
సాక్షి, అమరావతి: సీఎం సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను పలువురు అభినందిస్తున్నారు. ఈ క్రమంలో కోవిడ్ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం వ్యాపారవేత్తలు, సొసైటీలు, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు తరపున రూ.51 లక్షల 86 వేల రూపాయల విరాళాన్ని అందించారు. విరాళం చెక్కును సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకటరావు అందజేశారు. (చదవండి: కరోనా నిర్ధారణలో ‘ర్యాపిడ్’ విప్లవం)
Comments
Please login to add a commentAdd a comment