prakash jawadekar
-
యూపీ మాజీ సీఎంపై కేసు నమోదు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జర్నలిస్టులపై దాడి చేశారనే ఆరోపణలతో మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, 20 మంది సమాజ్‌వాది పార్టీ కార్యకర్తలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అఖిలేష్ యాదవ్ సమక్షంలో పార్టీ కార్యకర్తలు జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డారు. సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడి భద్రతా సిబ్బంది జర్నలిస్టులను నెట్టివేయడంతో వారికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఇరు వర్గాలవారు వేరువేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారని యూపీ శాంతి భద్రతల ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. వారి ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ఘటనను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మీడియా సలహాదారు షలాబ్‌మణి త్రిపాఠి తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టులు ప్రశ్నలు అడుగుతున్నారని సమాజ్ వాది పార్టీ కార్యకర్తలు వీధిరౌడీల మాదిరిగా జర్నలిస్టులపై దారుణంగా దాడి చేశారని ఆరోపించారు. అదే విధంగా ఈ ఘటనపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పందిస్తూ.. భారతదేశ ప్రజాస్వామ్యానికి భావప్రకటనా స్వేచ్ఛ ప్రధానమైందని గుర్తుచేశారు. జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు ట్విటర్లో పేర్కొన్నారు. (చదవండి:ట్రాక్టర్ ర్యాలీకి డీజిల్ నిషేధం బీజేపీ కుట్ర: అఖిలేష్ యాదవ్) -
ప్రధాని సూచనలను అందరూ పాటించాలి
-
ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఘనంగా జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ కార్యక్రమాని కి ముఖ్యఅతిథులుగా హాజరై అవార్డు గ్రహీతలకు పురస్కారాలు ప్రదానం చేశారు. తెలంగాణ నుంచి నలుగులు, ఏపీ నుంచి ఒకరిని పురస్కారాలు వరించాయి. అవార్డు గ్రహీతల కు జ్ఞాపిక, ప్రశంసాపత్రంతోపాటు రూ.50 వేల నగదు పురస్కారాన్ని ప్రదానం చేశారు. విద్యార్థులకు సులువైన పద్ధతుల్లో విద్యాబోధన, సృజనాత్మకత పెంపులో, పాఠశాలల్లో విద్యార్థుల చేరిక సంఖ్య పెంచడం వంటి అంశాల్లో చేసిన కృషికి గుర్తింపుగా కేంద్రం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పురస్కారాలు ప్రదానం చేస్తోంది. విద్యాబోధనలో అధ్యాపకులు అనుసరిస్తున్న వినూత్న విధానాలను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. శేష ప్రసాద్ నుడుపల్లి,ఆంగ్ల అధ్యాపకురాలు, బేగంపేట బేగంపేట కేంద్రీయ విద్యాలయంలో పనిచేస్తున్న ఆంగ్ల అధ్యాపకురాలు శేష ప్రసాద్ నుడుపల్లికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం దక్కింది. కేవలం మార్కుల కోసమే కాకుండా నిజజీవితంలో ఆంగ్లం ప్రాధాన్యతను గుర్తించి విద్యార్థులను సమాయత్తం చేస్తున్నందుకు కేంద్రం పురస్కారాన్ని ప్రదానం చేసిం ది. ఆంగ్లంపై విద్యార్థుల్లో ఆసక్తి కలిగించేందుకు, ఇతర కార్యక్రమాల్లో ఆంగ్ల భాషను ప్రోత్సహిస్తున్న విధానాలను కేంద్రం గుర్తించింది. బీఎస్ రవి, హెడ్మాస్టర్, జోగులాంబ గద్వాల జిల్లా పాఠశాలలో విద్యార్థుల చేరిక సంఖ్యను పెంచి విద్యా బోధనలో సులువైన సంక్షిప్త విధానాలను రూపొందించడంలో కృషి చేసినందుకు జోగులాంబ గద్వాల జిల్లా అమరావతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ బీఎస్ రవి పురస్కారాన్ని అందుకున్నారు. లైబ్రరీ, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్స్‌పై అవగాహన కల్పిస్తున్నందుకు ఈ పురస్కారం వరించింది. నర్రా రామారావు, హెడ్మాస్టర్, నిజామాబాద్ వీధిబాలలను, పేదరికంలో ఉన్న వారిని విద్యావంతులను చేయడంలో విశేష కృషి చేస్తున్నందుకుగాను నిజామాబాద్ జిల్లా బోర్గాం (పి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ నర్రా రామారావును పురస్కారం వరించింది. కార్మికుల పిల్లలను గుర్తించి, వారిని పాఠశాలలో చేర్పించి విద్యావంతులను చేస్తున్న తీరును కేంద్రం గుర్తించింది. బండారి రమేశ్, స్కూల్ అసిస్టెంట్, వరంగల్ అర్బన్ సెకండరీ స్థాయిలో గణితం బోధనలో 150 సంక్షిప్త విధానాలను ప్రవేశపెట్టి, సులువైన పద్ధతిలో విద్యాబోధన చేస్తున్నందుకు గుర్తింపుగా వరంగల్ అర్బన్ జిల్లా వెంకటాపురం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల స్కూల్ అసిస్టెంట్ బండారి రమేశ్‌ను పురస్కారం వరించింది. సుసత్యరేఖ, గణితం అధ్యాపకురాలు, రాజమహేంద్రవరం గణితం, సైన్స్ బోధనలో టెక్నాలజీని ఉపయోగించి నూతన పద్ధతిలో విద్యాబోధన చేస్తున్నందుకు గుర్తింపుగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎయిడెడ్ ఉన్నత పాఠశాల అధ్యాపకురాలు మేకా సుసత్యరేఖ పురస్కారాన్ని అందుకున్నారు. యాప్‌తో పాటు యూట్యూబ్ వీడియోలు, బ్లాగ్స్ ద్వారా సృజనాత్మక ధోరణిలో ఆమె అవలంబిస్తున్న విద్యా బోధనను కేంద్రం గుర్తించింది. ఈ విధానాల ద్వారా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించటం పట్ల ప్రశంసించింది. -
మానవతా దృక్పథంతో ఏపీని ఆదుకోవాలి
అనంతపురం జిల్లా: జేఎన్టీయూలో సెంట్రల్ యూనివర్సిటీ తాత్కాలిక భవనాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావుతో కలిసి ప్రారంభించారు. రాష్ర్ట విభజన హామీల్లో భాగంగా అనంతపురానికి సెంట్రల్ యూనివర్సిటీ మంజూరైంది. బుక్కరాయసముద్రం మండలం జంతలూరు గ్రామంలో 600 ఎకరాల భూమి కేటాయించినా ఇప్పటిదాకా ఎలాంటి కట్టడాలు ప్రారంభించలేదు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై విమర్శలు వెలువెత్తిన నేపథ్యంలో ఏపీ సెంట్రల్ యూనివర్సిటీని అనంతపురం జేఎన్టీయూలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. సెంట్రల్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఏపీని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కోరారు. రాష్ర్ట విభజన హామీల కోసం నాలుగేళ్లుగా పోరాడుతున్నాం..ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. ఏపీ హక్కుల కోసం వైఎస్సార్సీపీ అనేక రకాలుగా పోరాటాలు చేస్తోందని, ఏపీ న్యాయం చేయాలని విన్నవించారు. -
ఆ విద్యా సంస్థలకు రూ లక్ష కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక వసతుల మెరుగుదలకు కేంద్రం భారీగా నిధులు వెచ్చించనుంది. ఆయా సంస్థల్లో మౌలిక వసతుల ఆధునీకరణకు ఉన్నత విద్య ఫండింగ్ ఏజెన్సీ (హెచ్ఈఎఫ్ఏ) రూ లక్ష కోట్లు ఖర్చు చేస్తుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. 2022 నాటికి ఉన్నత విద్యా రంగంలో మౌలిక సౌకర్యాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించి, వ్యవస్థలను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్రం భారీగా నిధులను వెచ్చించాలని నిర్ణయించిందని చెప్పారు. ఉన్నత విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులకు అదనంగా హెచ్ఈఎఫ్ఏ నిధులు సమకూరుస్తుందన్నారు. గత నాలుగేళ్లలో విద్యా రంగంలో బీజేపీ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులను చేపట్టిందని ప్రకాష్ జవదేకర్ తెలిపారు. కాగా, నరేంద్ర మోదీ ప్రభుత్వం 2016-17 కేంద్ర బడ్జెట్లో హెచ్ఈఎఫ్ఏ ఏర్పాటును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ నిధులను సమీకరించి ఉన్నత విద్యాసంస్థలకు వడ్డీరహిత రుణాలుగా నిధులను అందుబాటులోకి తెస్తుంది. హెచ్‌ఈఎఫ్‌ఏను ఆర్బీఐ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థగా (ఎన్బీఎఫ్సీ) గుర్తించింది. -
కుమారస్వామి వ్యాఖ్యలపై స్పందించిన జవదేకర్
-
బీజేపీ నాయకులెవరూ నన్ను సంప్రదించలేదు
-
‘సుపరిపాలన కోరుకున్నారు’
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక ప్రజలు సుపరిపాలను కోరుకున్నారని..అందుకే బీజేపీకి పట్టం కట్టారని ఆ పార్టీ కర్ణాటక ఇన్ఛార్జ్ ప్రకాష్ జవదేకర్ అన్నారు. తాము వరుసగా ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకుంటుండగా కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోతోందని అన్నారు. మరోవైపు కర్ణాటకలో బీజేపీ విజయంపై ఆ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మేజిక్ ఫిగర్‌కు చేరువైంది. ఎన్నికలు జరిగిన 222 స్ధానాలకు గాను బీజేపీ 115 సీట్లలో ఆధిక్యం కనబరుస్తుండగా కాంగ్రెస్ 66 స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక జేడీఎస్ 39 స్ధానాలకు పరిమితం కాగా, ఇతరులు 2 స్ధానాల్లో ముందంజలో ఉన్నారు. -
ఓటమిని కూడా గెలుపుగా భ్రమించి..!
న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల్లో ఓటమి ఎదురైనా.. గెలిచినట్టు భ్రమపడి కాంగ్రెస్ పార్టీ ఆనందపడుతోందని బీజేపీ ఎదురుదాడి చేసింది. గుజరాత్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రధాని మోదీపై నిప్పులు చెరుగుతూ రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి, బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ కౌంటర్ ఇచ్చారు. పరాజయాన్ని కూడా గెలుపుగా భ్రమించి ఆనందపడుతున్నారని రాహుల్‌ను ఆయన ఎద్దేవా చేశారు. 'గుజరాత్ ఫలితాలపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు.. ప్రజాతీర్పును అవమానించడమే. వారసత్వ అహంకారం ఈ వ్యాఖ్యల్లో కనిపిస్తోంది' అని మండిపడ్డారు. గుజరాత్ ఫలితాలు బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ అన్న రాహుల్ వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకే ఎదురుదెబ్బ అని పేర్కొన్నారు. రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందంలో ఎలాంటి కుంభకోణం జరగలేదని, ఇది పాదర్శకంగా జరిగిందని ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. అమిత్‌షా కొడుకు జయ్ షా కూడా నిబంధనలకు అనుగుణంగా వ్యాపారం చేశాడని వివరణ ఇచ్చారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినా.. నైతిక విజయం మాత్రం కాంగ్రెస్‌దేనని రాహుల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. విశ్లేషకులు, మీడియా ఊహకు అందని రీతిలో కాంగ్రెస్ సీట్లను కైవసం చేసుకుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. మోదీ మోడల్ అన్నది ఓ ప్రచార స్టంట్‌గానే మిగిపోయిందని, బీజేపీ వెన్నులో వణుకు పుట్టించామని, ఈ ఫలితాలు బీజేపీకి పెద్ద దెబ్బ అని అన్నారు. ప్రచారంలో మోదీ అభివృద్ధి గురించి ఒక్క మాటా మాట్లాడలేదని... కానీ, ఇప్పుడు గెలిచాక అభివృద్ధి వల్లే తాము గెలిచామంటూ చెప్పుకుంటున్నారన్నారు. ఈ లెక్కన మోదీ విశ్వసనీయత కోల్పోయినట్లేనని రాహుల్ పేర్కొన్నారు. -
స్మృతి ఇరానీ అలిగారా?
కేంద్ర మంత్రివర్గంలో అత్యంత కీలక శాఖల్లో ఒకటి... మానవ వనరుల మంత్రిత్వ శాఖ. నిన్న మొన్నటి వరకు ఈ శాఖ స్మృతి ఇరానీ వద్ద ఉండగా, తాజా మార్పులలో భాగంగా ఇది ప్రకాష్ జవదేకర్‌కు వెళ్లింది. జవదేకర్ తన కొత్త బాధ్యతలను గురువారం చేపట్టారు. స్మృతి ఇరానీకి అంతగా ప్రాధాన్యం ఏమీ లేని చేనేత, జౌళి శాఖ దక్కింది. ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలలో స్మృతి మీద జోకులు బాగానే పేలాయి. దాంతో ఆమె అలిగినట్లు కనపడుతున్నారు. గురువారం నాడు ప్రకాష్ జవదేకర్ మానవ వనరుల మంత్రిత్వశాఖ బాధ్యతలు చేపట్టిన కార్యక్రమానికి ఆమె డుమ్మా కొట్టారు. సాధారణంగా అయితే.. మంత్రులు శాఖలు మారినప్పుడు పాత మంత్రి దగ్గరుండి కొత్త మంత్రికి ఆ బాధ్యతలు అప్పగించడం, కుర్చీ చూపించడం అనవాయితీ. ఇతర శాఖల్లో కూడా ఇలాగే జరిగింది. కానీ, తన ప్రాధాన్యాన్ని గణనీయంగా తగ్గించడం, దానికి తోడు తన మీద సోషల్ మీడియాలో జోకులు పేలడంతో ఆమె నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆమె ప్రకాష్ జవదేకర్‌కు దగ్గరుండి బాధ్యతలు అప్పగించకుండా.. అసలు ఆ కార్యక్రమానికే రాకుండా ఊరుకున్నారని అంటున్నారు. -
'సీఎంలు ఇద్దరు కలిసి పనిచేయాలి'
హైదరాబాద్: రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విద్వేషాలు రెచ్చకుండా కలిసి పనిచేయాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సూచించారు. విభజనతో కేవలం రాజకీయ సరిహద్దులు మాత్రమే మారాయన్న ఆయన.. రెండు రాష్ట్రాలు వివాదాల జోలికి వెళ్లకుండా అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యాప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమంలో ప్రకాశ్ జవదేకర్, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 'హరితహారం' కార్యక్రమం బాగుందన్నారు. "క్లీన్ ఇండియా.. గ్రీన్ ఇండియా" కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేస్తామని ప్రకాశ్ జవదేకర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. -
టీడీపీ- బీజేపీ పొత్తులో ప్రతిష్టంభన
తెలుగుదేశం పార్టీ- బీజేపీల మధ్య పొత్తులపై ప్రతిష్టంభన ఏర్పడింది. తెలంగాణ ప్రాంతంలో తమకు 65 ఎమ్మెల్యే టికెట్లు, 11 ఎంపీ టికెట్లతో పాటు సీఎం అభ్యర్థి కూడా తమవాళ్లే ఉండాలన్న షరతులకు అంగీకరిస్తేనే పొత్తు ఉంటుందని బీజేపీ పట్టుబడుతోంది. సరిగ్గా ఇదే అంశం మీద ప్రతిష్ఠంభన ఏర్పడినట్లు సమాచారం. ఈ రెండు పార్టీల మధ్య పొత్తును ఖరారు చేసేందుకు బీజేపీ అధిష్ఠానం దూతగా వచ్చిన ప్రకాశ్ జవదేకర్ శుక్రవారం కూడా హైదరాబాద్‌లోనే ఉండబోతున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వివిధ జిల్లాల పార్టీ అధ్యక్షుటు, పదాధికారులతో ఆయన సమావేశం నిర్వహించనున్నారు. శుక్రవారం సాయంత్రానికల్లా పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.