
సాక్షి, హైదరాబాద్: రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారిని యువత ఆదుకోవాలని మాజీ ఎంపీ కవిత పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ ఇటీవల ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్‌లోని తన నివాసంలో కవిత శుక్రవారం రక్తదానం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మనుషుల ప్రాణాలను రక్తదానం కాపాడుతుందని, తలసేమియా, ఇతర అత్యవసర చికిత్సలకు రక్తం కొరత రాకుండా చూడాలన్నారు. కార్యకర్తలు రక్తదానం చేయాలని కవిత పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment