ఊరిని కొని దానమిచ్చిన పాలకుడు | Telangana Dommata Village Donated As Agraharam | Sakshi
Sakshi News home page

ఊరిని కొని దానమిచ్చిన పాలకుడు

Published Fri, Jan 21 2022 1:44 AM | Last Updated on Fri, Jan 21 2022 8:09 AM

Telangana Dommata Village Donated As Agraharam - Sakshi

తాజాగా వెలుగు చూసిన శాసనమిదే.. 

సాక్షి, హైదరాబాద్‌: అదో ఊరు.. వాగు ఒడ్డున ఉంది. స్థానిక పాలకుడు దానికి సరిపడా పైకం ఇచ్చి కొనుగోలు చేసి దాన్ని అగ్రహారంగా దానమిచ్చాడు. ఇలా ఊరిని కొని దానమివ్వటం కొంత విచిత్రంగా అనిపించే వ్యవహారమే అయినా.. తాజాగా వెలుగు చూసిన ఓ శాసనం ఇదే విషయాన్ని చెబుతోంది. ప్రస్తుత సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణానికి సమీపంలో ఉన్న దొమ్మాట గ్రామం కథ ఇది. అది 14వ శతాబ్దం. స్థానిక పాలకుడు పైడిమర్రి నాగా నాయనిగారనే స్థానిక పాలకుడు ఈ గ్రామాన్ని తగు పైకం చెల్లించి కొనుగోలు చేశాడు.

తర్వాత దాన్ని అగ్రహారంగా బ్రాహ్మణ కుటుంబాలకు దానం చేశాడు. అప్పటి నుంచి దొమ్మాట అగ్రహారంగా ఆ ఊరు కొనసాగింది. ఆ తర్వాత ఓసారి గ్రామానికి సమీపంలోనే ఉన్న కృష్ణమ్మ చెరువు, గురుజకుంట వాగు పొంగి గ్రామం మునిగిపోయింది. దీంతో వ్యవసాయ పొలాల ఆధారంగా కొందరు వాగుకు ఆవల, కొందరు వాగుకు ఈవల ఇళ్లు కట్టుకోవటంతో క్రమంగా రెండు ఊళ్లుగా అవి ఎదిగాయి. కొందరు ఆ దొమ్మాట ఊళ్లోని గుళ్ల శిల్పాలు, వీరగళ్లులు, శాసనాన్ని తెచ్చి పెట్టుకున్నారు.

ఆ శాసనం పొలాల మధ్య పడి ఉండగా తాజాగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్‌ దాన్ని గుర్తించారు. ఇది దొమ్మాట గ్రామ శాసనమేనని, అందులో.. ‘పాహిడిమరి నాగాన్నాయనిగారు ధారణశేశి ఇచ్చిన అగ్రహారం దొమ్మాటకుంను ఆ బుని..దేయాన్న జొమా..న.. అన్న పంక్తులు (కొన్ని అక్షరాలు మలిగిపోయాయి) ఉన్నాయని శాసనాన్ని గుర్తించిన చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్‌ పేర్కొన్నారు. శాసనంపైన సూర్యచంద్రుల గుర్తులున్నాయి. కానీ అది ఏ చక్రవర్తి/రాజు హయాంలో చోటుచేసుకుందో శాసనంలో ప్రస్తావించలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement