చాలా మంది ధనవంతులు డబ్బు కూడబెట్టే కొద్దీ ఇంకా పోగు చేయాలి, ఇంకా గొప్పవాళ్ళైపోవాలి అని ఆలోచించడం సర్వ సాధారణం. అయితే కొందరు మాత్రమే వారికున్నదాంట్లో చాలా వరకు పేదలకు లేదా మంచి పనులను భారీగా విరాళం అందిస్తారు. ఇలాంటి కోవకు చెందిన అతి తక్కువ మందిలో 'మెకెంజీ స్కాట్' (MacKenzie Scott) ఒకరు. ఇంతకీ ఈమె ఎవరు? ఇప్పటి వరకు ఎంత దానం ఇచ్చింది? బ్యాగ్రౌండ్ ఏంటి అనే మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.
అమెరికాకు చెందిన ప్రముఖ నవలా రచయిత్రి అయిన 'మెకెంజీ స్కాట్' ఇప్పటి వరకు సుమారు రూ.1,19,522 కోట్లకుపైగా విరాళంగా ఇచ్చింది. అంతే కాకుండా తాను బ్రతికి ఉండే వరకు, తనకు వచ్చే ఆదాయంలో సగానికి పైగా విరాళంగా ఇస్తానని ప్రతిజ్ఞ కూడా చేసినట్లు సమాచారం.
నిజానికి ఈమె (మెకెంజీ స్కాట్) అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య. 1993లో ఈమె జెఫ్ బెజోస్‌ను పెళ్లి చేసుకుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల 2019లో విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో ఆమెకు భరణంగా అందిన డబ్బు కారణంగానే ప్రపంచంలోని అత్యంత ధనిక మహిళలలో ఒకరుగా నిలిచారు.
1907లో కాలిఫోర్నియాలో జన్మించిన మెకెంజీ స్కాట్ ఆరు సంవత్సరాల వయసులోనే కథలు రాయడం మొదలుపెట్టింది. చిన్నతనంలోనే 'ది బుక్ వార్మ్' అనే 142 పేజీల బుక్ రాసినట్లు, అది వరదల్లో కొట్టుకుపోయినట్లు సమాచారం. స్కాట్ ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ (ఇంగ్లీష్) పూర్తి చేసింది. అంతే కాకుండా ఈమె సాహిత్యంలో నోబెల్ గ్రహీత 'టోని మోరిసన్' వద్ద చదువుకుంది.
మెకెంజీ స్కాట్ చదువు పూర్తయిన తరువాత న్యూయార్క్ నగరంలోని ఓ కంపెనీలో పనిచేసింది, ఆ సంస్థలోనే జెఫ్ బెజోస్ కూడా పనిచేశారు. ఆ సమయంలో ఆ ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారి 1993లో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత అమెజాన్ స్థాపించి ఇద్దరూ దానిని బాగా అభివృద్ధి చేసారు.
ఇదీ చదవండి: ఉద్యోగులకు అవి ఇవ్వలేకపోయాను!.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
2019లో మెకెంజీ స్కాట్, జెఫ్ బెజోస్‌తో విడాకులు తీసుకున్న తరువాత రూ. 2,53,600 కోట్ల విలువైన స్టాక్స్ అందుకుంది. ప్రస్తుతం ఈమె విద్య, ఆరోగ్యం, సామజిక న్యాయం, పర్యావరణం వంటి వివిధ అంశాలకు మద్దతు పలుకుతూ వేలకోట్ల రూపాయలు విరాళంగా అందిస్తూ ప్రపంచంలో ఎక్కువ విరాళాలు అందించినవారి జాబితాలో ఒకరుగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment