సాక్షి, అమరావతి: కోవిడ్ నివారణ చర్యల కోసం యూనిసెఫ్ సాయం అందించింది. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన యూనిసెఫ్ ప్రతినిధులు.. కోవిడ్ బాధితుల కోసం ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను అందజేశారు. వారి వెంట డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ చైర్మన్ పి.గౌతమ్‌రెడ్డి ఉన్నారు.
కోవిడ్ నివారణ కోసం సీఎం జగన్ ఎంతో శ్రమిస్తున్నారు..
ఈ సందర్భంగా ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ ఛైర్మన్ గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ, కోవిడ్ నివారణ కోసం సీఎం జగన్ ఎంతో శ్రమిస్తున్నారన్నారు. యూనిసెఫ్ లాంటి సంస్థలు ముందుకొచ్చి తమ వంతు సాయం చేస్తున్నాయని పేర్కొన్నారు. మరో 50 లక్షల ఎన్-95 మాస్కులను కూడా అందించారని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారని గౌతమ్‌రెడ్డి తెలిపారు.
చదవండి: కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌తో మంత్రి బుగ్గన భేటీ
రూ.34 వేల కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment