తర్వాత గోదావరి డెల్టాకు ఏదైనా మేలు జరిగిందంటే అది దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనేనని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి చెప్పారు. -
మంత్రిగారూ.. మాట మరిచారా!
చిన్నారి గిరిజ కుటుంబానికి అందని పరిహారం 50 రోజులు దాటినా నెరవేరని మహేందర్‌రెడ్డి హామీ అధికారులు స్పందించడంలేదంటున్న కుటుంబ సభ్యులు మంచాల: బోరుబావిలో పడి అసువులు బాసిన చిన్నారి గిరిజ కుటుంబానికి ప్రభుత్వం పరిహారమిచ్చి ఆదుకుంటుందన్న మంత్రి మహేందర్‌రెడ్డి హామీ 50 రోజులు దాటినా ఆచరణకు మాత్రం నోచుకోవడంలేదు. పరిహారం విషయమై నిత్యం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం కానరావడంలేదని బాలిక కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమను అన్నివిధాలా ఆదుకుంటామని మంత్రి మాట ఇచ్చి మరిచిపోయారా అంటూ వారు ఆందోళన చెందుతున్నారు. వివరాలు.. మంచాలకు చెందిన గిరిజ (4), ఆమె అన్న చరణ్‌లు చిన్నమ్మ, అమ్మమ్మతో కలిసి అక్టోబర్ 12న వ్యవసాయ పొలం వద్దకు వెళ్లారు. పొలంలో కుటుంబ సభ్యులు పత్తి తీస్తుండగా గిరిజ ఆడుకుంటూ వెళ్లి సమీపంలోని బోరుబావిలో పడిపోయింది. దీంతో ఆ చిన్నారిని బయటికి తీసేందుకు అధికార యంత్రాంగం జేసీబీలు, హిటాచిల సహాయంతో మూడు రోజుల పాటు బోరు బావికి సమాంతరంగా తవ్వించారు. రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ విశ్వేశరరెడ్డి, కలెక్టర్ శ్రీధర్, జేసీ ఎంవీ రెడ్డిలతో పాటు జిల్లా యంత్రాంగమంతా మూడు రోజులు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి నిరాశే మిగిలింది. గిరిజ ప్రాణాలు దక్కలేదు. మృతదేహాన్ని బోరుబావిలోంచి బయటకు తీశారు. దీంతో గిరిజ కుటుంబాన్ని ఆదుకుంటామని, పరిహారం అందజేస్తామని మంత్రి మహేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన మాటిచ్చి 50 రోజులు దాటినా పరిహారం అందే జాడే కనిపించడంలేదని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిత్యం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండాపోతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కలెక్టర్‌ను కలిస్తే జేసీని కలవమని, జేసీ దగ్గరకు వెళితే తహసీల్దార్‌ను కలవమని, తహసీల్దార్‌ను కలిస్తే మంత్రిని కలవాలంటూ తిప్పించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ బాలరాజును వివరణ కోరగా.. మంత్రి మాట ఇచ్చిన మాట వాస్తవమేనన్నారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని తెలిపారు. -
వ్యూహం ఫలించింది.. విజయం వరించింది
తమదైన శైలిలో ఎంపీలుగా గెలిచిన విశ్వేశ్వర్‌రెడ్డి, మల్లారెడ్డి సాక్షి, రంగారెడ్డి జిల్లా : కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఇరువురు నేతలు.. అనూహ్యంగా పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాల నుంచి ఎంపీలుగా ఎన్నికయ్యారు. అయితే వారి గెలుపు వెనుక ఉన్న శ్రమ అంతా ఇంతా కాదు. చేవెళ్ల పార్లమెంట్ నుంచి బరిలో దిగిన టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గతేడాది చివర్లో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ అంతకు ఏడాది ముందు నుంచే పరోక్షంగా రాజకీయాల్లో ఉండి పరిస్థితులను సమీక్షిస్తూ వచ్చారు. అంతేకాకుండా చేవెళ్ల తన సొంతగడ్డ అంటూ ప్రజల్లోకి వెళ్లి స్థానిక నేతలతో మమేకం కావడంతో పాటు ప్రత్యేకించి కొందరు యువకులతో క్షేత్రస్థాయి పరిస్థితులపై అధ్యయనం చేయించారు. ఇలా ఎన్నికలకు ముందే పార్లమెంటు సెగ్మెంటులోని ప్రాంతాలపై అవగాహన పెంచుకున్న విశ్వేశ్వర్.. చేవెళ్లలో గులాభి దళపతి సమక్షంలో పార్టీలో చేరారు. అదే సమయంలో కేసీఆర్ టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించడంతో గెలుపు కోసం క్షేత్రస్థాయిలో కార్యాచరణకు దిగారు. ఆ తర్వాత ఎన్నికల సమయంలో సతీమణితో పాటు బంధువర్గాన్ని ప్రచారంలోకి దింపి ఓటర్లను ఆకర్షించడంతో సఫలీకృతులయ్యారు. పెద్దగా ప్రభావం లేని టీఆర్ఎస్ పార్టీని పటిష్టపరుస్తూ తన గెలుపునకు బాటలు వేసుకున్నారు. మరోవైపు తెలంగాణ సెంటిమెంటు కలిసి రావడంతో పాటు సోషల్ మీడియా తదితర టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకున్నారు. చివరకు అనుకున్నట్లుగా భారీ మెజార్టీతో బలమైన పార్టీలకు చెందిన ప్రత్యర్థులను మట్టికరిపించారు. సమన్వయం మల్లారెడ్డి విజయ రహస్యం... మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన చామకూర మల్లారెడ్డి సీఎంఆర్ విద్యాసంస్థల చైర్మన్. ఈ నేపథ్యంలో కొన్ని వర్గాలకు సుపరిచితులైనప్పటికీ రాజకీయాల్లోకి రావడం కొత్తే. అనూహ్యంగా టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. పూర్తిగా పట్టణ నియోజకవర్గం కావడం.. టీడీపీకి పట్టున్న ప్రాంతం.. మరోవైపు మోడీ గాలి.. వెరసి మల్లారెడ్డి విజయానికి మార్గం సుగమమైంది. అయితే ఇక్కడ పోటీచేసిన అభ్యర్థులంతా బడా నేతలే. స్థానికంగా బలమైన నేత మైనంపల్లి హన్మంతరావు, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి, లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి ప్రముఖుల ఎదుర్కొని చివరకు మల్లారెడ్డి విజయం సాధించారు. పార్టీకి కొత్త అయినప్పటికీ.. నియోజకవర్గంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అధినేతతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం ఆయనకు కలిసివచ్చిన అంశం. మరో వైపు పార్టీ శ్రేణులను, అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ అభ్యర్థులను సమన్వయం చేసుకుంటూ పనిచేశారు. మొత్తంమీద 30వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. -
టీఆర్ఎస్ను వీడటం వారి పొరపాటు
ఆలంపల్లి, న్యూస్‌లైన్ : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సానుకూల ప్రకటన చేసినందున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందనుకోవటం పొరపాటని టీఆర్ఎస్ పార్లమెంట్ ఇన్చార్జి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడంతో టీఆర్ఎస్ బలహీనపడుతుందన్న అభిప్రాయంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. టీఆర్ఎస్ను వీడిన కొందరు నాయకులు కాంగ్రెస్‌లో చేరడం పొరపాటన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం దశాబ్దానికి పైబడి టీఆర్ఎస్ సాగించిన ఉద్యమ ఫలితంగానే కాంగ్రెస్ దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన చేసిందని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. సాధారణ ఎన్నికల్లో 12 పార్లమెంటు సీట్లు టీఆర్ఎస్ గెల్చుకోవడం ఖాయమని అన్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేసి రెవెన్యూ, పోలీసు తదితర కీలక శాఖలను తమ ఆధీనంలో ఉంచుకోవాలని సీమాంధ్ర నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ సహా ఉద్యోగాలు, నీళ్లు, విద్యుత్ తదితర అన్ని వనరులు ఉన్న తెలంగాణ సాధన ధ్యేయంగా టీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. ఈ సందర్భంగా నవాబుపేట్ మాజీ సర్పంచ్ కల్యాణ్‌రావు తదితరులు టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, కార్మిక విభాగం అధ్యక్షుడు కృష్ణయ్య, మహిళా విభాగం అధ్యక్షురాలు స్వప్న, పార్టీ చేవెళ్ల ఇన్చార్జి దేశమోళ్ల ఆంజనేయులు, టీఆర్ఎస్ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎస్సీ సెల్ కార్యదర్శి రామస్వామి పాల్గొన్నారు.