
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక ప్రజలు సుపరిపాలను కోరుకున్నారని..అందుకే బీజేపీకి పట్టం కట్టారని ఆ పార్టీ కర్ణాటక ఇన్‌ఛార్జ్ ప్రకాష్ జవదేకర్ అన్నారు. తాము వరుసగా ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకుంటుండగా కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోతోందని అన్నారు. మరోవైపు కర్ణాటకలో బీజేపీ విజయంపై ఆ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి హర్షం వ్యక్తం చేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మేజిక్ ఫిగర్‌కు చేరువైంది. ఎన్నికలు జరిగిన 222 స్ధానాలకు గాను బీజేపీ 115 సీట్లలో ఆధిక్యం కనబరుస్తుండగా కాంగ్రెస్ 66 స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక జేడీఎస్ 39 స్ధానాలకు పరిమితం కాగా, ఇతరులు 2 స్ధానాల్లో ముందంజలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment