మాట నిలబెట్టుకున్న కేటీఆర్‌  | KTR Donated Six Ambulance To The Government Hospitals | Sakshi
Sakshi News home page

మాట నిలబెట్టుకున్న కేటీఆర్‌ 

Published Fri, Jul 31 2020 3:29 AM | Last Updated on Fri, Jul 31 2020 3:45 AM

KTR Donated Six Ambulance To The Government Hospitals - Sakshi

గురువారం అంబులెన్సులను ప్రభుత్వానికి అందజేసిన మంత్రి కేటీఆర్‌. చిత్రంలో కేటీఆర్‌ భార్య శైలిమ, కూతురు అలేఖ్య, మంత్రి ఈటల తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం ఆరు కోవిడ్‌ రెస్పాన్స్‌ అంబులెన్సులను ప్రభుత్వానికి అందజేశారు. తన జన్మదినం సందర్భంగా ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’పేరిట ఇచ్చిన నినాదంలో భాగంగా సొంత డబ్బుతో అంబులెన్సులు అందజేస్తున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి కేటీఆర్‌ అంబులెన్సులను జెండా ఊపి ప్రారంభించారు. కేటీఆర్‌ భార్య శైలిమ, కుమార్తె అలేఖ్యతో పాటు పలువురు మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, తాము కూడా త్వరలోనే అంబులెన్సులను అందజేస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు వెల్లడించారు. కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో ఈ అంబులెన్సులు కోవిడ్‌ రెస్పాన్స్‌ వాహనాలుగా పనిచేస్తాయని కేటీఆర్‌ వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement