
అనంతపురం జిల్లా: జేఎన్‌టీయూలో సెంట్రల్ యూనివర్సిటీ తాత్కాలిక భవనాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావుతో కలిసి ప్రారంభించారు. రాష్ర్ట విభజన హామీల్లో భాగంగా అనంతపురానికి సెంట్రల్ యూనివర్సిటీ మంజూరైంది. బుక్కరాయసముద్రం మండలం జంతలూరు గ్రామంలో 600 ఎకరాల భూమి కేటాయించినా ఇప్పటిదాకా ఎలాంటి కట్టడాలు ప్రారంభించలేదు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై విమర్శలు వెలువెత్తిన నేపథ్యంలో ఏపీ సెంట్రల్ యూనివర్సిటీని అనంతపురం జేఎన్‌టీయూలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు.
సెంట్రల్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఏపీని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కోరారు. రాష్ర్ట విభజన హామీల కోసం నాలుగేళ్లుగా పోరాడుతున్నాం..ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. ఏపీ హక్కుల కోసం వైఎస్సార్‌సీపీ అనేక రకాలుగా పోరాటాలు చేస్తోందని, ఏపీ న్యాయం చేయాలని విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment