donated
-
ఆమె.. ఆయనలో సగభాగం.. భర్తకు పునర్జన్మనిచ్చిన భార్య
సాక్షి, ఖమ్మం జిల్లా: వివాహం జన్మజన్మల అనుబంధమని, చెరోసగంగా భార్యాభర్తలు జీవనం సాగించడం అన్యోన్య దాంపత్యమని పెద్దలు చెబుతారు. ఈ తరహాలోనే ఓ మహిళ తన భర్తను బతికించుకునేందుకు కాలేయదానం చేసి ఆయనలో సగభాగంగా మారడమే కాదు.. కలకాలం కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని పెళ్లి రోజున చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి నిలిచినట్లయింది.రఘునాథపాలెం మండలం పెద్ద ఈర్లపూడికి చెందిన ధారావత్ శ్రీను ఖమ్మంలోని ఏపీజీవీబీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన భార్య లావణ్య ఎల్ఎల్బీ చివరి సంవత్సరం చదువుతుండగా వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం శ్రీను అనారోగ్యం బారిన పడడంతో ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. కామెర్లు సోకగా కాలేయం సమస్య ఎదురైందని వైద్యులు గుర్తించారు.ఆపై హైదరాబాద్‌లో చికిత్స చేయించుకున్నా నయం కాలేదు. అంతేకాక వివిధ పరీక్షల అనంతరం కాలేయ మార్పిడి మాత్రమే శ్రీనును బతికిస్తుందని వైద్యులు తేల్చిచెప్పారు. దీంతో కాలేయదానం చేసే వారి కోసం ఆరా తీస్తుండగా లావణ్యే ముందుకొచి్చంది. తన భర్తను కాపాడుకోవడానికి లివర్ ఇస్తానని చెప్పడంలో పరీక్షలు చేసిన వైద్యులు సరిపోతుందని నిర్ధారించారు. ఈ మేరకు లావణ్య లివర్ నుంచి 65శాతం మేర తీసిన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఈనెల 16న శస్త్రచికిత్స ద్వారా శ్రీనుకు అమర్చారు. ప్రస్తుతం దంపతులిద్దరూ ఆరోగ్యంగా ఉండగా కోలుకుంటున్నారని కుటుంబీకులు తెలిపారు.భర్తకు లివర్ దానం చేసి బతికించుకున్న భార్యఖమ్మం - పెద్ద ఈర్లపూడికి చెందిన ధారావత్ శ్రీను లివర్ సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లగా లివర్ మార్చాల్సిందేనని వైద్యులు చెప్పారు. కానీ, ఎంత వెతికినా డోనర్ దొరక్కపోవడంతో అతని భార్య లావణ్య ముందుకొచ్చింది. ఆమె… pic.twitter.com/Jh0mA4IyaM— Telugu Scribe (@TeluguScribe) November 21, 2024 -
మా కోసం పది లక్షలు విరాళం
మూవీ ఆర్టిస్ట్స్’ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు విష్ణు మంచు పది లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. తన మూడో కుమార్తె (విష్ణు–విరానికా దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు) ఐరా విద్యా మంచు జన్మదినం (ఆగస్టు 9) సందర్భంగా ‘మా’ అసోసియేషన్‌లో ఆర్థికంగా వెనకబడిన కళాకారుల సంక్షేమం కోసం ఆయన ఈ విరాళాన్ని అందించారు.కళాకారుల సంరక్షణ, సహాయాల నిమిత్తం ఈ నగదుని వెచ్చించనున్నారు. అలాగే ‘మా’ భవనంపై కూడా విష్ణు మంచు దృష్టి సారించారని తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే...ప్రస్తుతం విష్ణు మంచు హీరోగా ‘కన్నప్ప’ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా డిసెంబరులో రిలీజ్ కానుంది. -
200 కోట్ల ఆస్తిని దానం చేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు
గాంధీ నగర్ : వాళ్లిద్దరూ భార్యభర్తలు. వ్యాపార సామ్రాజ్యం. వందల కోట్లలో ఆస్తులు. సమాజంలో బోలెడంత పలుకుబడి. కానీ పైవేవి వాళ్లిద్దరికి సంతృప్తినివ్వలేదు. అందుకే ఇప్పటికే సన్యాసం స్వీకరించిన కొడుకు, కుమార్తెల బాటలోనే నడిచేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు ఈ కుబేరుల నిర్ణయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గుజరాత్ సబర్కాంత జిల్లా వాసి భావేష్ భండారి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కొద్ది మొత్తం పెట్టుబడితో వ్యాపారంలోకి అడుగుపెట్టారు. రోజులు గడుస్తున్నాయి. వ్యాపారం ఊపందుకుంది. ఊహించనంత లాభాల్ని కళ్ల జూశారు. ఆస్తుల్ని కూడబెట్టుకున్నారు. కానీ ఈ ఆస్తి పాస్తులు, వ్యాపారం ఆ దంపతులకు ఏ మాత్రం సంతృప్తి నివ్వలేదు. పిల్లల బాటలో తల్లిదండ్రులు చివరికి భావేష్ బండారి దంపతులిద్దరి 19 ఏళ్ల కుమార్తె , 16 ఏళ్ల కుమారుడు బాటలో నడిచేందుకు సిద్ధమయ్యారు. పిల్లలిద్దరూ 2022లో సన్యాసం తీసుకున్నారు. వారి నుంచి ప్రేరణ పొందిన భావేష్ బండారి దంపతులు.. తమ పిల్లలులాగే తాము కూడా భౌతిక అనుబంధాలను త్యజించి, సన్యాసి మార్గంలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. 200 కోట్లు విరాళం సన్యాసానికి సంబంధించి ఫిబ్రవరిలో జరిగిన ఓ వేడుకలో భావేష్ భండారి, అతని భార్య తమ సంపద రూ.200 కోట్ల మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. ఏప్రిల్ 22న జరిగే కార్యక్రమంలో అధికారికంగా సన్యాసం తీసుకోనున్నారు. మోక్షం పొందేదుకు యాత్రకు బయలుదేరాలని ప్లాన్ చేస్తున్నారు. చెప్పులు లేకుండా భండారీ దంపతులు, మరో 35 మందితో కలిసి నాలుగు కిలోమీటర్ల మేర ఊరేగింపుగా బయలు దేరనున్నారు. అక్కడ వారు తమ యావదాస్తుల్ని వదిలేయనున్నారు. ఆ తర్వాత రెండు తెల్లని వస్త్రాలు ధరిస్తారు. భిక్ష కోసం ఒక గిన్నె తీసుకుని దేశం అంతటా చెప్పులు లేకుండా ప్రయాణిస్తారు. భిక్షతో మాత్రమే జీవిస్తారు. -
రూ.లక్ష కోట్లకు పైగా విరాళం - ఈమె బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకవుతారు!
చాలా మంది ధనవంతులు డబ్బు కూడబెట్టే కొద్దీ ఇంకా పోగు చేయాలి, ఇంకా గొప్పవాళ్ళైపోవాలి అని ఆలోచించడం సర్వ సాధారణం. అయితే కొందరు మాత్రమే వారికున్నదాంట్లో చాలా వరకు పేదలకు లేదా మంచి పనులను భారీగా విరాళం అందిస్తారు. ఇలాంటి కోవకు చెందిన అతి తక్కువ మందిలో 'మెకెంజీ స్కాట్' (MacKenzie Scott) ఒకరు. ఇంతకీ ఈమె ఎవరు? ఇప్పటి వరకు ఎంత దానం ఇచ్చింది? బ్యాగ్రౌండ్ ఏంటి అనే మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం. అమెరికాకు చెందిన ప్రముఖ నవలా రచయిత్రి అయిన 'మెకెంజీ స్కాట్' ఇప్పటి వరకు సుమారు రూ.1,19,522 కోట్లకుపైగా విరాళంగా ఇచ్చింది. అంతే కాకుండా తాను బ్రతికి ఉండే వరకు, తనకు వచ్చే ఆదాయంలో సగానికి పైగా విరాళంగా ఇస్తానని ప్రతిజ్ఞ కూడా చేసినట్లు సమాచారం. నిజానికి ఈమె (మెకెంజీ స్కాట్) అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య. 1993లో ఈమె జెఫ్ బెజోస్‌ను పెళ్లి చేసుకుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల 2019లో విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో ఆమెకు భరణంగా అందిన డబ్బు కారణంగానే ప్రపంచంలోని అత్యంత ధనిక మహిళలలో ఒకరుగా నిలిచారు. 1907లో కాలిఫోర్నియాలో జన్మించిన మెకెంజీ స్కాట్ ఆరు సంవత్సరాల వయసులోనే కథలు రాయడం మొదలుపెట్టింది. చిన్నతనంలోనే 'ది బుక్ వార్మ్' అనే 142 పేజీల బుక్ రాసినట్లు, అది వరదల్లో కొట్టుకుపోయినట్లు సమాచారం. స్కాట్ ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ (ఇంగ్లీష్) పూర్తి చేసింది. అంతే కాకుండా ఈమె సాహిత్యంలో నోబెల్ గ్రహీత 'టోని మోరిసన్' వద్ద చదువుకుంది. మెకెంజీ స్కాట్ చదువు పూర్తయిన తరువాత న్యూయార్క్ నగరంలోని ఓ కంపెనీలో పనిచేసింది, ఆ సంస్థలోనే జెఫ్ బెజోస్ కూడా పనిచేశారు. ఆ సమయంలో ఆ ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారి 1993లో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత అమెజాన్ స్థాపించి ఇద్దరూ దానిని బాగా అభివృద్ధి చేసారు. ఇదీ చదవండి: ఉద్యోగులకు అవి ఇవ్వలేకపోయాను!.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి 2019లో మెకెంజీ స్కాట్, జెఫ్ బెజోస్‌తో విడాకులు తీసుకున్న తరువాత రూ. 2,53,600 కోట్ల విలువైన స్టాక్స్ అందుకుంది. ప్రస్తుతం ఈమె విద్య, ఆరోగ్యం, సామజిక న్యాయం, పర్యావరణం వంటి వివిధ అంశాలకు మద్దతు పలుకుతూ వేలకోట్ల రూపాయలు విరాళంగా అందిస్తూ ప్రపంచంలో ఎక్కువ విరాళాలు అందించినవారి జాబితాలో ఒకరుగా నిలిచింది. -
ఐటీ సర్వ్ అలయెన్స్ ఉదారత.. టాస్క్‌కి రూ. 80 వేలు విరాళం!
అమెరికాలోని ఐటీ సర్వ్ అలయెన్స్ (ఐటీ సర్వీస్ అలియన్స్) నార్త్ ఈస్ట్ చాప్టర్ మరోసారి తన ఉదారతను చాటుకుంది. న్యూజెర్సీలో సీఎస్ఆర్ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా థాంక్స్ గివింగ్ చేపట్టింది. నార్త్ ఈస్ట్ చాప్టర్ అధ్యక్షుడు కళ్యాణ్ విజయ్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ ఫుడ్ బ్యాంక్ అయిన ట్రెంటన్ ఏరియా సూప్ కిచెన్ (టాస్క్) కి 1,000 డాలర్ల విరాళం అందజేశారు. ఈ మేరకు ఐటీ సర్క్ సభ్యులు టాస్క్ నిర్వహకులకు చెక్ అందజేశారు. ఈ సందర్భంగా టాస్క్ ఫుడ్ బ్యాంక్‌ను ఐటీ సర్వ్ సభ్యులు సందర్శించారు. టాస్క్ చేస్తున్నసేవా కార్యక్రమాలతో పాటు ఆహారం తయారు చేసే విధానాన్ని ఐటీ సర్వ్ సభ్యులకు నిర్వహకులు వివరించారు. ట్రెంటన్ నగరంలో ఆకలితో మరియు కష్టాల్లో ఉన్న వారి అవసరాలను తీర్చే ఒక అద్భుతమైన సంస్థ టాస్క్ అని ఈ సందర్భంగా కళ్యాణ్ విజయ్ పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమాల్లో భాగమైనందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఐటీ సర్క్ అలయన్స్ తరుపున సహాయం చేసే అవకాశం వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఐటీ సర్వ్ అలయన్స్ ఉదారతను టాస్క్ ప్రశంసించింది. ఈ ఆర్థిక సాయం ఎంతో మందికి ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. సంస్థ చేస్తున్న సేవాకార్యక్రమాల్లో భాగమై ఆర్థిక సహాయసహాకారాలు అందించినందుకు ఐటీ సర్వ్ అలయన్స్ కు ధన్యవాదాలు తెలిపారు. ఐటీ సర్వ్ అలయెన్స్ అనేది ఐటీ రంగానికి చెందిన 1400 కంపెనీలతో ఏర్పడిన ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అమెరికాలోని 22 రాష్ట్రాలలో ఉన్న 19 చాప్టర్లలో ఈ సంస్థ ఐటీ సేవలను అందిస్తోంది. ఈ సంస్థలో ఉన్న ఐటీ కంపెనీల మొత్తం ఆదాయం 10 బిలియన్ డాలర్లు. లక్ష మంది ఐటీ నిపుణులు ఈ సంస్థల్లో పనిచేస్తున్నారు. (చదవండి: ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఏఏఏ ఆస్టిన్ చాప్టర్ ప్రారంభం) -
శ్రీవారి ఆలయ అలంకరణకు వీవీఎస్ లక్ష్మణ్ విరాళం
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారిని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మాజీ క్రికెటర్ వివిఎస్.లక్ష్మణ్ స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీవారి ఆలయంకు ఒక్క రోజు అలంకరణకు అయ్యే ఖర్చును వీవీఎస్ లక్ష్మణ్ విరాళంగా అందించారు. దాదాపు రూ.14 లక్షలు విరాళంగా ఇచ్చిన ఆయన, శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం మొదలుకుని శ్రీవారి గర్భాలయం వరకూ టీటీడీ ఉద్యానవనం సిబ్బంది వివిధ రకాల కట్ ప్లవర్స్ అలంకరణను ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రద్ధగా గమనించారు. చదవండి: ‘గగన్‌యాన్’ TV-D1 ప్రయోగం సక్సెస్ -
అపరిచితుడికి కిడ్నీ దానం.. అపర దాన కర్ణుడు ఈ బిలియనీర్..
రూ.9 వేల కోట్ల నెట్‌వర్త్‌తో దేశంలో అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తలలో ఒకరు కోచౌసెఫ్ చిట్టిలపిల్లి. రూ. 1 లక్షతో చిన్న కంపెనీని ప్రారంభించిన ఆయన రూ. 11వేల కోట్లకు పైగా మార్కెట్ క్యాప్‌తో వి-గార్డ్ ఇండస్ట్రీస్, దాదాపు రూ. 2,500 కోట్లతో వండర్లా హాలిడేస్ వంటి కంపెనీలను స్థాపించి అభివృద్ధి చేశారు. వ్యాపారపరంగా ఇంత ఎత్తుకు ఎదిగిన కోచౌసెఫ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది దశాబ్దం ఆయన క్రితం చేసిన నిస్వార్థ చర్య. కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన కోచౌసెఫ్ 61 ఏళ్ల వయసులో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అది తన కిడ్నీని దానం చేయడం. అది కూడా అపరిచితుడైన ఒక పేద ట్రక్కు డ్రైవర్‌కు. ఇందుకు కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపినా పట్టించుకోలేదు. వైద్యులు వారించినా లెక్క చేయలేదు. తాను ఇలా చేసింది.. శరీరం ఫిట్‌గా ఉంటే కిడ్నీలో ఒకదానిని దానం చేసినా ఫర్వాలేదని చాటి చెప్పడానికేనని తర్వాత ఓ ప్రముఖ దినపత్రికతో తెలిపారు. ఎవరీ కోచౌస్ఫ్ కోచౌసెఫ్ చిట్టిలపిల్లి? కేరళలోని త్రిస్సూర్ శివారులో 1950లో జన్మించారు కోచౌసెఫ్ చిట్టిలపిల్లి. స్థానిక చర్చి పాఠశాలలో చదువుకున్నారు. తరువాత త్రిసూర్‌లోని సెయింట్ థామస్ కళాశాల నుంచి భౌతికశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. 1973లో తిరువనంతపురంలోని ఎలక్ట్రానిక్స్ కంపెనీలో వోల్టేజ్ స్టెబిలైజర్లు, ఎమర్జెన్సీ ల్యాంప్‌లను తయారు చేయడం ప్రారంభించారు. మూడేళ్లపాటు అక్కడ సూపర్వైజర్గా పనిచేసిన కోచౌసెఫ్ ఉద్యోగం వదిలేసి రూ. 1 లక్ష మూలధనంతో 1977లో వి-గార్డ్ ఇండస్ట్రీస్‌ను స్థాపించారు. కేవలం ఇద్దరు ఉద్యోగులతో ప్రారంభమైన వి-గార్డ్ నేడు దేశంలోనే అతిపెద్ద స్టెబిలైజర్ బ్రాండ్. తన వ్యాపారాన్ని విస్తృతం చేస్తూ కోచౌసెఫ్ 2000 సంవత్సరంలో కేరళలో మొట్టమొదటి వాటర్ థీమ్ పార్క్‌ను ప్రారంభించారు. అలాగే బెంగళూరులో వండర్లా పార్కును ఏర్పాటు చేసింది కూడా ఈయనే. ఇక సేవా కార్యక్రమాల విషయానికి వస్తే.. కె. చిట్టిలపిల్లి ఫౌండేషన్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వెయ్యి నిరుపేద కుటుంబాలకు ఇళ్లు కట్టించి ఇచ్చారు. స్ట్రే డాగ్ ఫ్రీ ఉద్యమానికి అధ్యక్షత వహించారు. అత్యధిక పన్ను చెల్లింపుదారులలో ఒకరిగా భారత ప్రభుత్వం నుంచి రాష్ట్రీయ సమ్మాన్ అవార్డుతో సహా అనేక పురస్కారాలు అందుకున్నారు. ప్రాక్టికల్ విజ్డమ్ సిరీస్, తన ఆత్మకథ ‘ఒర్‌మక్కిలివాథిల్’తో సహా పలు పుస్తకాలను రచించారు. కోచౌసెఫ్ సతీమణి పేరు షీలా. వీరికి అరుణ్, మిథున్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు వి-గార్డ్, వండర్లా వ్యాపారాలను చూసుకుంటున్నారు. -
అధ్యాపకుడి అరుదైన చదివింపు
అన్నవరం: చదువుల్లో రాణించాలని, లక్ష్యాలు సాధించాలని విద్యార్థులకు బోధించే అధ్యాపకులు చాలా కళాశాలల్లో కనిపిస్తారు. కాని కళాశాలల్లో పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కూడా కల్పిస్తే వారు మరింత బాగా కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకుంటారని భావించి అందుకోసం సొంత సొమ్మును ఖర్చు చేసే అధ్యాపకులు చాలా అరుదు. అటువంటి కోవలోకే వస్తారు సత్యదేవ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ భీమలింగం సూర్యనారాయణమూర్తి. ఆయన తన భార్య పద్మావతితో కలిసి సోమవారం శ్రీ సత్యదేవ నిత్యాన్నదాన పథకానికి సత్యదేవ డిగ్రీ కళాశాల విద్యార్థుల పేరుతో రూ.ఐదు లక్షలు విరాళాన్ని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావుకు అందజేసిన విషయం తెలిసిందే. మధ్యాహ్న భోజనం పునరుద్ధరించాలనే లక్ష్యంతో... విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పునరుద్ధరించాలనే లక్ష్యంతో తన వంతు సాయంగా ఈ విరాళాన్ని అందచేసినట్టు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. స్థానిక సత్యదేవ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా 2015–17 మధ్య సేవలందించిన సూర్యనారాయణమూర్తి ప్రస్తుతం తమ స్వగ్రామమైన పెద్దాపురం మండలంలోని సిరివాడలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన ప్రిన్సిపాల్‌గా వ్యవహరించిన సమయంలో దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు మధ్యాహ్న భోజనం లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని అప్పటి దేవస్థానం చైర్మన్ రాజా ఐవీ రామ్‌కుమార్, ఈఓ కాకర్ల నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లారు. ఫలితంగా 2016లో అక్టోబర్ నుంచి 2017 ఏప్రిల్ వరకు డిగ్రీ కళాశాల విద్యార్థులకు అన్నదానం పథకం నుంచి మధ్యాహ్న భోజనం పంపించారు. అన్నదానం పథకానికి దాతలు ఇచ్చిన విరాళాలు భక్తులకు భోజనానికి ఉపయోగించాలి తప్ప విద్యార్థుల భోజనానికి కాదని ఆడిట్ అధికారులు అభ్యంతరం చెప్పడంతో దేవస్థానం ఆ భోజనాన్ని పంపించడం నిలిపివేసింది. 2018లో సూర్యనారాయణమూర్తి పదవీ విరమణ చేశారు. అయితే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పునరుద్ధరించేందుకు ఆయన చాలా ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దీంతో తన వంతు విరాళంగా ఆయన రూ.ఐదు లక్షలు అందజేశారు. మధ్యాహ్న భోజన సౌకర్యం పునరుద్ధరించాలని కోరాను కళాశాలలో చదివే విద్యార్థులు 600 మందిలో 400 మంది పేద, మధ్యతరగతి వారు. వీరికి భోజన సౌకర్యం పునరుద్ధరించాలని ఆలయ పెద్దలను కోరాను. నేను ఇచ్చిన విరాళంపై వడ్డీతో రోజుకు కనీసం పది మంది విద్యార్థులకు అన్నదాన పథకంలో (కళాశాల పనిదినాలు 180 రోజుల్లో) భోజనం పెట్టమని కోరాను. – సూర్యనారాయణమూర్తి, విశ్రాంత ప్రిన్సిపాల్ కమిషనర్‌తో చర్చిస్తాం డిగ్రీ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటుపై గతంలో ఆడిట్ అభ్యంతరాలు రావడంతో నిలిపివేయాల్సి వచ్చింది. మళ్లీ భోజనం పెట్టాలంటే దేవదాయశాఖ కమిషనర్ ఆదేశాలివ్వాలి. ఆ దిశగా ప్రయత్నం చేస్తాం. – చైర్మన్ రోహిత్, ఈఓ త్రినాథరావు -
ఊరిని కొని దానమిచ్చిన పాలకుడు
సాక్షి, హైదరాబాద్: అదో ఊరు.. వాగు ఒడ్డున ఉంది. స్థానిక పాలకుడు దానికి సరిపడా పైకం ఇచ్చి కొనుగోలు చేసి దాన్ని అగ్రహారంగా దానమిచ్చాడు. ఇలా ఊరిని కొని దానమివ్వటం కొంత విచిత్రంగా అనిపించే వ్యవహారమే అయినా.. తాజాగా వెలుగు చూసిన ఓ శాసనం ఇదే విషయాన్ని చెబుతోంది. ప్రస్తుత సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణానికి సమీపంలో ఉన్న దొమ్మాట గ్రామం కథ ఇది. అది 14వ శతాబ్దం. స్థానిక పాలకుడు పైడిమర్రి నాగా నాయనిగారనే స్థానిక పాలకుడు ఈ గ్రామాన్ని తగు పైకం చెల్లించి కొనుగోలు చేశాడు. తర్వాత దాన్ని అగ్రహారంగా బ్రాహ్మణ కుటుంబాలకు దానం చేశాడు. అప్పటి నుంచి దొమ్మాట అగ్రహారంగా ఆ ఊరు కొనసాగింది. ఆ తర్వాత ఓసారి గ్రామానికి సమీపంలోనే ఉన్న కృష్ణమ్మ చెరువు, గురుజకుంట వాగు పొంగి గ్రామం మునిగిపోయింది. దీంతో వ్యవసాయ పొలాల ఆధారంగా కొందరు వాగుకు ఆవల, కొందరు వాగుకు ఈవల ఇళ్లు కట్టుకోవటంతో క్రమంగా రెండు ఊళ్లుగా అవి ఎదిగాయి. కొందరు ఆ దొమ్మాట ఊళ్లోని గుళ్ల శిల్పాలు, వీరగళ్లులు, శాసనాన్ని తెచ్చి పెట్టుకున్నారు. ఆ శాసనం పొలాల మధ్య పడి ఉండగా తాజాగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ దాన్ని గుర్తించారు. ఇది దొమ్మాట గ్రామ శాసనమేనని, అందులో.. ‘పాహిడిమరి నాగాన్నాయనిగారు ధారణశేశి ఇచ్చిన అగ్రహారం దొమ్మాటకుంను ఆ బుని..దేయాన్న జొమా..న.. అన్న పంక్తులు (కొన్ని అక్షరాలు మలిగిపోయాయి) ఉన్నాయని శాసనాన్ని గుర్తించిన చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. శాసనంపైన సూర్యచంద్రుల గుర్తులున్నాయి. కానీ అది ఏ చక్రవర్తి/రాజు హయాంలో చోటుచేసుకుందో శాసనంలో ప్రస్తావించలేదు. -
ఏపీ: కోవిడ్ నివారణ చర్యల కోసం యూనిసెఫ్ సాయం
సాక్షి, అమరావతి: కోవిడ్ నివారణ చర్యల కోసం యూనిసెఫ్ సాయం అందించింది. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన యూనిసెఫ్ ప్రతినిధులు.. కోవిడ్ బాధితుల కోసం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందజేశారు. వారి వెంట డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పి.గౌతమ్‌రెడ్డి ఉన్నారు. కోవిడ్ నివారణ కోసం సీఎం జగన్ ఎంతో శ్రమిస్తున్నారు.. ఈ సందర్భంగా ఏపీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ, కోవిడ్ నివారణ కోసం సీఎం జగన్ ఎంతో శ్రమిస్తున్నారన్నారు. యూనిసెఫ్ లాంటి సంస్థలు ముందుకొచ్చి తమ వంతు సాయం చేస్తున్నాయని పేర్కొన్నారు. మరో 50 లక్షల ఎన్-95 మాస్కులను కూడా అందించారని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారని గౌతమ్‌రెడ్డి తెలిపారు. చదవండి: కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌తో మంత్రి బుగ్గన భేటీ రూ.34 వేల కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు: సీఎం జగన్ -
సీఎం సహాయనిధికి రూ.51 లక్షల విరాళం
సాక్షి, అమరావతి: సీఎం సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను పలువురు అభినందిస్తున్నారు. ఈ క్రమంలో కోవిడ్ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం వ్యాపారవేత్తలు, సొసైటీలు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు తరపున రూ.51 లక్షల 86 వేల రూపాయల విరాళాన్ని అందించారు. విరాళం చెక్కును సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకటరావు అందజేశారు. (చదవండి: కరోనా నిర్ధారణలో ‘ర్యాపిడ్’ విప్లవం) -
మాట నిలబెట్టుకున్న కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం ఆరు కోవిడ్ రెస్పాన్స్ అంబులెన్సులను ప్రభుత్వానికి అందజేశారు. తన జన్మదినం సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’పేరిట ఇచ్చిన నినాదంలో భాగంగా సొంత డబ్బుతో అంబులెన్సులు అందజేస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి కేటీఆర్ అంబులెన్సులను జెండా ఊపి ప్రారంభించారు. కేటీఆర్ భార్య శైలిమ, కుమార్తె అలేఖ్యతో పాటు పలువురు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, తాము కూడా త్వరలోనే అంబులెన్సులను అందజేస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు వెల్లడించారు. కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో ఈ అంబులెన్సులు కోవిడ్ రెస్పాన్స్ వాహనాలుగా పనిచేస్తాయని కేటీఆర్ వెల్లడించారు. -
రూ. 755 కోట్లు విరాళం
చార్లెట్: ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన జాతి వివక్షపై పోరాటానికి అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం మైకేల్ జోర్డాన్ ముందుకొచ్చాడు. వర్ణ సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాడుతోన్న సంస్థలకు జోర్డాన్ 10 కోట్ల డాలర్ల (రూ. 755 కోట్లు) విరాళం ప్రకటించాడు. ఇందులో 4 కోట్ల డాలర్లు (రూ. 302 కోట్లు) ‘నైకీ’ రూపొందించిన ‘జోర్డాన్ బ్రాండ్’ తరపున అందజేస్తారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ‘వివక్ష లేకుండా జాతి సమానత్వం, సామాజిక న్యాయం, విద్యావకాశాలు అనే లక్ష్యాల్ని నెరవేర్చడం కోసం 10 సంవత్సరాలకు పైగా ధనాన్ని సమకూర్చుతాం. ‘నల్లజాతి వారి ప్రాణాలూ ప్రధానమే’. దేశంలో వేళ్లూనుకుపోయిన జాత్యాహంకారం నశించేవరకు, నల్లజాతీయుల జీవితాలను మెరుగుపరిచేందుకు వారిని రక్షించేందుకు మేం కట్టుబడి ఉంటాం’ అని 57 ఏళ్ల చికాగో బుల్స్ మాజీ బాస్కెట్‌బాల్ ప్లేయర్ జోర్డాన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం జాతీయ బాస్కెట్‌బాల్ సంఘం (ఎన్బీఏ) జట్టు చార్లెట్ హార్నెట్స్‌కు యజమాని అయిన జోర్డాన్... పోలీసుల దురాగతానికి ప్రాణాలు కోల్పోయిన జార్జి ఫ్లాయిడ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. -
అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పది
సాక్షి, హైదరాబాద్: రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారిని యువత ఆదుకోవాలని మాజీ ఎంపీ కవిత పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ ఇటీవల ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్‌లోని తన నివాసంలో కవిత శుక్రవారం రక్తదానం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మనుషుల ప్రాణాలను రక్తదానం కాపాడుతుందని, తలసేమియా, ఇతర అత్యవసర చికిత్సలకు రక్తం కొరత రాకుండా చూడాలన్నారు. కార్యకర్తలు రక్తదానం చేయాలని కవిత పిలుపునిచ్చారు. -
విరుష్క జోడీ విరాళం రూ. 3 కోట్లు!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తమని కలచి వేస్తున్నాయని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, అతని భార్య బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కరోనాపై పోరు కోసం అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. పీఎం–కేర్స్ ఫండ్, మహారాష్ట్ర ముఖ్య మంత్రి సహాయనిధి కోసం తామిద్దరం నిధులు అందించనున్నట్లు ప్రకటించారు. అయితే తాము ఎంత మొత్తం విరాళంగా ఇస్తున్నది మాత్రం వారిద్దరు గోప్యంగా ఉంచారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వీరిద్దరు రూ. 3 కోట్లు విరాళం ఇచ్చారని తెలిసింది. ‘అనుష్క, నేను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. మేం అందించే ఈ సహాయం కొంతమందికైనా ఊరట కలిగిస్తుందని నమ్ముతున్నాం. కరోనా సృష్టిస్తోన్న విలయం చూస్తుంటే మా హృదయం తరుక్కుపోతుంది’ అని కోహ్లి ట్విట్టర్లో రాసుకొచ్చాడు. మరోవైపు భారత మహిళల వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ హైదరాబాద్ క్రికెటర్ మిథాలీ రాజ్ రూ. 5 లక్షలు పీఎం–కేర్స్ ఫండ్‌కు... రూ. 5 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి అందిస్తున్నట్లు తెలిపింది. మరో మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్ రూ. 2 లక్షలు విరాళం ప్రకటించింది. భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ సత్యన్ రూ. లక్షా 25 వేలు విరాళంగా ప్రకటించాడు. దిగ్గజ బాక్సర్ మేరీకోమ్, రాజ్యసభ ఎంపీ హోదాలో తన నెల జీతాన్ని విరాళంగా ఇచ్చింది. కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ 18 ఏళ్ల టీనేజ్ షూటర్ మను భాకర్ లక్ష రూపాయల్ని హరియాణా ప్రభుత్వానికి ఇచ్చింది. -
గవర్నర్ ఒక నెల జీతం విరాళం
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు సహాయంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నెల జీతం రూ.3.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధి కి విరాళంగా అందజేశారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జగదీశ్వర్‌కు శనివారం ఆమె రాజ్‌భవన్‌లో ఈ మేరకు చెక్కు ను అందజేశారు. అంతకు ముందు ఆమె రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో ఫోన్లో మాట్లాడారు. వలస కూలీలకు ఆహారం, వసతి సదుపాయం కల్పించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల దుస్థితిపై తన కార్యాలయానికి చాలామంది ఫి ర్యాదు చేస్తున్నారన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించడానికి ఐసీఎంఆర్ అనుమతి పొందిన ప్రైవేటు ఆస్పత్రులను బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. -
‘కరోనా నివారణకు రూ.కోటి విరాళం ఇస్తాం’
సాక్షి, పశ్చిమ గోదావరి: కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని మంత్రి శ్రీరంగనాథ రాజు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నివారణ చర్యలకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరపున కోటి రూపాయలను విరాళంగా అందజేస్తామని పేర్కొన్నారు. పశ్చిమగోదావరిలో కరోనా వైరస్ నివారణ చర్యలపై వైద్యశాఖ మంత్రి ఆళ్ల నానితో కలసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించామని వెల్లడించారు. కరోనా మహమ్మారిని పూర్తిస్థాయిలో తరిమికొట్టేందుకే ఏపీ ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిందని పేర్కొన్నారు. (ఏపీ: కరోనా నియంత్రణకు మరిన్ని చర్యలు) ప్రజలందరూ సహకరించి కచ్చితంగా లాక్ డౌన్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత పరిశుభ్రతతో కరోనా వైరస్‌ను నియంత్రించవచ్చని తెలిపారు. ప్రజలు అత్యవసర పనులు ఉంటేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని ఆయన సూచించారు. ఇతర దేశాల్లో చోటు చేసుకున్న పరిస్థితులు మనకు రాకూడదనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని శ్రీరంగనాథ రాజు పేర్కొన్నారు. (కరోనా.. తెలుగు రాష్ట్రాలకు నితిన్ విరాళం) -
ఆలయాలకు పెరుగుతున్న గుప్త కానుకలు
-
భద్రకాళీ మాతకు కిరీటం సమర్పించిన సీఎం కేసీఆర్
-
చెట్టంత కొడుకు పోయినా...
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో గాయపడి, నిస్సహాయంగా విలవిల్లాడతున్నా ఓ ఇరవై ఏళ్ల యువకుడిని ఎవరూ పట్టించుకోలేదు. ఇంతలోనే జరగరాని ఘోరం జరిగిపోయింది. చెట్టంత కొడుకును కోల్పోయింది ఢిల్లీలో నివసించే ఓ కుటుంబం. అంతటి విషాదంలో కూడా అతని తల్లి పెద్ద మనసు చేసుకుంది. దు:ఖాన్ని దిగమింగి తన కుమారుడి నేత్రాలతో పాటు, ఇతర అవయవాలను దానం చేసింది. కొందరి నిర్లక్ష్యానికి తన కొడుకు బలైనా, ఈ సమాజం ఎలా పోతే నాకేంటి అని ఆ కుటుంబం అనుకోలేదు. పరోపకారం కోసం తపన పడింది. ఇపుడిదే అందరి అభిమానాన్ని చూరగొంది. వివరాల్లోకి వెళితే.. తల్లికి మందుల తెచ్చేందుకు వెళ్లిన కొడుకు వినయ్ జిందాల్ (20) ఇంటికి విగతజీవిగా తిరిగొచ్చాడు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వేగంగా దూసుకొచ్చిన కారు అతడి స్కూటీని ఢీకొట్టింది. సుమారు కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్ళింది. దీంతో వినయ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని చూస్తూ వెళ్లిపోయారు కానీ ఆ దారిన పోయే ఒక్క వాహనదారుడు కూడా అతడిని పట్టించుకోలేదు. వినయ్‌ని ఢీకొట్టిన కారు మరో ద్విచక్ర వాహనాన్ని గుద్దుకొంటూ..చీకట్లో కలిసిపోయింది. ఇదంతా సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డయింది. పోలీసులు వచ్చి అతడిని ఆసుపత్రికి తరలించటంలో చాలా ఆలస్యం జరిగిపోయింది. తీవ్ర రక్తస్రావంతో అతను చనిపోయాడని వైద్యులు తెలిపారు. సమయానికి చికిత్స అంది ఉంటే వినయ్ బతికి ఉండేవాడని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. అయితే రెండు రోజులు గడిస్తే ఆ ఇంట్లో వినయ్ సోదరి పెళ్లి బాజాలు మోగేవి. బంధువులు, సన్నిహితులతో కోలాహలంగా ఉండేది. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. కుటుంబ సభ్యులు, ఆప్తుల రోదనలతో విషాదం అలుముకుంది. ఈ సంఘటన జరిగి నాలుగు రోజులవుతున్నా ఇంతవరకూ ఆ వాహనాన్ని గుర్తించలేదు. ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. కాగా స్కాలర్ షిప్‌తో బీబీఏ చదువుతున్న వినయ్ మెరిట్ స్టూడెంట్. తండ్రి కొన్ని నెలల క్రితమే కన్నుమూశాడు. దీంతో ట్యూషన్స్ చెబుతూ కుటుంబానికి ఆసరాగా నిలబడ్డాడు. అనారోగ్యంతో ఉన్న తల్లికి మందులు తేవడానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు తరలిపోయాడు. దీంతో అతని సోదరి పెళ్లిని వాయిదా వేశారు. వినయ్ జిందాల్ కోరిక మేరకు కుటుంబ సభ్యులు ఢిల్లీలోని గురునానక్ వైద్యశాలకు అతని కళ్ళను దానం చేశారు.