
సాక్షి, అనంతపురం: ఉద్యోగాల కల్పనలో దేశంలోనే నంబర్ వన్‌గా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించిందని మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు సత్వర పరిష్కరించడానికే గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను కేవలం ఐదునెలల్లో నెరవేర్చి ఇతర నాయకుల కంటే తాను భిన్నమైన నేతగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరూపించుకున్నారన్నారు.
ప్రజలకు నమ్మకం కలిగింది..
వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలకు రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం కలిగిందని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రతి పక్షాల పాత్ర నామ మాత్రమేనని చెప్పారు.